19, మే 2021, బుధవారం

సమస్య - 3727

20-5-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గాలి విసరెను వృక్షశాఖలు గదలవు”
(లేదా...)
“గాలులు తీవ్రమై విసరెఁ గాని చలింపవు వృక్షశాఖలే”

60 కామెంట్‌లు:

  1. మారుతమ్మునుగూడతామాయఁజేసి
    చెట్టుచేమలమాటునచేరెపురుగు
    వాయుజ్రుంభణముప్పునువచ్చుననుచు
    గాలివిసరెనువ్రుక్షశాఖలుకదలవు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      'జృంభణ' టైపాటు. 'జృంభన ముప్పు' వైరి సమాసం.

      తొలగించండి
    2. జ్రుంభననాపదఅంటేసరిపోతుందాగురువుగారు

      తొలగించండి
  2. శ్రీకృష్ణ పరమాత్మ తో దుర్యోధనుడు :

    తేటగీతి
    పాండు సుతులకు రాజ్యము పంచననిన
    నాలమందున గూల్తురటంచుఁ గృష్ణ!
    గోల జేయఁగఁ గురుభూమిఁ బేలవమగు
    గాలి విసరెను వృక్షశాఖలు గదలవు!

    ఉత్పలమాల
    మేలని పాండవేయులకు మేదిని రాజ్యము పంచ కున్న మ
    మ్మాలము నందుఁ గూల్తురని యంబుజలోచన! భీతిఁ గొల్పితే!
    మేలమ? హస్తినాపురిని మీరుచుఁ బల్కెడు నీదు మాటలన్
    గాలులు తీవ్రమై విసరెఁ గాని చలింపవు వృక్షశాఖలే!

    రిప్లయితొలగించండి
  3. మిత్రులందఱకు నమస్సులు!

    లీలగ వచ్చిచేరె నయొ లెండు కరోనను మాన్పుకోసమై
    గోలలు సేయకే యెదురుకొండని పెద్దలు సెప్పినన్, మహా
    సాలము వోలె నద్దియె విశాలము నయ్యెను! మంచి మందు లన్
    గాలులు తీవ్రమై విసరెఁ గాని, చలింపవు వృక్షశాఖలే!

    రిప్లయితొలగించండి
  4. సమస్య :

    గాలులు తీవ్రమై విసరె
    గాని చలింపవు వృక్షశాఖలే

    ( వాయుదేవునికి , ఆదిశేషునికి వచ్చిన శౌర్యవిషయక మైన పోటీలో మేరుగిరిని తన వేయిపడగలతో కప్పిన శేషుని పట్టునుండి మేరువును కదలించటానికి వాయుదేవుని మాటలు చేతలు )

    ఉత్పలమాల
    ...................

    " చాలును శేషుడా ! పలుకు
    చాతురి నాపుము ; సాగదింక నీ
    మేలము నా కడన్ ; దలప
    మిక్కిలి చిక్కుల నందెదీవు ; నీ
    వాలము నూపబోకు " మని
    వాయువు బుగ్గల నూదుచుండగా
    గాలులు తీవ్రమై విసరె ;
    గాని చలింపవు వృక్షశాఖలే !!

    రిప్లయితొలగించండి
  5. ఆలినినాట్యగత్తెయనెనన్నయుగౌరవమెంచిచూడకే
    గాలికిపుత్రుడయ్యునుఖండనసేయడువంశరాజమున్
    వాలినభీముడాయెడనువారణనిల్చెనుశాంతితోడుతన్
    గాలులుతీవ్రమైవిసరెగానిచలింపవువ్రుక్షశాఖలే
    విరాటపర్వమునభీముడుధర్మజునానతితోఆశ్రయమునునరకలేదుగదా

    రిప్లయితొలగించండి
  6. ప్రకృతి యందున మార్పులు ప్రభవ మంద
    వేరు వేరగు విపరీత వికృతు లనఁగ
    మహిని నొకచోట నేర్పడె మంద గమన
    గాలి విసరెను వృక్ష శాఖలు గదలవు

    రిప్లయితొలగించండి

  7. చాలవు జీతబత్తెములు సత్వరమే నవి పెంచుమంచు నా
    రాలికులెల్ల క్రోధమున రాష్ట్రమునంధృత సమ్మె జేసినన్
    బాలకులందు స్పందనయె వయ్యమవన్ గని చెప్పెనిట్టులన్
    గాలులు తీవ్రమై విసిరె గానిచలింపవు వృక్షశాఖలే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      వాట్సప్ సమూహంలో నా వ్యాఖ్య చూడండి.

      తొలగించండి
  8. బెదిరెను జనులు వల్లకాడదిరి వణికె

    మెట్టిన కరోన కొట్టెను గట్టి దెబ్బ

    మానవుల శాఖలు కదల్చు మలిన హోరు

    గాలి విసరెను , వృక్షశాఖలు గదలవు”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి

  9. అవనితలమంతట కరోన యావరించి
    భీతికొలిపెడు వేళను నేతలెల్ల
    మునగ నెన్నికలందు, నో బుధుడు పలికె
    గాలి విసరెను, వృక్షశాఖలు గదలవు.

    రిప్లయితొలగించండి
  10. చేలము వట్టి ద్రౌపదిని శీలవతిన్ గొనితెచ్చి క్రూర భూ
    పాలుని తమ్ముడౌ ఖలుడు వస్త్రవిహీనను సేయుచుండగా
    శైలము వోలె కూర్చొనిరి జ్ఞాతులు బంధులు వృద్ధులెల్లరున్
    గాలులు తీవ్రమై విసరెఁ గాని చలింపవు వృక్షశాఖలే

    రిప్లయితొలగించండి
  11. రాలిరి పక్షులై జనులరణ్యపు రోదన రాష్ట్రమందునన్
    మ్రోలను నున్నయౌషధము మ్రుచ్చులు నెల్లరు మ్రుచ్చిలింపగా
    నేలిక కింత బట్టదయె నెప్పుడు జూచిన రాజకీయమే
    గాలులు తీవ్రమై విసరె గాని చలింపవు వృక్షశాఖలే.

    రిప్లయితొలగించండి
  12. మేలగు చెట్లు నాటి కడు మి
    క్కలి శ్రద్ధగ బెంచ నిత్యమున్
    బాలన జేసినన్ మిగుల భవ్య
    ముగాను బలిష్ఠ మ్రానుతో
    జాల బలమ్ముగా నెదుగు శాఖ
    లు ,వర్షపు కాలమందునన్
    గాలులు తీవ్రమై విసిరె గాని
    చలించవు వృక్ష శాఖలున్

    రిప్లయితొలగించండి
  13. చాల యవాంతరమ్ములను చక్కగనాపగవచ్చునా నిలన్?
    గాలిదుమారమే చెలగగానగరమ్మునగల్గెనష్టమే!
    కూలెనువృక్షమే, కలవు కొమ్మలు కొన్ని పధంబు మీదనే
    గాలులు తీవ్రమై విసరెఁ గాని, చలింపవు వృక్షశాఖలే

    రిప్లయితొలగించండి
  14. కాలము ప్రాతికూల్యమయి కానలపాలయి రెందరోనృపుల్
    శీలమె మాన్యధర్మమని చింతను బొందక సత్యసంధులై
    చాలిక నిగ్రహమ్మునను శాత్రవులన్ పరిమార్చి
    గెల్వగా
    గాలులు తీవ్రమై విసరె గాని చలించవు వృక్షశాఖలే

    నలుడు, హరిశ్చంద్రుడు, రాముడు,పాండవులు మొ. వారు

    రిప్లయితొలగించండి
  15. వేలకు వేలు మాయమగు వింతగు మందుల సంతలో పలన్
    నాలుక లారి వైద్య భవనాల వసారల చావగా జనుల్
    జాలిగ జూచె వృక్షములు, చావులు మించ కరోన కాటుకున్
    గాలులు తీవ్రమై విసరె గాని చెలింపవు వృక్ష శాఖలే.

    రిప్లయితొలగించండి
  16. 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
    శంకరాభరణం వారి సమస్య : “గాలులు తీవ్రమై విసరెఁ గాని చలింపవు వృక్షశాఖలే ”
    పూరణ : A.C గాలుల గురించి

    ఉ. మా .

    కాలెడి సూర్యతాపమున కర్కశ జ్వాలల మండె నెండలే
    గోలలు పెట్ట పిల్లలటు, కూర్మిగ శీతల యంత్ర మొక్కటిన్ |
    వేళకు నింట గూర్చగనె వీచిన హాయగు మేటి శీతమౌ
    గాలులు తీవ్రమై విసరెఁ గాని చలింపవు వృక్షశాఖలే ||

    - రాంబాబు కైప
    18-05-2021
    🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    రిప్లయితొలగించండి
  17. 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔅🔆🔅🔅🔆🔅
    శంకరాభరణం వారి సమస్య : “గాలి విసరెను వృక్షశాఖలు గదలవు”
    పూరణ : A.C గాలుల గురించి

    తే . గీ .
    గాలి వడగాలిగను మారి కాల్చుచుండ
    గోల గోలగ పిల్లలు గొడవ జేయ |
    మేటి శీతల యంత్రము మీట నొక్క
    గాలి విసిరెను వృక్షశాఖలు గదలవు ||

    - రాంబాబు కైప
    18-05-2021
    🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔅🔆🔅🔅🔆🔅

    రిప్లయితొలగించండి
  18. 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆
    శంకరాభరణం వారి సమస్య : “గాలులు తీవ్రమై విసరెఁ గాని చలింపవు వృక్షశాఖలే ”
    మూడవ పూరణ : సత్య భామ కోపము వృక్ష శాఖల వోలె చలింపలేదు.. కృష్ణుడు ఎంత వేడినా .. అన్న భావము

    ఉ. మా .

    చాలును నాటకమ్ములని, శాంతము వీడియు క్రోధమొందగన్,
    మేలును కృష్ణ గోరి, మది మీటను కాంతను చేరినంతనే
    కాలును దృవ్వ భామయటు, కాంతుని మేనుని తాకె, జూడరే
    గాలులు తీవ్రమై విసరెఁ గాని చలింపవు వృక్షశాఖలే ||

    - రాంబాబు కైప
    19-05-2021

    🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    రిప్లయితొలగించండి
  19. తాపము భరించ జాలక తరువు చెంత
    సోలి పోయిన మగనిని జూచి యతని
    యాలి వీవెన తోడన యల్ప రీతి
    గాలి విసరెను , వృక్షశాఖలు గదలవు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      'తోడను నల్పరీతి/వీవన గైకొని యల్పరీతి'

      తొలగించండి
  20. 'ఆలను దొంగిలించెద మటంచు దలంతురొ !ధూర్తులార! మి
    మ్మాలము నందు గూల్చెద నుదగ్రపరాక్రమ ముజ్వలింప గో
    శాలకు దెత్తు వాటి' నని జల్పము లాడె విరాటజుండు హా!
    గాలులు తీవ్రమై విసరెఁ గాని చలింపవు వృక్షశాఖలే.

    జల్పము పనికి రాని మాటలు మాట్లాడుట.
    (జల్ప్ వ్యక్తాయాం వాచి మాటలాడు అనే అనే అర్థం కలిగిన ధాతువు,
    'జల్పతి కామపి రమయతి కామపి రామాం' )

    ( లేదా )

    'ఆలను దొంగిలించెద మటంచు దలంతురొ !ధూర్తులార! మి
    మ్మాలము నందు గూల్చెద నుదగ్రపరాక్రమ ముజ్వలింప గో
    శాలకు దెత్తు వాటి' నని జాటె విరాటసుతుండు కాని హా!
    గాలులు తీవ్రమై విసరెఁ గాని చలింపవు వృక్షశాఖలే.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  21. చిత్రకారుని చెయిదము చెప్పతరమె
    యడవి కనులముందుంచెతానక్కజముగ
    పరవశంబున తలబోసె పాపయిటుల
    "గాలి విసరెను వృక్షశాఖలు గదలవు"

    రిప్లయితొలగించండి
  22. తూలెను కోప తాపముల తుంటరి రావణ చక్రవర్తియే

    వాలము కాల్చు వేళలను వాయుని పుత్రుడు లంక కాల్చగన్

    కీలలు చుట్టు ముట్టగను కేకలువెట్టెడు దైత్య ఘోషనన్

    గాలులు తీవ్రమై విసరెఁ గాని చలింపవు వృక్షశాఖలే

    మాలతి రామ పత్ని గల మాటున మాతకు చేటు సేయకన్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  23. పుడమి నంతను చుట్టిన పురుగు గూర్చి
    తెలుప గోరుచు జనులకు తొంద రగను
    జరుగు ప్రళయము నాపగ జగమునందు
    గాలి విసరెను వృక్ష శాఖలు గదలవు

    రిప్లయితొలగించండి
  24. ఉ :

    పాలకులైన చాలనుచు వాదన లెంచి యెలెక్షనంచనన్
    కీలకమైన ఘట్టమగుకీటక నాశ మొనర్చకుండగన్
    కాలము వెళ్ళ బుచ్చిరట గాడిని తప్పె కరోన వ్యాప్తిగన్
    గాలులు తీవ్రమై విసరె గాని చలింపవు వృక్ష శాఖలే

    వై.చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  25. వింతఁ గాంచ లే రెవ్వరు సుంత యేని
    యిందు వీడు మింక నెడఁద సందియమ్ము
    వెలఁది పసతోడ వీవఁగ విసన కఱ్ఱ
    గాలి విసరెను వృక్షశాఖలు గదలవు


    చాలదు శక్తి గాలికిఁ బ్రసారము నందుఁ దరింప ఖండముల్
    వేలను దాట లేని ఘన భీకర వారిధి భంగి ధాత్రిలోఁ
    దేలక కొంచె మైన మన దేశము లోన, సుదూర భూమిలో
    గాలులు తీవ్రమై విసరెఁ గాని, చలింపవు వృక్షశాఖలే

    రిప్లయితొలగించండి
  26. ననలు పొదిగిన తీవెల కొనలు పూచి
    యాట లాడును గాలుల పాట బాడు
    నాకులన్ రాల్చి యెండిన మాఁకు నకట!
    గాలి విసరెను వృక్షశాఖలు గదలవు!

    రిప్లయితొలగించండి
  27. చిన్న చిన్నగా మొదలయి చెట్లు పడెడు
    గాలి విసరెను,వృక్షశాఖలు గదలవు
    పిల్ల గాలుల కెచటను బెద్దగాను
    బెద్ద గాలులు వీచిన విరిగి పడును

    రిప్లయితొలగించండి
  28. పాలనమందు బింకముగ పట్టునునొందిన నాయకుండు ని
    ర్మూలన జేయ దుర్నయము మోపెను దీటగు నుక్కుపాదమున్
    క్షాళన కోర్వజాలక విషంబును గ్రక్కువిరోధి వర్గ పెన్
    గాలులు తీవ్రమై విసరెఁ గాని చలింపవు వృక్షశాఖలే

    రిప్లయితొలగించండి
  29. బాలురు వీవ యిర్వురును వీవన తోడను శక్తి మించియున్
    గాలులు తీవ్రమై విసరె గాని చలింపవు వృక్షశాఖలే
    బాలుర శక్తి చాలకను బాదప శాఖలు నూగకుండెనే
    గాలులు తీవ్రమై నయెడ గాలికి వంగును శాఖలన్నియున్

    రిప్లయితొలగించండి
  30. బాలల చిత్రలేఖనపు స్పర్ధను జూడగ వింత యూహలన్
    దేలెడి వారి భావనలు తెల్లముగానగుపించునందులో
    బాలుడొకండు జేసెనొక వర్ణన జూపె వనంబు వృష్టినిన్
    గాలులు తీవ్రమై విసరెఁ గాని చలింపవు వృక్షశాఖలే

    రిప్లయితొలగించండి
  31. మేలము లాడుచున్ సతము మిక్కిలి ప్రేమను బంచు బావతో
    లీలగ పాణి పీడనము ప్రీతిగ నాయెను, బావపొందుకై
    హేలగ చూచుచుంటి, శయనింపగ వెన్నెల రాత్రి ప్రేమవౌ
    గాలులు తీవ్రమై విసరెఁ గాని, చలింపవు వృక్షశాఖలే

    రిప్లయితొలగించండి
  32. భానుని కిరణము ల వేడి భగభగ మన
    బాటసారులు సాగుచు వడలిపోయి
    తాళ లేక విశ్రాంతికై తరుల చేర
    గాలి విసిరెను వృక్ష శాఖలు గదలవు

    రిప్లయితొలగించండి