21-5-2021 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“సమరమును మాని కురురాజు శాంతిఁ గోరె”(లేదా...)“సమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె సుయోధనుండహో”
జీవమాయుధంబునుగాగచేటుగలుగుమందిమార్బలంబునుగూడమాటుగానుశత్రుపక్షంబుతలపడసంకటమ్ముసమరమునుమానికురురాజుశాంతిఁగోరె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు![దుర్యోధనుఁడు సంధిఁగూర్చుకొనుమను తండ్రితోఁ బలికిన సందర్భము]"విమతుల మాటలన్ వినియు, వేగమె సంధినిఁ గూర్చుకొన్నచో,సమరము చేతఁగాక, విరసమ్మున రాజ్యము నాససేయకేస్థిమితముఁ గోలుపోయిరని తిట్టెదరో పిత! లోకు లండ్రిలన్సమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె సుయోధనుండహో!"
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
అమలినభావు డందరకు హర్షము గూర్చగ ధర్మరాజటన్సమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె, సుయోధనుండహోక్రమమును దప్పి పాండవుల కాంక్షలనొప్పక క్రూరచిత్తుడైభ్రమపడి పోరి చచ్చె తనవారలతోడ రణాంగణంబునన్.
విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
అమరినగీతబోధలనునర్జునుడంతటపోరుసల్పగాచమరినకన్నుతోడుతనుచాలగవేదనఁజెందెరాజునున్విమలముగాగమానసమువింతకరోనకువెన్నుఁజూపుచున్సమరముమానిశాంతినెలకోల్పగఁగోరెసుయోధనుండహో
మీ పద్యం బాగుంది. కాని దుర్యోధనునకు, కరోనాకు సంబంధం? 'చమరిన కన్ను'?
చమరినసుకుమారమైనయనునర్ధమునవాడితినిసరదాగాదుర్యోధనునికికరోనాభయమునంటగట్టితిని
తేటగీతివంశనాశముఁ దప్పెడు వరుస దెలిపిదేవ దేవుడే సంధికిఁ ద్రోవఁజూపదురభిమానుడై బంధింపఁ దొడఁగె, నెపుడుసమరమును మాని కురురాజు శాంతిఁ గోరె?చంపకమాలదమనము నోపలేక మును ధర్మజుఁడెంచుచు శాంతిమంత్రమున్విమల యశోగుణున్ హరిని విజ్ఞత సంధికి బంపినంత ధర్మమయుని సైచకే దురభిమానుడు ఖైదిగఁ బట్ట జూచె! నేసమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె సుయోధనుండహో?
అధిక్షేపాత్మకమైన మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
కర్ణుని విలు విద్యను నమ్మక శకుని కరతంత్ర మును నమ్మి రాజ్యము పొందె విహితసమరమును మాని కురురాజు ; శాంతిఁ గోరెఐదుగురికినైదూళ్ళను హరియె కోరి...భారతీనాథ్ చెన్నంశెట్టి...
యుద్ధ తంత్రములను గూర్చి యోచన మును జేయు చలసి యు పవళించి చిత్ర మైన కలను గాంచిన వీరుఁడు కనుగొని యెను సమరమును మాని కురు రాజు శాంతి గోరె
సమస్య :సమరము మాని రాజ్యమున శాంతిని గోరె సుయోధనుం డహో ( ఉపప్లావ్యనగరంలో అందరూ తనవంటి వారే అని భావించే ధర్మరాజు తనకు వచ్చిన కలను శ్రీకృష్ణునికి ,తమ్ములకు , ద్రౌపదికి తెలుపుతున్న దృశ్యం )“ కమలదళాక్ష ! తమ్ములు ! వి కంపితదేహ ! వినుండు ; చిత్రమే !అమలినమానసుండు మన మంతయు గోరు విధాన సౌమ్యుడై సమరము మాని రాజ్యమున శాంతిని గోరె సుయోధనుం డహో !చెమరిన కన్నుదోయి బిలచెన్ నను ; వందనమస్తకుండుగా . “
ప్రమదము నెన్నికన్ గెలిచి పన్నుగ గద్దెను నెక్కినంతనేయమితపు కక్షసాధనము నంతము జేయక పాతపద్ధతుల్ విమల మనంబునన్ తగవెంచక ద్రావిడ దేశమందునన్సమరము మాని రాజ్యమున శాంతిని గోరె సుయోధనుండహో సుయోధనుండు = మంచి యోధుడు ( స్టాలిన్)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'విమల మనంబునందు తగ వెంచక..' అనండి.
ధన్యవాదములు గురుదేవా! సవరించెదను.🙏🙏🙏
సవరణతోప్రమదము నెన్నికన్ గెలిచి పన్నుగ గద్దెను నెక్కినంతనేయమితపు కక్షసాధనము నంతము జేయక పాతపద్ధతుల్ విమల మనంబుతోడ తగవెంచక ద్రావిడ దేశమందునన్సమరము మాని రాజ్యమున శాంతిని గోరె సుయోధనుండహో సుయోధనుండు = మంచి యోధుడు ( స్టాలిన్)
శాంతిదూతగ కృష్ణుండు చనునటంచుతెలియ వచ్చిన యారోజు కలికి కృష్ణనిదురలో స్వప్న మునుగాంచె నిశిని, యందుసమరమును మాని కురురాజు శాంతి గోరె.ప్రమదయె చక్రితో పలికె స్వప్నము గంటిని రాత్రి యందునన్ సుమతిని పాండుపుత్రు లట జూదము నొడ్డిరటంచు వంకతో నమతులు తూలపుచ్చుతరి యానిలి బాసయె చేయ భీతిచే సమలము మాని శాంతినెలకొల్పగఁ గోరె సుయోధనుండహో.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మూడవ పాదం అర్థం కాలేదు.
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅శంకరాభరణం వారి సమస్య : “సమరమును మాని కురురాజు శాంతిఁ గోరె”గాంధారి పుత్రులను కోల్పోయి , కలలో ఇలా చూసింది యని మాత గాంధారి సుతులటు మాటు పడగ కన్నులందున నీరిడి, కలిమి యేల ?కన్నపుత్రులు లేరని, కలల లోన “సమరమును మాని కురురాజు శాంతిఁ గోరె”- రాంబాబు కైప 20-05-2021🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅శంకరాభరణం వారి సమస్య : “సమరమును మాని కురురాజు శాంతిఁ గోరె”లక్ష్మణ కుమారుడు సుతుడై , "లక్ష్మణా"యె సుతగ, భానుమతిని పొందె సుదతి గాను, యింటి పోరునీశుడికైన నెంత బాధ “సమరమును మాని కురురాజు శాంతిఁ గోరె”- రాంబాబు కైప 20-05-202🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'సుదతిగాను+ఇంటి' అన్నపుడు యడాగమం రాదు.
~~~~~~~~~~~~~~~~~~అమలచరిత్రు ధర్మజు డహమ్మిసుమంతయు లేనివాడు తాసమరము మాని రాజ్యమునశాంతిని గోరె, సుయోధనుండహోసుమతుల మాట గాదనియుసూతుని పుత్రుని యండతోడ భీరములును బల్కి చచ్చె గద మాన్యుని మాటల నాలకించకన్.~~~~~~~~~~~~~~~~~~~~~~
రములను బల్కిఘోర రణరంగమునందున జచ్చె నొంటరై
విమల మనస్కుడైన కఱి వేల్పును గోరె యుధిష్ఠిరుండటన్ శమనము గూర్చమంచు కులసాదము నాపుమటంచు, కృష్ణుడే సమరము మాని శాంతి నెలకొల్పగ గోరె, సుయోధనుండహో కుమతుల మెప్పుకోసమని కూడదటంచును కాలుదువ్వెనే.
ఉషపుఁ డస్తాద్రి నుదయించి యుండనోపుజలధిలో నీరమింకుట జరుగవచ్చుసమరమును మాని కురురాజు శాంతిఁ గోరెననుట మాత్రము కలనైన కల్లయగును
చక్కని పూరణ. అభినందనలు.
సమసెను భీష్ముడున్ సమసె శత్రుభయంకరుడౌ దృశానుడేసమసెను సూతపుత్రుడను జన్ములు జావగ యుద్ధమందు తానమిత విరాగియై మడుగు నందున జేరి వివేకహీనుడైసమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె సుయోధనుండహో
గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.
సమయము వచ్చెనేమొమరి, సాచెనుమృత్యువుకైకరంబులేఅమలినవర్తనుండుగగ యైదుపురంబులనేను, కాదనేతమకముగాతనీయననె, తప్పదునిప్పుడు, నాకుగావలెన్సమరము, మానిరాజ్యమునశాంతినిఁ, గోరె సుయోధనుండహో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'మృత్యువునకై' అనడం సాధువు. '...వర్తనుండుగగ'? 'కాదనే' అనడం వ్యావహారికం. 'తను+ఈయననె'... 'తాను'ను 'తను' అనరాదు.
సమయము వచ్చెనేమొమరి సర్వమునాశనమవ్వ గానిలన్అమలినవర్తనుండడుగ నైదుపురంబులనేను, కాదనేతమకముగానతండు, "నిక తప్పదునిప్పుడు, నాకుగావలెన్సమరము", మానిరాజ్యమునశాంతినిఁ, గోరె సుయోధనుండహో -- thanks andi for corrections
చం: సమయము జూసి పాండవుల జంపగ నిశ్చయమెంచి యుద్ధమున్తమదగు మాట నెగ్గుటకు తామరకంటి సయోధ్య నొప్పకైభ్రమ గొనుటన్న తప్పిదము , పల్కగ నిట్టులటన్న భావ్యమే ? సమరము మాని రాజ్యమున శాంతిని గోరె సుయోధనుండహో!!వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు."సమయము జూచి.." అనండి.
ధన్యవాదములు
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅శంకరాభరణం వారి సమస్య : “సమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె సుయోధనుండహోసుయోధనుడు = గొప్ప యోధుడు, రాజు రక్త పాతము చూడలేక శాంతి మార్గమును కోరెనని 3)ఉ . మా చెమరిన కళ్ళతో, రణము జేసిన సైనికు బాధలన్నియూ తమతమ రీతిలో తెలుప, తండ్రిగ రాజుగ, రక్షకుండుగా సమతను పెంచు వాడిగ , చాలని చెప్పెను రక్త పాతమున్ “సమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె సుయోధనుండహో- రాంబాబు కైప 20-05-2021🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'బాధలన్నియున్' అనండి.
విమలుడుఁబాండుమధ్యముడువీడగధర్మమునేమిజేసెనో?క్రమమునధర్మనందనుడురాజసయాగమునేమిగోరెనో?స్థిమితమువీడగానెవడుచిత్తమునిల్పెనునాత్మహత్యకై?సమరము మాని ,రాజ్యమున శాంతినిఁ గోరె, సుయోధనుండహోకొరుప్రోలు రాధాకృష్ణరావు
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.రాజసూయాన్ని రాజస మనవచ్చునా అని సందేహం!
విమలుడుఁబాండుమధ్యముడువీడగధర్మమునేమిజేసెనో?క్రమమునరాజ్యభారమునరాజగుధర్మజుడేమిగోరెనో?స్థిమితమువీడగానెవడుచిత్తమునిల్పెనునాత్మహత్యకై?సమరము మాని ,రాజ్యమున శాంతినిఁ గోరె, సుయోధనుండహోకొరుప్రోలు రాధాకృష్ణరావు
ఏమి చేసి పరుగు బెట్టె భూమి పైనయుత్తరుండు, కుంతి సుతుల కొక్క గ్రామమైన యివ్వజాల ననుచు మాట లాడెనెవరు,ధర్మ సుతు డనుజు నేమి కోరెసమరమును మాని, కురు రాజు,శాంతి కోరె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'భూమిపైన నుత్తరుండు... గ్రామమైన నివ్వజాల...' అనండి.
సమరము ను మాని కురురాజు శాంతి కోరెవార్త విన్న టి ద్రౌపది వగచె మిగులపగలు తీరుట నెట్ల ని పతులనడిగెచింత వలదిది కలయన సంతసించె
విన్నట్టి గా సవరించాను
మీ పూరణ బాగున్నది. అభినందనలు."తీరుట యెట్లని" అనండి.
ధన్యవాదాలు గురువుగారు!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సమరము ను మాని కురురాజు శాంతి కోరెవార్త విన్నట్టి ద్రౌపది వగచె మిగులపగలు తీరుట యెట్ల ని పతులనడిగెచింత వలదిది కలయన సంతసించె
సమయము కాదు కాదనుచు సాధువచస్సుల బోధఁ జేసినన్క్రమముగ వృద్ధి జెందె నురగమ్ములు పాలను ద్రావి చిందు నట్లమితవిషమ్ము, నేలుబడికై తపియించుచు దుష్టబుద్ధితోసమరము,... మాని రాజ్యమున శాంతినిఁ, గోరె సుయోధనుండహో.కంజర్ల రామాచార్య.
ఆర్యా! విరుపు చాలా బాగుంది.
ధన్యవాదములు సహదేవకవివరా!
విమల తరంబునైన పృథివీస్థలి ధర్మజు డోర్మి నిల్చి, వేసమరము మాని రాజ్యమున శాంతిని గోరె; సుయోధనుండహోసమర కుతూహలుండయి కషాయిత నేతృడునై చరించె;ధీసముపేతు,కృష్ణు,పరుషంబుగ రోయుచు తూలనాడుచున్.
మాత గాంధారి మనమున మదనపడుచు పుత్ర శోకపు కన్నీటినొడిసిపట్టి తలచె ఉద్వేగ భరితమై తనయుగూర్చి సమరమును మాని కురు రాజు శాంతి కోరె
సమరమును మాని కురురాజు శాంతి గోరెననుట చిత్రము దుర్బుద్ధి యైన వారు శాంతి గోరరు గోరు నశాంతి నెపుడు వంశ నాశమ్ము జరుగును వారి వలన
సమయును నీదుపుత్రుడని శౌరి వచింపగ కొల్వులోన సంయమనము చూపమంచునన నార్యులు వంశము నిల్ప నెంచుచున్గమనము మార్చెపుత్రుడని కాంచెను స్వప్నము నాంబి కేయుడే“సమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె సుయోధనుండహో”
విమల మనస్కుడై మరచి వేదనలన్నియు ధర్మజుండు దాసమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె; సుయోధనుండహోసమరమె గోరి బంధుజన సంక్షయకారకుడై జనెన్ గదాతమ నిజలక్షణంబుల లతాంత శితాగ్రములజ్జగించునే
విప్రవరుఁ డుదంకుని మాట విని యొనర్పనధిపుఁ డిష్టిని నాస్తీకుఁడు ధరణీ సు రోత్తముఁడు వేఁడ జనమేజయుఁ డహుల పయి సమరమును మాని కురురాజు శాంతిఁ గోరె అమరుఁడు నయ్యె నింపుగ మహాత్ముఁడు మౌర్య కులస్థుఁ డిద్ధరం గమలఁగ నంతరంగము ప్రగాఢముగా విజయుండు నయ్యుఁ దావిమలుఁ డశోక భూధవుఁడు వేదన నీయ కళింగ యుద్ధమే సమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె సుయోధనుం డహో [సుయోధనుఁడు = మంచి యుద్ధము చేయువాఁడు, ఇక్కడ అశోక చక్రవర్తి]
సముపగమంబుగోరు నొక సత్పురుషుండు దలంచె నిద్రలోవిమల యశో విభూషణులు వీరులు వేవురు పాండునందనుల్సమరము సల్పిరేని యరి సంఘములన్ సమయింత్రు గావునన్సమరము మాని రాజ్యమున శాంతినిఁగోరె సుయోధనుండహో
ప్రమద మనంబు నొందుచును బార్ధునితోడ ను ధర్మరాజనెన్ విమలపు మానసంబున నబేర్మిని నాదగు మాట చెప్పుమాసమరముమాని రాజ్యమున శాంతిని గోరె, సుయోధనుండహోకుమతిని నీచ్చగించడెమొ కూర్మిని నచ్చువిధంబు జేయుమా
పాండు సుతుల పై పగ నుంచి బాల్యమందెశకుని మరియును కర్ణుడు సాయమందివారలను చంపి నెంచిన వాడదెటులసమరమును మాని కురురాజు శాంతి కోరె.
జీవమాయుధంబునుగాగచేటుగలుగు
రిప్లయితొలగించండిమందిమార్బలంబునుగూడమాటుగాను
శత్రుపక్షంబుతలపడసంకటమ్ము
సమరమునుమానికురురాజుశాంతిఁగోరె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[దుర్యోధనుఁడు సంధిఁగూర్చుకొనుమను తండ్రితోఁ బలికిన సందర్భము]
"విమతుల మాటలన్ వినియు, వేగమె సంధినిఁ గూర్చుకొన్నచో,
సమరము చేతఁగాక, విరసమ్మున రాజ్యము నాససేయకే
స్థిమితముఁ గోలుపోయిరని తిట్టెదరో పిత! లోకు లండ్రిలన్
సమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె సుయోధనుండహో!"
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలగించండిఅమలినభావు డందరకు హర్షము గూర్చగ ధర్మరాజటన్
రిప్లయితొలగించండిసమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె, సుయోధనుండహో
క్రమమును దప్పి పాండవుల కాంక్షలనొప్పక క్రూరచిత్తుడై
భ్రమపడి పోరి చచ్చె తనవారలతోడ రణాంగణంబునన్.
విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅమరినగీతబోధలనునర్జునుడంతటపోరుసల్పగా
రిప్లయితొలగించండిచమరినకన్నుతోడుతనుచాలగవేదనఁజెందెరాజునున్
విమలముగాగమానసమువింతకరోనకువెన్నుఁజూపుచున్
సమరముమానిశాంతినెలకోల్పగఁగోరెసుయోధనుండహో
మీ పద్యం బాగుంది. కాని దుర్యోధనునకు, కరోనాకు సంబంధం? 'చమరిన కన్ను'?
తొలగించండిచమరినసుకుమారమైనయనునర్ధమునవాడితిని
తొలగించండిసరదాగాదుర్యోధనునికికరోనాభయమునంటగట్టితిని
తేటగీతి
రిప్లయితొలగించండివంశనాశముఁ దప్పెడు వరుస దెలిపి
దేవ దేవుడే సంధికిఁ ద్రోవఁజూప
దురభిమానుడై బంధింపఁ దొడఁగె, నెపుడు
సమరమును మాని కురురాజు శాంతిఁ గోరె?
చంపకమాల
దమనము నోపలేక మును ధర్మజుఁడెంచుచు శాంతిమంత్రమున్
విమల యశోగుణున్ హరిని విజ్ఞత సంధికి బంపినంత ధ
ర్మమయుని సైచకే దురభిమానుడు ఖైదిగఁ బట్ట జూచె! నే
సమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె సుయోధనుండహో?
అధిక్షేపాత్మకమైన మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండికర్ణుని విలు విద్యను నమ్మక శకుని కర
రిప్లయితొలగించండితంత్ర మును నమ్మి రాజ్యము పొందె విహిత
సమరమును మాని కురురాజు ; శాంతిఁ గోరె
ఐదుగురికినైదూళ్ళను హరియె కోరి
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండియుద్ధ తంత్రములను గూర్చి యోచన మును
రిప్లయితొలగించండిజేయు చలసి యు పవళించి చిత్ర మైన
కలను గాంచిన వీరుఁడు కనుగొని యెను
సమరమును మాని కురు రాజు శాంతి గోరె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిసమరము మాని రాజ్యమున
శాంతిని గోరె సుయోధనుం డహో
( ఉపప్లావ్యనగరంలో అందరూ తనవంటి వారే అని భావించే ధర్మరాజు తనకు వచ్చిన కలను శ్రీకృష్ణునికి ,
తమ్ములకు , ద్రౌపదికి తెలుపుతున్న దృశ్యం )
“ కమలదళాక్ష ! తమ్ములు ! వి
కంపితదేహ ! వినుండు ; చిత్రమే !
అమలినమానసుండు మన
మంతయు గోరు విధాన సౌమ్యుడై
సమరము మాని రాజ్యమున
శాంతిని గోరె సుయోధనుం డహో !
చెమరిన కన్నుదోయి బిల
చెన్ నను ; వందనమస్తకుండుగా . “
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిప్రమదము నెన్నికన్ గెలిచి పన్నుగ గద్దెను నెక్కినంతనే
రిప్లయితొలగించండియమితపు కక్షసాధనము నంతము జేయక పాతపద్ధతుల్
విమల మనంబునన్ తగవెంచక ద్రావిడ దేశమందునన్
సమరము మాని రాజ్యమున శాంతిని గోరె సుయోధనుండహో
సుయోధనుండు = మంచి యోధుడు ( స్టాలిన్)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'విమల మనంబునందు తగ వెంచక..' అనండి.
ధన్యవాదములు గురుదేవా! సవరించెదను.🙏🙏🙏
తొలగించండిసవరణతో
తొలగించండిప్రమదము నెన్నికన్ గెలిచి పన్నుగ గద్దెను నెక్కినంతనే
యమితపు కక్షసాధనము నంతము జేయక పాతపద్ధతుల్
విమల మనంబుతోడ తగవెంచక ద్రావిడ దేశమందునన్
సమరము మాని రాజ్యమున శాంతిని గోరె సుయోధనుండహో
సుయోధనుండు = మంచి యోధుడు ( స్టాలిన్)
రిప్లయితొలగించండిశాంతిదూతగ కృష్ణుండు చనునటంచు
తెలియ వచ్చిన యారోజు కలికి కృష్ణ
నిదురలో స్వప్న మునుగాంచె నిశిని, యందు
సమరమును మాని కురురాజు శాంతి గోరె.
ప్రమదయె చక్రితో పలికె స్వప్నము గంటిని రాత్రి యందునన్
సుమతిని పాండుపుత్రు లట జూదము నొడ్డిరటంచు వంకతో
నమతులు తూలపుచ్చుతరి యానిలి బాసయె చేయ భీతిచే
సమలము మాని శాంతినెలకొల్పగఁ గోరె సుయోధనుండహో.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదం అర్థం కాలేదు.
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
రిప్లయితొలగించండిశంకరాభరణం వారి సమస్య : “సమరమును మాని కురురాజు శాంతిఁ గోరె”
గాంధారి పుత్రులను కోల్పోయి , కలలో ఇలా చూసింది యని
మాత గాంధారి సుతులటు మాటు పడగ
కన్నులందున నీరిడి, కలిమి యేల ?
కన్నపుత్రులు లేరని, కలల లోన
“సమరమును మాని కురురాజు శాంతిఁ గోరె”
- రాంబాబు కైప
20-05-2021
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
రిప్లయితొలగించండిశంకరాభరణం వారి సమస్య : “సమరమును మాని కురురాజు శాంతిఁ గోరె”
లక్ష్మణ కుమారుడు సుతుడై , "లక్ష్మణా"యె
సుతగ, భానుమతిని పొందె సుదతి గాను,
యింటి పోరునీశుడికైన నెంత బాధ
“సమరమును మాని కురురాజు శాంతిఁ గోరె”
- రాంబాబు కైప
20-05-202
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సుదతిగాను+ఇంటి' అన్నపుడు యడాగమం రాదు.
~~~~~~~~~~~~~~~~~~
రిప్లయితొలగించండిఅమలచరిత్రు ధర్మజు డహమ్మి
సుమంతయు లేనివాడు తా
సమరము మాని రాజ్యమున
శాంతిని గోరె, సుయోధనుండహో
సుమతుల మాట గాదనియు
సూతుని పుత్రుని యండతోడ భీ
రములును బల్కి చచ్చె గద
మాన్యుని మాటల నాలకించకన్.
~~~~~~~~~~~~~~~~~~~~~~
రములను బల్కిఘోర రణరంగము
తొలగించండినందున జచ్చె నొంటరై
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివిమల మనస్కుడైన కఱి వేల్పును గోరె యుధిష్ఠిరుండటన్
శమనము గూర్చమంచు కులసాదము నాపుమటంచు, కృష్ణుడే
సమరము మాని శాంతి నెలకొల్పగ గోరె, సుయోధనుండహో
కుమతుల మెప్పుకోసమని కూడదటంచును కాలుదువ్వెనే.
విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఉషపుఁ డస్తాద్రి నుదయించి యుండనోపు
రిప్లయితొలగించండిజలధిలో నీరమింకుట జరుగవచ్చు
సమరమును మాని కురురాజు శాంతిఁ గోరె
ననుట మాత్రము కలనైన కల్లయగును
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిసమసెను భీష్ముడున్ సమసె శత్రుభయంకరుడౌ దృశానుడే
రిప్లయితొలగించండిసమసెను సూతపుత్రుడను జన్ములు జావగ యుద్ధమందు తా
నమిత విరాగియై మడుగు నందున జేరి వివేకహీనుడై
సమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె సుయోధనుండహో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిగురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.
తొలగించండిసమయము వచ్చెనేమొమరి, సాచెనుమృత్యువుకైకరంబులే
రిప్లయితొలగించండిఅమలినవర్తనుండుగగ యైదుపురంబులనేను, కాదనే
తమకముగాతనీయననె, తప్పదునిప్పుడు, నాకుగావలెన్
సమరము, మానిరాజ్యమునశాంతినిఁ, గోరె సుయోధనుండహో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మృత్యువునకై' అనడం సాధువు. '...వర్తనుండుగగ'? 'కాదనే' అనడం వ్యావహారికం. 'తను+ఈయననె'... 'తాను'ను 'తను' అనరాదు.
సమయము వచ్చెనేమొమరి సర్వమునాశనమవ్వ గానిలన్
తొలగించండిఅమలినవర్తనుండడుగ నైదుపురంబులనేను, కాదనే
తమకముగానతండు, "నిక తప్పదునిప్పుడు, నాకుగావలెన్
సమరము", మానిరాజ్యమునశాంతినిఁ, గోరె సుయోధనుండహో -- thanks andi for corrections
చం:
రిప్లయితొలగించండిసమయము జూసి పాండవుల జంపగ నిశ్చయమెంచి యుద్ధమున్
తమదగు మాట నెగ్గుటకు తామరకంటి సయోధ్య నొప్పకై
భ్రమ గొనుటన్న తప్పిదము , పల్కగ నిట్టులటన్న భావ్యమే ?
సమరము మాని రాజ్యమున శాంతిని గోరె సుయోధనుండహో!!
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"సమయము జూచి.." అనండి.
ధన్యవాదములు
తొలగించండి
రిప్లయితొలగించండి🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
శంకరాభరణం వారి సమస్య : “సమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె సుయోధనుండహో
సుయోధనుడు = గొప్ప యోధుడు, రాజు రక్త పాతము చూడలేక శాంతి మార్గమును కోరెనని
3)
ఉ . మా
చెమరిన కళ్ళతో, రణము జేసిన సైనికు బాధలన్నియూ
తమతమ రీతిలో తెలుప, తండ్రిగ రాజుగ, రక్షకుండుగా
సమతను పెంచు వాడిగ , చాలని చెప్పెను రక్త పాతమున్
“సమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె సుయోధనుండహో
- రాంబాబు కైప
20-05-2021
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'బాధలన్నియున్' అనండి.
విమలుడుఁబాండుమధ్యముడువీడగధర్మమునేమిజేసెనో?
రిప్లయితొలగించండిక్రమమునధర్మనందనుడురాజసయాగమునేమిగోరెనో?
స్థిమితమువీడగానెవడుచిత్తమునిల్పెనునాత్మహత్యకై?
సమరము మాని ,రాజ్యమున శాంతినిఁ గోరె, సుయోధనుండహో
కొరుప్రోలు రాధాకృష్ణరావు
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరాజసూయాన్ని రాజస మనవచ్చునా అని సందేహం!
విమలుడుఁబాండుమధ్యముడువీడగధర్మమునేమిజేసెనో?
తొలగించండిక్రమమునరాజ్యభారమునరాజగుధర్మజుడేమిగోరెనో?
స్థిమితమువీడగానెవడుచిత్తమునిల్పెనునాత్మహత్యకై?
సమరము మాని ,రాజ్యమున శాంతినిఁ గోరె, సుయోధనుండహో
కొరుప్రోలు రాధాకృష్ణరావు
ఏమి చేసి పరుగు బెట్టె భూమి పైన
రిప్లయితొలగించండియుత్తరుండు, కుంతి సుతుల కొక్క గ్రామ
మైన యివ్వజాల ననుచు మాట లాడె
నెవరు,ధర్మ సుతు డనుజు నేమి కోరె
సమరమును మాని, కురు రాజు,శాంతి కోరె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'భూమిపైన నుత్తరుండు... గ్రామమైన నివ్వజాల...' అనండి.
సమరము ను మాని కురురాజు శాంతి కోరె
రిప్లయితొలగించండివార్త విన్న టి ద్రౌపది వగచె మిగుల
పగలు తీరుట నెట్ల ని పతులనడిగె
చింత వలదిది కలయన సంతసించె
విన్నట్టి గా సవరించాను
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"తీరుట యెట్లని" అనండి.
ధన్యవాదాలు గురువుగారు!
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసమరము ను మాని కురురాజు శాంతి కోరె
తొలగించండివార్త విన్నట్టి ద్రౌపది వగచె మిగుల
పగలు తీరుట యెట్ల ని పతులనడిగె
చింత వలదిది కలయన సంతసించె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసమయము కాదు కాదనుచు సాధువచస్సుల బోధఁ జేసినన్
తొలగించండిక్రమముగ వృద్ధి జెందె నురగమ్ములు పాలను ద్రావి చిందు న
ట్లమితవిషమ్ము, నేలుబడికై తపియించుచు
దుష్టబుద్ధితో
సమరము,... మాని రాజ్యమున శాంతినిఁ, గోరె సుయోధనుండహో.
కంజర్ల రామాచార్య.
ఆర్యా! విరుపు చాలా బాగుంది.
తొలగించండిధన్యవాదములు సహదేవకవివరా!
తొలగించండివిమల తరంబునైన పృథివీస్థలి ధర్మజు డోర్మి నిల్చి, వే
రిప్లయితొలగించండిసమరము మాని రాజ్యమున శాంతిని గోరె; సుయోధనుండహో
సమర కుతూహలుండయి కషాయిత నేతృడునై చరించె;ధీ
సముపేతు,కృష్ణు,పరుషంబుగ రోయుచు తూలనాడుచున్.
మాత గాంధారి మనమున మదనపడుచు
రిప్లయితొలగించండిపుత్ర శోకపు కన్నీటినొడిసిపట్టి
తలచె ఉద్వేగ భరితమై తనయుగూర్చి
సమరమును మాని కురు రాజు శాంతి కోరె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసమరమును మాని కురురాజు శాంతి గోరె
రిప్లయితొలగించండిననుట చిత్రము దుర్బుద్ధి యైన వారు
శాంతి గోరరు గోరు నశాంతి నెపుడు
వంశ నాశమ్ము జరుగును వారి వలన
సమయును నీదుపుత్రుడని శౌరి వచింపగ కొల్వులోన సం
రిప్లయితొలగించండియమనము చూపమంచునన నార్యులు వంశము నిల్ప నెంచుచున్
గమనము మార్చెపుత్రుడని కాంచెను స్వప్నము నాంబి కేయుడే
“సమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె సుయోధనుండహో”
విమల మనస్కుడై మరచి వేదనలన్నియు ధర్మజుండు దా
రిప్లయితొలగించండిసమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె; సుయోధనుండహో
సమరమె గోరి బంధుజన సంక్షయకారకుడై జనెన్ గదా
తమ నిజలక్షణంబుల లతాంత శితాగ్రములజ్జగించునే
విప్రవరుఁ డుదంకుని మాట విని యొనర్ప
రిప్లయితొలగించండినధిపుఁ డిష్టిని నాస్తీకుఁడు ధరణీ సు
రోత్తముఁడు వేఁడ జనమేజయుఁ డహుల పయి
సమరమును మాని కురురాజు శాంతిఁ గోరె
అమరుఁడు నయ్యె నింపుగ మహాత్ముఁడు మౌర్య కులస్థుఁ డిద్ధరం
గమలఁగ నంతరంగము ప్రగాఢముగా విజయుండు నయ్యుఁ దా
విమలుఁ డశోక భూధవుఁడు వేదన నీయ కళింగ యుద్ధమే
సమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె సుయోధనుం డహో
[సుయోధనుఁడు = మంచి యుద్ధము చేయువాఁడు, ఇక్కడ అశోక చక్రవర్తి]
సముపగమంబుగోరు నొక సత్పురుషుండు దలంచె నిద్రలో
రిప్లయితొలగించండివిమల యశో విభూషణులు వీరులు వేవురు పాండునందనుల్
సమరము సల్పిరేని యరి సంఘములన్ సమయింత్రు గావునన్
సమరము మాని రాజ్యమున శాంతినిఁగోరె సుయోధనుండహో
ప్రమద మనంబు నొందుచును బార్ధునితోడ ను
రిప్లయితొలగించండిధర్మరాజనెన్
విమలపు మానసంబున నబేర్మిని నాదగు మాట చెప్పుమా
సమరముమాని రాజ్యమున శాంతిని గోరె, సుయోధనుండహో
కుమతిని నీచ్చగించడెమొ కూర్మిని నచ్చువిధంబు జేయుమా
పాండు సుతుల పై పగ నుంచి బాల్యమందె
రిప్లయితొలగించండిశకుని మరియును కర్ణుడు సాయమంది
వారలను చంపి నెంచిన వాడదెటుల
సమరమును మాని కురురాజు శాంతి కోరె.