24, మే 2021, సోమవారం

సమస్య - 3732

25-5-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సతతము సంతసమొసంగు సతితో గొడవల్”
(లేదా...)
"సతతము భార్యతో గొడవ సంతస మిచ్చును భర్త కెప్పుడున్"

85 కామెంట్‌లు:

  1. కందం
    సుతిమెత్తని సుమ తనువున
    జతఁగూర్ప ప్రణయ కలహము సడలఁగ నార్తుల్
    గుతుకమ్మున నవవరునకు
    సతతము సంతసమొసంగు సతితో గొడవల్

    చంపకమాల
    అతులిత మాధురీ సుధల నందుచుఁ బొందున నూత్నదంపతుల్
    గుతుకముఁ దీర్పగన్ బ్రణయ కోపము నార్తిని కంతుకేళిలో
    జతపడ నెంచి తత్కలహ జాలమునన్ గృతకుత్యుడైనచో
    సతతము భార్యతో గొడవ సంతస మిచ్చును భర్త కెప్పుడున్

    రిప్లయితొలగించండి

  2. సతిపతు లన్నోన్యతయే
    సతతము సంతస మొసంగు, సతితో గొడవల్
    పతికి చిరాకు మిగుల్చుచు
    వెతలకు మూలంబగునని విజ్ఞుడె పలికెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సతీపతులు' అనడం సాధు సమాసం. 'పతుల + అన్యోన్యత' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.

      తొలగించండి
  3. చతురతసతితోజగడము
    పతులతుపాటియెతెలియగభాసురమతితో
    అతకదునాదర్శమునను
    సతతముసంతసమోసంగుసతితోగోడవల్
    ఆదర్శము-అద్దము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పతులకు' టైపాటు. 'అతకదు+ఆదర్శ' మన్నపుడు నుగాగమం రాదు.

      తొలగించండి
    2. తీసుకోలేదు, క్షమించండి
      అతకదుఆదర్శముననుఅనివ్రాయవచ్చాగురువుగారు

      తొలగించండి
  4. పతి సరసతతో మెలగుచు
    సతతము సంతస మొసంగు సతితో :గొడవల్
    వెతలను సమకూర్చి జనుల
    గతులను మార్చు నని యండ్రు కంటక యుతమై

    రిప్లయితొలగించండి

  5. బ్రతుకున శాంతి దూరమగు బద్దవిరోధుల యట్లు మార్చుచున్
    వెతలకు మూలమై యదియె బిద్దెను చూపుచు క్రుంగ దీయదే
    సతతము భార్యతో గొడువ, సంతస మిచ్చును భర్తకెప్పుడున్
    సతి వినయమ్మునే కలిగి సమ్మతితో చరియించి నంతనే.

    రిప్లయితొలగించండి
  6. అతులముగాగలక్ష్మియునుమన్మధుతండ్రినిఁజేరెగుండెపై
    సతిగనుపార్వతీరమణిసార్ధముగాగనుశంభుఁజేరెగా
    చతురతరాణిబమ్మకునుసన్మతినెక్కెరసాగ్రమందునన్
    సతతముభార్యతోగోడవసంతసమిచ్చునుభర్తకెప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. "అతులముగాగ లక్ష్మి కుసుమాస్త్రుని తండ్రిని..." అనండి.

      తొలగించండి
    2. అతులముగాగలక్ష్మికుసుమాస్త్ర్తునితండ్రినిఁజేరెగుండెపై
      సవరణతోవ్రాశానుధన్యవాదములండి, క్షమించగలరు

      తొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  8. పతిపత్నులు గలి సుండుట
    సతతము సంతసమొసంగు, సతితో గొడవల్
    మితిమీరినచో, లవణము
    నతిగా గలిపిన సువారఁ మగునయ వింటే.

    సువారము-వంటకము (ఆంధ్రభారతి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కలిసి+ఉండుట' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. 'సువారము'లో అరసున్న అవసరం లేదు.

      తొలగించండి
  9. సతిపతు లిద్దరు చక్కగ
    జతగూడిన తొలిదినముల సయ్యాటలలో
    నితమగు సరసమున పతికి
    సతతము సంతస మొసంగు సతితో గొడవల్.

    రిప్లయితొలగించండి
  10. పతిదేవుని గొల్చు పడతి
    ప్రతిరాత్రినపాదములను పట్టుచునుండన్
    హితువులెరుంగని ధైనను
    సతతము సంతసమొసంగు సతితో గొడవల్!



    రిప్లయితొలగించండి
  11. మితమగు భాషణమ్మిలను మేలగు నెవ్వరి తోడనేనియన్
    వెతలను గూర్చు, వల్లభుని వీధిని జేర్చును జేయ నెంచగా
    సతతము భార్యతో గొడవ! సంతస మిచ్చును భర్త కెప్పుడున్
    సతి ప్రతిపాదనమ్ములకు సమ్మతి దెల్పగ నెంచినంతటన్!

    రిప్లయితొలగించండి
  12. పతిని విడి కినుకన చనె

    న్నతులిత కోపమున లక్ష్మి , నారాయణుడు

    న్వెతకుచు తిరుమల చేరెన్

    సతతము సంతసమొసంగు సతితో గొడవల్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కినుకను జనియె నతులిత...' అనండి.

      తొలగించండి
  13. ~~~~~~~~~~~~~~~~~~~~~
    మతిచెడు,బెర్గు నక్కసము,మ
    న్నన తగ్గు, నశాంతి మీరెడి
    న్నతులిత భార్యతో గొడవ,
    భర్తకు నిచ్చును సంతసంబెసన్
    హితమతి భార్య,తా మిగుల నిం
    పుగ గూడియునున్న సర్వదా
    సతి పతులిద్ద రున్నమిత
    సౌఖ్యముగా జీవింత్రు ప్రేమతో
    ~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  14. కె.వి.యస్. లక్ష్మి:

    సతిపతు లిద్దరి కలయిక
    సతతము సంతస మొసంగు; సతితో గొడవల్
    అతి సాధారణమగు నిది
    ప్రతి యింటను జరుగు చుండు భాగవతమ్మే!

    రిప్లయితొలగించండి
  15. వితతముగానివిధంబున
    మితమగు సతిపతుల యలుక మేలొనగూర్చున్
    వెతలెరుగని కాపురమున
    సతతము సంతసమొసంగు సతితో గొడవల్

    రిప్లయితొలగించండి
  16. సతిపతు లన్యోన్యతయే
    సతతము సంతసమొసంగు, సతితో గొడవల్
    వెతలకు తావిచ్చుటచే
    మతిమంతులు గారవింత్రు మగువల మాటల్

    వైవిధ్యంగా

    సతిపతులేకమై గడప సంతసమందుచు నాదివారమున్
    కుతుకముతోడ నింటికడ గూరిమి పేకల తోడనాడగన్
    చతురత ముక్కలేయుచును జాయనుగెల్చెడు తొండియాటలో
    సతతము భార్యతో గొడవ సంతసమిచ్చును భర్తకెప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువర్యా! నమోనమః!🙏🙏🙏

      తొలగించండి
    3. సవరణతో

      సతితో సల్లాపములే
      సతతము సంతసమొసంగు, సతితో గొడవల్
      వెతలకు తావిచ్చుటచే
      మతిమంతులు గారవింత్రు మగువల మాటల్

      తొలగించండి
  17. చతురయగు శాలినికి తన
    మతమేదో తనది గాని మన మతమసలే
    జతపడ , దైనను జాణత
    సతతము సంతసమొసంగు సతితో గొడవల్

    శాలిని = భార్య
    జాణత = నేర్పరితనము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తన మతమేదో తనది - మనమత మసలే పడదోయ్' మిస్సమ్మ సినిమా పాటను గుర్తుకు తెచ్చారు.

      తొలగించండి
  18. చం:

    సతమత మందజేయు పతి సన్నని నవ్వుల ప్రక్కచూపులన్
    కుతకుత లాడు చుండు సతి గుంభన వాక్కుల నెచ్చరించుచున్
    చతురత నిండు వాదములు సంభవమెంచి రమింప మార్గమై
    సతతము భార్యతో గొడవ సంతసమిచ్చును భర్త కెప్పుడున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  19. సతితోసఖ్యముపతికిని
    సతతము సంతసమొసంగు సతితోగొడవల్
    వెతలుకు తావిచ్చునులే
    మతితోమెలగంగవలయుహితముంగోరిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో యతి తప్పింది. 'కోరిన్' అనడం సాధువు కాదు.

      తొలగించండి
  20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  21. సతము గృహిణితో నొడబడ
    క , తరచుగా చిన్ని చిన్ని కలహములుండన్
    నతిగ పెరిమి పెరుగు , మరియు
    సతతము సంతసమొసంగు సతితో గొడవల్

    రిప్లయితొలగించండి
  22. సతికిల గల్గినన్ సకల సద్గుణముల్ సఖుడెంతొ మెచ్చుగా
    అతివయె నేర్తునీ మమత, అందముగా, నభిమానమూర్తియై
    పతినమితమ్ముగావలచు, పంచభిమానము, గల్గనీయదున్
    సతతము, భార్యతో గొడవ, సంతస మిచ్చును భర్త కెప్పుడున్

    రిప్లయితొలగించండి
  23. సతిపతులుండినసఖ్యమున
    సతతము సంతసమొసంగుసతితోగొడవల్
    అతిగానుండుటహితమా
    మతులంబోవునునిజముగ గతులుందప్పున్






    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. చివరి పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  24. 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
    శంకరాభరణం వారి సమస్య : "సతతము భార్యతో గొడవ సంతస మిచ్చును భర్త కెప్పుడున్"
    పూరణ : ఉరుముల పిదప వాన వలె , కలహము తరువాత ప్రణయము లభించిన, పతి ఉత్సాహము చూపును అని..

    సతిపతులందు పోరు సహజంబగు, పోరుయు ప్రేమ రూపమే,
    స్థితిగతులందులో నురుము జేయు ధ్వనుల్ తరువాతి వర్షమౌ,
    సతియటు నేడ్వ శాంతమగు, చక్కటి సంగమ మొందు భర్తకున్
    "సతతము భార్యతో గొడవ సంతస మిచ్చును భర్త కెప్పుడున్"

    - రాంబాబు కైప
    24-05-2021
    🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    రిప్లయితొలగించండి
  25. 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
    శంకరాభరణం వారి సమస్య : “సతతము సంతసమొసంగు సతితో గొడవల్!”
    పూరణ : ఉరుముల పిదప వాన వలె , కలహము తరువాత ప్రణయము లభించిన, పతి ఉత్సాహము చూపును అని..

    కం .
    సతిపతుల గొడవ సహజము
    ప్రతి కలహము పిదప పొంద , ప్రణయము సతితో
    పతి యుత్సాహము జూపును
    సతతము సంతసమొసంగు సతితో గొడవల్!


    - రాంబాబు కైప
    24-05-2021
    🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    రిప్లయితొలగించండి
  26. 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
    శంకరాభరణం వారి సమస్య : “సతతము సంతసమొసంగు సతితో గొడవల్!”
    పూరణ : సేవా తత్పరులైన సతిపతులు, మంచి కార్యములు కోరి పోటీ పడుట సంతసమని భావన
    3)

    కం .
    సతిపతులిరువురు సుజనులు
    ప్రతిదినమునొక సుగుణమగు పని సలుపుచు, సం
    గతిగను స్పర్ధను జేయగ;
    సతతము సంతసమొసంగు సతితో గొడవల్!


    - రాంబాబు కైప
    24-05-2021
    🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    రిప్లయితొలగించండి
  27. 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
    శంకరాభరణం వారి సమస్య : “సతతము సంతసమొసంగు సతితో గొడవల్!”
    పూరణ :దిష్టి పరిహారార్థము తగవులాడుట మంచిదనుకొనే మూర్ఖుని ఆలోచనా సరళి

    కం .
    అతడొక మూర్ఖశిఖామణి
    ప్రతిదినమున ప్రియ వచనము, పడయును దిష్టిన్
    సుతగవె దృష్టికి విరుగని,
    సతతము సంతసమొసంగు సతితో గొడవల్!

    సుతగవు - మంచి తగవు అని వాడాను.

    - రాంబాబు కైప
    24-05-2021

    🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    రిప్లయితొలగించండి
  28. సమస్య :

    సతతము భార్యతో గొడవ
    సంతస మిచ్చును భర్త కెప్పుడున్

    ( లీలామానుషవేషధారి హరి కృష్ణుడై సహిష్ణుడై ధవుడై మధురమాధవుడై అలరారిన విధం మనోజ్ఞం)

    అతడొక ప్రేమతత్పరు ; డ
    నంతుడు ; భక్తుల రక్షకుండునై
    హితమతియైన మాధవుడు ;
    హేలగ లీలల జేయువాడు ; స
    మ్మతి దన సత్యకున్ నలుక
    మంత్రము నేర్పి వినోదమందెడిన్ ;
    సతతము భార్యతో గొడవ
    సంతస మిచ్చును భర్త కెప్పుడున్ .

    రిప్లయితొలగించండి
  29. రిప్లయిలు
    1. బ్రతుకులు యంత్రతుల్యములు బాధలు సౌఖ్యమలున్ సమేతమై
      కృతకము జేసె జీవమును కించుతు మార్పులు సంభవించి సం
      గతసరసత్వవృద్ధి కొఱకైన నొకానొక వేళ..., కానిచో
      సతతము...., భార్యతో గొడవ సంతసమిచ్చును భర్తకెప్పుడున్.

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
    2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  30. మితి కలదా? నతివ మనసు
    శృతి కనుగొనగా జగతిన సఖికిన్ సుఖమో?
    వెతయో? తెలియక నేవిధి?
    సతతము సంతస మొసంగు సతితో గొడవల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కలదా యతివ' అనండి. 'శృతి' అన్న పదం లేదు. 'జగతిని' అని ఉండాలి. రెండవ పాదంలో యతి తప్పింది. 'తెలియక యేవిధి' అని ఉండాలి.

      తొలగించండి
    2. గురువు గారు ఇలా సవరించాను.
      మితి కలదా? యతివ మనసు
      సృతి కనుగొనగా జగతిని చెలికిన్ సుఖమో?
      వెతయో? తెలియక యేవిధి?
      సతతము సంతస మొసంగు సతితో గొడవల్.

      తొలగించు

      తొలగించండి
  31. రిప్లయిలు
    1. పతి యెదరుచూచు నిరతము
      మతిపో గొట్టెడు సరసపు మాటలు, నలుకన్
      సతి మూతి ముడుపు, బహుశా
      సతతము సంతస మొసంగు సతితో గొడవల్.

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  32. అతుకుల బొంతలౌ బ్రతుకు లందున నన్నువ లేదు సౌఖ్యముల్
    వితథము లయ్యె మృగ్యములు వేడుక లెయ్యెడ, నిట్టి దుర్దశన్
    సతియును సమ్మతించి కొనసాగగ, ప్రేమలు ముబ్బడించగన్
    సతతము భార్యతో గొడవ సంతస మిచ్చును భర్త కెప్పుడున్.

    కంజర్ల రామాచార్య

    రిప్లయితొలగించండి
  33. వితతిగదానధర్మములుఁబెద్దలఁబిన్నలబోషణంబుస
    మ్మతముగదైవకార్యములుమన్ననలందెడువృత్తులందుదా
    నతులితప్రేమమూలముగనాతతమయ్యెడభేదభావన
    ల్సతతము భార్యతో గొడవ సంతస మిచ్చును భర్త కెప్పుడున్

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  34. ఈనాటి శంకరా భరణము సమస్య

    సతతము సంతస మొసంగు సతితోడ గొడవల్

    ఇచ్చిన పాదము కందము

    నా పూరణ సీసములో


    రుక్మిణితో పది రోజులు గడిపినా వనుచు నాతో మాట లాడక పది

    దినములు నా వైపు తిప్ప కుంటివి నీదు మోము, జాంబవతితో కామ కేళి

    సల్పి వచ్చితి వని సరసము లాడక నాతోడ కొన్నాళ్ళు మూతిని బిగ

    దీసు కొంటివి గద ,రాసలీల లలో స
    పత్నులతో గూడి పరవశమును

    బడసితి వని నన్ను గడప తొక్కరా
    దనుచు పంపితివిగ దాసి చేత

    సందేశమును,యిన్ని జరిగినా నీపైన కోపము నే జూప కుంటి ని , ప్రియ

    సఖి,సతతము సంతస మొసంగు సతితో గొ
    డవ లెప్పుడని నేను
    స వినయముగ

    తెల్పు చుంటి సాత్రాజితీ దిగులు నెపుడు

    చెందగ వలదు సతము నీ డెందమునకు

    ముదము నిడుచు నుండెద నుగ, మోహ నాంగి

    యనుచు బలికెను గిరిధారి
    యనునయముగ

    రిప్లయితొలగించండి

  35. రతికేళి వేళ పతికి స
    మతులితముగ పాల్గొనుచు ప్రమదలాడెడు భా
    షితములె ప్రియమగు నవియే
    సతతము సంతస మొసంగు సతితో గొడవల్ .

    రిప్లయితొలగించండి
  36. పతియునుపత్నియున్ వలపు పంతము బూనుట సాజమేయిలన్
    సతియనురాగ వీక్షణము సంతసమందగ జేయుచుండగన్
    సతతము, భార్యతో గొడవ సంతస మిచ్చును భర్త కెప్పుడున్
    మితముగ మేలమాడగను, మేలగు ప్రేమ ఫలించ నిచ్చలున్

    రిప్లయితొలగించండి
  37. అతులిత ధన సంపాదన
    సతతము సంతస మొసంగు,సతితో గొడవల్
    సతమున్ జరుగుచు నుండును
    మతములు భిన్నం బులైన మామూలేగా

    రిప్లయితొలగించండి
  38. శంకరుఁడు పార్వతీ దేవిని సంతోషపఱచుటకుఁ దాను జంపిన బాలునకు గజాస్యముతోఁ బ్రాణము లొసఁగెను; పార్వతీ దేవి కొఱకై మేరుపర్వత సమీపపుఁ గుమార వనమునకు వచ్చిన మగ జీవు లాఁడ జీవులుగా మారెదరని శపించెను. ఈ సందర్భము:

    సుతునకు నిచ్చెఁ గరి ముఖము
    సతులుగ మారుదు రనె వని సకల పురుషులన్
    సతి కెదురాడఁడు భర్గుఁడు
    సతతము సంతస మొసంగు సతితో గొడవల్
    [సతి = పార్వతీ దేవి]


    అతులిత హర్ష దాయక మనంత సుఖప్రద మౌను స్వీయ జీ
    వితము స భార్య మోక్ష గతిఁ బృథ్విని నారయ వీలు కల్గఁగా
    వితత మనోనురాగ మది వెల్వడ దూరము కాఁగ నింపుగా
    సతతము భార్యతో గొడవ సంతస మిచ్చును భర్త కెప్పుడున్

    రిప్లయితొలగించండి
  39. రతనము వంటి పత్ని కడు రంజిల చేయుచు మించి వంటలన్
    పతికి నొసంగుచున్ ముదము వాని కుటుంబము నాదరించినన్
    రతి సమయమ్మునన్ మిగిలి రాతిరి వేళ విరాళి తోడుతన్
    సతతము భార్యతో గొడవ సంతసమిచ్చును భర్తకెప్పుడున్

    రిప్లయితొలగించండి

  40. మతులను బోవదోచునట మాన్యులకైనను జేయు గీడునున్
    సతతము భార్యతో గొడవ,సంతస మిచ్చును భర్తకెప్పుడున్
    వితరణ బుద్ధి గల్గుచును బేదల జీరుచు నన్నమిచ్చుచో
    గతమును మర్చిపోవుచును గారవ మొప్పగ నుండ మేలగున్

    రిప్లయితొలగించండి
  41. మతి చెడి మంచమెక్కుటకు మార్గమగున్ గద మానగావలెన్
    సతతము భార్యతో గొడవ; సంతస మిచ్చును భర్త కెప్పుడున్
    సతి మదినాకళించి సరసంబుగనామె మనోరధంబులన్
    చతురత నాదరించు దగు చక్కని నేరుపు కాపురంబునన్

    రిప్లయితొలగించండి
  42. పతి తన మాట వినిన సతి
    సతతము సంతస మొసంగు, సతితో గొడవల్
    మితిమీరిన చెడి మతి పర
    పతి, పతియే పరితపించు పరిపరి విధముల్.

    రిప్లయితొలగించండి