28, మే 2021, శుక్రవారం

సమస్య - 3735

29-5-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హితముఁ గను గ్రహణమున భుజించువాఁడు”
(లేదా...)
“కడు హిత మబ్బులే గ్రహణకాలమునన్ భుజియించువానికిన్”

62 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. ఏడు గంటల ముందుగ నెల్లరును భు

    జించి పది లోపుగా నిదురించు జనులు

    హితము‌ గను, గ్రహణమున‌ భుజించువాడు

    నిరత మస్వస్తతను పొంది నీరసించు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వాట్సప్ సమూహంలో నా సవరణలు చూడండి.

      తొలగించండి
  3. ఆర్యుల వచన ముల నెల్ల నాచరింప
    నెట్టి విపత్తు లు కలుగ కెల్ల రిలను
    సౌఖ్య మందుట జరుగుట సత్య మగు న
    హితము గను గ్రహణము న భు జించు వాడు

    రిప్లయితొలగించండి

  4. ఆలయమ్మున నర్చకుడైన యతడు
    నాల్గు వేదాలనెఱగిన నౌమ మిట్లు
    భక్తులడగగ వారితో పలికె నిట్ల
    హితముఁ గను గ్రహణమున భుజించువాడు.

    రిప్లయితొలగించండి
  5. అరయనారోగ్యనియమంబునాదరించి
    జీవజాతులుతమదైనజీవనంబు
    సాగస్రుష్టినిభాగమైశక్తితోన
    హితముగనుగ్రహణమునభుజించువాడు

    రిప్లయితొలగించండి
  6. పేద సాదల మండించు పెద్ద రవియె

    కడుపు మండిన వారి శోకమ్ము మాన్ప

    హితముఁ గను గ్రహణమున భుజించువాఁడు

    రాహువతడు కొంత దనువు రవిని ప్రీతి

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  7. కడుగగ పాపరాశినిల కాముని జంపినవాని ధ్యానమున్
    కడుహిత మబ్బులే;గ్రహణకాలమునన్ భుజియించు వానికిన్
    నిడుపగు నాయువేదరుగు నిష్ఠుర సత్యము శూలబాధచే
    మడుగున స్నానమాడి పరమాత్ముని పూజను జేయు
    టొప్పగున్

    రిప్లయితొలగించండి
  8. రిప్లయిలు
    1. తేటగీతి
      సతి బనుపునఁ గుచేలుడుఁ జక్రిఁ జేరి
      యాదరింపగఁ దెచ్చిన నటుకుల నిడి
      యింట నైశ్వర్యమొదవ గ్రహించె! దైవ
      హితముఁ గను గ్రహణమున భుజించువాఁడు!

      (గ్రహణము = గ్రహించుట)

      చంపకమాల
      తొడరిన లేమికిన్ మివుల దుఃఖము నంది కుచేలునంపఁగన్
      బడతియె, రుక్మిణీపతి యపార కృపామయుఁ డాదరించి తా
      నిడఁగ నమేయ సంపదల నింట గ్రహించెను! లేక చిక్కినన్
      గడు హిత మబ్బులే గ్రహణకాలమునన్ భుజియించువానికిన్!

      (గ్రహణకాలము = గ్రహించినవేళ)

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  9. విడువుము మూఢనమ్మకము విజ్ఞత తో చరియింప గా వలెన్
    మడియడు లైనవారలు ప్రమాణము లేకవచింతురిట్లు వ
    ల్లడియని నమ్మబోకుమని రాష్ట్రము జేరిన నాస్తికుండనెన్
    గడు హితమబ్బులే గ్రహణ కాలము నన్ భుజించు వానికిన్.

    రిప్లయితొలగించండి
  10. సమస్య :
    కడు హిత మబ్బులే గ్రహణ
    కాలమునన్ భుజియించువానికిన్

    ( ఒక ఆస్తికవాదితో ఒక నాస్తికవాది )
    చంపకమాల
    ..................

    ఎడపక నిట్లు కూరుచొని
    యేలొకొ యన్నము మానివైచుటల్ ?
    దడయక హాయిగా దినుడు ;
    తత్తరపాటుల బొందనేటికిన్ ?
    వడివడి బైకి రండిక ; య
    వాంఛితవిశ్వసనీయతల్ విడన్
    గడు హిత మబ్బులే ! గ్రహణ
    కాలమునన్ భుజియించువానికిన్ .

    ( ఎడపక - సందేహించక ; తడయక - ఆలసింపక )

    రిప్లయితొలగించండి
  11. నుడివిన రీతి వైద్యులు వినోద
    ముతో సరియైన వేళకున్
    గుడచిన నన్నమున్ దరికి గూ
    డను జేరవు రోగ బాధలున్
    గడు హితమబ్బలే , గ్రహణ కాల
    మునన్ భుజియించువానికిన్
    విడువక వచ్చు రోగ మని వి
    జ్ఞలు సెప్పదు రెల్ల వేళలన్

    రిప్లయితొలగించండి
  12. చం:

    తెలిపిరి వాయు మండలము తీరును, మార్పులు సాగరమ్ముగన్
    వలసిన శాస్త్ర పద్ధతులు బారుగ దెల్పిరి పూర్వమందుగన్
    పలికిరి హేతువాదులిది భావ్యము గాదు పరీక్ష జేయనై
    కడు హిత మబ్బులే గ్రహణ కాలమునన్ భుజియించు వానికిన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  13. సమస్య :- “హితముఁ గను గ్రహణమున భుజించువాఁడు”

    *కందం**

    మహనీయుండను వాడును
    గృహస్థు విధి నాచరించు కృప గల వాడున్
    సహచరి చేయు హితముఁ గను
    గ్రహణమున భుజించు వాఁడు గడుసరి వాడున్
    .....‌................✍️ చక్రి

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. “హితము గను” అంటే
    ‘మంచిని చూస్తాడనా’ లేక ‘ఇష్టము గా’ అనా !

    పట్టు విడుపుల నడి దైవ భావనమున
    హితముఁ గను ; గ్రహణమున భుజించువాఁడు
    తిన్నదంత జీర్ణముగాక దిగులుబడుచు
    దైవమా!యని పరిపరి తలచుచుండు

    లేదా

    పట్టు విడుపుల నడి దైవ భావనవిడి ;
    హితముఁ గను గ్రహణమున భుజించువాఁడు
    తిన్నదంత జీర్ణముగాక దిగులుబడుచు
    దైవమా!యని పరిపరి తలచుచుండు

    రిప్లయితొలగించండి
  16. నీతి నియమాలు బ్రతుకున నింపు హాయి
    బ్రతుకు నేర్చిన మనుజు లేర్పరచిరోయి;
    అనుభవించును తగుఫలమును నియమ ర
    హితముఁ గను గ్రహణమున భుజించువాఁడు”

    రిప్లయితొలగించండి
  17. వడిగను చేసినన్ జపము వాటిలదే శ్రమ, శాస్త్రమే గదా
    నడచిన వేరొకన్ పథము, నష్టము పెద్దగ నొందు నందరున్
    చెడుజరుగున్ గదా నెపుడు చీడయెగొప్పగపేరు, వైరికిన్
    కడు హిత మబ్బులే, గ్రహణకాలమునన్ భుజియించువానికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వేరొకన్'? "...గదా యెపుడు.." అనండి.

      తొలగించండి
  18. ఇనుఁడు రాహువు గ్రస్తుడై యనరు పడెడు
    తరుణమందున భుజియింప తగదు నిజము
    హితముఁ గ గ్రహణమున భుజియించువాఁడు
    నాస్తికుల సంఘమున కధినాయకుండు

    రిప్లయితొలగించండి
  19. ఉడుపతిపద్మబాంధవుల నుగ్రులు రాహువు కేతు లిర్వురుల్
    తడయక మ్రింగి వీడుదురు తత్క్షణమందు భుజించ కూడదం
    చెడపక జోస్యులండ్రు తగదిట్లని తత్ జ్ఞులు జెప్పిరీవిధిన్
    కడు హిత మబ్బులే గ్రహణకాలమునన్ భుజియించువానికిన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  20. అడుగులువేయరాదనుచునాంక్షవిధించగనాచరించినన్
    మడియనిదర్భఁబోచలనుమంత్రమువేయుచునింటయుంచినన్
    గుడులనుమూసివేయుచునుగొప్పజపంబులుజేయబూనినన్
    గడియలురెప్పబాటులనుకచ్చితశాస్త్రపుజర్చలందున
    న్గడు హిత మబ్బులే గ్రహణకాలమునన్ భుజియించువానికిన్

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  21. నుడివిన మాట మీరకను నొవ్వక సేవలు చేయనేమగున్

    వడి వడి సూర్య చంద్రులను పాములు మ్రింగెడు వేళలెప్పుడే

    తడబడు పాద ఘట్టనలు తప్పని ఆకలులేరికుండవే

    కడు హిత మబ్బులే, గ్రహణకాలమునన్ , భుజియించువానికిన్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  22. దుడుకుగుణమ్ముతో బుధుల దూరుచు ప్రేలుచు నెల్లవేళలన్
    చెడు పథమందు నిచ్చగొని చేయుచు స్నేహము దుండగీలతో
    పడిన మనస్సుతో పలికె పండిత వర్యుల ధిక్కరించి యొ
    క్కడు “హిత మబ్బులే గ్రహణకాలమునన్ భుజియించువానికిన్”

    రిప్లయితొలగించండి

  23. తడబడుచుండు నీ విషయ
    తాత్వికత న్దలపోయ విశ్వమున్
    నుడివెడి సంప్రదాయము వి
    నూత్నత దెల్పెడు శాస్త్రదృష్టియున్
    విడివిడిగా గ్రహించుచు, వి
    వేచన తోడ చరించు మార్గమున్
    కడు హిత మబ్బులే గ్రహణ
    కాలమునన్ భుజియించువానికిన్!

    రిప్లయితొలగించండి
  24. మంత్ర పారాయణ ముజేయ మదిని నిలిపి
    హితముగను గ్రహణమున,భుజించువాడు
    కడుపు సంబంధ రోగముల్ గనుచు,బాధ
    నొందు నుగలగా లమతడు విందు లేమి

    రిప్లయితొలగించండి
  25. బడుగు జనంబు లందఱునుభద్రత గోరుచు దూరముండుచో
    గడుహితమబ్బులే,గ్రహణ కాలమునన్ భుజీయించు వానికిన్
    గడుపున నొప్పి వచ్చుచును గానగ రానిది రోగమేదియో
    మడియగ జేయునంచు ననెమంతెన రామయ వెజ్జు వింటిరే

    రిప్లయితొలగించండి
  26. మిత్రులందఱకు నమస్సులు!

    [నేఁటివలె విద్యుత్తు లేని నాఁటి దినములలో, గ్రహణ కాలమున నేమియుఁ దినరాదనుటకుఁ గారణము...చీఁకటిలోఁ దినునప్పు డేదేనిఁ దినరాని వస్తువు పళ్ళెరమందుఁ బడునేమో...కానఁ దినరాదనిరి పెద్దలు. రాహువు సూర్యుని గ్రసించునప్పుడు చంద్రుఁడుండును. కేతువు చంద్రుని గ్రసించునప్పుడు సూర్యుఁడుండును. చీఁకటి ప్రసక్తి యాకసమున నున్న రాహుకేతువులకు లేదు గావున, నిరభ్యంతరముగాఁ దినవచ్చును. కీడు కలిగే ప్రసక్తి లేనేలేదనుట]

    చిడిముడి రాహుకేతువులు చిక్కిన సూర్యశశాంకులన్ వెసన్
    గడిగొన యత్నముం జలుపఁ, గ్రమ్మఱఁ జీఁకటి క్రమ్మదందుకే;
    వడిగ నొకండు చిక్కఁ, గనువాఁడొక డుండి, హసించి, వెల్గు లీన్,
    గడు హిత మబ్బులే, గ్రహణకాలమునన్ "భుజియించువానికిన్"!

    రిప్లయితొలగించండి
  27. సూర్య చంద్రులు లోకుల కార్య వరులు
    వారు గ్రహణ పీడితు లైన భావ్య మగునె
    తుష్టు లయి నాహరింపఁగ దుస్సహపు ట
    హితముఁ గను గ్రహణమున భుజించు వాఁడు


    పుడమిని విశ్వసింతురు సమోదము వేద విదుల్ వచింపఁగాఁ
    గుడువఁగ రాదు మానవులు కూడిన ఘోరత రోపరాగమే
    యుడుపతి పద్మ బాంధవుల నుంచి మనమ్మున భక్తి మౌనముం,
    గడు హిత మబ్బులే గ్రహణ కాలమునన్, భుజియించు వానికిన్

    రిప్లయితొలగించండి
  28. శాస్త్రవేత్తలు చెప్పిరి, చదువరులును,
    గ్రహణ మన్న చెడ్డ ఘడియ కాదు చూడ
    యద్భుతంబిది యాకాశ మందు యిందు
    హితముఁ గను, గ్రహణమున భుజించువాఁడు

    రిప్లయితొలగించండి
  29. బుడతడు దాచి ఉంచినవి బూరెలు గారెలు దండిగా తినెన్
    మడ చిన పెట్టె లోపలను మంచిగ దాచిన వైన గాని ఆ
    చెడు గ్రహణంబహో మనకు! చిన్నతనంబున తిన్న నేమగున్
    కడు హిత మబ్బులే గ్రహణ కాలమునన్ భుజించు వానికి న్

    రిప్లయితొలగించండి
  30. [28/05, 8:58 pm] Kandi Shankaraiah: 29-5-2021 (శనివారం)
    *సమస్య - 3735*
    కవిమిత్రులారా,
    ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
    *“హితముఁ గను గ్రహణమున భుజించువాఁడు”*
    (లేదా...)
    *“కడు హిత మబ్బులే గ్రహణకాలమునన్ భుజియించువానికిన్”*
    http://kandishankaraiah.blogspot.com
    [29/05, 11:54 am] Umadevi: డా బల్లూరి ఉమాదేవి.

    పట్టకమునుపే గ్రహణమువాసిగాను
    తినుచునున్నచో కలుగును తీరు గాను
    హితము,గను గ్రహణమున భుజించు వాడు
    బాధల ననుభవించగ వచ్చు నండ్రు
    వాస్తవములనుచుందురువసుధయందు

    రిప్లయితొలగించండి