8, మే 2021, శనివారం

సమస్య - 3717

9-5-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాము రాము రాము రమణి గాంచె”
(లేదా...)
“రాముని రామునిన్ మఱియు రాముని జానకి గాంచె మువ్వురన్”

52 కామెంట్‌లు:

  1. తాను చేత దాల్చు దర్పణమున, తోట
    లో సరోవరమ్ములోన, నెదుట
    కనులపండువైన కమనీయ మూర్తిని
    రాము రాము రాము రమణి గాంచె.
    (లేదా...)
    "రా మహనీయ మూర్తి!" యని ప్రార్థనఁ జేసె ముదాన జానకీ
    రామ, కరంబునందు గల రమ్యపు టద్దమునందు, వెన్క నా
    రామ సరోవరమ్మునఁ, గరమ్మనురక్తిని ముందు నిల్చు నా
    రాముని రామునిన్ మఱియు రాముని జానకి గాంచె మువ్వురన్.

    రిప్లయితొలగించండి
  2. మిత్రులందఱకు నమస్సులు!

    శ్రీమదుమాపతి త్రిణతఁ జేతను నందియు, నెక్కుపెట్టి, యా
    భామను సీతనుం బడయ భార్యగ నెంచియు, వచ్చినట్టి మా
    యా మయుఁడైన యా మయసుతాంచిత హృద్వరసంశ్రితోన్మనో
    రాముని, రా మునిన్ మఱియు రాముని జానకి గాంచె మువ్వురన్!
    [మయసుతాంచిత హృద్వరసంశ్రితోన్మనోరాముని=మండోదరి హృదయస్థితుఁడగు రావణుని; రా మునిన్=రాజర్షి విశ్వామిత్రుని]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిన్న సవరణతో...

      శ్రీమదుమాపతి త్రిణతఁ జేతను నందియు, నెక్కుపెట్టి, యా
      భామను సీతనుం దనదు భార్యగ నందఁగ వచ్చినట్టి మా
      యా మయుఁడైన యా మయసుతాంచిత హృద్వరసంశ్రితోన్మనో
      రాముని, రా మునిన్ మఱియు రాముని జానకి గాంచె మువ్వురన్!

      [ఉమాపత్రి త్రిణత=శివధనుస్సు; మయసుతాంచిత హృద్వరసంశ్రితోన్మనోరాముని=మండోదరి హృదయస్థితుఁడగు రావణుని; రా మునిన్=రాజర్షి విశ్వామిత్రుని]

      తొలగించండి
    2. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  3. పద్మపత్రనేత్రుపావనురామునిన్
    సూర్యవంశమందుశూరురాము
    కలికిమనసుదోచుకాముడురాముని
    రామురామురామురమణిఁజూచె
    విశాలద్రుష్టి, శూరత్వము, అందముగలిగినరాముడు

    రిప్లయితొలగించండి
  4. ఒంటిమిట్టలోనబంటులేకయెతాను
    భధ్రగిరినవెలసెవరదుడగుచు
    మూగపాత్రలోనమునుపాతచిత్రాన
    రాము రాము రాము రమణి గాంచె”

    కొరుప్రోలురాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  5. సమస్య :
    రాముని రామునిన్ మరియు
    రాముని జానకి గాంచె మువ్వురన్

    ( సీతాస్వయంవరం )

    రాముని గాధిపుత్రు డటు
    రాజకుమారుని శిష్యసత్తమున్
    రాముని వెంటబెట్టుకొని
    రా ; శివు వింటిని రెండుజేయగన్ ;
    రాముడు భార్గవుండు కడు
    రంజిలు విష్ణుని వింటినీయగా
    రాముని ; రామునిన్ ; మరియు
    రాముని ; జానకి గాంచె మువ్వురన్ .

    ( రాముని - శ్రీరాముని ; రాముని - రాజర్షి విశ్వామిత్రుడు ; రాముని - పరశురాముని )

    రిప్లయితొలగించండి
  6. తత్త్వ చింతన గల తరుణి యొకర్తుక
    నిద్ర యందు తాను నిరుప మాన
    మైన రూపు డైన మహిమతో ముగ్గురౌ
    రాము రాము రాము రమణి గాంచె

    రిప్లయితొలగించండి
  7. ఆటవెలది
    మురిసి తననె గొనిన హరువింటి ధారిగా,
    నగ్నిఁ దేలు ననుచు నలరు వాని,
    హడలి లోక నింద కడవుల విడనాడు
    రాము రాము రాము రమణి గాంచె!

    ఉత్పలమాల
    సోముని వింటి నెత్తి తన సోయగ మందు మనోహరున్, వమిన్
    భామిని దేలు నమ్మికను పంతముఁ బట్టిన మేటి భర్తనున్,
    భూమిని నిందమోయు గతిఁ బోలఁగ నొప్పని ధర్మమూర్తిగన్
    రాముని రామునిన్ మఱియు రాముని జానకి గాంచె మువ్వురన్

    రిప్లయితొలగించండి

  8. వనమునవిహరించు పాళమందుననొక
    సరము చెంతన గల తరుణమందు
    నంధమందు గాంచె నందమైన మనోభి
    రాము రాము, రాము రమణి గాంచె.


    భామను గూడి రాఘవుడు ప్రాంతరమందు వసించు వేళలో
    కోమలి యద్దమందు గని కుంతలముల్ సవరించు చుండగా
    తామరకోసమై కొలను దాపున చేరిన భర్త బింబమౌ
    రాముని రామునిన్ మఱియు రాముని జానకి గాంచె మువ్వురన్.

    రిప్లయితొలగించండి
  9. ధాముడుసత్యసంధతకుధర్మగుణంబులరాముడాతడే
    వేమరుణజూచినన్కనులవిందుగతోచినరూపురాముడే
    యామినిపూర్ణచంద్రుడునుయాగములందునరాముడంచనన్
    రామునిరామునిన్మఱియురామునిజానకిగాంచెమువ్వురన్

    రిప్లయితొలగించండి
  10. చిరునగవులొలుకుచు చిద్విలాసమ్ముగ
    కంటి పాపలందు, కనులముందు
    ముచ్చటైనమూడు మూర్తుల గనులార
    రాము రాము రాము రమణి గాంచె

    రిప్లయితొలగించండి
  11. నీమము నెంచి ధర్మమును నిశ్చలచిత్తము నాచరించెడిన్
    ప్రేమను జానకీపతిగ బిల్వగ మోదమునందు భర్తగన్
    తామస యాసురీగణము ధ్వంసముజేయు సుధన్వి
    కీర్తితా
    రాముని రామునిన్ మఱియు రాముని జానకిగాంచె
    మువ్వురన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధర్మ రక్షయందు తత్పరుడైనట్టి
      ప్రేమమూర్తి యైన ఱేడుగాను
      రాక్షసాళి ద్రుంచు లావైన యోధగ
      రాము రాము రాము రమణిగాంచె

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదములాచార్యా! నమోనమః!🙏🙏🙏

      తొలగించండి
    4. సవరణతో

      నీమము నెంచి ధర్మమును నిశ్చలచిత్తము నాచరించెడిన్
      ప్రేమను జానకీపతిగ బిల్వగ మోదమునందు భర్తగన్
      తామస దైత్యసంఘమును ధ్వంసముజేయు సుధన్వి
      కీర్తితా
      రాముని రామునిన్ మఱియు రాముని జానకిగాంచె
      మువ్వురన్

      తొలగించండి
  12. పూజసలుప పడతి బొమ్మల గొనిదెచ్చి
    పార్థివి , బలరామ భార్గవులను
    పదిలపరచ పెంకె బాలుడిట్లుపలికె
    “రాము రాము రాము రమణి గాంచె”

    రిప్లయితొలగించండి
  13. ప్రేమ తో రాముడు జానకిని కౌగిలించు కొంటాడు. అప్పుడు చూపు మార్చకుండా రాముడిని చూస్తుంది. అలా చూసినపుడు రాముని రూపము సీత కన్నుల్లో పడి తిరిగి రాముని కళ్ళలో ప్రతిబింబిస్తుంది. అమాదిరి రాముని 3 రూపాలు చూస్తుంది అనే భావన గా నా ప్రయత్నము:

    ఉ:

    ప్రేమము మీర రాఘవుడు ప్రీతిని పొందగ నక్కు జేర్చగన్
    రామము వోలె రెప్పలను రాల్చక రాముని చూచు చుండగన్
    రాముని రూపమున్ దిరిగి రాముని కన్నుల లోన గాంచనై
    రాముని రామునిన్ మఱియుఁ రాముని జానకి గాంచె మువ్వురన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  14. కె.వి.యస్. లక్ష్మి:

    తండ్రి మాట తాను తలదాల్చు రాముని
    రాక్షసాంతకుండు రామవిభుని
    శివుని చాప మెత్తు శ్రీరామచంద్రుని
    రాము రాము రాము రమణి గాంచె.

    రిప్లయితొలగించండి

  15. ప్రేమగ డెందమందు రఘు వీరుని నిల్పుచు కొల్చు వేళలో
    తామర కోసమై కొలను దాపుఁ జరించెడు భర్త రూపమున్
    గోమలమందు బింబమును కుంతలముల్ సవరించు కొంచు తా
    రాముని రామునిన్ మరియు రాముని జానకి గాంచె మువ్వురన్


    సామిరి పల్కు నామమున చక్కటి రూపము గోచరింపగా
    భామకు వాయుపుత్రుడట వక్షము చీలిచి చూపె నాథునిన్
    ప్రేమను జూపుచున్ సతము వెంట చరించుచు నుండనత్తరిన్
    రాముని రామునిన్ మరియు రాముని జానకి గాంచె మువ్వురన్.

    రిప్లయితొలగించండి
  16. ముల్లు వలన సీత ముంగాలి గాయంబు
    మిగుల నొప్పి జేసి మించి పోవ
    మందు మొక్క తెచ్చి మంచిగ రాయిపై
    రాము, రాము, రాము రమణి గాంచె

    రాముట= నూరుట

    రిప్లయితొలగించండి
  17. సోమముఁ జూపి రాక్షసుల స్రుక్కగ జేసి యయోధ్య చేర శ్రీ
    రాముడు, గాడ్పుపట్టియు స్థిరమ్ముగ దాపున భక్తియుక్తుడై
    రాము స్మరించుచుండగను ప్రాకటమౌ హృది వాని కన్నులన్
    రాముని రామునిన్ మఱియు రాముని జానకి గాంచె మువ్వురన్

    రిప్లయితొలగించండి
  18. క్షేమముగూర్చివేగమునక్షీరముబంచినక్షత్రియున్భళీ!
    ప్రేమముమోసులెత్తసుమవేదికజేఱిననీలదేహునిన్
    సోమునివిల్లుద్రుంచగనుసుందరవిగ్రహధర్మమూర్తియౌ
    రాముని రామునిన్ మఱియు రాముని జానకి గాంచె మువ్వురన్

    కొరుప్రోలురాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  19. ఏల కరొనవేళ ఎట్లు ముమ్మాటికి
    రాము రాము రాము, రమణిగాంచె
    ముందె రమణుసమేతమై, ముందు ముందు
    వచ్చిచూతుము, భద్రాద్రి వైభవమ్ము!

    రిప్లయితొలగించండి
  20. రాముని వంశమున్ గన ధరాపతులెల్లరు రామచంద్రులే
    ధీమతి సీత యీవిధి మదిన్ దన సోదరి సంఘమెల్లకున్
    రాముని తమ్ములం దలచి లావున రూపున నంచు నమ్ముచున్
    రాముని రామునిన్ మఱియు రాముని జానకి గాంచె మువ్వురన్.

    -యజ్ఞభగవాన్ గంగాపురం

    రిప్లయితొలగించండి
  21. అద్దమందు నెదుట పెద్దమడుగులోన
    రామురామురాము రమణిగాంచె
    భర్త యందు సీత వలపుగొన్నకతన
    చోటుచోటులందు చూచె విభుని

    రిప్లయితొలగించండి
  22. కొట్టి పిల్వ నేల వట్టిగ వత్తురు
    మాన మున్న వారు మఱచి మమ్ము
    మింగు నట్టి విధము, మే మఱవఁగ నిట్లు
    రాము రాము రాము, రమణి గాంచె

    [రాము: రా మని చెప్పుట]


    భీముని గొప్ప వింటి నట వే విఱువన్ విని భార్గవాన్వయుం
    డా ముని పుంగవుం డలిగి నా రఘు రామునిఁ గాంచ వచ్చినన్
    భీమపు రాము నారసి సభీతి వసిష్ఠుని మామ పిల్వఁగా
    రా ముని రామునిన్ మఱియు రాముని జానకి గాంచె మువ్వురన్

    [రా (న్) ముని = వసిష్ఠ ముని రాఁగ; వసిష్ఠ మునిని, పరశురాముని, భర్త రాముని మువ్వురను జానకి చూచెను.]

    రిప్లయితొలగించండి
  23. ఆ ముని దోడుగానరిగి యాగము గాచిన రామునొక్కనిన్
    రాముని నీడయై నడుచు లక్ష్మణునా సుగుణాభిరామునిన్
    వాముని విల్లు ద్రుంచ జలపట్టిన భార్గవ రామునొక్కనిన్
    రాముని రామునిన్ మఱియు రాముని జానకి గాంచె మువ్వురన్

    రిప్లయితొలగించండి
  24. రాముని జూచెదాకలను రమ్యశరీరుని,నద్దమందునన్
    భామలు మోహమందగను బాఱెడు నీటను దీర్ఘబాహుతో
    రామల మానసంబులను బ్రాకటమౌనటుచేయువాడునౌ
    రాముని రామునిన్ మఱియు రాముని జానకిగాంచెమువ్వురన్

    రిప్లయితొలగించండి
  25. రామనామమిలనురమణీయమనుచును
    మదిని తలచిసీతమానుగాను
    పగలురేయియనకపరవశమ్మునతాను
    రామురామురాము రమణిగాంచె


    సోమునికాంతి తోడనట సుందర రూపము నొప్పు రామునిన్
    కాముని మించు సోయగము కన్నులు యందగుపించు రాముని
    న్నాముని వెంటసాగినసురాధము లన్పరిమార్చినట్టియా
    రాముని,రామునిన్,మరియు రాముని జానకి గాంచెమువ్వురిన్.

    రిప్లయితొలగించండి