4-5-2021 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పారిజాత గంధమ్ము దుర్భరము సతికి”(లేదా...)“కాంతకుఁ బారిజాత సుమ గంధము దుర్భరమయ్యెఁ దోటలోన్”
పారిజాత గంధమ్ము దుర్భరము సతికి”బారువులు బంగరును తెచ్చు పడతిని విడిసారె చీరలు తేనట్టి సవతికొసగఅలక పాన్పును చేరెనుగ అలి వేణి...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు."అలక పాన్పును చేరిన దంబుజాక్షి" అనండి. లేకుంటే యతిదోషం.
మధుర భావ మనోజ్ఞము మదికి నొసగు పారిజాత గంధమ్ము : దుర్భరము సతికి పతి మధువు సేవన ము జేసి పడక జేర వఛ్చిన సమయమ్ము తనకు బాధ గలుగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు: ముచ్చటగ రుక్మిణికి కృష్ణుడిచ్చినట్టి పారిజాత ప్రసూనపు వైన మెఱిగి కోపగించిన సత్యకు పాప మట్టి పారిజాత గంధమ్ము దుర్భరము సతికి!
గురువుగారికి నమస్సులు.
కలహ భోజనుండు తెలుప కరుణ తోడ,సత్య భామ నాశికలకు సరస గతినిసోకు చుండె విడువ కుండ శుధ్ద మైనపారిజాత గంధమ్ము, దుర్భ రమ్మునాదు జీవితంబుగదా తన వనమందుకాంచ కున్న దాని ననుచు కలత చెందె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సమస్య '...దుర్భరము సతికి' అని కదా!
సత్యసాధువుగాగనుసన్మతిగనువెదకెసుమసౌరసంజాతవేణుగీతితపముతల్లడమందినతరుణమందుపారిజాతగంధమ్ముదుర్భరముసతికి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'సౌర'?
సుమసారఅనిస్వీకరింపవలసినదిగప్రార్ధన
మిత్రులందఱకు నమస్సులు![నారదుఁడిచ్చిన పారిజాత సుమమును శ్రీకృష్ణుఁడు తన చెంతనున్న రుక్మిణి కిచ్చిన విధమునుఁ జెలికత్తె చెప్పఁగా విని, యేకాంతమునకై సత్యభామ తోఁటకుఁ జనినప్పు డా పారిజాత సుమ సందర్భపుటాలోచనల వాసనలు దుర్భరమైనాయను సందర్భము]ఇంతియె వచ్చి, సెప్ప, విని, యెంతయుఁ గోపభరమ్ముపెంపునం,జెంతను నున్న తోఁటఁ జని, చింతిలుచున్, మగనిన్ సహింపకే,వింతగఁ బొంగు దుఃఖమున వేఁగుచు, మోమునుఁ జూప నీని యే కాంతకుఁ, బారిజాత సుమ గంధము దుర్భరమయ్యెఁ దోటలోన్!
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.'వచ్చి సెప్ప'... క్త్వార్థంబైన యిత్తునకు గసడదవలు రావనుకుంటాను.
భారి వర్షము కురియుచున్ వరదలచటపరుగు లెత్తుచు పంటలన్ వాసిగానుముంచివేయగ నందులో మురిగినట్టిపారిజాత గంధమ్ము దుర్భరము సతికి.
శాంతముసత్యమున్గలయసాధువుజీవునిరూపమేగదాసాంతముమానసంబదియుసాధనతోడనునిర్వికారమైభ్రాంతినిదాటియామనసుభామగక్రుష్ణునిఁజేరుదారిలోకాంతకుపారిజాతసుమగంధముదుర్భరమయ్యెదోటలోన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
శాంతము లేని మానసము సౌరును జూపని సాంధ్యరాగముల్భ్రాంతి నొనర్చు నూహలును రమ్యత నీయని రాగరక్తిమన్చెంత శ్రుతించు నా విరహచిత్తము నందున క్రమ్ము వేదనన్గాంతకుఁ బారిజాత సుమ గంధము దుర్భరమయ్యెఁ దోటలోన్!
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తేటగీతికలహబంధుడు, రుక్మిణీ కరము నందుకృష్ణుఁడొసగంగ, సత్యలో తృష్ణ రేపెచక్రి తనకీయ నొప్పక సవతి కిడినపారిజాత గంధమ్ము దుర్భరము సతికిఉత్పలమాలచింతిలి రుక్మిణీ సతికి శ్రీకరుఁడీయఁగఁ దల్లడిల్లి శ్రీకాంతుని పైననల్గి దివిఁ గాలిడి శక్రుని గెల్చి తోటనేసొంతము జేయ సత్యకు రసోదయమైనను గాఢ తీవ్రతన్కాంతకుఁ బారిజాత సుమ గంధము దుర్భరమయ్యెఁ దోటలోనింతిగఁ జెప్పెనే బయట? నీర్ష్యకు జిక్కిన వాలకమ్మిదౌ!!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
యువకుడైనట్టి పతిలోని ఉడుకు (ఒడుపు) దనముఇంతి కొసగును సాంత్వన మింపుగానుమగని సహృదయ గంధమే మగువ మెచ్చుపారిజాత గంధమ్ము దుర్భరము సతికి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'ఉడుకుదనము + ఇంతి' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. "ఉడుకుదనమె యింతి..." అనండి.
ముంతలలోన ముచ్చటగ పువ్వులనన్నియు నీరుపోసియా కాంతయె కామనీయకముగా నట పెట్టగ క్రుళ్ళి పోవగన్ జెంతన యున్న తోటజని చెత్తన వేసితి నైననేమి యాకాంతకుఁ బారిజాతసుమ గంధము దుర్భర మయ్యె దోటలోన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు."...జెంతన నున్న... చెత్తను.." అనండి.
సమస్య :కాంతకు బారిజాతసుమ గంధము దుర్భరమయ్యె దోటలోన్ ( రుక్మిణీదేవిని ఎంతో అబిమానించే జాంబవతి ఒకరోజు సత్యభామ ఉద్యాన వనంలో విహరిస్తుండగా ప్రసరించిన పారిజాతపుష్పసౌరభాన్ని ఆమె భరించలేకపోయింది )ఉత్పలమాల ...................శాంతను జేయ మాధవుడు చక్కని వృక్షము పారిజాతమున్ స్వాంతము తెప్పరిల్ల సతిసత్య కొసంగగ ; నొక్క నాడటన్సంతతసౌమ్య జాంబవతి సత్యవనమ్మున సంచరింపగన్గాంతకు బారిజాతసుమ గంధము దుర్భరమయ్యె దోటలోన్ .
రుక్మిణి సాత్త్వికురాలు కనుక భల్లుకపుత్రి జాంబవతిని రంగం మీదికి తెచ్చి చెప్పిన పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
సైపజాలని వేదనన్ సత్య పలికెనాత్మసఖితోడ కినుకతో నడరుపడుచురుక్మిణీ సతి పెరటిలో రోజు బూయుపారిజాత గంధమ్ము దుర్భరము సతికి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కాని పారిజాతం రుక్మిణి ఇంట్లో ఉంది. పెరట్లో కాదు. నారదుడు పుష్పాన్ని ఇస్తూ "ఇది వాడదు" అన్నాడు. పెరట్లో పారిజాతవృక్ష మున్నది సత్యకు.
🙏 చిన్నప్పుడు హరికథలో పిట్టకథలా దాసుగారు సత్యభామ పారిజాత ద్రుమము విస్తరించి కాండము ఆమె పెరటిలోనూ పుష్పాలు రుక్మిణీదేవి పెరటివైపూ పుష్పించాయని హాస్యం పండించారు. అది గుర్తుకు వచ్చింది 😄
వరూధినీ విలాపముఇంతలు కన్నులుంగలిగి నింతుల సొంపుల గానలేనియోకంతు సమానుడా! కలికి కమ్మని కౌగిలి కాదనంగ నీవెంత శఠుండవో యనుచు బేలతనంబున నేడ్చుచుండెడిన్కాంతకు పారిజాత సుమగంధము దుర్భరమయ్యె దోటలోన్
నేడ్చునట్టిదౌ
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
కాంతడు ప్రేమతో దనదు గాదిలి బిల్చెను బూల తోటకున్ స్వాంతము నందు తోషపడి చయ్యన చేరెను గాని చెల్వుడున్నెంతకు రాకపోయె మది నెంతయొ చింతిలె ,నట్టి వేళలో కాంతకు పారిజాత సమ గంధము దుర్భరమయ్యె దోటలోన్
దేవముని యాకసమునుండి తెచ్చినట్టపుష్పము సవతికీయ నా ముదిత వసతి యజ్జ గించుచు దన ముక్కు నంటినంతపారిజాత గంధమ్ము దుర్భరము సతికిఅజ్జగించు= విడనాడు
మంచి పూరణ. అభినందనలు.
🙏🏽
భ్రాంతినిఁ పెండ్లి చేసుకొనె బావను వద్దన నింటి పెద్దలున్శాంతియె జీవ మం దిలిగె, సాధువు గాని పతిన్ భరించు టణ్వంతము గాక యేమిటి? రవంత ప్రశాంతత నోచుకోని యా కాంతకుఁ బారిజాత సుమ గంధము దుర్భరమయ్యెఁ దోటలోన్౹౹
శంతనుడేగినాడుమునుచల్లనివేళనవేటకోసమైవింతగసోకవాసనలువెంటనుజేఱెనుమత్స్యగంధినిన్బొంతనబెండ్లియాడగనుముక్కుకుబాఱకనమ్మహీధరాకాంతకుఁ బారిజాత సుమ గంధము దుర్భరమయ్యెఁ దోటలోన్కొరుప్రోలు రాధాకృష్ణ రావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'మహీధరాకాంతకు'?
చింతితవిప్రయోగభరచిత్తవివృద్ధసమున్నతార్తిలోసంతతశీతమారుతశశాంకకరమ్ములు నూష్ణకారులైభ్రాంతిపయోధి మున్గ ననివార్యమనోజశరాహతాంగ, యాకాంతకుఁ బారిజాత సుమ గంధము దుర్భరమయ్యెఁ దోటలోన్.విప్రయోగము ఎడబాటుకంజర్ల రామాచార్య.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
నిన్నటి పూరణపరమానందకరాంబుజాస్యతరుణీబాహుద్వయీబంధనిర్భరసౌఖ్యాబ్ధిని మున్గు వేళల ననిర్వారప్రభావమ్ముతోపురిగొల్పం దగు సంస్తుతిప్రకటనాపుంస్త్వప్రసంగమ్మునన్సిరియే మోక్షము నంద సాధనమగున్ జింతించి సాధింపుమా.
మగసిరి అనే అంశములోపూరణ.
కె.వి.యస్. లక్ష్మి: ముదము గూర్చుచు మనసుకు మురిపెమిచ్చు పారిజాత గంధమ్ము; దుర్భరము సతికి నన్య పుష్పజాతుల తావి యరుసమీక సరిపడకనుండి యెలమిని సరదకుండు.
చెంతకు చేరుకొందునని చెన్నగు మాటలు పల్క, నమ్మి యేకాంతమునందునన్ గలలఁ గాంచుచు నుండగ వానికోసమైకంతుడు వేయ బాణములఁ , గాంతునిపై కసి మల్లడింపగాకాంతకు బారిజాత సుమగంధము దుర్భరమయ్యె దోటలోన్
గర్భవతి సత్య వేకువ కాలమందుపెరటి తోటఁ బూలను గోయు వేళ నయ్యెపోరి సాధించుకొన్నట్టి కోరికైనపారిజాత గంధమ్ము దుర్భరము సతికి
మగువ కింపొసఁగు మదికి మండు టెండభర్త యుండంగ నండఁగ వర్తనమునఁ బండు వెన్నెల, లేకున్నఁ బతి సరసను, బారిజాత గంధమ్ము దుర్భరము సతికి స్వాంతము నందు భక్తి నిడఁ జాలదె లోకుల కెంచఁగా రమాకాంతు దయావలోకన నికాయము వొందఁగ సమ్మదమ్మునం గాంతుని దాన మిచ్చి ధన కాయము చేఁ బతిఁ దూఁప లేక యా కాంతకుఁ బారిజాత సుమ గంధము దుర్భరమయ్యెఁ దోఁటలోన్
మీ మొదటి పూరణ ప్రశస్తంగా, రెండవ పూరణ వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
భార్య కు నీడగా భర్త ఉంటే గనక ఇహ పారిజాత మల్లే జాజి సంపెంగ గంధముల అవసరమే ఉండదు. ఆ తోడే లేకుంటే ఎంతటి అలంకారమైన అడవి కాచిన వెన్నెలేభర్త కు తోడుగా భార్య ఉంటే ఆ అన్యోన్యత కు సాటి మేటి పోటి ఉండనే ఉండదు, అదే ఆ తోడే వీడిపోతే ఆ జన్మ కే సార్థకత లేనట్టే.అత్రాజ్
చెంతకు జేర రమ్మనును చెక్కిలి నొక్కును కౌగిలించు నాకాంతుడు నేడటంచు వలకాకను జిక్కి దపించు వేళ నావంతయు జాగు సైపదిక వారిజవైరియు గాల్చు వహ్నియైకాంతకుఁ బారిజాత సుమ గంధము దుర్భరమయ్యెఁ దోటలోన్
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.'కాంతుడు లేడటంచు' టైపాటు అనుకుంటాను.
ఎంతటి భంగపాటు తనకెగ్గొనరింపగ రుక్మిణీ సతిన్చెంతకుజీరి యర్మిలిని చేడియలెల్లరు జూచుచుండ శ్రీకాంతుడు పారిజాతమును కానుకజేసెనటంచు నెంచనాకాంతకుఁ బారిజాత సుమ గంధము దుర్భరమయ్యెఁ దోటలోన్
ఉ: చింతలు లేని జీవితము సీమలెఱుంగని సంతసమ్మునున్సొంతము గాగ చందురము చూడ్కొను చుండగ నొక్కసారిగన్వింత కరోన సూక్ష్మ క్రిమి వేత మిగుల్చగృహమ్ము నందునైకాంతకు బారిజాత సుమ గంధము దర్భరమయ్యె దోటనున్ వై. చంద్రశేఖర్
నలుదెసల వ్యాప్తియగునుగ బొలుపుగానుపారిజాత గంధమ్ము,దుర్భరముసతికిసవతిపోరుండునెడలనుసంతతమ్ముభార్య కోరును బ్రేమను భర్తనుండి
కాంతుని రూపమున్ మదిని కాంచుచు నేగగ తోటలోనికిన్ గాంతకు పారిజాతసుమ గంధము దుర్భరమయ్యె దోటలోన్ జెంతను నేమియున్ననిక చేష్టలులేకను మానసంబుగాశాంతికి దూరమయ్యి తమి చర్వితచర్వణ మౌటచేన్
పారిజాత విరినొసగ పడతికచటయలకగృహమును చేరెనా యతివ సత్యసంగతెరిగి వడిగ చేర సతిని శౌరిపారిజాత గంధమ్ము దుర్భరము సతికి
సత్య నటనలో వ్యక్తమౌ సవతి యీసురుక్మిణీ పైన కలహమున్ రుజువుపరచునాథు సవరింపు కథనడ్పు నయమెగాని"పారిజాత గంధమ్ము దుర్భరము సతికి"
పారిజాత విరినొసగ పడతికచటయలకగృహమును చేరెనా యతివ సత్యసంగతెరిగి వడిగ చేర సతిని శౌరిపారిజాత గంధమ్ము దుర్భరము సతికి.
పారిజాత గంధమ్ము దుర్భరము సతికి”
రిప్లయితొలగించుబారువులు బంగరును తెచ్చు పడతిని విడి
సారె చీరలు తేనట్టి సవతికొసగ
అలక పాన్పును చేరెనుగ అలి వేణి
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు"అలక పాన్పును చేరిన దంబుజాక్షి" అనండి. లేకుంటే యతిదోషం.
మధుర భావ మనోజ్ఞము మదికి నొసగు
రిప్లయితొలగించుపారిజాత గంధమ్ము : దుర్భరము సతికి
పతి మధువు సేవన ము జేసి పడక జేర
వఛ్చిన సమయమ్ము తనకు బాధ గలుగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించుముచ్చటగ రుక్మిణికి కృష్ణుడిచ్చినట్టి
పారిజాత ప్రసూనపు వైన మెఱిగి
కోపగించిన సత్యకు పాప మట్టి
పారిజాత గంధమ్ము దుర్భరము సతికి!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుగురువుగారికి నమస్సులు.
తొలగించుకలహ భోజనుండు తెలుప కరుణ తోడ,
రిప్లయితొలగించుసత్య భామ నాశికలకు సరస గతిని
సోకు చుండె విడువ కుండ శుధ్ద మైన
పారిజాత గంధమ్ము, దుర్భ రమ్ము
నాదు జీవితంబుగదా తన వనమందు
కాంచ కున్న దాని ననుచు కలత చెందె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుసమస్య '...దుర్భరము సతికి' అని కదా!
సత్యసాధువుగాగనుసన్మతిగను
రిప్లయితొలగించువెదకెసుమసౌరసంజాతవేణుగీతి
తపముతల్లడమందినతరుణమందు
పారిజాతగంధమ్ముదుర్భరముసతికి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'సౌర'?
సుమసార
తొలగించుఅనిస్వీకరింపవలసినదిగప్రార్ధన
రిప్లయితొలగించుమిత్రులందఱకు నమస్సులు!
[నారదుఁడిచ్చిన పారిజాత సుమమును శ్రీకృష్ణుఁడు తన చెంతనున్న రుక్మిణి కిచ్చిన విధమునుఁ జెలికత్తె చెప్పఁగా విని, యేకాంతమునకై సత్యభామ తోఁటకుఁ జనినప్పు డా పారిజాత సుమ సందర్భపుటాలోచనల వాసనలు దుర్భరమైనాయను సందర్భము]
ఇంతియె వచ్చి, సెప్ప, విని, యెంతయుఁ గోపభరమ్ముపెంపునం,
జెంతను నున్న తోఁటఁ జని, చింతిలుచున్, మగనిన్ సహింపకే,
వింతగఁ బొంగు దుఃఖమున వేఁగుచు, మోమునుఁ జూప నీని యే
కాంతకుఁ, బారిజాత సుమ గంధము దుర్భరమయ్యెఁ దోటలోన్!
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించు'వచ్చి సెప్ప'... క్త్వార్థంబైన యిత్తునకు గసడదవలు రావనుకుంటాను.
రిప్లయితొలగించుభారి వర్షము కురియుచున్ వరదలచట
పరుగు లెత్తుచు పంటలన్ వాసిగాను
ముంచివేయగ నందులో మురిగినట్టి
పారిజాత గంధమ్ము దుర్భరము సతికి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుశాంతముసత్యమున్గలయసాధువుజీవునిరూపమేగదా
రిప్లయితొలగించుసాంతముమానసంబదియుసాధనతోడనునిర్వికారమై
భ్రాంతినిదాటియామనసుభామగక్రుష్ణునిఁజేరుదారిలో
కాంతకుపారిజాతసుమగంధముదుర్భరమయ్యెదోటలోన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుశాంతము లేని మానసము
రిప్లయితొలగించుసౌరును జూపని సాంధ్యరాగముల్
భ్రాంతి నొనర్చు నూహలును
రమ్యత నీయని రాగరక్తిమన్
చెంత శ్రుతించు నా విరహ
చిత్తము నందున క్రమ్ము వేదనన్
గాంతకుఁ బారిజాత సుమ గంధము దుర్భరమయ్యెఁ దోటలోన్!
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుతేటగీతి
రిప్లయితొలగించుకలహబంధుడు, రుక్మిణీ కరము నందు
కృష్ణుఁడొసగంగ, సత్యలో తృష్ణ రేపె
చక్రి తనకీయ నొప్పక సవతి కిడిన
పారిజాత గంధమ్ము దుర్భరము సతికి
ఉత్పలమాల
చింతిలి రుక్మిణీ సతికి శ్రీకరుఁడీయఁగఁ దల్లడిల్లి శ్రీ
కాంతుని పైననల్గి దివిఁ గాలిడి శక్రుని గెల్చి తోటనే
సొంతము జేయ సత్యకు రసోదయమైనను గాఢ తీవ్రతన్
కాంతకుఁ బారిజాత సుమ గంధము దుర్భరమయ్యెఁ దోటలో
నింతిగఁ జెప్పెనే బయట? నీర్ష్యకు జిక్కిన వాలకమ్మిదౌ!!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించు🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుయువకుడైనట్టి పతిలోని ఉడుకు (ఒడుపు) దనము
రిప్లయితొలగించుఇంతి కొసగును సాంత్వన మింపుగాను
మగని సహృదయ గంధమే మగువ మెచ్చు
పారిజాత గంధమ్ము దుర్భరము సతికి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'ఉడుకుదనము + ఇంతి' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. "ఉడుకుదనమె యింతి..." అనండి.
రిప్లయితొలగించుముంతలలోన ముచ్చటగ పువ్వులనన్నియు నీరుపోసియా
కాంతయె కామనీయకముగా నట పెట్టగ క్రుళ్ళి పోవగన్
జెంతన యున్న తోటజని చెత్తన వేసితి నైననేమి యా
కాంతకుఁ బారిజాతసుమ గంధము దుర్భర
మయ్యె దోటలోన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు"...జెంతన నున్న... చెత్తను.." అనండి.
సమస్య :
రిప్లయితొలగించుకాంతకు బారిజాతసుమ
గంధము దుర్భరమయ్యె దోటలోన్
( రుక్మిణీదేవిని ఎంతో అబిమానించే జాంబవతి ఒకరోజు సత్యభామ ఉద్యాన వనంలో విహరిస్తుండగా ప్రసరించిన పారిజాతపుష్పసౌరభాన్ని ఆమె భరించలేకపోయింది )
ఉత్పలమాల
...................
శాంతను జేయ మాధవుడు
చక్కని వృక్షము పారిజాతమున్
స్వాంతము తెప్పరిల్ల సతి
సత్య కొసంగగ ; నొక్క నాడటన్
సంతతసౌమ్య జాంబవతి
సత్యవనమ్మున సంచరింపగన్
గాంతకు బారిజాతసుమ
గంధము దుర్భరమయ్యె దోటలోన్ .
రుక్మిణి సాత్త్వికురాలు కనుక భల్లుకపుత్రి జాంబవతిని రంగం మీదికి తెచ్చి చెప్పిన పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుసైపజాలని వేదనన్ సత్య పలికె
రిప్లయితొలగించునాత్మసఖితోడ కినుకతో నడరుపడుచు
రుక్మిణీ సతి పెరటిలో రోజు బూయు
పారిజాత గంధమ్ము దుర్భరము సతికి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుకాని పారిజాతం రుక్మిణి ఇంట్లో ఉంది. పెరట్లో కాదు. నారదుడు పుష్పాన్ని ఇస్తూ "ఇది వాడదు" అన్నాడు. పెరట్లో పారిజాతవృక్ష మున్నది సత్యకు.
🙏 చిన్నప్పుడు హరికథలో పిట్టకథలా దాసుగారు సత్యభామ పారిజాత ద్రుమము విస్తరించి కాండము ఆమె పెరటిలోనూ పుష్పాలు రుక్మిణీదేవి పెరటివైపూ పుష్పించాయని హాస్యం పండించారు. అది గుర్తుకు వచ్చింది 😄
తొలగించువరూధినీ విలాపము
రిప్లయితొలగించుఇంతలు కన్నులుంగలిగి నింతుల సొంపుల గానలేని
యో
కంతు సమానుడా! కలికి కమ్మని కౌగిలి కాదనంగ నీ
వెంత శఠుండవో యనుచు బేలతనంబున నేడ్చుచుండెడిన్
కాంతకు పారిజాత సుమగంధము దుర్భరమయ్యె దోటలోన్
నేడ్చునట్టిదౌ
తొలగించుమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
తొలగించుకాంతడు ప్రేమతో దనదు గాది
రిప్లయితొలగించులి బిల్చెను బూల తోటకున్
స్వాంతము నందు తోషపడి
చయ్యన చేరెను గాని చెల్వుడు
న్నెంతకు రాకపోయె మది నెం
తయొ చింతిలె ,నట్టి వేళలో
కాంతకు పారిజాత సమ గంధ
ము దుర్భరమయ్యె దోటలోన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుదేవముని యాకసమునుండి తెచ్చినట్ట
రిప్లయితొలగించుపుష్పము సవతికీయ నా ముదిత వసతి
యజ్జ గించుచు దన ముక్కు నంటినంత
పారిజాత గంధమ్ము దుర్భరము సతికి
అజ్జగించు= విడనాడు
మంచి పూరణ. అభినందనలు.
తొలగించు🙏🏽
తొలగించుభ్రాంతినిఁ పెండ్లి చేసుకొనె బావను వద్దన నింటి పెద్దలున్
రిప్లయితొలగించుశాంతియె జీవ మం దిలిగె, సాధువు గాని పతిన్ భరించు ట
ణ్వంతము గాక యేమిటి? రవంత ప్రశాంతత నోచుకోని యా
కాంతకుఁ బారిజాత సుమ గంధము దుర్భరమయ్యెఁ దోటలోన్౹౹
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుశంతనుడేగినాడుమునుచల్లనివేళనవేటకోసమై
రిప్లయితొలగించువింతగసోకవాసనలువెంటనుజేఱెనుమత్స్యగంధినిన్
బొంతనబెండ్లియాడగనుముక్కుకుబాఱకనమ్మహీధరా
కాంతకుఁ బారిజాత సుమ గంధము దుర్భరమయ్యెఁ దోటలోన్
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'మహీధరాకాంతకు'?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుచింతితవిప్రయోగభరచిత్తవివృద్ధసమున్నతార్తిలో
రిప్లయితొలగించుసంతతశీతమారుతశశాంకకరమ్ములు నూష్ణకారులై
భ్రాంతిపయోధి మున్గ ననివార్యమనోజశరాహతాంగ, యా
కాంతకుఁ బారిజాత సుమ గంధము దుర్భరమయ్యెఁ దోటలోన్.
విప్రయోగము ఎడబాటు
కంజర్ల రామాచార్య.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించునిన్నటి పూరణ
రిప్లయితొలగించుపరమానందకరాంబుజాస్యతరుణీబాహుద్వయీబంధని
ర్భరసౌఖ్యాబ్ధిని మున్గు వేళల ననిర్వారప్రభావమ్ముతో
పురిగొల్పం దగు సంస్తుతిప్రకటనాపుంస్త్వప్రసంగమ్మునన్
సిరియే మోక్షము నంద సాధనమగున్ జింతించి సాధింపుమా.
మగసిరి అనే అంశములో
తొలగించుపూరణ.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుకె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించుముదము గూర్చుచు మనసుకు మురిపెమిచ్చు
పారిజాత గంధమ్ము; దుర్భరము సతికి
నన్య పుష్పజాతుల తావి యరుసమీక
సరిపడకనుండి యెలమిని సరదకుండు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుచెంతకు చేరుకొందునని చెన్నగు మాటలు పల్క, నమ్మి యే
రిప్లయితొలగించుకాంతమునందునన్ గలలఁ గాంచుచు నుండగ వానికోసమై
కంతుడు వేయ బాణములఁ , గాంతునిపై కసి మల్లడింపగా
కాంతకు బారిజాత సుమగంధము దుర్భరమయ్యె దోటలోన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుగర్భవతి సత్య వేకువ కాలమందు
రిప్లయితొలగించుపెరటి తోటఁ బూలను గోయు వేళ నయ్యె
పోరి సాధించుకొన్నట్టి కోరికైన
పారిజాత గంధమ్ము దుర్భరము సతికి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుమగువ కింపొసఁగు మదికి మండు టెండ
రిప్లయితొలగించుభర్త యుండంగ నండఁగ వర్తనమునఁ
బండు వెన్నెల, లేకున్నఁ బతి సరసను,
బారిజాత గంధమ్ము దుర్భరము సతికి
స్వాంతము నందు భక్తి నిడఁ జాలదె లోకుల కెంచఁగా రమా
కాంతు దయావలోకన నికాయము వొందఁగ సమ్మదమ్మునం
గాంతుని దాన మిచ్చి ధన కాయము చేఁ బతిఁ దూఁప లేక యా
కాంతకుఁ బారిజాత సుమ గంధము దుర్భరమయ్యెఁ దోఁటలోన్
మీ మొదటి పూరణ ప్రశస్తంగా, రెండవ పూరణ వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించుపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించుభార్య కు నీడగా భర్త ఉంటే గనక ఇహ పారిజాత మల్లే జాజి సంపెంగ గంధముల అవసరమే ఉండదు. ఆ తోడే లేకుంటే ఎంతటి అలంకారమైన అడవి కాచిన వెన్నెలే
రిప్లయితొలగించుభర్త కు తోడుగా భార్య ఉంటే ఆ అన్యోన్యత కు సాటి మేటి పోటి ఉండనే ఉండదు, అదే ఆ తోడే వీడిపోతే ఆ జన్మ కే సార్థకత లేనట్టే.
అత్రాజ్
చెంతకు జేర రమ్మనును చెక్కిలి నొక్కును కౌగిలించు నా
రిప్లయితొలగించుకాంతుడు నేడటంచు వలకాకను జిక్కి దపించు వేళ నా
వంతయు జాగు సైపదిక వారిజవైరియు గాల్చు వహ్నియై
కాంతకుఁ బారిజాత సుమ గంధము దుర్భరమయ్యెఁ దోటలోన్
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించు'కాంతుడు లేడటంచు' టైపాటు అనుకుంటాను.
ఎంతటి భంగపాటు తనకెగ్గొనరింపగ రుక్మిణీ సతిన్
రిప్లయితొలగించుచెంతకుజీరి యర్మిలిని చేడియలెల్లరు జూచుచుండ శ్రీ
కాంతుడు పారిజాతమును కానుకజేసెనటంచు నెంచనా
కాంతకుఁ బారిజాత సుమ గంధము దుర్భరమయ్యెఁ దోటలోన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుఉ:
రిప్లయితొలగించుచింతలు లేని జీవితము సీమలెఱుంగని సంతసమ్మునున్
సొంతము గాగ చందురము చూడ్కొను చుండగ నొక్కసారిగన్
వింత కరోన సూక్ష్మ క్రిమి వేత మిగుల్చగృహమ్ము నందునై
కాంతకు బారిజాత సుమ గంధము దర్భరమయ్యె దోటనున్
వై. చంద్రశేఖర్
నలుదెసల వ్యాప్తియగునుగ బొలుపుగాను
రిప్లయితొలగించుపారిజాత గంధమ్ము,దుర్భరముసతికి
సవతిపోరుండునెడలనుసంతతమ్ము
భార్య కోరును బ్రేమను భర్తనుండి
కాంతుని రూపమున్ మదిని కాంచుచు నేగగ తోటలోనికిన్
రిప్లయితొలగించుగాంతకు పారిజాతసుమ గంధము దుర్భరమయ్యె దోటలోన్
జెంతను నేమియున్ననిక చేష్టలులేకను మానసంబుగా
శాంతికి దూరమయ్యి తమి చర్వితచర్వణ మౌటచేన్
పారిజాత విరినొసగ పడతికచట
రిప్లయితొలగించుయలకగృహమును చేరెనా యతివ సత్య
సంగతెరిగి వడిగ చేర సతిని శౌరి
పారిజాత గంధమ్ము దుర్భరము సతికి
సత్య నటనలో వ్యక్తమౌ సవతి యీసు
రిప్లయితొలగించురుక్మిణీ పైన కలహమున్ రుజువుపరచు
నాథు సవరింపు కథనడ్పు నయమెగాని
"పారిజాత గంధమ్ము దుర్భరము సతికి"
పారిజాత విరినొసగ పడతికచట
రిప్లయితొలగించుయలకగృహమును చేరెనా యతివ సత్య
సంగతెరిగి వడిగ చేర సతిని శౌరి
పారిజాత గంధమ్ము దుర్భరము సతికి.