21, మే 2021, శుక్రవారం

సమస్య - 3729

22-5-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“క్రూరుఁడై శిబి ఖండించెఁ బారువమును”
(లేదా...)
“క్రూరుండై శిబి ఖడ్గముం గొని వడిం గోసెం గపోతమ్మునే”

51 కామెంట్‌లు:

  1. మిత్రులందఱకు నమస్సులు!

    బీరమ్ముల్ వలదంచుఁ బల్క, నటులే వే పల్కెదో బాలకా!
    తోరంబౌ ఘనదాతఁగూర్చి యిట నేదో సెప్పరాదా! యనన్,
    ధీరాత్మన్ ఘనతేజ మూనుచును నుద్దీపింప వాఁడిట్లనెన్
    "క్రూరుండై శిబి ఖడ్గముం గొని వడిం గోసెం గపోతమ్మునే!"

    రిప్లయితొలగించండి
  2. రాజుపంపినదూతగారాజసాన
    పక్షిఱెక్కలనాడింపభావమెఱిగి
    సత్యకాముడుసదమలశాంతితోడ
    క్రూరుడైశిబిఖండించెఁబారువమును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యం బాగుంది. కాని భావం బోధపడలేదు.

      తొలగించండి
    2. దుర్మార్గుడురాజుపంపగావిఱ్ఱవీగుచుపక్షివచ్చినది
      శిబిదుర్మార్గమునుఖమడించిశాంతినిస్ధాపించెను

      తొలగించండి
  3. డేగ రూపుడై ఇంద్రుడు వేగముగను

    వచ్చెను తరుముచును యజ్ఞ వాటికునతి

    క్రూరుఁడై ; శిబి ఖండించెఁ బారువమును”

    కు సమమగు తొడను బదులౌ మాంసమనుచు

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వాటిక కతి..." అనండి. 'పారువమునుకు' అనడం సాధువు కాదు.

      తొలగించండి

  4. పారంక్యుండగు తార్క్ష్యునాయకుడు నన్ భక్షింప నేతెంచు నీ
    వేరక్షించు మటంచు గోరినంత తనదౌ వృక్కమ్మునే వేగ మ
    క్రూరుండై శిబి ఖడ్గముంగొని వడింగోసెం, గపోతమ్మునే
    తా రక్షింప దలంచుచున్ నృపునియా దాతృత్వమెంతోటిదో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. "...గోర తనదౌ.." అనండి.

      తొలగించండి
    2. పారంక్యుండు అనగా? నిఘంటువులో అర్ధం దొరకలేదు!

      తొలగించండి

  5. అరుణలోచనము తనయా హారమంచు
    పలుకు గరుడికి తన తొడ పలము కొంత
    క్రూరుఁడై శిబి ఖండించె, బారువమును
    తాను కాపాడనెంచెనా దానశీలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గరుడికి' అనడం సాధువు కాదు. "పలుకు డేగకు తన..." అనండి.

      తొలగించండి
  6. కథను కొంచెం మార్చి 🙂🙏

    ఆరామంబుల సంచరించు దృఢుడౌ యాఖేటకుండా
    ద్యువున్
    ధారాపాతముగా సువృష్టి గురియన్ తాళంగలేకే క్షుధన్
    జేరంగా నొకమానుచెంత నచటన్ జీవించు జంటన్
    గనిన్
    క్రూరుండై శిబిఖడ్గముంగొని వడింగోసెన్ గపోతమ్మునే

    శిబి = హింసించెడు పశువు (శబ్ద రత్నాకరము)
    ఆఖేటకుడు = వేటగాడు
    ద్యువు = దినము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! సవరించెదను!🙏🙏🙏

      తొలగించండి
    3. సవరణతో
      ఆరామంబుల సంచరించు దృఢుడౌ యాఖేటకుండా
      ద్యువున్
      ధారాపాతముగా సువృష్టి గురియన్ తాళంగలేకే క్షుధన్
      జేరంగా నొకమానుచెంత నచటన్ జీవించు పక్షిన్
      గడున్
      గ్రూరుండై శిబిఖడ్గముంగొని వడింగోసెన్ గపోతమ్మునే

      శిబి = హింసించెడు పశువు (శబ్ద రత్నాకరము)
      ఆఖేటకుడు = వేటగాడు
      ద్యువు = దినము

      తొలగించండి
  7. తనువు పై మమకారపు ధ్యాస వదలి
    త్యాగ ధను డయ్యు తొడను దా ధైర్య ముగను
    కౄరుడై శిబి ఖండిం చె :: బారువమును
    కరుణ జూపియు తానప్డు కావ గలిగె

    రిప్లయితొలగించండి
  8. ఆరాధింవలెగా సదాయితని సౌహార్ధంబునే నందరున్
    ఈరాజోత్తముడున్, తలంచడెపుడున్ ఈతీరుగానున్ నిలన్
    నేరంబౌనుగదా తలంచినిటులన్, నీచుండె పల్కేనిలా
    "క్రూరుండై శిబి ఖడ్గముం గొని వడిం గోసెం గపోతమ్మునే"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఆరాధింవలె'? "సౌహార్దంబునే యందరున్, తలంచిన నిటుల్" అనండి. 'పల్కేనిలా' అనడం సాధువు కాదు.

      తొలగించండి
  9. అందరికీ నమస్సులు🙏

    శూరుండౌ శిభి ప్రాభవంబును సురుల్ శోధించ నేతెంచగన్
    కారుణ్యం బున రక్షణ న్నొసగ తా కాయంబు ఖండించగన్
    ఘోరంబౌ నిది చూడలేననుచు మేల్గోరంగ సేనానియే
    *“క్రూరుండై శిబి ఖడ్గముం గొని వడిం గోసెం గపోతమ్మునే”*

    *వాణిశ్రీ నైనాల*

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. తేటగీతి
      దాన గుణము పరీక్షింప ధరణి జేరి
      శ్యేన రూపాన మాంసమ్ము నింద్రుఁడడుగ
      గ్రూరుఁడై, శిబి ఖండించెఁ, బారువమును
      నగ్నిఁ గావఁగ తనదైన కాయమిడఁగ

      శార్దూలవిక్రీడితము
      పారన్ బావుర మగ్ని వేడ శరణున్ బ్రాదేశనాత్ముండనన్
      సారించన్ దిగి శ్యేనమై హరియె తా సాధించి కోరంగనే
      క్రూరుండై, శిబి ఖడ్గముం గొని వడిం గోసెం, గపోతమ్మునే
      తా రాగమ్మున గావ తానె తన భూతాత్మమ్ము తుల్యంబనన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. 🙏ధన్యోస్మి గురుదేవా🙏

      నాలుగవ పాదంలో యతిని సవరించిన తేటగీతి :తేటగీతి
      దాన గుణము పరీక్షింప ధరణి జేరి
      శ్యేన రూపాన మాంసమ్ము నింద్రుఁడడుగ
      గ్రూరుఁడై, శిబి ఖండించెఁ, బారువమును
      నగ్నిఁ గావఁగ తనదైన నజిరమిడఁగ

      తొలగించండి
  11. డేగ భయమున బారువం బేగి శిబిని
    శరణుజొచ్చగ పెనగొను కరుణతోడ
    క్రూరుఁడై శిబి ఖండించెఁ బారువమును
    బ్రోవ తనమేను డేగకు భోజనముగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "శరణు వేడగ" అనండి.

      తొలగించండి
    2. డేగ భయమున బారువం బేగి శిబిని
      శరణు వేడగ పెనగొను కరుణతోడ
      క్రూరుఁడై శిబి ఖండించెఁ బారువమును
      బ్రోవ తనమేను డేగకు భోజనముగ

      తొలగించండి
  12. పావురమ్మును భక్షింప పక్షిరాజు
    తర్కమాడుచుప్రభువుతోకర్కశమున
    మాంసమడుగగాసురరాజుమాయతోడ
    క్రూరుడై శిబిఖండించె బారువమును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని సమస్య పరిష్కరింపబడినట్లు లేదు.

      తొలగించండి
  13. ఆరాజేంద్రుని త్యాగమున్ వినిన, యింద్రాగ్నుల్ కఠోరాత్ములై
    క్రూరంబైన పరీక్షజేయ శరణున్ గోరన్, సుకార్యంబునన్
    క్రూరుండై శిబి ఖడ్గముం గొని వడిం గోసెం, గపోతమ్మునే
    కారుణ్యంబున రక్షనన్ సలుప ప్రాకాశ్యంబుయై నిల్చెనే

    రిప్లయితొలగించండి
  14. 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    శంకరాభరణం వారి సమస్య : "క్రూరుడైశిబిఖండించెఁబారువమును"
    పూరణ : ఒక దూత శాంతిని కోరుచు రాజును చేరగా , అతని తల ఖండించెనట. అది చూసి ప్రజలు చెప్పిన ఉపమానము

    తే. గీ.
    శాంతికోరుచు దూతయు, కాంతు జేర
    దయను జూపక నాతని తలను నరికె;
    భ్రాంతి జెంది ప్రజలనిరి వగచి వగచి
    "క్రూరుడైశిబిఖండించెఁబారువమును"

    - రాంబాబు కైప
    22-05-2021

    🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    రిప్లయితొలగించండి
  15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  16. ఎన్ని నాళ్ళకో దొరికిన యెరను దనకు
    వదల నాయమనిన డేగ వచన ములను
    క్రూరుఁడై శిబి ఖండించెఁ ; బారువమును
    బదులు తన మేను మాంసము బడయు మనెను

    రిప్లయితొలగించండి
  17. వీరావేశవిలుప్తచింతనుడునై విశ్వాసమున్ వీడి త
    ద్దారన్ మూర్ఖుడు శీలశంకితుడునై దండించి, తత్పుత్రులన్
    నోరారం బిలువంగ జంపె కట! కన్నుం గానడ ప్పట్టునన్
    క్రూరుండై శిబి ఖడ్గముం గొని వడిం గోసెం గపోతమ్మునే.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దృష్టాంతాలంకారంతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  18. భయము నన్ వచ్చి వాలిన నయమున తన
    ఒడిని చేర్చి, పావురమున నొక వల కని
    క్రూరుఁడై శిబి ఖండించెఁ, బారువమును”
    వల తొలగించి విడిచెను వాట ముగను

    రిప్లయితొలగించండి
  19. ప్రాణభీతిచే చేరగ పావురమ్ము
    దానిభీతినిబాపుచు తనువులోని
    మాంసమొసగి కాపాడినమాన్యుడెట్లు
    క్రూరుడై శిబి ఖండించె బారువమును

    రిప్లయితొలగించండి
  20. క్రూరుండై శిబి ఖండించె బారువమును
    ననగ బాడియే యిచ్చట యార్య! మీరు
    చేర దీసి యభయమీయ శిబిని మెచ్చు
    కొనిరి యింద్రాగ్ను లాతని దాన గుణము

    రిప్లయితొలగించండి
  21. బోయఁ డాత్మజునకుఁ బెట్టెఁ బుణ్య పురుషుఁ
    డు శిబి చక్రవ ర్త్యాఖ్యను భృశపుఁ బ్రీతి
    నక్కట పెరిగి సూనుఁడు మిక్కుటముగ
    క్రూరుఁడై శిబి ఖండించెఁ బారువమును


    పారావార పరీవృ తాఖిల జగత్ప్రాణ్యోఘ సంభావ్య లో
    కారాధ్యుండు మహామహీశ్వరుఁడు శ్యేనార్థంబు నిర్భీతినిన్
    సారోదార దయాసముద్రుఁడు నిజ స్కంధమ్ము, రక్షింప న
    క్రూరుండై శిబి ఖడ్గముం గొని వడిం గోసెం, గపోతమ్మునే

    [పద విభజనము: రక్షింపఁ, గపోతమ్మునే, నిజ స్కంధమ్ము నక్రూరుండై... ]

    రిప్లయితొలగించండి
  22. డేగ రూపమున సురేంద్రుడెగుచు రాగ
    క్రూరుఁడై, శిబి ఖండించెఁ, బారువమును
    కావగ, నిజ శరీర భాగంబు, దాని
    మారుగనొసగె దన త్యాగనిరతి గనుడు

    రిప్లయితొలగించండి
  23. శా:

    ప్రారంభించెను రాగ యుక్త శ్రుతినున్ పౌరాణ ప్రాసంగికన్
    తీరాలోచనసేయ కష్ట తరమై తేలించ రాకుండగన్
    వీరావేశము తోడ చెప్ప దొడగెన్ విడ్డూరమై నివ్విధిన్
    క్రూరుండై శిబి ఖడ్గమున్గొని వడిన్ గోసెన్ గపోతమ్మునే

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  24. చేరం దీసిన యాకపోతమును దా శీర్షంబు నూరార్చి యున్
    ధీరత్వంబును జెప్పి నభయం ధీరుండవై యుండుమా
    హారం బిత్తును డేగ కియ్యెడను నాయంగంపు మాంసమ్మునాన్
    క్రూరుండై శిబి ఖడ్గమున్ గొని వడిం గోసె గపోతమ్మునే

    రిప్లయితొలగించండి
  25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  26. ధీరుండై శిబి దానధర్మముల సందీపింప, రూపింపగా
    నా రాజేంద్రుని, డేగ రూపముగనై యావృష్టి, పార్వమ్ముగా
    నైరక్షింపమటంచు కోర శిఖితా, నానంద ముప్పొంగ య
    క్రూరుండై శిబి ఖడ్గముం గొని వడిం గోసెం. గపోతమ్మునే
    తారక్షింపగ, మేనిదౌ పలము ఖాదమ్మియ్య గాబైరికిన్

    రిప్లయితొలగించండి