13, మే 2021, గురువారం

సమస్య - 3722

14-5-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కారము భక్తులనుఁ దీయగా మురిపించెన్”
(లేదా...)
“కారము తీపియై సుఖముగా మురిపించెను భక్తబృందమున్”

60 కామెంట్‌లు:


 1. భారూపమ్మదియె నిరా
  కారుడు సర్వాత్మకుండు కాయస్థుండౌ
  ధౌరేయుని గొల్చెడు యోం
  కారము భక్తులనుఁ దీయగా మురిపించెన్.

  రిప్లయితొలగించండి
 2. కోరలు సాచె కరోనా

  భారములయ్యెను గుడులను బడులన్ తెరవన్

  తారసపడె మది శివునా

  కారము భక్తులనుఁ దీయగా మురిపించెన్”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 3. చారు మనోహర రూపుని
  నారాయణుని మదిని లిపి నామ జపమునన్
  పేరిమి యొనరించెడి యోం
  కారము భక్తులను దీయగా మురిపించెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "పేరిమి నొనరించెడి" అనండి.

   తొలగించండి
 4. తరమాచూడగపరముని
  కరమరుదుగకోటికోకనికరుణింపంగా
  వరమైవేంకనకనసా
  కారముభక్చులనుతీయగామురిపించెన్

  రిప్లయితొలగించండి
 5. సమస్య :

  కారము తీపియై సుఖము
  గా మురిపించెను భక్తబృందమున్

  ( ఆదివారం సాయంసమయంలో సత్యసాయి భజనకు
  ఉపక్రమిస్తున్న భక్తులు )

  ఉత్పలమాల
  ....................

  వారము వారమున్ జనులు
  భక్తియె మీరగ సాయి నెంచుచున్
  జేరుచు నొక్క చోటకును
  జెన్నుగ గొంతుల మార్దవమ్ముతో
  గోరిక నొక్క భావమున
  గూర్చుని ప్రేమగ నాలపింప నోం
  కారము ; తీపియై సుఖము
  గా మురిపించెను భక్తబృందమున్ .

  రిప్లయితొలగించండి
 6. శ్రీరాముని కుత్సవములు
  నారాధన, కోవెలందు నానందముగన్
  ఆరాము నలంకృత నా
  కారము, భక్తులనుఁ దీయగా మురిపించెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అలంకృత+ఆకారాము = అలంకృతాకారము' అవుతుంది. నుగాగమం రాదు.

   తొలగించండి
  2. శ్రీరాముని కుత్సవములు
   నారాధన, కోవెలందు నానందముగన్
   ఆరాముని దివ్యాలం
   కారము, భక్తులనుఁ దీయగా మురిపించెన్

   తొలగించండి

 7. ధారుణి బ్రోచువాడె యధి దైవము ధీముడు వాని సన్నిధిన్
  గోరుచు నిత్యముక్తునిని గొల్చెడి యాశ్రితు లైన వారికిన్
  ప్రేరణ నిచ్చు నాదమది విశ్వమనోజ్ఞ కలాపమైన యోం
  కారము తీపియై సుఖముగా మురిపించెను భక్తబృందమున్.

  రిప్లయితొలగించండి
 8. రిప్లయిలు


  1. కందం
   కూరిచి పతాక ఘట్టము
   నారాధ్యుడు నన్నమయ్య నంతిమ గడియన్
   బూరిగఁ గరుణించెడు సా
   కారము భక్తులనుఁ దీయగా మురిపించెన్

   ఉత్పలమాల
   మూరితి శ్రీనివాసునకు ముప్పది వేలకు మించు కీర్తనల్
   గూరిచి యన్నమయ్య తిరు కోవెల చేర పతాకఘట్టమై
   నీరజ నాభుడున్ సతులు నేరుగ సాంత్వన నీయ వారి సా
   కారము తీపియై సుఖముగా మురిపించెను భక్తబృందమున్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 9. పారమునమటగామునియుభావనసేయయలౌకికంబునున్
  కోరికముక్తికాగనటకోందలమందుచుచూడగానటన్
  వేరుగలేదుగానదియువెల్గుగజీవిగకానిపించునా
  కారముతీపియైసుఖముగామురిపించెనుభక్తబ్రుందమున్

  రిప్లయితొలగించండి
 10. ~~~~~~~~~~~~~~~~~~

  భారము లెక్కజేయకను
  భక్తులు వెళ్ళిరి కాశి చూడగన్
  సారెకు సారెకున్ మిగుల సన్ను
  తి జేయుచు విశ్వనాథునిన్
  జేరిరి యాలయంబు దరి చేయు
  చు చింతన నంతలోన నోం
  కారము తీపియై సఖముగా
  మురిపించెను భక్త బృందమున్
  ~~~~~~~~~~~~~~~~~~

  రిప్లయితొలగించండి
 11. నీరజనాభునిన్ దలచి నిత్యము భక్తుల కన్నదానమున్
  దీరిచి కూర్చునట్టి పరదేవత పద్మిని యాలయంబునన్
  బారులు తీరగానచట భక్ష్యములన్ గలదౌ ప్రసాద స్వీ
  కారము తీపియై సుఖముగా మురిపించెను భక్తబృందమున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏

   తొలగించండి
  3. సవరణతో

   నీరజనాభునిన్ దలచి నిత్యము భక్తుల కన్నదానమున్
   దీరిచి కూర్చునట్టి పరదేవత పద్మిని యాలయంబునన్
   బారులు తీరగానచట భక్ష్యములన్ గలనోగిరంపు స్వీ
   కారము తీపియై సుఖముగా మురిపించెను భక్తబృందమున్

   తొలగించండి
 12. గోపికల భక్తితో నా ప్రయత్నం.

  క.
  చీరల కొంగులు తొలగగ
  నోరసిగల్ జారిపోవ నువిదలు కృష్ణున్
  జేరగ, గారము నంగీ
  కారము భక్తులను దీయగా మురిపించెన్.

  రిప్లయితొలగించండి
 13. కోరిక కొండ చేరిరయ కొండల రాయుని దర్శనార్ధులై

  వీరలు వారలందరును వేడుకనాడుచు మెట్ల మార్గమున్

  చేరిన కాలినొప్పులవి ఛిధ్రము దేవుని గాంచి సుందరా

  కారము తీపియై సుఖముగా మురిపించెను భక్తబృందమున్”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 14. బారులుదీరి యార్తజన బాంధవుడౌ హరి దేవళంబునన్
  జోరుగ భక్తబృందములు చొక్కపు కీర్తన లాలపించుచున్
  సారెకుసారెకున్ విభుని సన్నిధిచేరుచు నుచ్చరించు యోం
  కారము తీపియై సుఖముగా మురిపించెను భక్తబృందమున్

  రిప్లయితొలగించండి
 15. బారులుతీరినభక్తులు
  యారవముగహరినిదలచి యతి తన్మయతన్
  జేరుచు సన్నిధి విను యోం
  కారము భక్తులనుఁ దీయగా మురిపించెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'భక్తులు+ఆరవము' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. "భక్తులె యారవమున" అనండి.

   తొలగించండి
 16. సారపు సుస్వరాల విల
  సత్కృత దివ్య ఝరీ ప్రవాహమున్
  గోరి భజించ వేడ్కనట
  గూడిన వారల భాగ్యమోయనన్
  దీరిన నాద సంభృత వి
  ధేయ సుధా లహరీ ప్రశస్త మోం
  కారము తీపియై సుఖము
  గా మురిపించెను భక్తబృందమున్!

  రిప్లయితొలగించండి
 17. కారము లేని వంటల నొకానొక విందున గ్రోలినట్టు లా
  కారము లేని యీశ్వరుని కన్నులలో దలపింప జేసి సా
  కారమొసంగె గాదె యనగా హరిదాసు నుతింప జేసి నోం
  కారము, తీపియై సుఖముగా మురిపించెను భక్త బృందమున్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురువర్యులకు నమస్సులు, మూడవ పాదంలో "నుతింప జేసి " బదులుగా "నుతింప జేయ "అని సవరణ చేయడమైనది.
   ధన్యవాదములు

   తొలగించండి
  2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  3. గురువర్యులకు నమస్సులు, ధన్యవాదాలు.

   తొలగించండి
 18. ఆరాధన కాలమవగ
  నారాటపడి యచటి గుడి యందుగల నిరా
  కారుని కొనర్చిన యలం
  కారము భక్తులనుఁ దీయగా మురిపించెన్

  రిప్లయితొలగించండి
 19. శ్రీరమణీయనీలిమశరీరరుచిప్రచురుండు శోభనా
  కారుడు నాగళాబ్జపదకమ్రసుహారుని గాంచ నిట్లు శ్రీ
  హీరసువర్ణనూపురమహీయవిభూషితమాలికాద్యలం
  కారము తీపియై సుఖముగా మురిపించెను భక్తబృందమున్

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 20. క్షీరముగీతాసారము
  బోరునఁదావెన్నుజూపబోధించెను,త
  త్సారధిజూపినశాంతా(విశ్వా)
  కారము భక్తులనుఁ దీయగా మురిపించెన్

  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 21. మరో పూరణ

  భూరమణీధరారమలు పొందిక భూషలు పంచకాస్త్రముల్
  క్షీరసముద్రవాసములు శేషఫణీంద్రశయమ్ము లైననున్
  శ్రీరమణీయతన్మధురచిత్తనిరంతరభాస్వదున్నతా
  కారము తీపియై సుఖముగా మురిపించెను భక్తబృందమున్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 22. సారము లేని జీవనము సాగుచు నుండగ, స్వర్గలోకపున్
  పారము కాంచగా హరిని ప్రార్థన చేయుచు చిత్తశుద్ధితో
  చేరిరి కొండపైకి కన శ్రీహరి నచ్చట శౌరి మోహనా
  కారము తీపియై సుఖముగా మురిపించెను భక్తబృందమున్

  రిప్లయితొలగించండి
 23. నీరజనేత్రుని శ్రీ హరి
  నారాధన సేయు వేళనాలయమందున్
  హారతినిడ దివ్యాలం
  కారము భక్తులనుఁ దీయగా మురిపించెన్

  రిప్లయితొలగించండి
 24. మారెమ గుడి పూజారిణి
  హారతి దానిచ్చు చుండి యమ్మను ఓంయన
  నారాధన మధ్యను నోం
  కారము భక్తులను దీయగా మురిపించెన్

  రిప్లయితొలగించండి
 25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 26. మారెమ దేవళంబున సమాగతులైన నవీనులందఱున్
  హారతి ధూపముల్ గనుచు హాశివ! శాంకరి! యోంయనంగ నోం
  కారము తీపియై సుఖముగా మురిపించెను భక్తబృందమున్
  నారయ యంతెగా మదికి హాయిని గూర్చెడుమంత్రమే సుమా

  రిప్లయితొలగించండి
 27. 1)
  కారణము జగతికీతడు
  కారణము స్థితికి లయకును కారణమితడే
  కారణజన్ములకితడా
  “కారము భక్తులనుఁ దీయగా మురిపించెన్”

  2)

  భారము కాగ జీవనము పాడగు రోగము వ్యాప్తిజెందగన్
  మారము జేయుచున్ప్రజలు మారణ హోమము చేయుచుండగన్
  వారము లోన తగ్గుటకు ప్రార్థన జేయగ నీ దయన్ , సదా
  కారము, తీపియై సుఖముగా మురిపించెను భక్తబృందమున్

  3)
  రారా ! సుందర వదనా !
  రారా ! రాజీవనయన ! రా యని పిల్వన్
  శ్రీరామునిగ నిడిన మమ
  “కారము భక్తులనుఁ దీయగా మురిపించెన్”

  4)
  రార! సరోజ పుష్ప దళ రాజిత దేహము మాకు జూపరా
  రార ! సుగంధ లేపనము రాయగ మామొర లాలకించరా
  రార ! సునేత్ర రాజముల రాలిన ప్రేమను మాకు జూప , సా
  “కారము తీపియై సుఖముగా మురిపించెను భక్తబృందమున్”

  - రాంబాబు కైప
  14-05-2021

  రిప్లయితొలగించండి
 28. దూరం బైనవి జనుల వి
  కారమ్ములు వేంకటేశుఁ గాంచఁగఁ గనులన్
  మూరిన యధికారుల సహ
  కారము భక్తులనుఁ దీయగా మురిపించెన్


  సార విభూతి గంధ తను సంతత నిర్జర వంది తేద్ధ బృం
  దారక నామ కీర్తిమ దుదాహృత జన్మ మహా పరంపరా
  తారక మంత్ర వన్నమక తచ్చమ కావృత దివ్య కుర్వ దోం
  కారము తీపియై సుఖముగా మురిపించెను భక్తబృందమున్

  రిప్లయితొలగించండి
 29. ఆ రఘురామ మందిరమునందున పర్వదినంబు వేడుకన్
  తీరుగ పుష్పమాలికల దేరును సిద్ధము జేసి భవ్యమౌ
  మూరుతమందు దీర్చిరట మోహినిగా గన స్వామి మంగళా
  కారము తీపియై సుఖముగా మురిపించెను భక్తబృందమున్

  రిప్లయితొలగించండి
 30. కె.వి.యస్. లక్ష్మి:

  వారిజలోచన మిత్రా!
  వారిజభవ సేవ్య భక్తవత్సల సాంబా!
  సారగ్రీవా నీ యా
  కారము భక్తులనుఁ దీయగా మురిపించెన్.

  రిప్లయితొలగించండి
 31. సారపుభక్తినిపూనుచు
  శ్రీరఘు రామునిసతతము సేవింపంగన్
  ఆరామచంద్రునిశుభా
  కారము భక్తులనుదీయగా మురిపించెన్

  రిప్లయితొలగించండి