14, మే 2021, శుక్రవారం

సమస్య - 3723

15-5-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వెలయా లొనరించు వంశవృద్ధినిఁ బ్రేమన్”
(లేదా...)
“వెలయాలే మన వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదించులే”

78 కామెంట్‌లు:

  1. కలిగిన ముద్దు మురిపములు

    వెలయా లొనరించు ; వంశవృద్ధినిఁ బ్రేమన్”

    కలుగంగ సేయు నిజ సతి

    ఖలుడై తిరిగెడు పతిగని కయ్యము సల్పిన్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సల్పిన్' అన్న ప్రయోగం సాధువు కాదు. "కయ్యములాడున్" అనవచ్చు కదా?

      తొలగించండి
  2. కలగాపులగపుజీవన
    వలయములోననుసమయమువాడగసతులున్
    మెలకువశాస్త్త్రముచెప్పగ
    వెలయాలోనరించువంశవ్రుద్ధినిప్రేమన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యం బాగుంది. కాని భావం అర్థం కాలేదు.

      తొలగించండి
    2. బిడ్డలనుకనేతీఱికలేక, డబ్బులిచ్చిఆధునికపద్ధతులనుఅనుసరించివంశోద్ధారకులనుతెచ్చుకుంటున్నవైనము

      తొలగించండి
  3. ఖలులకు భారతదేశము
    విలువల నేర్పించెగాదె వివిధగ్రంథం
    బులలో, గృహమన నొక కో
    వెల, యాలొనరించు వంశవృద్ధినిఁ బ్రేమన్.

    రిప్లయితొలగించండి

  4. తలిదండ్రులవీడుచు పతి
    నిలయమె తనదనుచు తలచు నెలతయె కదరా
    కులకాంత, యామె కానిది
    వెలయాలొనరించు వంశవృద్ధినిఁ బ్రేమన్?

    రిప్లయితొలగించండి
  5. కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణమును ఆక్షేపించిన పెద్దలతో దుర్యోధనుడు.....

    కందం

    కులటన్ నిల్పఁగ సభలోఁ
    దలవంచుచు పెద్దలెల్లఁ దగదందురె? భ
    ర్తలయిదుగురితోనలరెడు
    వెలయా లొనరించు వంశవృద్ధినిఁ బ్రేమన్?

    మత్తేభవిక్రీడితము

    కొలువై జూదము గాంచి ధర్మజుఁడుఁ దాఁ గోల్పోవసర్వస్వమున్
    గులటన్ ద్రౌపదిఁ దెచ్చినిల్ప సభలో గోలెంచ మీరంత పె
    ద్దలహో! ధర్మము గాదనన్ దగునె? భర్తాళిన్ వినోదింప నీ
    వెలయాలే మన వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదించులే?



    రిప్లయితొలగించండి


  6. సలహాలిచ్చును నీసమస్యలకునే సందర్భమందైనగా
    కలహంబైన ప్రయోజనంబెనిడు నీకల్యాణితోనీకులే
    నిలలోనేవిదితంబగీనిజము, ఔ, నేరంబెలెక్కెట్టినన్
    వెల, యాలే మన వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదించులే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అగు(న్)+ఈ జగము = అగు నీ జగము' అవుతుంది. 'అగీజగము' కాదు.

      తొలగించండి
  7. సమస్య :

    వెలయాలే మన వంశవృద్ధి కిరవౌ
    ప్రేమన్ బ్రసాదించులే

    ( వల్లమాలిన వారవనిత వలలో చిక్కుకొన్న మరది వేమారెడ్డిని మందలిస్తున్న వదినె గారు )

    మత్తేభవిక్రీడితము
    ...........................

    అలయన్ జేయుచు వంశగౌరవము న
    య్యా ! వేమనా ! దట్టమౌ
    గలలం దేల్చుచు మాయమక్కువల నా
    ఘాతంబు గావించు నా
    వెలయాలే ; మన వంశవృద్ధి కిరవౌ
    ప్రేమన్ బ్రసాదించులే
    లలితంబుల్ గుణపూర్ణముల్ కులవధూ
    లావణ్యసంభాషణల్ .

    రిప్లయితొలగించండి
  8. తలగొని అన్నియు తానై
    యలసట నొందక విధిన్ విహారము చేయున్.
    కులకాం తకు కలదా?ఇల
    “వెల, యా లొనరించు వంశవృద్ధినిఁ బ్రేమన్”

    రిప్లయితొలగించండి
  9. వలపుల నమ్ము కొను ను గద
    వెలయా లొ నరించు వంశ వృధ్ధి ని బ్రేమన్
    చెలువము గన బరచి సతము
    నిలుచును గృహ లక్ష్మి గ దాను నేర్పరి యగుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాలుగోపాదం లో తాను బదులుగా భార్య అని సవరణ చేయడమైనది

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గృహలక్ష్మి భార్య' అనండి. 'గృహలక్ష్మిగ' అంటే గణభంగం.

      తొలగించండి

  10. తలిదండ్రుల్ కడు ప్రేమజూపినను భర్తై వచ్చెడిన్ పూరుషుం
    డిల దైవంబను సంస్కృతిన్ గనరె? ప్రత్యేకమ్ముగా ధాత్రిఁ గా
    దిలి వంశోన్నతి గోరు, కాని పర భూతిన్ గోరు స్త్రీ యెవ్విధిన్
    వెలయాలే మన వంశవృద్ధికిరవౌ ప్రేమన్ ప్రసాదించులే?

    రిప్లయితొలగించండి
  11. ~~~~~~~~~~~~~~~~~
    బలమౌ బంధము జీవితాంత
    మును సద్భావంబుతో గల్గియున్
    కలహంబున్ విడనాడి నిత్యమ
    తి సఖ్యంబొప్ప జీవించుచున్
    కులకాంతామణి భర్తపై నెపు
    డు సంకోచంబు లేనట్టి కో
    వెల, యాలే మన వంశ వృద్ధికిర
    వౌ ప్రేమన్ ప్రసాదించులే
    ~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  12. మిత్రులందఱకు నమస్సులు!

    [ఒక యువకుఁడు తాను ప్రేమించిన యువతినిఁ గూర్చి మదిలో ననుకొను సందర్భము]

    చెలువమ్మెంతయొ డెందమందుఁ దపనన్ జెందింపఁ దా నిష్ఠుఁడై
    వలఱేనిం దన మానసమ్మున వడిన్ బ్రార్థించుచున్ స్వాంతమం
    దెలనాఁగన్ దగ నిల్పి పల్కె, "మదినిం దేలించు లేనవ్వుఱు
    వ్వెలయాలే మన వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదించులే!"

    [లేనవ్వుఱువ్వు+ఎల+ఆలు=లేనవ్వుఱు/వ్వెలయాలు; ఎల=యౌవనము గల, ఆలు=స్త్రీ]

    రిప్లయితొలగించండి
  13. కలవరపాటును బ్రతుకున
    వెలయా లొనరించు, వంశవృద్ధినిఁ బ్రేమన్
    కులసతియందించు పతికి
    వెలలేనిది ధర్మపత్ని ప్రేముడి జగతిన్

    రిప్లయితొలగించండి
  14. అలవాటు జేసి హీనత
    వెలయా లొనరించు ; వంశవృద్ధినిఁ బ్రేమన్
    నిలుపుగద యింటి యాలే
    మెలగవలయు వీటిలోని మేటి నెరుగుచున్

    రిప్లయితొలగించండి
  15. కలుముల రాణిని బోలెడు
    కలికిని సతిగాగలిగియు కాముకుడగుచో
    నిలువున దోచిన పిమ్మట
    వెలయా,లొనరించు వంశవృద్ధిని బ్రేమన్

    అలుకన్ జూపదు, భూషణంబులను సంవ్యానమ్ములన్ గోరదే
    సలహాలిచ్చుచు క్లిష్టకాలములలో సాహాయ్య మందించునే
    తలపన్ లాలన పాలనమ్ములను సాధ్యంబేన లెక్కింపగా
    వెల?యాలే మన వంశవృద్ధికిరవౌ ప్రేమన్ బ్రసాదించులే

    సంవ్యానము = వస్త్రము

    రిప్లయితొలగించండి
  16. శంకరాభరణం వారి సమస్య: “వెలయాలే మన వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదించులే”
    1)
    నా పూరణ
    " కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ , భోజ్యేషు మాతా , శయనేషు రంభా" తీరులో

    మత్తేభము :

    పలు కర్మంబులకు భార్యయే యగుఁకదా ; ప్రార్థించు దాసీ వలెన్
    మలు కార్యంబులకు కాంతయే యగుఁకదా మంత్రీసమానంబుగా
    లలి జూపన్ , తను, భుక్తిలో జనని; సల్లాపంబు గావించుటన్ ,
    “వెలయాలే, మన వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదించులే”

    - రాంబాబు కైప
    14-05-2021

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి, రెండవ పాదాలలో గణభంగం. 'దాసి వలెన్, మంత్రి సమానంబుగా' అనడం సరియైనవి.

      తొలగించండి
  17. 2) వెలయాలు , ప్రియురాలు మాత్రమే, కులకాంత కాబోదు. అని వెలయాలి గురించి ప్రశ్నల పరంపర

    వెలయాలొక ప్రియురాలే !
    వెలలేని కుసుమము వలెను వెలవెల పోదా ?
    వెలయాలగు కులకాంతే ?
    “వెలయాలొనరించు వంశవృద్ధినిఁ బ్రేమన్”?

    - రాంబాబు కైప
    14-05-2021

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కులకాంత+ఏ' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.

      తొలగించండి
  18. 3)
    కులుకుచు నట్టింట లలన ,
    గలగల మనుచును తిరగగ , కళకళ లాడున్
    తొలిపూజజేయ, లక్ష్మియు
    “వెలయాలొనరించు వంశవృద్ధినిఁ బ్రేమన్”
    (వెలయు, ఆలొ)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వెలయు(న్)' ద్రుతాంతం. 'వెలయు నాలోనరించు' అని ఉంటుంది.

      తొలగించండి
  19. 4)
    పలుకులు కోయిల కూతలు
    పలుకును నిరతము భగవతి పలుకులు ప్రియమున్
    పలుకగ గృహమే యొక కో
    “వెల, యాలొనరించు వంశవృద్ధినిఁ బ్రేమన్”

    రిప్లయితొలగించండి
  20. 5)
    కులకాంతాగమనంబునన్ గృహములో గుప్పించు ప్రేమాంబుధుల్
    నెలరాజాగమనంబునన్ గగనమౌ నీలాంబరీ కాంతిగా
    కులకాంతన్ నెలరాజు వెన్నెలలలో గూడన్ , గృహంబొక్క కో
    “వెల, యాలే మన వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదించులే”

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నెలరాజే చనుదెంచగా' అనండి.

      తొలగించండి
  21. 6)
    కలయో! వైష్ణవ మాయయో ! పతికి సాక్షాత్కారమయ్యెన్, సదా
    కులమెల్లన్ కడు మెచ్చు భార్య, పలుకుల్ కూయంచు కూయంగదే
    వెలగట్టన్ తరమా సతిన్, నిరతమున్ ప్రీతిన్ ప్రదర్శించు కో
    “వెల, యాలే మన వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదించులే”

    రిప్లయితొలగించండి
  22. 7)
    పలు మార్గంబుల గర్భధారణ సతిన్ బాయంగ లోపంబుగా
    కలకాదే యిది వేశ్య గర్భమున సాకారంబు దాల్చున్ సుతున్
    వెలయెంతో యని లోకులందరనగా వేసారి పోగా మదిన్
    “వెలయాలే మన వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదించులే”

    రిప్లయితొలగించండి
  23. 8)

    పలువిధముల చింతించుచు
    విలవిల లాడి సతిపతులు వేశ్యను గోరన్
    కులమును పెంపును జేయగ
    “వెలయా లొనరించు వంశవృద్ధినిఁ బ్రేమన్”

    రిప్లయితొలగించండి
  24. వెలగట్టున్ సుఖమందజేయు మిషతోవేశ్యాంగనా లోలుకున్
    వెలయాలే, మన వంశవృద్ధి కిరవౌప్రేమన్ బ్రసాదించులే
    కలనైనన్ తనవారి శ్రేయమును కాంక్షంజేయు నిల్లాలు తా
    నిలలో నెన్నగ పెన్నిధౌను పతికిన్ యిల్లాలు ముమ్మాటికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పెన్నిధి+ఔను' అన్నపుడు సంధి లేదు. 'పతికిన్+ఇల్లాలు' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
    2. వెలగట్టున్ సుఖమందజేయు మిషతోవేశ్యాంగనా లోలుకున్
      వెలయాలే, మన వంశవృద్ధి కిరవౌప్రేమన్ బ్రసాదించులే
      కలనైనన్ తనవారి శ్రేయమును కాంక్షంజేయు నిల్లాలె తా
      నిలలో పెన్నిధియైచెలంగు కనగానిల్లాలు ముమ్మాటికిన్

      తొలగించండి
  25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  26. ఇలపై పుట్టిన దేవకాంత కనగా నిల్లాలుగా తల్లిగా
    పలు సేవల్ సతతమ్ముచేయుచును సంభావించుచున్ పూరుషా
    ళుల కాహారమొసంగుచున్ రతములో రూపించి పోషించు కో
    వెల, యాలే మన వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదించులే

    రిప్లయితొలగించండి
  27. కలిధర్మంబున పాపసం కలితులై కామాతురోత్సాహులై
    కులికే జాతులకెల్ల భారతము లోకోక్తుల్ నివేదించెనే,
    లలనే కొల్వయి యుండదే సతము యుల్లంబెల్ల మారంగ కో
    వెల, యాలే మన వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదించులే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కులికే' అన్నది వ్యావహారికం. 'లలన+ఏ' అన్నపుడు సంధి లేదు. 'సతము+ఉల్లంబెల్ల' అన్నపుడు యడాగమం రాదు. "సతత ముల్లంబెల్ల" అనవచ్చు.

      తొలగించండి
    2. 🙏🙏సరి చేసుకొనెదనండి.

      తొలగించండి
  28. జిలేబిగారు కన్పించడం లేదు!🤔🤔

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఏమో?
      ఉగాది తర్వాత తమ 'వరూధిని' బ్లాగులోను పోస్టులు పెట్టలేదు.

      తొలగించండి
  29. కులగౌరవనాశనమే
    వెలయా లొనరించు; వంశవృద్ధినిఁ బ్రేమన్
    కులసతి దా నిలుపును గద,
    కులటల సాంగత్యమేల గోరెదరయ్యా

    రిప్లయితొలగించండి
  30. ఇలబి చ్చకునిగ మనలను
    వెలయాలొనరించు,వంశవృద్ధిని బ్రేమన్
    గలకాల మటుల గఱపుచు
    వలపులలో మునుగు చుండ్రు భార్యలు బుడమిన్

    రిప్లయితొలగించండి
  31. లలితోద్యానముపుష్పవాటికలనాలోకింపగానేలనో
    ఫలితంబంతయుపొంవచ్చునుగదతాపృధ్విన్గృహంబందునన్
    ఇలలోభార్యకుసాటిరాదుగదదేవీీస్ధానమీయిల్లుకో
    వెలయాలేమనవంశవృద్ధికిరవౌప్రేమన్ప్రసాదించులే

    రిప్లయితొలగించండి
  32. లలనలు కా రాటల బొ
    మ్మలు శక్తి సమాన లెంచ మహిలో నెల్లం
    గులసతి యనంగఁ గా దిల
    వెలయా, లొనరించు వంశవృద్ధినిఁ బ్రేమన్


    తలి యై పెట్టును గడ్పు నిండ నొసగుం దా మంత్రియై యోచనల్
    విలసిల్లున్ సిరి భంగి రూపమున సేవించుం దగన్ దాసియై
    కలలో నైనను భార్య కెవ్వరు నహో కట్టంగ లే రిద్ధరన్
    వెల, యాలే మన వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదించులే

    [వెల యిచట ద్వితీయార్థ ప్రథమలో నున్నది కనుక యడాగమము.]

    రిప్లయితొలగించండి
  33. ఇలలో నాదిమదైవమెవ్వరనగా నిల్లాలె యింకెవ్వరౌ?
    యల ప్రత్యక్షనవీనదైవమెవరో యన్నన్ దగున్ దానెయై
    తొలి యాచార్యుడు, నామె సేవ కొరకై దుష్టాత్మువై కట్టెదో
    వెల? యాలే మన వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదించులే.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  34. వెలయాలే మన వంశ వృద్ధికిరవౌ ప్రేమన్ బ్రసాదించులే
    వెలయాలందున మంచివారలును దావేవేలుగా నిద్ధరన్
    బలుచోట్లం గలరే గదా విమల! యవ్వారిన్ దురాలాపముల్
    బలుకం న్యాయమె చెప్పుమా యికను నోభామా!ముదంబే యిటన్

    రిప్లయితొలగించండి
  35. *15-05-2021(శనివారం)*
    *సమస్య: 3723*
    1)
    కలియుగవేంకటనాథా!
    బలమగుయామద్దివృక్ష పార్శ్వము నీదౌ
    తలమేతోగునగన కో
    *వెల!యాలొనరించు వంశవృద్ధినిఁ ప్రేమన్*

    2)
    కలియుగమున సంస్కృతిగని
    నిలిచినఘనులైనవారి నిజ విజ్ఞతకున్
    ఫలమందగజేయును కో
    వెల! యాలొనరించు వంశవృద్ధినిఁ ప్రేమన్

    3)
    కలలోనైనయెఱుంగవిక్రయము సత్కాలమ్ము వచ్చెన్నడో!
    పులులాదూఁకుచు వైద్యమంటు నకిలీపుణ్యాత్ములౌ చాందసుల్
    యిలలోపేదలపిండిజేసెయకటా!యింట్లోశవాలుండగన్
    వెలయా? లే! మనవంశవృద్ధికిరవౌ ప్రేమన్ ప్రసాదించులే!

    🙏✍️ --గడ్డం.లక్ష్మయ్య

    రిప్లయితొలగించండి
  36. కలియుగనాథుని భక్తుల
    తలపులు చక్కగ నెరుగుచు తమితో విడకన్
    నలిమేల్మంగయు నాకో
    వెలయాలొనరించువంశవృద్ధిన్ ప్రేమన్
    మరొక పూరణ
    అలసట యన్నది నెరుగక
    నిలలోమరవలె పనులను నిమ్ముగచేయన్
    తులతూచి కట్టగలమా
    వెల?యాలొనరించువంశవృద్ధిని ప్రేమన్

    రిప్లయితొలగించండి