1, మే 2021, శనివారం

సమస్య - 3710

2-5-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుశలవుల్ గారు రాముని కొడుకు లంద్రు”
(లేదా...)
“పుత్రులు గారుపో కుశలవుల్ రఘురామున కంద్రు సజ్జనుల్”
(ఈ పాపం నాది కాదు... 'కార్తికదీపం' సీరియల్‌ది!)

64 కామెంట్‌లు:

  1. మిత్రులందఱకు నమస్సులు!

    క్షేత్రము బీజముం గనియుఁ జెట్టునఁ బండ్లనుఁ గాంచుమంచుఁ, జా
    రిత్రముఁ గాంచి, సంతతి సుకృత్యములం గని, వాని నెల్ల, స
    ద్గాత్రుల టంచు మెచ్చి, మనగాఁ దగు దీవెన లిచ్చి, యిచ్చి, "దు
    ష్పుత్రులు గారు పో కుశలవుల్ రఘురామున" కండ్రు సజ్జనుల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా పూరణమునే కొద్దిగా మార్చి తిరిగి ప్రకటించుచున్నాను...

      "క్షేత్రము బీజముం గనియుఁ, జెట్టునఁ బండ్లనుఁ గాంచు మండ్రు; చా
      రిత్రులు భూజ రాఘవుల శ్రేష్ఠగుణాలు లభింపఁ, బుట్టి, స
      ద్గాత్రులుగా గుణాలు వెలుఁగంగను, ఖ్యాతి గడించినారు; దు
      ష్పుత్రులు గారు పో కుశలవుల్ రఘురామున" కండ్రు సజ్జనుల్!

      తొలగించండి
    2. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  2. తరచి చూడగా కృష్ణుని తనయు లెపుడు

    కుశలవుల్ గారు, రాముని‌ కొడుకు లంద్రు

    వినుము దశరధ నందనుల్ ఘనులు వారె

    రామ శత్రుఙ్ఞ భరతులు లక్ష్మణుడును

    రిప్లయితొలగించండి
  3. రామరాజ్యంబురహిమీరరంజితముగ
    ప్రజలుబిడ్డలునైరిగప్రభువునకును
    కన్నబిడ్డలునడవినికష్టపడిరి
    కుశలవుల్గారురామునికోడుకులండ్రు

    రిప్లయితొలగించండి
  4. మౌని వాల్మీకి శిక్షణన్ మాన్యులగుచు
    రామ కథను గానము జేసి రహిని గాంచి
    మన్నన లు బొంది రిగ వారు మహిని దుష్ట
    కుశ లవులు గారు రాముని కొడుకు లండ్రు

    రిప్లయితొలగించండి

  5. తుంటరితనమందున యజ్ఞ తురికినెవరు
    పట్టి బంధించిరో తెలుపవలె ననగ
    వారు వనముందిరుగు ముని బాలకుండ్రు
    కుశలవుల్ గారు, రాముని కొడుకులంద్రు.



    క్షాత్రము జూపి గోత్రమున శైబ్యముఁ బాలురు బంధిసేసిరా?
    చిత్రమె కాదె నప్పలకు స్థేమమదెట్టుల వచ్చె మౌనికిన్
    బౌత్రులకంచు సందియము వద్దని చెప్పెద, పారికాంక్షికిన్
    బుత్రులు కారుపో కుశలవుల్, రఘురామునకంద్రు సజ్జనుల్,

    రిప్లయితొలగించండి
  6. ఛాత్రులుధర్మబద్ధతకుజానకిసూనులుసత్యసంధులే
    మిత్తునివంశజాతులుగమేరువులైరిగవీరమందునన్
    పాత్రులురాజధర్మమునుపాలనసేయగసచ్చరిత్రతో
    పుత్రులుగారుపోకుశలవుల్రఘురామునకండ్కుసజ్జనుల్

    రిప్లయితొలగించండి
  7. పోరు సలిపెను రాముడు, పూని గెలువ,
    పుత్రులని తెలియక సీత పుట్టు బడిని
    వెలుగు, కవలపిల్లల తోడ, వేరొకరును
    కుశలవుల్ గారు, రాముని కొడుకు లంద్రు.

    రిప్లయితొలగించండి
  8. లవకుశ సినిమా షూటింగులో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారిని ఒక పాత్రికేయుడు ఈ లవకుశ పాత్రధారులు మీ కుమారులేనా అని అడిగిన సందర్భం మును పురస్కరించుకొని నేటి నా పూరణ


    చిత్రము తీయ రామకథ శీలన జేసెను యెన్టియారుతో
    నాత్రము తోడ పృచ్ఛకుడు నందరిలో కుశుడున్ లవుండు మీ
    పుత్రులె పాత్రధారులన పోహణతో నికిలించి వీరు నా
    పుత్రులు గారుపో కుశలవుల్ రఘురామున కంద్రు సజ్జనుల్

    పోహణ = నేర్పు

    రిప్లయితొలగించండి
  9. తేటగీతి
    సాధ్వి జానకి కన్నది సద్గుణులను
    రూప లావణ్యముల మెచ్చ లోకమెల్ల
    ధర్మ విగ్రహునకునెందు తక్కువైన
    కుశలవుల్ గారు రాముని కొడుకు లంద్రు

    ఉత్పలమాల
    ధాత్రిని సీత కన్నదట ధర్మము దప్పని రాముఁ బోలెడున్
    పుత్రుల నన్నిటన్ బుణికి పుచ్చుకొనంగను తండ్రి శీలమున్
    శాత్రవ కోటి భీతిలెడు స్వామికి వారలు తక్కువైనచో
    పుత్రులు గారుపో కుశలవుల్ రఘురామున కంద్రు సజ్జనుల్

    రిప్లయితొలగించండి
  10. ఉ:

    చిత్రము చిన్న నాడె బలి చిక్కగ గొప్పగు యుద్ధరీతులన్
    పుత్రులు గాని చందమున, పూనిక రాముని తమ్ము లెల్లరిన్
    నాత్రము మేర నోటమికి నంచున జెర్చగ, నగ్గి పిడ్గు లీ
    పుత్రులు గారుపో కుశలవుల్,! రఘు రాముని కంద్రు, సజ్జనుల్

    బలి =అశ్వమేధ యాగాశ్వము

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  11. పిన్నతనమున గుర్తింపు పితరవలన
    వచ్చు సంఘమందున , గాన
    వారిరువురు
    కుశలవుల్ గారు ; రాముని కొడుకు లంద్రు
    వారి చేష్టలె దండ్రికి వన్నె దెచ్చు

    రిప్లయితొలగించండి
  12. గాత్రపు సౌరభంబునను గానము జేయుచు రామగాధనే
    క్షాత్రము జూపి రాముడిని సంగరమందున నిల్పినట్టియా
    ధాత్రిజ కీర్తివర్ధనులు తర్షకులంబున మచ్చదెచ్చెడిన్
    పుత్రులు గారుపో కుశలవుల్ రఘురామున కంద్రు సజ్జనుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      (ఇప్పుడెక్కడుంటున్నారు మీరు?)

      తొలగించండి
    2. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు. నేను అమెరికాలోనే ఉంటున్నానండీ. ప్రస్తుతం కొలంబస్ నగరంలో ఉంటున్నాను.

      తొలగించండి
  13. గాత్రము ముగ్ధులన్ బఱచు కావి ధరించిన వారు కేవలం
    బుత్రులు గారుపో కుశలవుల్ రఘురామున, కంద్రు సజ్జనుల్,
    క్షాత్రపు ధర్మమున్ నెఱప శాంతియు భద్రత పొందుజేయు క్ష్మా
    పాత్రులు, వా రయోధ్య పరిపాలన జేతురు కీర్తిమంతులై౹౹

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కేవలం' అనడం వ్యావహారికం.

      తొలగించండి
  14. జానకీ మాత కడుపున జనన మొంది
    యినకుల తిలకునికి కీర్తినినుమడించి
    చరిత యందునిలిచిన సచ్చరితులుగద
    ముందు వెనుకల నెంచని మూఢజనులె
    కుశలవుల్ గారు రాముని కొడుకు లంద్రు

    రిప్లయితొలగించండి
  15. క్షత్రియధర్మసూత్రమదిగయ్యమునందునశౌర్యమందద
    త్పాత్రులునశ్వమేధమునఁబట్టిరిఁగట్టిరివీరబుత్రులై
    ధాత్రినిజుట్టునట్టిదగుదానినివారలుబట్టకున్నచో
    పుత్రులు గారుపో కుశలవుల్ రఘురామున కంద్రు సజ్జనుల్

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  16. రణమునందునగెలిచి శ్రీరామచంద్రు
    నశ్వమేధమ్ము మనమిప్పుడడ్డకున్న
    పౌరుషములేని పందలు వీరిరువురు
    కుశలవుల్ గారురా! ముని కొడుకు లంద్రు

    రిప్లయితొలగించండి
  17. ధాత్రిని వీరులిద్దరును తండ్రిని మించగ బాణ విద్యలో
    ఛాత్రులతీర్చిదిద్దెదను చక్కని జోదులుగా దురంబునన్
    క్షాత్రపు ధర్మమున్నెరపు కౌశలమొప్పగ జేయకున్నచో
    పుత్రులు గారుపో కుశలవుల్ రఘురామున కంద్రు సజ్జనుల్

    రిప్లయితొలగించండి
  18. రిప్లయిలు
    1. క్షత్రియవంశసంభవము సాత్వికమౌనిసుశిక్షణమ్ముస
      చ్ఛాత్రుల మైత్రి సాధుమునిసన్నిధిధార్మికజీవనమ్ము స
      త్పాత్రయశమ్మునొందు వనవాసులు, దంచితదష్టబుద్ధిమ
      త్పుత్రులు గారుపో కుశలవుల్ రఘురామున కంద్రు సజ్జనుల్.

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
    2. మీ పూరణ మనోజ్ఞంగా ఉన్నది. అభినందనలు.
      'ఉదంచిత దుష్టబుద్ధి' అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి
  19. మిత్ర రుషీశ్వరాంగనల మేలగు సాయము చేత సీత ఆ
    సత్రము నందునన్ మిగులు చాతురతన్ కనిపెంచె పుత్రులన్
    పుత్రులు రామునిన్ గెలువ బోరగ అస్త్రము వీడె సీతకే
    పుత్రులు గారు పో! కుశలవుల్ రఘు రాముని కంద్రు సజ్జనుల్

    రిప్లయితొలగించండి
  20. క్షేత్రమునందు గల్గి యల శ్రీరఘురాముని ధర్మపత్నియై
    గోత్రములోన సీత కడు కూర్మిని పంచుచు పెంచ, వీరులై
    క్షత్రియ ధర్మమున్ నిలుప గ్రక్కున నశ్వము పట్టకున్నచో
    పుత్రులు కారుపో కుశలవుల్ రఘురామునకంద్రు సజ్జనుల్

    రిప్లయితొలగించండి
  21. మార్పుతో మరో పూరణ.

    క్షత్రియవంశసంభవము సాత్వికమౌనిసుశిక్షణమ్ముస
    చ్ఛాత్రుల మైత్రి సాధుమునిసన్నిధివర్తన నొప్పి భూమిదౌ
    హిత్రయశమ్మునొంది రన నీదృశధార్మికులై కుబుద్ధిమ
    త్పుత్రులు గారుపో కుశలవుల్ రఘురామున కంద్రు సజ్జనుల్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  22. ఆది దంపతు లకొమరు లరయ వినుము
    కుశలవుల్ గారు,రామునికొడుకులంద్రు
    కుశలవులనిల నిజమది కుమతు లగరు
    వమ్ము నణచువీ రులువారు సుమ్ము బాల!

    రిప్లయితొలగించండి
  23. వినకుమ కనకుమ పస చెడిన పని యను
    నది కఱవయిన జనులకు నెదను గలవ
    ర పఱచెడి కతలఁ గల గిరలను నిటులఁ
    గుశలవుల్ గారు రాముని కొడుకు లంద్రు


    చిత్రము కా కు నార్తికకుఁ జేరఁగ దీపము “దుష్ట తప్త దీ
    పాత్ర” యనంగ నొప్పగు నపాత్రపు గాథకు నెంచి చూడఁగన్
    క్షాత్రము నందు తండ్రికినిఁ జాలరె! కార్ముక మందు నల్పపుం
    బుత్రులు గారు పో కుశలవుల్ రఘురామున కంద్రు సజ్జనుల్

    [కా + ఆర్తిక +దీపము; “దుష్ట+తప్త+ దీప+అత్ర”: చెడ్డదైన యార్తి నొందిన దీప మిక్కడ యని యనఁగ నొప్పగును.]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  24. చిత్రముగాగ రామకథ చెప్పుచు విశ్వమునందు రామునిన్
    శాత్రవభీకరున్ తెలుప జాలిరి,
    ధారుణిలోన సద్యశః
    పాత్రులు, వీరులున్, కదనవైభవయుక్తులు, నామమాత్రులౌ
    *పుత్రులు గారుపో కుశలవుల్ రఘురామున కండ్రు సజ్జనుల్* .

    రిప్లయితొలగించండి
  25. శత్రువుగా దలంచిరట జన్మదునంచు వితండవాదులే
    పుత్రులు గారుపో కుశలవుల్ రఘురామున కంద్రు; సజ్జనుల్
    పుత్రులనంగనా కుశలవుల్ గనుడందురు వారి ధీరతన్
    క్షాత్రము జూపి యశ్వమును గట్టిరిగా వెనుకంజ వేయకన్

    రిప్లయితొలగించండి
  26. పుత్రులుగారు పోకుశలవుల్ రఘురామునకంద్రు సజ్జనుల్
    చిత్రముగాదె యీపలుకు శీర్షములోపల గుంజుగల్గునే
    మిత్రుడు బల్కడిట్లుగను మేదిని సజ్జనులైనవారలే
    పాత్రతలేక పల్కనిక బంధములుండునె?జిత్తగించుమా

    రిప్లయితొలగించండి
  27. కె.వి.యస్. లక్ష్మి:

    వనమునందు రామాశ్వము పట్టియుండి
    మిత్రులన్ గూడి నాడుచు మెలగుచుండి
    పొలయు వీరిరువుర నెంచి తలచ దెలియు
    కుశలవుల్ గాదురా! మునికొడుకు లండ్రు.

    రిప్లయితొలగించండి