23, మే 2021, ఆదివారం

సమస్య - 3731

24-5-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కోడలివని పల్కె నొకఁడు గూఁతురితోడన్”
(లేదా...)
“కోడలివంచు నొక్కరుఁడు గూఁతురితోడ వచించె నెమ్మదిన్”

87 కామెంట్‌లు:

  1. మిత్రులందఱకు నమస్సులు!

    "మేడలు మిద్దెలుం గలిగి మిన్నగ జీవనమందువారుకాన్;
    జూడఁగఁ జక్కనైన పురుషోత్తముఁడౌ తనయుండు నుండినన్;
    జూడను వారలన్; మనసు చొక్కమునై కన నాదు చెల్లికిం
    గోడలివంచు నొక్కరుఁడు గూఁతురితోడ వచించె నెమ్మదిన్!"

    రిప్లయితొలగించండి
  2. వీడకుమగనినికష్టము
    నేడుగడగచూడుమతనినిందునిభాస్యా
    వాడనినగయైయత్తకు
    కోడలివనిపల్కెనోకడుగూతురితోడన్

    రిప్లయితొలగించండి
  3. కందం
    వేడుక నృత్యము నేర్పియు
    చేడియ యుత్తర సుతునకు చెల్లునటంచున్
    దోడొన గూర్చినఁ గ్రీడికి
    కోడలివని పల్కె నొకఁడు గూఁతురితోడన్

    ఉత్పలమాల
    వేడుక నృత్య గానములఁ బేర్మిని నేర్పియు శాస్త్రమొప్పఁగన్
    జేడియ భార్యగా సుతునిఁ జేరఁగ సొంపగునంచు యుత్తరా!
    తోడొన గూర్పఁగన్ రతికి తూగెడు మన్మథునట్లు గ్రీడికిన్
    గోడలివంచు నొక్కరుఁడు గూఁతురితోడ వచించె నెమ్మదిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. 🙏 ధన్యోస్మి గురుదేవా🙏

      కందం
      వేడుక నిన్ను పలుకుపూ
      బోడిగ సృజియించి సృష్టిఁ బూనిన నాకున్
      దోడుగఁ దగునన శౌరికిఁ
      గోడలివని పల్కె నొకఁడు గూఁతురితోడన్

      ఉత్పలమాల
      వేడుకఁ బొత్తమున్ శుకముఁ బేరిమి పద్మము నక్షమాల సొం
      పాడఁగ సాహితీ స్వరములక్కున దాల్చ సృజించి మోదియై
      తోడుగొనంగ సృష్టి విధిఁ దొందర బాపితె దేవి! శౌరికిన్
      గోడలివంచు నొక్కరుఁడు గూఁతురితోడ వచించె నెమ్మదిన్

      తొలగించండి

  4. చేడియ ప్రేమించిన చే
    బోడిని పెండ్లాడినావె మూర్ఖత్వముతో
    వీడు గృహము పేదింటికి
    కోడలివని పల్కెనొకఁడు గూఁతురు తోడన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చేబోడి = నిర్ధనుడు' క్రొత్త పదం నేర్చుకున్నాను.

      తొలగించండి
  5. తోడుగ జీవన మందున
    నీడగ నిలిచెడు మగనిగ నెగడెడి వాడై
    మేడను వసించు నత్తకు
    కోడలివని బల్కె నొకడు కూతురు తోడన్

    రిప్లయితొలగించండి
  6. క్రొవ్విడి వెంకట రాజారావు:

    చూడగ మేనల్లునకున్
    జోడయి భోగములదోడ సొంపాఱెడి నా
    తోడుకు నిప్పటి నుండియు
    కోడలివని పల్కెనొకఁడు గూఁతురు తోడన్.
    (తోడు= సోదరి)

    రిప్లయితొలగించండి

  7. వాడొక బైసికాడు పని పాటలు లేకచరించు నట్టి చే
    బోడిని యందగాడనుచు బుద్ధియె లేక వివాహ మాడుచున్
    వీడితివోయి నా గృహము వెళ్ళుము నీవిక పేదయింటికిన్
    కోడలు వంచు నొక్కరుఁడు గూఁతురితోడ వచించె నెమ్మదిన్.

    రిప్లయితొలగించండి
  8. పోడిమిమీఱగేహమునపోందుగగౌరిగభాగ్యలక్ష్మివై
    వీడనిబంధమైమగనివెంటనునీడనువోలెనిల్వగా
    తోడుగధర్మబుద్ధినిలుతోయ్యలిదీపపుకాంతివారికిన్
    కోడలివంచునోక్కరుడుకూతురితోడవచించెనెమ్మదిన్

    రిప్లయితొలగించండి
  9. కూడదు మాటిమాటికినిఁ గోపము బూనియొ కుంటిసాకునో
    వీడుట మెట్టినింటిని వివేకము కా దది యాడుబిడ్డకున్
    దోడు లభించినంతఁ బతి తోడిదె జీవిత మత్త యింటికిం
    గోడలి వంచు నొక్కరుడు గూతురు తోడ వచించె నెమ్మదిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆహా... ఎన్నాళ్ళకెన్నాళ్ళకు మీ పూరణ శంకరాభరణంలో!
      ప్రశస్తంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. గురువు గారూ మీ అభిమానానికి ధన్యవాదాలు. నమస్సులు.

      తొలగించండి
  10. 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
    శంకరాభరణం వారి సమస్య : “కోడలివంచు నొక్కరుఁడు గూఁతురితోడ వచించె నెమ్మదిన్”
    అప్పగింతల సమయాన తండ్రి తన కూతురితో నీతి మాటలు

    ఉ. మా .
    కోడలు దీపమింటికట ! కోడలి తోడ కులంబు వృద్ధియౌ
    కోడలు మంచిదైన, కడు కూర్మిని జూపును మెట్టినింటయున్
    కోడలు ప్రేమరూపిణియు కోరిన భర్తకు! తల్లి! నీవికన్
    “కోడలివంచు నొక్కరుఁడు గూఁతురితోడ వచించె నెమ్మదిన్”


    - రాంబాబు కైప
    23-05-2021

    🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    రిప్లయితొలగించండి
  11. సమస్య :-
    “కోడలివని పల్కె నొకఁడు గూఁతురితోడన్”

    *కందం**

    వేడుకగా పెండ్లి జరిగె
    తోడు నిలుచు నీ పెనిమిటి దుఃఖ సుఖమునన్
    చూడగ కావలె నుత్తమ
    కోడలివని పల్కె నొకఁడు గూఁతురితోడన్
    ......................✍️చక్రి

    రిప్లయితొలగించండి
  12. వేడుక సర్వ శాస్త్రములు, వేద వినోద సునాద గీతికల్
    పాడుచు 'శారదాంబ 'ను సభక్తిగ పూజ లొనర్చు నేర్పరిన్
    చూడగ ముచ్చటై తనరు సుందరి నాతడు జూచి లక్ష్మికిన్
    కోడలి వంచు నొక్కరుడు కూతురు తోడ వచించె నెమ్మదిన్.

    రిప్లయితొలగించండి
  13. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నేడిట వైభవమ్ముగను నెమ్మిని గూడిన బంధనమ్మునన్
    వేడుకగా నొనర్చితిని పెండ్లిని సోదరి నందనుండుతో
    మేడలు మిద్దెలన్ గలిగి మీఱెడి నామెకు నేటినుండియున్
    గోడలివంచు నొక్కరుఁడు గూఁతురితోడ వచించె నెమ్మదిన్

    రిప్లయితొలగించండి
  14. వీడక పట్టిన పట్టును
    గాఢపు నభిలాషతోడ గ్రంథము వ్రాయన్
    వేడుక నీవిపుడు రమకు
    కోడలివని బల్కెనొకడు కూతురి తోడన్

    ఆడుచు బాడుచున్ నిచట హాయిగ బెర్గిన చిట్టితల్లిరో
    వేడుక బెండ్లియాడగను వెన్నునిబోలెడు పుణ్యపూరుషున్
    నేడిక జ్ఞప్తినుంచుకొని నేర్పుగ మెల్గుము మెట్టినింటికిన్
    గోడలివంచు నొక్కరుడు గూతురుతోడ వచించె నెమ్మదిన్


    రిప్లయితొలగించండి
  15. వాడలయందునాడునొక బాలికఁ నొక్కడు జూచినంతనే
    వీడని మోహబంధమున వీపున వైచుక నింటికేగ, ము
    య్యీడున నున్న దానిగని యేడ్వకు, వీడికిఁ మేనమామకున్
    కోడలివంచు నొక్కరుఁడు గూఁతురితోడ వచించె నెమ్మదిన్.

    రిప్లయితొలగించండి
  16. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~
    చూడుము సీత! రాముడును సుం
    దర కోమల శ్యామలాంగుడున్
    నేడు వివాహమాడె నిను, నిర్మల
    చిత్తుని తండ్రి శూరుడా
    రేడుకు సద్గుణాత్మునకు రిత్త
    ను బల్కని సచ్చరిత్రుకున్
    గోడలివంచు నొక్కరుడు గూతు
    రుతోడ వచించె నెమ్మదిన్
    ~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  17. వీడకునీధర్మమ్మును
    నీడగ నీపతినిగూడి నిరతముజనుమా
    తోడగుమత్తకు మరువకు
    కోడలివని పల్కె నొకఁడు గూఁతురితోడన్

    రిప్లయితొలగించండి
  18. వీడకు ధర్మమార్గమును పిన్నలపెద్దలనొక్క రీతిగా
    తోడును నీడవై గనుము, దూరము చేయకుమత్త మామలన్
    వేడుకలందు కష్టములు వేమరుగల్గిననాడు వారికిన్
    కోడలివంచు నొక్కరుఁడు గూఁతురితోడ వచించె నెమ్మదిన్

    రిప్లయితొలగించండి
  19. సమస్య :

    కోడలివంచు నొక్కరుడు
    గూతురి తోడ వచించె నెమ్మదిన్

    ( అమెరికాలో నివసిస్తూ కొంతకాలం కొడుకు వద్ద , కొంతకాలం అల్లుడి వద్ద ఉండే మామ గారు కూతురింటికి వెళ్లినప్పుడు ఆమెతో అంటున్నాడు )

    ఉత్పలమాల
    ....................

    " వాడని కూర్మి , గౌరవము
    బంచెడి దచ్చట కోడలమ్మయే !
    నేడిపు డిట్లు చేరితిని
    నెయ్యము జూపెడి యల్లునింటికిన్ ;
    తోడగు పుత్రు నట్లతడు ;
    తొయ్యలి ! నీవిక నన్ను జూచుటన్
    గోడలి ; " వంచు నొక్కరుడు
    గూతురి తోడ వచించె నెమ్మదిన్ .

    రిప్లయితొలగించండి
  20. కూతురిని అత్త వారింటికి పంపుతూ తల్లిదండ్రులు
    "వీడుము కలతల్ మదిలో ;
    కీడును శంకించ వలదు; కీర్తియె కల్గున్;
    చూడుము మెట్టిన యింటను
    కోడలి" వని పల్కెనొకఁడు గూఁతురు తోడన్.

    రిప్లయితొలగించండి
  21. అక్క చెల్లెండ్రను పెండ్లి చేసుకొన్న ఇద్దరు సడ్డకులు దూరపు బావలు గా తెలుసు కొంటారు. వారికి కలిగిన పుత్రిక కూతురై నప్పటికీ సరదా గా కోడలి వరుసగా పిలుస్తారని చెప్పడమే నా ప్రయత్నము :

    ఉ:

    గూడెము నందు పద్ధతిగ గూర్చిరి బెండిలి యాడబిడ్డకున్
    తోడగు టెంచు సడ్డకుడు దూరపు బావయటంచు దెల్వనై
    కాలము కొద్ది గల్గ నొక కన్నియ రత్నము వారి ఇంటనున్
    కోడలివంచు నొక్కరుడు గూతురు తోడ వచించె నెమ్మదిన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  22. ఆడ జననమొందగ నా
    వీడు వదలి యత్తవారి వీటికి బోవన్
    పాడిగ నీవా యింటికి
    కోడలివని పల్కె నొకఁడు గూఁతురితోడన్

    రిప్లయితొలగించండి
  23. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  25. తోడుగ నీభర్త యుండగ
    కీడునుశంకించబోకుకిమ్మనకుండన్
    వేడుముయత్తనుమరువకు
    కోడలివనిపల్కెనొకడుకూతురితోడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. "తోడుగ నీ పతి యుండగ.." అనండి.
      'వేడుము+అత్తను' అన్నపుడు యడాగమం రాదు. "వేడుమ/వేడవె యత్తను.." అనండి.

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  26. [24/05, 00:05] Rambabu kaipa: 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
    శంకరాభరణం వారి సమస్య : "కోడలివని పల్కె నొకడు గూతురితోడన్ "
    4)
    నేడే నీ పెళ్ళమ్మా !
    వాడే నీ భర్త జూడు, వాడే తోడౌ !
    వేడుకతో మెట్టింటను
    కోడలివని పల్కె నొకడు గూతురితోడన్ ||


    5)

    వాడే నీకిక దైవము !
    వాడే నీతోడునీడ, వాడే సఖుడౌ !
    తాడును కట్టిన యింటన్
    కోడలివని పల్కె నొకడు గూతురితోడన్ ||

    - రాంబాబు కైప
    23-05-2021

    🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
    [24/05, 00:16] Rambabu kaipa: 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
    శంకరాభరణం వారి సమస్య : "కోడలివని పల్కె నొకడు గూతురితోడన్ "
    అమ్మాయిని సాగనంపే సమయాన , తండ్రీ కూతుళ్ళ బంధం .. కన్నీళ్లతో వ్రాస్తూ

    ఏడవకమ్మా ! బిడ్డా !
    యేడవకెక్కిళ్లువచ్చు! నేడ్వకు తల్లీ !
    వేడితినమ్మా ! నీవొక
    కోడలివని పల్కె నొకడు గూతురితోడన్ ||

    - రాంబాబు కైప
    23-05-2021

    🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    రిప్లయితొలగించండి
  27. ఆడినది యాట నిచ్చట
    వేడుక మాకున్, శఠమును వీడుము, సరి పో
    రాడకుమని, నీ అత్తింటన్
    కోడలివని, పల్కె నొకఁడు గూఁతురితోడన్

    రిప్లయితొలగించండి
  28. వీడక సేవఁజేయు సుమి పెద్దల కిమ్ముల ప్రేమమూర్తివై,
    కూడి సుఖమ్ము బంచు పతి కోరిన యట్లు చరించు నెమ్మితో,
    వేడుకఁ బుట్టినింట రహి బిడ్డవె కాదట మెట్టినింటిలో
    కోడలివంచు నొక్కరుఁడు గూఁతురితోడ వచించె నెమ్మదిన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  29. ఈనాడు శంకరాభరణం వారిచ్చిన

    సమస్య

    కోడలివని పల్కెనొకడు కూతురు తోడన్.
    (లేదా)
    కోడలివంచు నొక్కరుడు గూతురుతోడ వచించె నెమ్మదిన్

    నాపూరణ

    కందము

    ఏడవకమ్మా నీవిక
    తోడుగనుండును పెనిమిటి తోషమునిచ్చున్
    వీడుము చింతలు నీవిక
    కోడలివని, పల్కెనొకడు కూతురు తోడన్

    ఉత్పలమాల

    వీడని రాగబంధమును, వేడుక మీరగ పాడిపంటలున్
    తోడుగనిల్చు భర్త, కడు దోరవయస్కుడు, నందగాడుయున్,
    ఏడుపుమానుమింక చనువేర్పడు, నీవిక మెట్టినింటికిన్
    కోడలివంచు నొక్కరుడు గూతురుతోడ వచించె నెమ్మదిన్

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "... నందగాడు నీ యేడుపు..." అనండి.

      తొలగించండి
  30. చూడగ నాటకం బిదియు చోద్యముగా నిచటన్ కుమార్తె ఓ
    కోడలి పాత్రధారి నయె గోమున నాటక మందు తాను మా
    ట్లాడుచు "నాన్న"అన్న ది తటాలున తండ్రి యునౌ నతండు నా
    “కోడలివంచు నొక్కరుఁడు గూఁతురితోడ వచించె నెమ్మదిన్”

    నెమ్మదిన్ = గుసగుస గా (భావిస్తే బాగుంటుంది)

    రిప్లయితొలగించండి
  31. వాడిమగండు నీదుపతి ప్రాణమునిచ్చును ప్రేమకోసమై
    తోడువు నీడవై నిలిచి తోషము నింపు కుటుంబ మందునన్
    పోడిగ నత్తమామలకు పోషణఁ జేయుము, గొప్ప యింటికిన్
    కోడలివంచు నొక్కరుడు గూతురితోడ వచించె నెమ్మదిన్
    అసనారె

    రిప్లయితొలగించండి
  32. ఏడవకుము నాసోదరి
    కోడలివని పల్కె నొకడు గూతురి తోడన్
    వేడుకగ బెండ్లి జేసెద
    వీడుమ యాబెంగ నికను బ్రియతమ పుత్రీ!

    రిప్లయితొలగించండి
  33. వేడుక నొందునట్లుగను బెండ్లిని జేయుదు నీకుబావతోన్
    వీడుము శోకమున్ నికను వెళ్ళి బజారున పట్టుబట్టలన్
    వేడుకమీరగా గొనుము బ్రేమగ నౌదువు నాదు చెల్లికిన్
    కోడలి వంచు నొక్కరుడు గూతురి తోడ వచించె నెమ్మదిన్

    రిప్లయితొలగించండి
  34. వాఁడు నిను గాంచు నిత్యము
    పాడిగఁ దన కూఁతురి వలె వలదిఁకఁ దలఁకే
    యోడ కయితి నాసఖునకుఁ
    గోడలి వని పల్కె నొకఁడు గూఁతురితోడన్


    వేడుక మీఱఁ జేసి సుత పెండిలి నిచ్చుచుఁ గట్టనమ్ములన్
    వాడి తఱుంగ నట్టి వగు బంగరు టాభరణమ్ములం దమిన్
    బాడిగ పుట్టి నింటి గరువమ్మును నిల్పుమ గొప్ప యింటికిం
    గోడలి వంచు నొక్కరుఁడు గూఁతురి తోడ వచించె నెమ్మదిన్

    రిప్లయితొలగించండి
  35. కె.వి.యస్. లక్ష్మి:

    ఈడును జోడును కుదిరెను
    వీడక వరుసలు మనువున వియ్యము గూడన్
    చూడగ నాచెల్లి కవుదు
    కోడలివని పల్కె నొకడు గూతురి తోడన్.

    రిప్లయితొలగించండి
  36. తోడుగ రమ్మను నెవరో
    చూడుమనుచు నడుగ నాదు సోదరియేలే
    వీడుము సందియమామెకు
    కోడలివని పల్కె నొకఁడు గూఁతురితోడన్

    రిప్లయితొలగించండి
  37. బేటి ఆవ కోని జేరాంగ ఖా పీ లేణు
    బ్వాడి ఆవ కోని జేరాంగ ఓడ్ ప్యార్ లేణు

    తాత్పర్యం:
    కూతురు పుట్టక మునుపే తిని తాగేయాలి.. ఎందుకంటే నాకు పెట్టకుండా నువ్వే తాగేస్తున్నావ్, లేదా తినేస్తున్నావంటు మారం చేస్తారు కనుక
    కోడలు రాక మునుపే బట్టలు వేసుకోవాలి (వేరే అర్థం కింద తీసుకోకూడదు) ఎందుకంటే ఆమే వచ్చిన తరువాత బట్టలేసుకుంటే.. ఈ వయసులో కొత్త బట్టలు, పూలు అవసరమా అని దెప్పి పొడుస్తారని ద్విపది.

    రిప్లయితొలగించండి
  38. కోడలె ఇంటికి దీపము
    కోడలె వంశమునుపెంచు కూరిమి సతియౌ
    వేడుక తో పతియింటికి
    కోడలివని పల్కెనొకడు కూతురి తోడన్

    రిప్లయితొలగించండి