7, మార్చి 2021, ఆదివారం

సమస్య - 3656

8-3-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అవధాని పరాజయమున నందె బహుమతిన్"
(లేదా...)
"ఓటమితో వధానికి మహోన్నత సత్కృతి దక్కె సత్సభన్"
(సోమవారం వరంగల్లులో ఆముదాల మురళి గారి అష్టావధానం సందర్భంగా...)

32 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    నీటుగ వస్త్రముల్ పరచి నిండుగ షోకులు వేసి యాదటన్
    దీటుగ జేరుచున్ సభకు దిక్కులు తోచక రంగమందునన్
    పాటులు పెక్కులన్ బడుచు బాధల నోర్చెడు పృచ్ఛకాళివౌ
    యోటమితో వధానికి మహోన్నత సత్కృతి దక్కె సత్సభన్

    రిప్లయితొలగించండి
  2. ధాటిగ ధీటుగా పదపదంబు నిషేధము దాటి వేయుచున్
    మాటల మాంత్రికుండునయి మౌనము వీడి విచక్షణాగతిన్
    నోటికి వేసె తాళమును నొవ్వక దెప్పక పృచ్ఛకేశుదౌ
    *యోటమితో వధానికి మహోన్నత సత్కృతి దక్కె సత్సభన్"*

    రిప్లయితొలగించండి
  3. పోటుమగండుగా నొకఁడు పూరణ పద్యములోన దోషముల్
    వాటము గాక యున్నవని వాదనఁ జేయఁగ శాస్త్రరీతులన్
    దీటుగ విప్పి చెప్పి గణుతిం గనెఁ; బ్రాశ్నికుఁ డందినట్టి యా
    యోటమితో వధానికి మహోన్నత సత్కృతి దక్కె సత్సభన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. (అవధాను లెందరికో గురుతుల్యుడైన వాడు నూరేండ్ల వయస్సులో అవధానం చేయడానికి ప్రయత్నించి ధారణలో విఫలుడై, ఓడినా అతనిని గురుభక్తితో సన్మానించారు శిష్యులు)

      నూటికిఁ జేరువౌచుఁ గడు నోచిన ప్రాయమునందునైన, నా
      నాటికి ధారణాపటిమ నాస్తి యటం చెఱింగియున్ ఘనా
      పాటినిరా వధానమును పారము ముట్టెదనంచు నోడినన్
      సాటి వధాను లెల్లరును సన్మతి గౌరవమిచ్చువారుఁ గా
      నోటమితో వధానికి మహోన్న సత్కృతి దక్కె సత్సభన్.

      తొలగించండి
  4. చవులూరించెడు పూరణ
    లవలీలగ సల్పు మురళి యందరి మెప్పున్
    జవమున పొంద న దెట్టుల
    యవధాని పరాజ యమున నందె బహుమతిన్?

    రిప్లయితొలగించండి
  5. అవమానముసభయందున
    నవనవమగుదారిఁజూపునవతనుఁగూర్చున్
    పవియగుతప్పులపాలిట
    అవధానిపరాజయముననందెబహుమతిన్

    రిప్లయితొలగించండి
  6. ధాటిగ పృచ్ఛకాళికిని దక్షతతో బదులిచ్చు ప్రౌఢిమన్
    జాటుచు పాండితీగరిమ ఛంద సముజ్వల పద్య
    ఘోషతో
    మేటి వధానవేదికను మిక్కిలి యొప్పగ ప్రాశ్నికాళిదౌ
    యోటమితో వధానికి మహోన్నత సత్కృతి దక్కె సత్సభన్

    రిప్లయితొలగించండి
  7. కవనమ్ములనల్లుచు తా
    నవలీలగ నట వధాన మద్భుత రీతిన్
    సవరించి పొందె మన్నన
    యవధాని, పరాజయమున నందె బహుమతిన్? .
    . . . విరించి.

    రిప్లయితొలగించండి
  8. పాటవ మొప్పురీతి ప్రతి వాదము జేయుచు పృచ్ఛకుండ్రనే
    ధాటిగ బాదరించెడు బుధానుని ప్రజ్ఞత గాంచి ప్రేక్షకుల్
    మేటి సుమేధులెల్లరులు మేలని మెచ్చగ ప్రాశ్నికుండ్రదౌ
    యోటమితో వధానికి మహోన్నత సత్కృతి దక్కె సత్సభన్ .
    . . . విరించి.

    రిప్లయితొలగించండి
  9. సవివరణలన విజేతయె
    అవధాని, పరాజయమున నందె బహుమతిన్
    కవివర్య పృచ్చకులు, సభ
    న విజితులు లెవరునులేరు, నందమె మిగిలెన్

    రిప్లయితొలగించండి
  10. దీటుగసభ్యులందరికినేమరకుండగనేర్పువర్ధిలన్
    మాటలమూటలన్నిటినిభావముతోడుతగుట్టువిప్పగా
    బూటకప్రుఛ్చకావళియుభోరుననేడ్చుచువంచిరేతలల్
    ఓటమితో, వధానికిమహోన్నతసత్క్రుతిదక్కెసత్సభన్

    రిప్లయితొలగించండి
  11. సమస్యా పూరణం

    యోటమితో వధానికి మహోన్నత సత్కృతిదక్కె తత్సభన్

    నా పూరణ

    ఉత్పలమాల

    పాటవమొప్పగా నుడువు పద్యపు ధార నిరంతరంబునై
    సూటిగవేయు పృచ్ఛకుల చోద్యపు ప్రశ్నల నాదరించుచున్
    ఘాటుజవాబులన్ దిరిగి కమ్మని రీతిగ నప్పజెప్పుచున్
    మాటల గారిడీల మహిమంతయుఁ జూపగ , పృచ్ఛకాళి దౌ
    యోటమితో వధానికి మహోన్నత సత్కృతిదక్కె తత్సభన్

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  12. వ్యవధానము లేక సలుపు
    యవధానమునందు పృచ్ఛకాగ్రణులనుతా
    నవలీలగ నోడించగ
    నవధాని, పరాజయమున నందె బహుమతిన్

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. పాటులు బెట్ట దుష్కరపు ప్రాసల గూర్చుచు న్యస్తదత్తముల్
      సాటి నిషిద్ధ వర్ణనలు చారు సమస్యలునుండ తత్క్రియన్
      పోటిగ గంట మ్రోగ సరి పూన్చిన పృచ్ఛకులందినట్టిదౌ
      యోటమితో వధానికి మహోన్నత సత్కృతి దక్కె సత్సభన్

      తొలగించండి
  14. పాటవమొప్ప పండితుల ప్రశ్నలకెల్లను ప్రజ్ఞజూపుచున్
    దీటుగ పద్య పూరణలు తేకువగా నొనరించి యెల్లరున్
    మేటి వధానముంగనుచు మెచ్చగ, నొవ్వగ పృచ్ఛకాగ్రణు
    ల్వోటమితో, వధానికి మహోన్నత సత్కృతి దక్కె సత్సభన్

    రిప్లయితొలగించండి
  15. ఉత్పలమాల
    పాటవమొప్పు పృచ్ఛకుల ప్రశ్నల పూరణకెన్నిగంటలో
    దాటగఁ బట్టునేడనుచుఁ దల్చిన, వాగ్విభవంపు నేర్పుతో
    ధీటుగ రెండుగంటలకె తేల్చఁగఁ, దాఁ దలవంచ ప్రేక్షకుం
    డోటమితో, వధానికి మహోన్నత సత్కృతి దక్కె సత్సభన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కందం
      అవలీలగ గంటన్నర
      వ్యవధి వధానము ముగింప నక్కవి గరిమన్
      ధ్రువపరుచ లేనిదౌ న
      య్వవధాని పరాజయమున, నందె బహుమతిన్

      తొలగించండి
  16. అందరికీ నమస్సులు

    ఉ||
    వాటికయౌ వధాని! తన పద్యములెల్లయు పుష్పగుచ్ఛముల్!
    సూటిగనుండకన్ వరుస జూడని లంకెల, బల్ సమస్యలన్,
    దాట, తెలుంగు హెచ్చగ, నధర్మము, మ్లేచ్ఛపదంబులీగెనే
    ఓటమితో! వధానికి మహోన్నతసత్కృతి దక్కె తత్సభన్


    ఆదిపూడి రౌహిత్ శర్మ 🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
  17. ఉ:

    లోటునెఱింగి పృచ్ఛకులు లోతగు ప్రశ్నలు వేయ నెంచగన్
    నూటికి నూరుపాళ్లుకడు నోరిమి తోడ జవాబు చెప్ప నీ
    సాటియె కానరాడనుచు సంతన జేరి తలొగ్గినంత నా
    యోటమితో వధానికి మహోన్నత సంస్కృతి దక్కె సత్సభన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  18. పాటవ మెల్లజూపుచును ప్రజ్ఞ గడించిన పృచ్ఛకాగ్రులే
    యీటెల బోలుమాటల ననేకము సూటిగ దాడిసేయగా
    దీటగు పూరణమ్ములను తెల్విని చేయగ పృచ్ఛకాళి క
    వ్వోటమితో; వధానికి మహోన్నత సత్కృతి దక్కె సత్సభన్

    రిప్లయితొలగించండి
  19. సమస్య :
    ఓటమితో వధానికి మ
    హోన్నతసత్కృతి దక్కె సత్సభన్

    ( ప్రతిభాశూన్యత అనే లక్షణం ఓడిపోతే అవధానికి అనన్యసత్కారం లభిస్తుంది )

    ఉత్పలమాల
    ..................

    ఆటగ నెంచి వీక్షకుల
    కందరి కెంతయొ వీనువిందుగన్
    గాటపు పద్యపంక్తులను
    ఖంగను కంఠముతోడ బంచెనే
    మాటికి మాటికిన్ సుకవి !
    మంథర బోలిన శూన్యమేధదౌ
    యోటమితో వధానికి మ
    హోన్నతసత్కృతి దక్కె సత్సభన్ .
    (శూన్యమేధ - ప్రతిభ లేని తనము ; గాటపు - అధికమైన )

    రిప్లయితొలగించండి
  20. వివశత పెగలక నోరున్

    అవధాని పరాజయమున నందె బహుమతిన్

    భువులు పదునాల్గు కాంచన్

    సవాలులడుగు హరి నోట శంకరు సాక్షిన్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  21. చెవులకు నింపైన సంపుటి
    "అవధాని పరాజయము"న నందె బహుమతిన్
    కవరున నుంచిన రొఖ్ఖము
    కవికిని సభయందునిచ్చి,కప్పెను షాలున్

    రిప్లయితొలగించండి
  22. మహిళా దినోత్సవ సందర్భముగా పద్యము చెప్పమనగా

    కాటుక కంట నీరులను గాంచక కామము జుర్రు మానవుల్

    మాటలు రాని మూగగను మానిని ఘోషలు మిన్నులంటగన్

    బీటలు వారె మానసము వెక్కుచు పద్యము చెప్ప జాలకన్

    ఓటమితో వధానికి మహోన్నత సత్కృతి దక్కె సత్సభన్"

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  23. శ్రీమాత్రేనమః/శ్రీగురుభ్యోనమః
    పృచ్ఛకులు జీరో😭 అవధాని హీరో..😎

    మేటి నిషేధమాశువును మేటిసమస్యనునీయకుండిరే

    దీటుగలేనిదత్తపది! తేలెను న్యస్తము వర్ణనాంశముల్!

    ఆటయునీరసమ్మునయె!నందరుపృచ్ఛకు
    లోడె సత్య మా

    యోటమితో,వధానికిమహోన్నత సత్కృతి
    దక్కెసత్సభన్!!!

    మీ ఆచార్య లక్ష్మణ పెద్దింటి యానాం.

    రిప్లయితొలగించండి
  24. కవన సభకలంకారము
    కవివర్యుడు కానుకలను కాదను నెపుడున్
    యువ యభిమానుల ప్రేమచె
    అవధాని, పరాజయమున నందె బహుమతిన్

    రిప్లయితొలగించండి
  25. కవి నిచయ దుష్కర ప్రా
    స విరాజిలఁ జేయ నంత సన్నుత కవియే
    యవనతుఁడు కాఁగఁ బ్రాశ్నికుఁ
    డవధాని పరాజయమున నందె బహుమతిన్

    [అవధాని పరాజయమున = అవధాని యొక్క పరాజయము నందు]


    పోటరి దత్త శబ్ద సు నభోగతి నెంచ నిషిద్ధ వర్ణముల్
    వ్రేటునఁ గూలు వర్ణనలు హృద్యములౌ సహ పూరణమ్ములై
    పాటవ పృచ్ఛ కావలియె పద్య పరశ్వథ ఘాతి కోడఁగా
    నోటమితో వధానికి మహోన్నత సత్కృతి దక్కె సత్సభన్

    రిప్లయితొలగించండి
  26. పాటిగ పండితాళి రస
    వాహినివోలు వధానమందునన్
    మేటిగ పృచ్ఛకాళి యట
    మీటిన ప్రశ్నపరంపరాగతిన్
    దీటుగ వారలం దన సు
    ధీమత సామ్యత డీలుసేయ నా
    ఓటమితో వధానికి మ
    హోన్నత సత్కృతి దక్కె సత్సభన్!

    రిప్లయితొలగించండి