13-5-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్”
(లేదా...)
“రవ యుత మౌనమూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతిఁ గొల్చెదన్”
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్”
(లేదా...)
“రవ యుత మౌనమూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతిఁ గొల్చెదన్”
వివరముపుట్టుకతెలియగ
రిప్లయితొలగించండికవియగనాత్మనుపదిలముగాగనుభక్తిన్
వివశుడవైరాగ్యంబున
రవయుతమౌనమునశంకరప్రభుగోల్తున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభవ జలధిం దరించఁగఁ దపం బొనరింపఁగ బూని నే నను
రిప్లయితొలగించండిశ్రవమగు దీక్షఁ గైకొని చిరంబగు యోగము నంది లోని శా
త్రవుల నెదిర్చి నిర్మల పథంబున సాగుచు శాంతినిచ్చు గౌ
రవ యుత మౌనమూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతిఁ గొల్చెదన్,
మీ పూరణ అద్భుతంగా వున్నదండీ శంకరయ్యగారూ! అభినందనలు!
తొలగించండిసంస్కారవంతమైనపూరణము, ప్రణామములుగురువుగారు
తొలగించండి,🙏🙏
తొలగించండిబహు చక్కని పూరణ
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి"భవహర నీవె దిక్క"నుచు భర్గుని వేడ, దయాంతరంగుఁడై,
యవనిని సర్వ భక్తులకు హర్షమునన్ వరమిచ్చిదీవనల్
జవమున నిచ్చుదైవమని, సత్వర మేను నుతింపఁ బూని, నీ
రవ యుత మౌనమూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతిఁ గొల్చెదన్!
మీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలండీ శంకరయ్య గారూ!
తొలగించండిజవమునుసత్వమున్గలిగిజారనియౌవ్వనమందునాత్మనే
రిప్లయితొలగించండినవిరళభక్తిభావముననజ్ఞుడగాకనుసాధనంబునన్
సవనముగాగజీవనముశంభునిసన్నిధిగోరువాడనై
రవయుతమౌనమూనిత్రిపురదివిషుశంకరుఁబ్రీతిగోల్చెదన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపేరేమో 'మహాలక్ష్మి' పూరణ చూస్తే పురుషుడు చేసినట్లుంది. "భావమున నజ్ఞత వీడియు... సన్నిధి గోరుదాననై" అనవచ్చు కదా!
ఏకశేషవ్రుత్తినిభావమునుగ్రహింపవచ్చునుగదా,, మీఅభిప్రాయమునుశిరసావహించుచున్నాను
తొలగించండిమహాలక్ష్మిపేరుపురుషులకుగూగవాడుకలోగలదు, తూర్పుగోదావరిలో
తొలగించండికందం
రిప్లయితొలగించండిసవరించ సర్వ సృష్టిని
మివుల పరబ్రహ్మ తానె మేల్కొని జగతిన్
శివమొసఁగ భక్తిమై నీ
రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్
చంపకమాల
రవి సుతుఁ డాగడమ్ము విడ రయ్యున వచ్చి మృకండు సూతి కా
యువొసఁగి మేటి మౌనిగ మహోన్నతి గూర్చిన భక్తరక్షకున్
నవయుగ మందు కోవిడను నాశక కారిని మట్టుఁబెట్ట నీ
రవ యుత మౌనమూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతిఁ గొల్చెదన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిభవ బంధములను బాపగ
రిప్లయితొలగించండినవవిధ మగు భక్తి తోడ నైజపు రీతిన్
సువిధపు జపతప మను గా
రవ యుత మౌనమున శంకర ప్రభు గొల్తున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"గౌరవయుత..." అనండి.
~~~~~~~~~~~~~~~~~~~~~~
రిప్లయితొలగించండివరముల నిచ్చి భక్తతతి బాధ
లు దీర్చును దుర్జనాదులన్
నరకము కంపుచుండు, ఘన నా
ట్య దురంధరు డద్రి వాసునిన్
నిరతము బ్రోవుమంచుమది ని
క్కము మిక్కిలి యాత్మలోన నీ
రవ యుత మౌనమూని త్రిపుర
ద్విషు శంకరు బ్రీతిగొల్చెదన్.
~~~~~~~~~~~~~~~~~~~~~
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిభవహర! శంకర! శంభో!
రిప్లయితొలగించండితవ నామస్మరణ వీడి తరియించుటయా!
ప్రవిమల చిత్తంబున, నీ
రవ యుత మౌనమున, శంకరప్రభుఁ గొల్తున్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిశివుడా మినుసిగ దేవర
భవభయ హరుడౌ కురంఘ పాణి వృషపతిన్
శివరుని సతమ్ము నే నీ
రవయుత మౌనమున శంకర ప్రభుఁ గొల్తున్.
భవభయ హారి వాడని శుభంబుల గూర్చెడు దేవదేవుడా
శివరుడటంచు నమ్మి శశిశేఖరు డైన పినాక పాణి నా
గువుగళమందు దాల్చెడి యఘోరుని చిచ్చర కంటి వేల్పుఁ నీ
రవయుత మౌనమూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతి గొల్చెదన్.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిజవముల దీసెడు తెవులును
రిప్లయితొలగించండిసవరింపగ వేడుకొనుచు శర్వుని, సాంబన్,
భవుడి, ననంతుని, నే గౌ
రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపవలును రేయి గాఢతరభక్తిహృదంతరభాసమానునిన్
రిప్లయితొలగించండిశివుని పరాత్పరున్, కరము శీర్షము నెన్నుదురున్ శిరమ్ము లీ
యవనిని సోకుభంగిమల ధ్యానసమంచితచిత్తపూర్తి నీ
రవయుతమౌన మూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతిఁ గొల్చెదన్.
కంజర్ల రామాచార్య.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపవనము కుంభించి హృదిని
రిప్లయితొలగించండిబవరంబొనరించియారు పరిపంథులతో
భవభయహరమునకై గా
రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్
సమస్య :
రిప్లయితొలగించండిరవ యుత మౌనమూని త్రిపు
రద్విషు శంకరు బ్రీతి గొల్చెదన్
( శివపూజకై తెల్లకలువలతో అరుదెంచిన అర్ధాంగితో భర్త )
నవమగు భక్తిమార్గముల
నా కెరిగించిన ధర్మవర్తినీ !
శివమయమైన జీవితము
జెన్నుగ జూపినయట్టి ప్రేయసీ !
నవనవలాడు పుష్పముల
నర్మిలి దోసిట నుంపు నింక కై
రవయుత ! మౌనమూని త్రిపు
రద్విషు శంకరు బ్రీతి గొల్చెదన్ .
( కైరవయుత = తెల్లకలువలను తెచ్చినదానా )
శివమయ దేహమునందున
రిప్లయితొలగించండిభవనాశుని గన్గొనంగ స్వాత్మస్థితిలో
పవనక్రియ నిగ్రహ నీ
రవయుత మౌనమున శంకరప్రభు గొల్తున్
శివమయ దేహమందునను చిన్మయరూపున దాగియుండెడిన్
భవభయహారినిన్ దెలియ భావనలన్నిటి నిల్పివేయగన్
పవనము నిగ్రహించి నిజస్వాంతము నందున
తన్మయత్వమున్
రవయుత మౌనమూని త్రిపురద్విషు శంకరు బ్రీతి గొల్చెదన్
రవయుత = సున్నితమైన (ఆం.భా)
రవయుత అంతే శ్రీయుత లా అనుకున్నా.. శ్రీతో కూడిన అనగ ఆ లక్ష్మీ దేవి కృపా కటాక్షము కలుగగా.. ఐతే నేనింక ఏ రవ్వ కేసరి లేద రవ్వ లడ్డు ను నైవేద్యముగా పెట్టి మౌనం దాల్చి త్రిపురాసురాంతకుడైన శివుని ఆప్యాయత కూడిన భక్తి యుక్తి ప్రపత్తులతో కొలుస్తున్నా అనే అర్థమనుకుంటేను..
తొలగించండిఈ ఆంధ్ర భారతి నిఘంటువా.. బ్రౌనీయం అనగ బ్రౌన్ బ్రెడ్డా.. ఏమోలే.. బ్రిటీషర్ కాలం నాటి తెలైగూ లైపి తైపో ఎర్రఱ్
భవహర! యేమి కాలమిది భారమయెన్ బ్రతుకీడ్చుటెట్టులో,
రిప్లయితొలగించండిజవముల దీయురోగము, సజావుగ సాగెడి జీవితమ్ము, భై
రవమయి నొప్పె, దేవ! దిగి రమ్మిటు! వేగమె గావ మమ్ము, గా
రవ యుత మౌనమూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతిఁ గొల్చెదన్.
కం//
రిప్లయితొలగించండిశివతత్వము నెరుగుటకై
భవసాగర మీదలేక భక్తిగనేడే !
నవనీతపు హృదిలోపల
రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్ !!
హమ్ లకే జకో పూరణ కూఁ ఛ కేన్ తోన కూణి పూఁచ్రేచ కేన్
రిప్లయితొలగించండిఆచో ఛగ బల్లా ఛగ కేన కో నితేర్ ఏమా కాఁయి తప్పు చగ కేన్ కూణి పూఁచతో కేణు లపణ్..!
సారి జగతేమా ప్యాల్రోచ కత్తేరికో రోగ్
సే డర్రేచ ఓతి పేనా కన్నాయి ఛేని జత్రా
కేన కన్న కూఁరచకో కాఁయి కేర్వేరో కోన్తి కేని
రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్
అవసరము లేదు మనకు అ
రిప్లయితొలగించండిభవు పూజకు చాల తంతు, భావన మెండై
శివునే ధ్యానించిన గౌ
రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్
శంకరాభరణం వారి సమస్య : “రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్”
రిప్లయితొలగించండి1)
కం.
శివుడిని కొలుతును మరిమరి,
పవిత్ర గంగా జలమున పదములు కడుగన్ |
నవవిధ పుష్పంబులఁ , గౌ
“రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్” ||
- రాంబాబు కైప
12-05-2021
శంకరాభరణం వారి సమస్య : “రవ యుత మౌనమూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతిఁ గొల్చెదన్”
2)
శివశివమంత్రమున్ జపము జేయుచు భక్తిగ పూజ చెయ్యగన్
నవనవ రీతులన్ ప్రణవ నాదము బల్కుచు ధ్యాన మార్గమున్
భవజలధిన్ తరించి భవు పాదములే ప్రణతిల్ల గోరి ,గౌ
“రవ యుత మౌనమూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతిఁ గొల్చెదన్”
3)
కం.
కువకువ లాడగ పక్షులు,
రవములు వినుచును కవితలు వ్రాయగ నీకై
యవిరళ రచనల కై, నీ
“రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్” ||
- రాంబాబు కైప
12-05-2021
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి( మా గురువు గారి పేరు శంకరయ్య)
రిప్లయితొలగించండినవ కవులు జేయు తప్పుల
సవరించుచు సూచనలిడి చక్కగ వారిన్
ప్రవర కవుల జేయగ, గౌ
రవయుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్
యవనిక మూతికిన్ దొడిగి యాతన బొందుచు దూరదర్శినిన్
రిప్లయితొలగించండిశవములు గాల్చుటన్ గనుచు, శక్యము గాని కరోన, కౄరమౌ
దవముగ రేగగా, జనులు తాళరు, శాంతిని గోరి నేను నిర్
“రవ యుత మౌనమూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతిఁ గొల్చెదన్”
కవితలు వ్రాయగ తెలుగున
చవి గల మాటల నొసగుము జంగమ దేవా!
నవ ఆలోచనకై ధీ
“రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్”
శివమనియెంచిరాగమునశీఘ్రములాదిగసేకరించి,నా
రిప్లయితొలగించండిశివునికిసేచనంబుననుజిమ్ముచుగంగనుమేలుమేలుగన్,
స్తవమునమల్లెమొల్లలునుజల్లనిదెల్లనిశుద్దమైనకై
రవ యుత మౌనమూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతిఁ గొల్చెదన్
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
నివసనమందునన్ పరుల నీడను చూచి భయమ్ము నొందుచున్
రిప్లయితొలగించండిబవరము చేయు చుంటి పరిపంథుల సృష్టి కరోన తోడుతన్
ప్రవిమల భక్తియుక్తముగ, రమ్మని కావగ, చిత్తమందు నీ
రవ యుత మౌనమూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతిఁ గొల్చెదన్
పవనము గుండెయందుబిగబట్టుచు కుంభక రేచకంబులన్
రిప్లయితొలగించండిభవహరుడైనయీశ్వరుని భవ్యపదంబుల దృష్టి నిల్పుచున్
శివశివయంచు ధ్యానమున చిన్మయరూపుని దల్చుకొంచు నీ
రవ యుత మౌనమూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతిఁ గొల్చెదన్
కం//
రిప్లయితొలగించండిభవభూతై జన్మించితి
సవరించుము నుదిటి వ్రాత సర్వము నీవై !
నివసించగ కినుకేలర
రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్ !!
భవ బంధనములు దెంచగ
రిప్లయితొలగించండిశివ నామమె శరణటంచు స్థిరచిత్తమునన్
ధ్రువముగ కామారిని గౌ
రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్
కె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండిభవపాశమ్ముల జిక్కితి
శివనామస్మరణె నాకు శ్రీకరమయ్యెన్
భవహర దయజూడగ గౌ
రవయుత మౌనమున శంకరప్రభు గొల్తున్.
జవసత్వములున్నవరకు
రిప్లయితొలగించండిన్నవరాత్రుల పూజ శివాని నయజయమొసగున్
శివరాతిరి జాగరణన్
రవయుత మౌనమున శంకర ప్రభుగొల్తున్. 🙏
కవితల రచనకు నేగౌ
రిప్లయితొలగించండిరవయుత మౌనమున శంకరు ప్రభు గొల్తున్
శివనామ జపము వలననె
భవబంధము లుడిగి మనకు పరముంగలుగున్
కవనము లెస్స వచ్చుట కుగాగల కార్యము బొందగోరి గౌ
రిప్లయితొలగించండిరవయుత మౌనమూని త్రిపుర ద్విషు శంకరు బ్రీతి గొల్చెదన్
ప్రవిమల భక్తి తోడనిల భవ్యుని పూజను జేయుచో దయన్
నవిరళ భోగభాగ్యములు నాయువు,గీర్తిని గల్గజేయుగా
భవ పారావారమ్మును
రిప్లయితొలగించండిశివ నామము దాఁటఁ జేయు శీఘ్రమ్ముగ భ
క్తి వశుండనై ముని గణా
శ్రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్
[ఆశ్రవము = అంగీకారము]
భవ చయ నాశకుం డజుఁడు పంచ వరాస్యుఁడు నిత్య సద్దయా
ద్రవ పరిపూరి తాత్ముఁడు నుదారుఁడు సాంబుఁడు స్వీయ మానస
స్రవ శివ నామ సంస్మరణ సక్త సమంచిత పూర్వ భా గను
శ్రవ యుత మౌన మూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతిఁ గొల్చెదన్
[అనుశ్రవము = సంప్రదాయము]
భోజనము వేళ అయినందు వల్ల , తినుబండారాల నుపయోగించి పూరణ
రిప్లయితొలగించండి4)
రవ కేసరి, రవ లడ్డులు
రవ పాయసమునటు నీకు లావుగ పెట్టన్
శివు సాదము గతియని నీ
“రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్” ||
- రాంబాబు కైప
13-05-2021
కె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండిభవపాశంబుల జిక్కితి
శివనామ స్మరణజేయ చిత్తము నందున్
అవశుడ బ్రోవ నను నీ
రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్.
రిప్లయితొలగించండినవవిధ భక్తుల గొలుచుచు
జవముగ పూజలనుచేసి సవ్యపురీతిన్
దివమునురాత్రియునేగౌ
రవయుత మౌనమున శంకరప్రభుగొల్తున్