9, మే 2021, ఆదివారం

సమస్య - 3718

10-5-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రతినిఁ గాంచి బ్రహ్మ రక్తుఁ డయ్యె”
(లేదా...)
“రతిఁ గని బ్రహ్మదేవుఁ డనురక్తినిఁ బొందెను వేల్పు లౌననన్”

65 కామెంట్‌లు:

  1. మిత్రులందఱకు నమస్సులు!

    నుతులిడ బ్రహ్మదేవుఁడు వినూత్న సుశోభిత జాతిరత్నమున్
    సితమయ దేహనున్, విజిత చేతన రూపక సుస్మితాంచితన్
    మతినిఁ దలంచి, సృష్టి నిడి, మాన్యను తద్వనితా విభాసి, భా
    రతిఁ గని, బ్రహ్మదేవుఁ డనురక్తినిఁ బొందెను వేల్పు లౌననన్!

    రిప్లయితొలగించండి
  2. నిత్య శోభితుండు నియమాల పాటించి
    భక్తి పరవశమున ప్రభుని గొల్చి
    పరమపదము జేర వరలెడు సత్య ని
    రతినిఁ గాంచి బ్రహ్మ రక్తుఁ డయ్యె!!

    రిప్లయితొలగించండి
  3. సుందరీ లలామ సోయగము నకును
    మరుని శరము దాఁకి మరులు పొంగ
    వలపు పుట్ట యపుడు వాంఛ కలుగ గ భా
    రతిని గాంచి బ్రహ్మ రక్తు డయ్యె

    రిప్లయితొలగించండి
  4. మోక్షమందునిచ్ఛమౌనియుకాగను
    బ్రహ్మరంధ్రమందుభావముంచి
    ద్రుష్టియందునునుచుతరుణమాని
    రతిఁగాంచిబ్రహ్మరక్తుడయ్యె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూడవ పాదంలో గణదోషం, యతి దోషం. సవరించండి.

      తొలగించండి
    2. సవరణతో
      మోక్షమందునిచ్ఛమౌనియుకాగను
      బ్రహ్మరంధ్రమందుభావముంచి
      ద్రుష్టినంతనిలిపిధ్రుఢముకాగని
      రతినిఁగాంచిబ్రహ్మరక్తుడయ్యె

      తొలగించండి
  5. తరుణముకాగని
    రతినిగాంచిబ్రహ్మరక్తుడయ్యె

    రిప్లయితొలగించండి

  6. ప్రభువుదరము జొచ్చి బ్రహ్మాండ తత్త్వమ్ము
    నెఱగి యచట నుండి నేత నాభి
    ద్వార వెడలి వచ్చి పలుకు పూబోడి భా
    రతిని గాంచి బ్రహ్మ రక్తుడయ్యె.

    రిప్లయితొలగించండి
  7. ఆటవెలది
    అంబుజమ్ము పొత్తమక్ష మాల చిలుక
    కరముల, స్తనములను స్వరము పదము
    లమర సృజనఁ జేసి యనుకూల వతిగ భా
    రతినిఁ గాంచి బ్రహ్మ రక్తుఁ డయ్యె

    చంపకమాల
    చతురతఁ బొత్తమున్ శుకము సారసమాదిగ నక్షమాలతో
    నతులిత సాహితీ స్వరములక్కున దాల్చ సృజించి ముగ్ధుడై
    హితమొన రించు సృష్టి విధి నింపుగ సాగగఁ దోడటంచు భా
    రతిఁ గని బ్రహ్మదేవుఁ డనురక్తినిఁ బొందెను వేల్పు లౌననన్


    రిప్లయితొలగించండి
  8. రతి గని మన్మధుండు, కని రాముడు సీతను కైక కోడలిన్,

    సతి గని సాంబుడీశుడును , సాధ్విని లక్ష్మిని కాంచి విష్ణువున్

    సతతము మౌనివర్యులును సాధన కృష్ణుని, సత్య వాణి భా

    రతిఁ గని బ్రహ్మదేవుఁ డనురక్తినిఁ బొందెను వేల్పు లౌననన్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  9. సమస్య :

    రతిని గాంచి బ్రహ్మ రక్తుడయ్యె

    ( భారతీదేవి - బ్రహ్మదేవుడు )

    ఆటవెలది
    ..............

    సతిని ; శారదాంబ ; జదువుల సమ్రాజ్ఞి ;
    బలుకుజెలియ ; గ్రంథపాణి ; వాణి ;
    బ్రాహ్మి ;సర్వశుక్ల ; భగవతి ; వాగ్గేయ
    రతిని గాంచి బ్రహ్మ రక్తుడయ్యె

    రిప్లయితొలగించండి
  10. చం:

    సతతము భక్తి భావనగ సాదరమెంచుచు పూజ సేయగన్
    పతితుల గాచునంచనుచు వాసికి నెక్కెను పుష్కరంబుగన్
    వెతకగ నొక్క టాలయమె వేడుక తీర ప్రదేశమందు, హా
    రతిగని బ్రహ్మదేవు డను రక్తిని బొందెను వేల్పు లౌననన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  11. సతతము జిహ్వపైనిలిచి సత్వగుణంబున తేజరిల్లెడిన్
    స్మిత వదనైకమోహిని నిమీలిత లోచన వాగ్విలాసినిన్
    అతులిత ఙ్ఞానదాయి లలితాంగిని గానవినోది దేవి భా
    రతిగని బ్రహ్మదేవు డనురక్తిని బొందెను వేల్పులౌనన్

    రిప్లయితొలగించండి

  12. క్రతువు వరాహరూపమున కంబలమందున మున్గియున్న శా
    శ్వతి నతడెత్తినంత హరి సత్త్వము జొచ్చి యజాండమన్న నా
    శతధృతెఱంగి వచ్చి తను శ్రద్ధఁ సృజించిన యట్టి భాష, భా
    రతిఁగనిబ్రహ్మదేవుడను రక్తిని బొందెను వేల్పులౌనన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శతధృత+ఎఱింగి' అన్నపుడు సంధి లేదు. 'శ్రద్ధ' తరువాత అర్ధానుస్వారం అవసరం లేదు.

      తొలగించండి
  13. సృష్టికార్యమందు స్థిరచిత్తుడై యుండి
    తనరుచుండ తనను తాను మరచి
    నిత్యకృత్యమందు నిర్వేదమంది భా
    రతినిఁ గాంచి బ్రహ్మ రక్తుఁ డయ్యె

    రిప్లయితొలగించండి
  14. పలుకు తేనె చిలుకు వాణి వీణాపాణి
    విద్దె నొసగి జ్ఞానమద్దు తల్లి
    రాగ సుస్వరాల లాస్య విలాస భా
    రతిని గాంచి బ్రహ్మ రక్తుడయ్యె!

    రిప్లయితొలగించండి
  15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  16. తాను జేయు సృష్టి దనకు దా నె యెదుగ ,
    వలయు శక్తి నంత బడసి యున్న
    జనుల వెడగు బాప , జదువుల నొసగు భా
    రతినిఁ గాంచి బ్రహ్మ రక్తుఁ డయ్యె

    రిప్లయితొలగించండి
  17. అతికుతుకంబుతోడ తనయాలిని గూడక సృష్టి చేయుచున్
    సతమతమొందెతా నలువ సంతత మాపని యందు లీనమై
    రతిపతి వేయ పూవుల శరంబులు తాపమునోపలేక భా
    రతిఁ గని బ్రహ్మదేవుఁ డనురక్తినిఁ బొందెను వేల్పు లౌననన్

    (షరా: ఇది కేవలము కల్పితము, ఊహాజనితము)

    రిప్లయితొలగించండి
  18. ఘోర తపము జేసె కోరివరములను
    రావణుండు, విడచి రాజ్య సుఖము,
    తపము తీవ్రమవగ, దానవేంద్రు తపోని
    రతినిఁ గాంచి బ్రహ్మ రక్తుఁ డయ్యె

    రిప్లయితొలగించండి
  19. తనదు వీణతో డనవరతము ఘనమగు

    రత్భ సభ నలరించు భారతిని గాంచి

    బ్రహ్మ రక్తుడయ్యె, హరియు రమను గాంచి

    యుమను గని హరుడు పరవశములు పొందె

    రిప్లయితొలగించండి
  20. మరిది మన్మధునకు మగువ రతికి నొప్ప
    మంచి మాట జరిగె మనవు కొరకు
    నందు తెల్ల వన్నె నతిశయించతివ భా
    “రతినిఁ గాంచి బ్రహ్మ రక్తుఁ డయ్యె”

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అతిశయించు నతివ' అనడం సాధువు. "... నతిశయించు సతి భా.." ఆనండి.

      తొలగించండి
  21. అతులితమాధురీభరసమాహితసుందరవాక్ప్రదాత్రినిన్
    శ్రుతిమధురస్వరాలపనశోభనగేయమహద్గళప్రదన్
    సతతసుజిహ్వికావసతిసర్గవిధాయకశక్తివర్ధినీ
    రతిఁ గని బ్రహ్మదేవుఁ డనురక్తినిఁ బొందెను వేల్పు లౌననన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  22. ఆ. వె.
    తేనె తేటచిల్కితే తెల్గు పలుకయ్యె
    శుకపికాళి పాటసోయగముల
    అక్షరాకృతి, పద, వాక్యఝరిగ భా
    "రతినిఁ గాంచి బ్రహ్మ రక్తుడయ్యె!

    రిప్లయితొలగించండి
  23. వేద నాద మోద విస్మిత లోలుడు
    తనకు తోడు నీడ తప్పదనుచు
    పుస్తకంబు,వీణ,పొల్పుగా నున్న భా
    రతిని గాంచి బ్రహ్మ రక్తుడయ్యె.

    రిప్లయితొలగించండి
  24. చేతి వీణతోడ చిన్మయరూపుభా
    రతినిగాంచి బ్రహ్మ రక్తుడయ్యె
    సహజ మదియ యందచందము లెప్పుడు
    రక్తి గలుగ జేయు భక్తులకును

    రిప్లయితొలగించండి
  25. మతులనునిచ్చు నెల్లపుడు మా
    నవ జాతికి వ్రాయ కావ్యముల్
    అతులిత కావ్య రాజములు నా
    మె యపార కృపా కటాక్షమే
    వినుతులు జేతు రామెను గవీం
    ద్రులు నిత్యము దివ్యమైన భా
    రతిని గని బ్రహ్మదేవు డనురక్తిని
    బొందెను వేల్పులౌనన్

    రిప్లయితొలగించండి
  26. సంతత హరి నామ జప లోక సంచారి
    బ్రహ్మచారి దేవరాణ్నుతుండు
    నారదు నిజ తనయు నారాయణునిపై ని
    రతినిఁ గాంచి బ్రహ్మ రక్తుఁ డయ్యె


    అతులపు ఘోర భీకర మహా తప మత్తరి నిర్జరాలికిన్
    వెత లిడఁ దాప మంది తొలు వేలుపుఁ గోరఁగ వచ్చి యిచ్చెఁ దా
    వితతిని మెచ్చి బ్రహ్మఋషి పీఠము గాధిజ సల్లసత్తపో
    రతిఁ గని బ్రహ్మదేవుఁ డనురక్తినిఁ బొందెను వేల్పు లౌననన్

    రిప్లయితొలగించండి
  27. అతులిత రామణీయతన హ్లాదముగూర్చెడి యాలలామ,భా
    రతిగని బ్రహ్మదేవుడనురక్తిని బొందెను వేల్పులౌననన్
    శ్రుతిమయ రూపమందుటను జూచెడువారలు భక్తితోదగన్
    నతులను నిచ్చుచుదిరటనవ్యతరీతిని నొందునామెకున్

    రిప్లయితొలగించండి
  28. కె.వి.యస్. లక్ష్మి:

    వాణి నలువరాణి వారిజాసుని రాణి
    పల్కు తేనెలొలుకు వాక్కులమ్మ
    బుద్ధి నొసగి సకల విద్దెల నిచ్చు భా
    రతిని గాంచి బ్రహ్మ రక్తుడయ్యె.

    రిప్లయితొలగించండి
  29. సృష్టికర్త తాను సృజియించ జగతిని
    హరియనుజ్ఞచేత యాది యందు
    వదనమందుపుట్ట భాషామతల్లి భా
    రతినిగాంచి బ్రహ్మ రక్తుడయ్యె


    రసనపైవసించి రాగాలు పలికించు
    స్ఫటికమాలదాల్చి జనుల కెల్ల
    విద్యలొసగునట్టి విద్దెలతల్లిభా
    రతినిఁ గాంచి బ్రహ్మ రక్తుఁ డయ్యె”*

    మరొక పూరణ

    చతురమతిన్విధాతయును సంతసమొప్పగసృష్టిచేసె తా
    స్థితమతితోడదేవతలతిర్యకులాదిసమస్తజీవులన్
    జతకుజనాళి కెల్లతరి చక్కని విద్యలనిచ్చి బ్రోచు భా
    రతిగని బ్రహ్మదేవుడనురక్తినిపొందెను వేల్పులౌననన్.


    రిప్లయితొలగించండి
  30. చతురత తో సృజించి కడు చక్కని కన్యను దీక్షతోడుతన్
    మతి చలియింపనామె యసమాన్యపు రూపము చూచి నంత నీ
    రతనము నాదు సొత్తనుచు ప్రాకటమౌ స్థితి యుద్భవింప భా
    రతిఁ గని బ్రహ్మదేవుఁ డనురక్తినిఁ బొందెను వేల్పు లౌననన్

    రిప్లయితొలగించండి
  31. స్థితిపదు నాభినిన్ వెలసె దీర్చు దలంపున జీవ రాశులం
    దతివను సృష్టి సేయు దరుణంబున దొల్త జనించె నాతి భా
    రతిఁ గని బ్రహ్మదేవుఁ డనురక్తినిఁ బొందెను వేల్పు లౌననన్
    శ్రుతిసహితంబుగా నఖిలలోకములన్ సృజియించెనాదటన్

    రిప్లయితొలగించండి
  32. ********
    శంకరాభరణం వారి సమస్యా పూరణం :
    అంశం : “రతినిఁ గాంచి బ్రహ్మ రక్తుఁ డయ్యె”
    1)
    అవిరతిగను పనుల నవరతి పొందగ
    నభిరతి కలిగెనట , యనురతిగ, ప
    తికి సుదతియు హారతి సలిపిన, స్వరభా
    “రతినిఁ గాంచి బ్రహ్మ రక్తుఁ డయ్యె”

    అవిరతి= విశ్రాన్తి లేని
    అవరతి = విశ్రాంతి
    అభిరతి = ఇచ్ఛ కోరిక
    అనురతి = ప్రేమ


    ********

    2)
    సమస్య: "రతిగని బ్రహ్మదేవు డనురక్తిని బొందెను వేల్పులౌనన్"

    రతిగని మన్మథుండు ప్రియరాగము పాడెను రక్తి చెందుచున్
    రతియును భార్య సాటిగను రాదుకదా, ప్రియమైన భర్తకున్ |
    రతియును సృష్ఠి చేసిన విరాట్టు, మనోజ్ఞముగా రచించు భా
    రతిగని బ్రహ్మదేవు డనురక్తిన బొందెను వేల్పులౌననన్ ||

    3)
    శారీరిక వ్యాయామము దేవతలకైనను ముఖ్యమని హాస్యపూరిత పురాణము
    (వ్యాయామము లేకుండా ఓకే చోటు కూర్చుని పనిచేసే వారందరికీ కూడా వర్తిస్తుంది )

    సమస్య: "రతిగని బ్రహ్మదేవు డనురక్తిని బొందెను వేల్పులౌనన్"


    సతతము శ్వేత పద్మమున శారద కూర్చొని వీణ మీటగన్
    పతియును సృష్ఠి కార్యముల భారము తోడను లేవకుండగా
    సతిపతులిర్వురున్ నడక సల్పగ నాట్యపు రీతి యాడు భా
    రతిగని బ్రహ్మదేవు డనురక్తిన బొందెను వేల్పులౌననన్ ||

    - రాంబాబు కైప
    10-05-2021

    రిప్లయితొలగించండి