6, మే 2021, గురువారం

సమస్య - 3715

7-5-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విధునిఁ గని భాస్కరుఁడు వెలవెలనవోయె”
(లేదా...)
“వెలవెలబోయె భాస్కరుఁడు వెన్నెల రాజునుఁ గాంచినంతటన్”

83 కామెంట్‌లు:

  1. మిత్రులందఱకు నమస్సులు!

    మలమల మండు టెండలకు మానవు లందఱు డస్సిపోవుచున్
    విలవిలలాడి, తాపమున వీక్షణ సేయుచుఁ దిట్టుచుండియున్,
    గలువల నెచ్చెలిన్ స్తుతుల గౌరవముం దగ నీయ, బాధతో,
    వెలవెలబోయె భాస్కరుఁడు వెన్నెల రాజునుఁ గాంచినంతటన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిన్న సవరణతో...

      మలమల మండు నెండలకు మానవు లందఱు డస్సిపోవుచున్,
      విలవిలలాడి, తాపమున వీక్షణ సేయుచుఁ దిట్టుచుండియున్,
      గలువల ఱేనికిన్ స్తుతుల గౌరవముం దగ నీయ, బాధతో,
      వెలవెలబోయె భాస్కరుఁడు, వెన్నెల రాజునుఁ గాంచినంతటన్!

      తొలగించండి
    2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  2. ఆకశమ్ము స్వయంవరమన్చు పిలిచె

    చల్లగన్వెన్నల కురియు చంద్రునిగని

    తార హారము వేసెను తామసమున

    విధునిఁ గని భాస్కరుఁడు వెలవెలనవోయె”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ఆకసమ్ము..చల్లగన్వెన్నెల.." అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములండీ🙏🏻
      సవరణలు స్వీకరించడమైనది

      తొలగించండి
  3. కౌముదులు వెద జల్లుచు గగన మందు
    వెలుగు నుడురాజు నందరు వేడ్క తోడ
    గాంచి హాయిని పొందు ట కష్ట పెట్ట
    విధుని గని భాస్కరుడు వెల వెలన బోయె

    రిప్లయితొలగించండి
  4. తేటగీతి
    ప్రధమముగ నాదు వెలుగుల వడిసి నీవు
    పిదప వెన్నెల ఱేనిగ పదవి నుంచి
    సోక గురుపత్ని నఘమునన్ సోకె ననుచు
    విధునిఁ గని భాస్కరుఁడు వెలవెలనవోయె

    చంపకమాల
    వెలుగుల వంచి నాడ వినువీధిని తారలు ఱేనిఁజేయుచున్
    వలపులు వంచ నీకు గురుపత్నియె జిక్కెన మోహమందునన్
    విలువలు వీడితే నఘము వెన్కొను నన్నని పాపభీతితో
    వెలవెలబోయె భాస్కరుఁడు వెన్నెల రాజునుఁ గాంచినంతటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      "వీడితే యఘము..." అనండి.

      తొలగించండి
    2. 🙏ధన్యోస్మి గురుదేవా🙏
      సవరించిన పూరణ:
      చంపకమాల
      వెలుగుల వంచి నాడ వినువీధిని తారలు ఱేనిఁజేయుచున్
      వలపులు వంచ నీకు గురుపత్నియె జిక్కెన మోహమందునన్
      విలువలు వీడితే యఘము వెన్కొను నన్నని పాపభీతితో
      వెలవెలబోయె భాస్కరుఁడు వెన్నెల రాజునుఁ గాంచినంతటన్

      తొలగించండి
  5. విధముమార్చెనుకోవిడువింతగాను
    జనులజీవికలందునజంకునుండె
    సవితకిరణమ్ముపసలేకసన్నబడియె
    విధునిగనిభాస్కరుండువెలవెలవోయె

    రిప్లయితొలగించండి
  6. అలసియు సేదదీరుటకు నంబుధి గ్రుంకగ భాస్కరుండు వె
    న్నెలలను జిమ్ముచున్ శశియె నేల సుధల్ గురిపించి యేలుచో
    కులుకుచు ప్రేయసీప్రియులు గ్లో నట కీర్తుల ముంచువేళలన్
    *వెలవెలబోయె భాస్కరుఁడు వెన్నెల రాజునుఁ గాంచినంతటన్*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  7. వలపుల పూలు జల్లి తెలి
    వన్నెల వెన్నెల జల్లి రేయిలో
    పులకిత మానసంబు విర
    బూసిన హాయిని కౌగిలించుచున్
    విలసిత భావరాగ మృదు
    వీచిని నాడెడి లోకమున్గనన్
    వెలవెలబోయె భాస్కరుఁడు
    వెన్నెల రాజునుఁ గాంచినంతటన్!

    రిప్లయితొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మూడు కన్నుల తోడను పొంపెసగుచు
    వాడియైన ప్రభలతోడ వఱలు చుండి
    కాలకాలుడై సర్వ లోకముల నేలు
    విధుని గని భాస్కరుడు వెలవెలనవోయె.

    రిప్లయితొలగించండి
  9. విలవిలలాడిరేజనులువీయగగాలులసూర్యురాకతో
    కలువలఱేనిరాకమదికాంతులునింపుచుహాయిగోల్పగా
    చలిమలయల్లుడండగనుసశీతలమాయెగచంద్రుడంచునున్
    వెలవెలబోయెభాస్కరుడువెన్నెలరాజునుగాంచినంతటన్

    రిప్లయితొలగించండి
  10. సలలిత కాటి వెల్గులను చక్కగ కాపురమున్న వానిపై

    గలగల మోత చేయుచును గంగయె నాట్యము సేయు చోటునన్

    మిలమిల కాంతులీను శివు మేటి శిరమ్ముకు మొక్కు వేళలన్

    వెలవెలబోయె భాస్కరుఁడు వెన్నెల రాజునుఁ గాంచినంతటన్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సలలిత కాటి' దుష్టసమాసం. "సలలిత రుద్ర/ప్రేత భూములను చక్కగ..." అందామా?

      తొలగించండి

  11. శరదృతువు పున్నమి శమని శశిని గూర్చి
    కవివరేణ్యుడొకడు తన కావ్యమందు
    నద్భుతముగ వర్ణింపగ నందు నగల
    విధునిఁ గధిభాస్కరుడు వెలవెలన వోయె


    వెలుగుల యిక్కగా జనులు పిల్చిన నేమిర తానొసంగు సో
    మలమది గాంచి మీరినంతనె ప్రమాదమటంచు దలంచు లోకులే
    చలువల బచ్చగాంచినను సంతస మందెదరంచు తెల్యగా
    వెలవెల బోయె భాస్కరుఁడు వెన్నల రాజును గాంచినంతటన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      వృత్తంలో రెండవ పాదంలో గణభంగం. "మీరగ ప్రమాదమటంచు... మందెదరం చెఱుంగగా..." అనండి.

      తొలగించండి
  12. చం:

    విలవిల లాడు బ్రాణములు వేడికి నోర్వక నెండకాలమై
    గడ గడ లాడ జేయు వడ గాడ్పుకు సూర్యుడు వాసరమ్ముగన్
    కలవర మేల నీ గతిని గాంచము, తత్త్వము, రాత్రివేళలో
    వెలవెల బోయె భాస్కరుడు వెన్నెల రాజును గాంచి నంతటన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      ***
      'ల-డ'లకు ప్రాస చెల్లడం అభేదప్రాసము. లాక్షణికులు చెప్పిందే...
      జలనిధి యను తెరమరుగటు
      వెడలి నిలిచినట్టి యాటవెలఁదియ పోలెన్ (ప్రభావతీ ప్రద్యుమ్నము 1-57)

      తొలగించండి
  13. క్రొవ్విడి వెంకట రాజారావు:

    చలిమిరి గూడు వెన్నెలను చక్కగనిచ్చి మనస్సు నందునన్
    వలపులు రేపు రూపునిడి బాళిని గూర్చెడి వేళ నందరున్
    పొలుపగు తీరు చందురుని ముచ్చటగా కొనియాడు నంతటన్
    వెలవెలబోయె భాస్కరుఁడు వెన్నెల రాజునుఁ గాంచినంతటన్.

    రిప్లయితొలగించండి
  14. పగలు గడచెను భానుడు పశ్చిమాద్రిఁ
    గుంకు చుండఁగ నేతెంచి కోలుమసఁగి
    చలువ వెన్నెలల్కురిపింప కలువఱేడు
    విధునిఁ గని భాస్కరుఁడు వెలవెలనవోయె

    రిప్లయితొలగించండి
  15. చంపకమాల:
    +++++++++++++++
    మలమలమాడ్చువేడిమిట,మానవజాతినిబాధబెట్టగా !
    పలుకులు విశ్వసింపకను,పాపలు,పెద్దల స్వేఛ్చజూడగా
    కులుకులమాయమాయెనట కుందనబొమ్మయె రాగనత్తరిన్
    వెలవెలబోయె భాస్కరుడు వెన్నెలరాజును గాంచినంతటన్.

    రిప్లయితొలగించండి
  16. జిలిబిలి వెలుగులు వెలుగు జింక తాలు
    పరిని పరి పరి పొగడగ ప్రౌఢ కవులు
    మరి తనకది లేదని దినమణియె కృంగె,
    విధుని గని భాస్కరుడు వెలవెలన బోయె

    రిప్లయితొలగించండి
  17. సమస్య :

    విలవిలలాడె భాస్కరుడు
    వెన్నెలరాజును గాంచినంతటన్

    ( ఎన్నికలలో డిపాజిట్ కూడా రాని భాస్కర్ తనను ఓడించిన వెన్నెలరాజు కనపడగానే వెలవెలబోయి బాధతో
    విలవిలలాడాడు )

    చంపకమాల
    ...................

    " కలలవి నేను గాంచితిని
    కమ్మగ రాతిరులందు ; భ్రాంతులై
    యలలవి తగ్గిపోయినవి ;
    యల్లరిపాలయిపోయినాడనే !
    కిలకిలనవ్వుచున్ జనుల
    కేకల మధ్యన వచ్చె " నంచదే
    విలవిలలాడె భాస్కరుడు ;
    వెన్నెలరాజును గాంచినంతటన్ .

    రిప్లయితొలగించండి
  18. చలిమల రేనికల్లుడగు శంకరుమోమున జంటకన్నులై
    వెలుగగ సోమసూర్యులట వెన్నెల వేడుల జాలువార్చుచున్
    కులుకుచు శీర్షమెక్కగను క్రొన్నెలవంకగ రేఖమాత్రమున్
    వెలవెలబోయె భాస్కరుడు వెన్నెలరాజును గాంచినంతనే

    రిప్లయితొలగించండి
  19. తలబడ తమ్మిమొగ్గరపు ద్వారము జీల్చి శశాంక శోభతో
    వెలిగెడు బాలకుండు జని వీరుల నెల్లర గూల్చుచుండగా
    పలుమరు నోడె భాస్కరుని పాటి వెలింగెడి శూరకర్ణుడే
    వెలవెలబోయె భాస్కరుఁడు వెన్నెల రాజునుఁ గాంచినంతటన్

    రిప్లయితొలగించండి
  20. చంపకమాల:
    ---------------
    సలసలక్రాగుయెండలకు,సఱ్ఱునవ్రేలెడు దేహమాయనన్
    మిలమిలవెల్గునింగియును మీదకు వ్రాలెన భూమిపైకనన్
    పలుకులుమూగవోయెగద,పాటునుదప్పిన రోగబాధతో
    వెలవెలబోయె భాస్కరుడు,వెన్నెలరాజునుగాంచినంతటన్

    రిప్లయితొలగించండి
  21. చంపకమాల:
    -----------
    నలగని వస్త్రముల్ దొడిగి,నాయకుడంతయునవ్వురాల్చగా
    విలువలుగల్గువాడనుచు,వేడగవానికివోట్లుదంచగా
    వలవలయేడ్చిరాపయిన,వాక్కులుమర్చిననేతతీరుతో

    వెలవెలబోయె భాస్కరుడు,వెన్నెలరాజునుగాంచినంతటన్

    రిప్లయితొలగించండి
  22. శివముగ సకల జీవుల జీవనముకు
    తగిన శక్తి నొసగునది తానయినను
    చోద్యముగ జనుల పిరము జూరగొనిన
    విధునిఁ గని భాస్కరుఁడు వెలవెలనవోయె

    రిప్లయితొలగించండి
  23. చంపకమాల:
    -----------
    వలపులుగుమ్మరించుచును,వాక్సుధలన్నిటి ధార వోయుచున్
    తొలగనినవ్వుతోజెణకి,దోహదమిచ్చెడువానిచెంతలో
    పిలుపులవీణలోనొదిగి ,పీయుషధారలు బంచబోననన్
    వెలవెలబోయె భాస్కరుడు,వెన్నెలరాజునుగాంచినంతటన్

    రిప్లయితొలగించండి
  24. పలువురుక్రీడకారులనుబట్టిరిగట్టిరి స్పర్ధనందునన్
    దొలుతనునేడునాటలకుదుర్భరమొక్కటిగెల్పునొందగన్
    కలకలమొచ్చెగాలమునగయ్యమునందగవీరువారునున్
    వెలవెలబోయె భాస్కరుఁడు వెన్నెల రాజునుఁ గాంచినంతటన్

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వచ్చె'ను 'ఒచ్చె' అనరాదు కదా.. "కలవరమాయె" అందామా?

      తొలగించండి
    2. పలువురునాటగాళ్ళనటబట్టిరిగట్టిరి స్పర్ధనందునన్
      దొలుతనునేడునాటలకుదుర్భరమొక్కటిగెల్పునొందగన్
      కలవరమాయెగాలమునగయ్యమునందగవీరువారునున్
      వెలవెలబోయె భాస్కరుఁడు వెన్నెల రాజునుఁ గాంచినంతటన్

      కొరుప్రోలు రాధాకృష్ణ రావు
      క్రీడకారులను సరియైనదా?

      తొలగించండి
  25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  26. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  27. వెలుగుల ధారవోయ నవి వెన్నెల రూపు వహించె, తచ్ఛవిన్
    కలువల తొంగలించ శశి కారణుడై పొలుపొంది కీర్తులన్
    చలువల గ్రుమ్మరించె గద చాలిక యిట్టి ప్రతాపమంచు తా
    వెలవెలబోయె భాస్కరుఁడు వెన్నెల రాజునుఁ గాంచినంతటన్

    కంజర్ల రామాచార్య

    రిప్లయితొలగించండి
  28. వెలుగుల యిక్కగా జనులు పిల్చిన నేమిర తానొసంగు సో
    మలమది గాంచి మీరగ ప్రమాదమటంచు దలంచు లోకులే
    చలువల బచ్చగాంచినను సంతస మందెదరంచెఱుంగగా
    వెలవెల బోయె భాస్కరుఁడు వెన్నల రాజును గాంచినంతటన్.

    రిప్లయితొలగించండి
  29. ***********************************************************************
    శంకరాభరణం వారి సమస్యా పూరణం :

    అంశం : విధునిఁ గని భాస్కరుఁడు వెలవెలనవోయె
    పూరణ : రాంబాబు కైప, హైదరాబాదు

    విధుడు అన్న పదమునకు నాలుగు అర్థములు - బ్రహ్మ, విష్ణువు, శివుడు , చంద్రుడు.
    ఆ నలుగురిని ఒకే పద్యములో , విధుడు అన్న పదము ఉపయోగించి పూరణ చేయ ప్రయత్నించాను.

    1)
    తే. గీ .

    విధుని వేల్పుల స్పర్థలో వెలుగుఱేండ్లు
    విధుని కనుదోయి విధులను విడిచి వెడలి`| ,
    విధుని సిగపైన వెలసియు వెలుగుచున్న,
    విధునిఁ గని భాస్కరుఁడు వెలవెలనవోయె ||

    భావం (బ్రహ్మ పెట్టిన పోటీలో వెలుగు రాజులైన సూర్యచంద్రులు , విష్ణువు యొక్క రెండు కనులుగా తాము చేసే విధులు విడిచి వెళ్లారట
    ఆ స్పర్ధలో శివుని సిగపైన వెలసి వెలిగే చంద్రుని కని భాస్కరుడు వెలవెలన పోయాడని నా భావన )



    2)
    సమస్య : “వెలవెలబోయె భాస్కరుఁడు వెన్నెల రాజునుఁ గాంచినంతటన్

    చంపక మాల

    కలువలు రిక్కరాయుని ప్రకాశములో విరిసెన్; సరోజముల్
    వలవల యేడ్చెనాకసముపై వలరాజును కానరాక; ది |
    వ్వెలవలె తారలెల్ల తమ వేల్పు శశాంకుని గూడి వెల్గగా
    “వెలవెలబోయె భాస్కరుఁడు వెన్నెల రాజునుఁ గాంచినంతటన్ ||

    - రాంబాబు కైప
    06-05-2021
    ***********************************************************************

    రిప్లయితొలగించండి
  30. అధిక విషపూరిత కరోన యవనినెగుల
    చల్లదనపు వెన్నెల నిశయు చాటు నింద
    వేసవినిగూడ తనవేటు వేయుచుండ
    "విధునిఁగని భాస్కరుఁడు వెలవెలవోయె!"

    రిప్లయితొలగించండి
  31. మధు వసంతపు వెన్నెల మార్గగామి
    "విధునిఁగని భాస్కరుఁడు వెలవెల వోయె"
    వేడి భరియించెడు కరోన వేవు నణచ
    నాల్గు దిశల కిరణజాల వెల్గులంపె!

    రిప్లయితొలగించండి
  32. సంతసించిరి జనములు సంతుతోడ
    చాల దినముల తదుపరితెల్లనైన
    విధునిగని,భాస్కరుడువెల వెలనవోయె
    రాహు వుచెఱకు జిక్కగ రహిని జెడగ

    రిప్లయితొలగించండి
  33. అలసియు పశ్చిమాద్రి పయి నర్కుడుగుంకుచు నుండ మెల్లగా
    కలువలరేడు కౌముదులు గ్రన్నన నాకసమందు నింపి యిం
    పలరగ విశ్వమంతయును పర్వముగా కనువిందు జేయగన్
    వెలవెలబోయె భాస్కరుఁడు వెన్నెల రాజునుఁ గాంచినంతటన్

    రిప్లయితొలగించండి
  34. మలమల మాడి మానవులు మం
    డెడు మిక్కలి యెండ వేడిచే
    విలవిల యేడ్చుచుండిరి కని వెళ్ళి
    యు కృంకెను పశ్చి మాంబుధిన్
    వెల వెల బోయి భాస్కరుడు,
    వెన్నెల రాజును గాంచినంతనే
    కలకల నవ్వినారు ప్రజ కాంచి
    యు శీతల చంద్ర కాంతులన్ .

    రిప్లయితొలగించండి
  35. తెలతెలవారుచుండగనె దీప్తులు వోవుచు రాహుపట్టగన్
    వెలవెలబోయె భాస్కరుడు,వెన్నెలరాజునుగాంచినంతటన్
    కళకళలాడె నాముఖము గాంతులు జిమ్ముచు నొక్కసారిగన్
    గలువల రాజుపొంకములు గాంచెడు వారలుమోదమందురే

    రిప్లయితొలగించండి
  36. పులుగులు ఖాదనమ్ముగొని పోడిగ గూడుల చేరె చెచ్చెరన్
    హలికులు కార్యముల్ ముగియ హర్షముతోడ గృహమ్ము చేరె నె
    ద్దులగొని, చీకటుల్ కవియ తొంగొన నెంచుచు పశ్చమాద్రిపై
    వెలవెలబోయె భాస్కరుఁడు వెన్నెల రాజునుఁ గాంచినంతటన్

    రిప్లయితొలగించండి
  37. రిప్లయిలు
    1. మూడు లోకములఁ జరించు పుణ్యనదిఁ గ
      నఁ దొలఁగును పాపములు కరుణా లసన్మ
      నస్కు హరు నౌదల సహస్ర భాస్కర చ్ఛ
      వి ధునిఁ గని భాస్కరుఁడు వెలవెలనవోయె

      [ధుని = నది]


      అల తన చేతి దెబ్బలకు నప్పుడు మృత్యువు దైన వాకిలిన్
      నిలువఁగ నన్నచే బ్రతికె నివ్వెఱ వోయె మృగేంద్ర తుల్యుఁ డా
      వలలుఁడు సైంధ వాధముఁడు భండనమందుఁ జెలంగ నవ్విధిన్
      వెలవెలఁబోయె భాస్కరుఁడు వెన్నెల రాజునుఁ గాంచి నంతటన్

      తొలగించండి
  38. చలిమల దాపు జేరెనిక సంజెయు మించెడి వేళ జూడగా
    వెలవెలబోయె భాస్కరుఁడు వెన్నెల రాజునుఁ గాంచినంతటన్
    కలువలు దొంతరల్ విరిసె కన్నుల పండువగా తటాకమున్
    మిలమిల జుక్కలున్ మెరిసె మింటను గాంచ మనోజ్ఞ యామినిన్

    రిప్లయితొలగించండి
  39. మండుటెండల నొసగుచు మాడ్చె రవియు
    తనువు నొందును హెచ్చెను తాపమదియ
    టంచుచల్లని వెన్నెలపంచుచున్న
    విధునిఁ గని భాస్కరుఁడు వెలవెలనవోయె.

    రిప్లయితొలగించండి