22, మే 2021, శనివారం

సమస్య - 3730

23-5-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విటులకుఁ దావలములయ్యె విద్యాశాలల్”
(లేదా...)
“విటులకు తావలంబులుగఁ బేర్మిఁగనెన్ బడు లెల్ల తావులన్”

63 కామెంట్‌లు:

BMahalakshmi చెప్పారు...

కుటిలమునుగాగబుద్ధులు
అటకెక్కెనుచదువులన్నిహంగులువచ్చెన్
నటనలునేర్చిరిగురువులు
విటులకుదావలములయ్యెవిద్యాశాలల్

Haranath Rao Chennamsetty చెప్పారు...

నటనము చూపు గృహములున్

విటులకుఁ దావలములయ్యె ; విద్యాశాలల్

బటువుగ రుధిరము పిండెడి

కటువగు దావలములు కద కలి కాలమ్మున్

...భారతీనాథ్ చెన్నంశెట్టి...

విరించి చెప్పారు...


విటునిగ తామార్చె విదుని
చిటపట లాడుచు పడతియె చిలిపితనముతో
నటవ్రాయ చదివిరిట్టుల
విటులకుఁ దావలములయ్యె విద్యాశాలల్.

BMahalakshmi చెప్పారు...

అటనటయాచకుండువలెయానముసేయుగురుండునక్కటా
పటుతరసంపదల్గనగభావితరంబులజాడఁజూపగా
జటిలమునయ్యెజీవితముచాలగదుర్భరమయ్యెబోధయే
విటులకుతావలంబులుగణబేర్మిగనెన్బడులెల్లతావులన్
విటులనగబోధనముచేయుటకుకాలికిబలపముకట్టుకునితిరుగాడెమధ్యతరగతిబతకలే, నిబడిపంతులు

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

చంద్రుని మోహంలో చిక్కి విచక్షణ కోల్పోయిన తార తాను గన్న కలను చంద్రునితో....

కందం
కిటుకులతో నేమారిచి
దిటవుగ నీ సరసమందుఁ దేల్చితివౌరా!
నటకుడ! కలలో తారా
విటులకుఁ దావలములయ్యె విద్యాశాలల్!

చంపకమాల
కిటుకుల నెన్నొ పన్ని రతి కేళికి దించుచు చాటుమాటుగన్
దిటవుగ సంతునే గనిన ధీర! సుధాకర! తేరకానివౌ
నటకుడు! నీదు మోహమున నైచ్యమునౌ కలలోన తారకా
విటులకు తావలంబులుగఁ బేర్మిఁ గనెన్ బడు లెల్ల తావులన్!

seethadevi gurram చెప్పారు...

నటనాలయములె నిశినిన్
విటులకు దావలములయ్యె ,విద్యాశాలల్
కటువగు శిక్షణతోడను
పటుతర బుద్ధిని గఱపును బాలల కెపుడున్

Haranath Rao Chennamsetty చెప్పారు...

నటనము చూపి మేనకయె నాట్యము చేయగ , విష్ణు భక్తుడున్

విటులకు తావలంబులుగఁ బేర్మిఁగనెన్; బడు లెల్ల తావులన్”

కటినపు విద్య నేర్పునయ కాలము చెల్లిన మ్లేఛ్ఛు గాధలన్

బటువుగ చూపి , కానరుగ భారత వీరుల మేటి గాధలున్

...భారతీనాథ్ చెన్నంశెట్టి...

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

పటుతర మగు బోధలతో
దిట వగు విజ్ఞాన మొసగు దేవళ ములు గా
నెటుల పలు కంగ వచ్చు ను
విటులకు దావలము లయ్యె విద్యా శాలల్?

విరించి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విరించి చెప్పారు...

చిటపట లాడు భర్తకిక చేసెద శాస్తి యటంచు నెంచి పె
న్మిటి వచియింపు వాక్యమును నేర్పును జూపి 'దు' చోట తా 'టు' తో
విటులుగ మార్చెనే విదుల భీరువు, భర్త పఠించె నిట్టులన్
విటులకు తావులంబులుగ బేర్మిగనెన్ బడులెల్ల తావులన్.

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

దయచేసి ఈ పద్యన్ని పరిగణలోకి తీసుకోండి

అటనిట నన్ని చోట్లనిపు డాంగ్ల
బడుల్ కడు విస్తరించె న
క్కటకట! తగ్గి పోయినవి కామి
త తెల్గు బడుల్ క్రమంబుగా
కుటిల విహీన మానవులకున్
జెడు కర్జము చేయువారికిన్
విటులకు తావలంబులుగ పేర్మి
గనెన్ బడులెల్ల తావులన్.
~~~~~~~~~~~~~~~~~

GOVINDARAO చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
GOVINDARAO చెప్పారు...

పటుతరమున బోధించగ
కటువుగమారిన గురువును కళాశాలలనూ
ఎటులనునిందించగలను
విటులకు దావలములయ్యె విద్యాశాలల్

sitharamayya solasa చెప్పారు...

నటనల వేశ్యా శాలలు
విటులకుఁ దావలములయ్యె ; విద్యాశాలల్
వటువుల కాలంబన నిడి
దిటవగు నిర్ణయపరులుగ తీర్చుచునుండున్

Rambabu Kaipa చెప్పారు...

న🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
శంకరా భరణం వారి సమస్య : “విటులకుఁ దావలములయ్యె, విద్యాశాలల్”

అటునిటు జూడగ మేడలు
“విటులకుఁ దావలములయ్యె, విద్యాశాలల్”
జటిలపు చదువుల జదువను
కటువగు గురువులు దొరికిన కాదా మేలున్

- రాంబాబు కైప
22-05-2021

🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

పెనగలూరు శివ ప్రసాదరాజు చెప్పారు...

కటు విది పలుకగ, నిజమే!
పటు తరమౌ కాపు లేక, ప్రహరీ గోడల్
అటునిటు పడగా, రాత్రుల్
విటులకుఁ దావలములయ్యె విద్యాశాలల్.

కటకట ఏమి చెప్పనగు కావలి కాచెడు వారులేక, చీ
కటి నలుదిక్కులన్ ముసర కాంతులు జల్లు కరెంటు లేక, ప్రా
కటముగ చెడ్డ పేరిటుల గల్గెను, గోడలు కూలగా, నిశిన్
విటులకు తావలంబులుగఁ బేర్మిఁగనెన్ బడు లెల్ల తావులన్

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రైవేటు విద్యాలయాల గురించా మీరు చెప్పింది?

కంది శంకరయ్య చెప్పారు...

చక్కని పూరణ. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కాని చంద్రుడొక్కడే కదా? 'విటులకు' అన్న బహువచనం అన్వయించదేమో?

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కటినము' - 'కఠినము'నకు వికృతి కాదు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

చక్కని పూరణ. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఆంగ్ల బడుల్' సమాసం సాధువు కాదనుకుంటాను.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణభంగం, 'కళాశాలలనూ' అని దీర్ఘాంతం సాధువు కాదు.

కంది శంకరయ్య చెప్పారు...

విరుపుతో చక్కని పూరణ. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

chandrashekhar yelisetty చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

గురుదేవులకు ప్రణామములు. ధన్యవాదములు. గౌరవ సూచకమైన బహువచనంగా లేక చంద్రుని బోలిన వారలకు అని నా భావన గురువుగారూ!

chandrashekhar yelisetty చెప్పారు...

చం:

కటుతరమైన మాటలివి గౌలును చాచెడు దుష్ట భావనల్
కుటరము వోలె చిమ్ముచును కూడని బల్కులు వ్యాప్తి నొందగన్
దిటవుగ బుద్దిచెప్పవలె దీనుడి కిన్ పలుకంగ నిట్టలన్
విటులకు తావలంబులుగ బేర్మి గనెన్ బడు లెల్ల తావులన్

వై. చంద్రశేఖర్

కంజర్ల రామాచార్య. చెప్పారు...

కటుతరవాక్కు లియ్యవి వికారము గొల్పును విన్న, నైననున్
కట కట! వాస్తవమ్ము లయి కానగ గుండె తరుక్కపోవు నీ
వటుల వచించ, నేడు భ్రమరాళిమరందవిలుబ్ధసంచర
ద్విటులకు తావలంబులుగఁ బేర్మిఁగనెన్ బడు లెల్ల తావులన్.

కంజర్ల రామాచార్య.

కంజర్ల రామాచార్య. చెప్పారు...

తుమ్మెదలు గూళ్ళుకట్టినవను భావనలో.

Haranath Rao Chennamsetty చెప్పారు...

అవునండీ

Haranath Rao Chennamsetty చెప్పారు...

ధన్యవాదములండీ

sitharamayya solasa చెప్పారు...

🙏🏽

seethadevi gurram చెప్పారు...

చక్కని పూరణలండీ! అభినందనలు!💐💐

chandrashekhar yelisetty చెప్పారు...

నిట్టలన్ ను నిట్టులన్ గా చదువగలరు

విరించి చెప్పారు...

కటకట యేమి చెప్పెదను కావ్యుడు భోగపిపాసియై సదా
పిటపిట లాడు జవ్వనువ వెన్ను జరించుచు నాస్తినెల్ల తా
నటగల భండహాసినికి యర్పణ చేయగ గాంచి చెప్పిరే
విటులకు తావులంబులుగ బేర్మి గనెన్ బడులెల్ల తావులన్.

subbarao చెప్పారు...

కుటిలపు టొజ్జలు గలుగుత
విటులకు దావలము లయ్యె విద్యాశాలల్
నటియించి ప్రేమ తోడుత
దిటముగ దావలపు రేపి తీయగ పలికిన్

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మిత్రులందఱకు నమస్సులు!

నటవిటగాణికామణులు నవ్యకరోన దురాగతమ్ముచే
నటమటలంబడన్, బడుల నాగతి మూయఁగఁ, ద్రాగుఁబోరులున్
బొటబొటమంచుఁ గాలిడఁగ, బోరన మూసియు నున్న సాకుచే
విటులకు తావలంబులుగఁ బేర్మిఁ గనెన్ బడు లెల్ల తావులన్!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

...బోతు...టైపాటు

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

subbarao చెప్పారు...

విటులకు తావళంబులుగ బేర్మి గనెన్ బడులెల్ల తావులన్
నటనట యుండవచ్చు నెమొ,యంతట యుండవు నిశ్చయంబుగా
కుటిలపు టొజ్జలుందురుగ గొందఱు వారలు గారణంబుగా
నిటులుగ జర్గుచున్నవని యెంతయొ నమ్మకముండె గాద?భో!

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"జవ్వనుల.. నర్పణ చేయగ..." అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

పెనగలూరు శివ ప్రసాదరాజు చెప్పారు...

గురువు గారికి, మీకును ధన్యవాదాలండీ!

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

అటు నిటు పోకుండ సతము
వటువులు వల్లించుచుండఁ బాఠ్యాంశములం
బటువుగ మఱి జదు వనెడు న
వి టులకుఁ దావలము లయ్యె విద్యాశాలల్

[అవి +ఇటు + ఉలకు = అ వి టులకు; ఇటు = ఇట్లు; ఉల = కండూతి / దురద; అవి = ఆ విద్యా శాలలు]


కటువుగ నుండుఁ బల్కఁగను గాని నిజం బిది యెంచి చూడ గ్రా
మటికల యందు నిక్కముగ మంత్రి వరేణ్యుఁడ! యొక్కటేని లే
దట వినుమా పటుత్వమున నా శిథిలంబులు తార కోర్వశీ
విటులకుఁ దావలంబులుగఁ బేర్మిఁ గనెన్ బడు లెల్ల తావులన్

[తారకా విటుఁడు = చంద్రుఁడు; ఊర్వశీ విటులు = మిత్రావరుణులు (ఊర్వశి వలన వసి ష్ఠాగస్త్యుల జన్మకారకులు); చంద్రి కాతప వర్షములకుఁ దావలము లైనవి.]

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

గురుదేవులకు ధన్యవాదములు.
సవరించిన పూరణలు పరిశీలించ ప్రార్థన

చంద్రుని మోహంలో చిక్కి విచక్షణ కోల్పోయిన తార తాను గన్న కలను చంద్రునితో....

కందం
"కిటుకులతో నేమారిచి
దిటవుగ నీ సరసమందుఁ దేల్చితివౌరా!
నటకుడ! కలలో నీ గతి
విటులకుఁ దావలములయ్యె విద్యాశాలల్!"

చంపకమాల
"కిటుకుల నెన్నొ పన్ని రతి కేళికి దించుచు చాటుమాటుగన్
దిటవుగ సంతునే గనిన ధీర! సుధాకర! తేరకానివౌ
నటకుడ! కంటి స్వప్నమును నవ్వకు నీ గతి మేలుబంతిగన్
విటులకు తావలంబులుగఁ బేర్మిఁ గనెన్ బడు లెల్ల తావులన్!"

chandrashekhar yelisetty చెప్పారు...

ధన్యవాదములు

A.Satyanarayana Reddy చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
A.Satyanarayana Reddy చెప్పారు...

పటలము నాశమయ్యె కన ప్రాత తరమ్మగు పాఠశాలలన్
పటుతరమైన చక్కనగు వాసములన్ సృజియింపకుండిరే
కుటిలమనస్కులౌ పతులు, గోపతి జ్యోతికి, రేయి తారకా
విటులకు తావలంబులుగఁ బేర్మిఁగనెన్ బడు లెల్ల తావులన్

Surya చెప్పారు...

కటకట గన మధుశాలలె
విటులకుఁ దావలములయ్యె; విద్యాశాలల్
వటుకులకున్ దావలములు
పటుతరముగ దీర్చు వారి భవితవ్యంబున్

seethadevi gurram చెప్పారు...

కటువగు రోగమెల్లెడల గ్రమ్మగ పిల్లల బాగునెంచుచున్
చటుకున మూసివేయగను చక్కని విద్యల నాలయమ్ములన్
నటునిటు బోవువారలకు నడ్డపుదారుల ద్రొక్కువారికిన్
విటులకు తావలంబులుగ బేర్మిగనెన్ బడులెల్ల తావులన్

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!

Sistla Sharma చెప్పారు...

ఇటుల వచింతురేమి? ఫల
మిచ్చెడి విద్య నొసంగు నొజ్జలున్
పటుతరమైన సత్కృతుల
పాండితి వైభవమిచ్చు విజ్ఞులున్
పొటమెడి పాఠశాలలను
బోల్చుచు నిట్లు వచింప బాడియే?
"విటులకు తావలంబులుగఁ బేర్మిఁ గనెన్ బడు లెల్ల తావులన్"!

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

ఇటువంటి మాటలాడగ
కటకట నో రెట్లు వచ్చె కాఠిన్యముతో
చిటపటలాడక చెపుమెట
విటులకుదావలములయ్యె విద్యాశాలల్