26, మే 2021, బుధవారం

సమస్య - 3733

27-5-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విరహముఁ బాపుమని గౌరి వెన్నుని వేడెన్”
(లేదా...)
“విరహముఁ బాపవే యనుచు వెన్నుని వేడెను గౌరి తప్తయై”

85 కామెంట్‌లు:

 1. నరికెను సుతునపుడు శివుడు

  విరిసిన వేదనము శాంభవి గిరి తనయ శం

  కరు సతి ముద్దుల పుత్రుని

  విరహముఁ బాపుమని గౌరి వెన్నుని వేడెన్”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 2. రిప్లయిలు
  1. గజాసురుని వృత్తాంతము

   హరుడు తపంబునకు మురిసి
   వరమిచ్చెను రాక్షసునికి వైవిధ్యముగన్
   కరిముఖుని జంపి తన "పతి
   విరహముఁ" బాపుమని గౌరి వెన్నుని వేడెన్

   తొలగించండి
  2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 3. కురిసినహిమమునసరసున
  అరవిరిసినపద్మమందునమరెనులక్ష్మీ
  సురలునుపోగడగసుందరి
  విరహముబాపుమనిగౌరివెన్నునివేడెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'లక్ష్మీ' అన్న సంబోధన అక్కడ అన్వయించదనుకుంటాను. పద్యం భావం బోధపడలేదు.

   తొలగించండి
  2. కురిసినహిమమునసరసున
   నరవిరసినపద్మమందునమరెనురమయున్
   సురలునుపోగడగసుందరి
   విరహముబాపుమనిగౌరివెన్నునివేడెన్
   సవరణతో

   తొలగించండి
  3. గౌరితపముఁజేయుచుండగ, మంచుతోనిండినపద్మములోరమచలితోదాగినదిఅదిఁజూచినగౌరిరమవిరహమునుబాపుమన, వెన్నునివేడినది

   తొలగించండి
  4. కురిసినహిమమునసరసున
   నరవిరసినపద్మమందునమరెనురమయున్
   సురలునుపోగడగసుందరి
   విరహముబాపుమనిగౌరివెన్నునివేడెన్
   సవరణతో

   తొలగించండి

 4. వరమిచ్చి గజా సురుని యు
  దరమున నిల్వ తిగకంటి, ధవునికనక యా
  పరదాహముతో జని తన
  విరహము బాపుమని గౌరి వెన్నుని వేడెన్.

  రిప్లయితొలగించండి
 5. కందం
  తరలె గజాసురు నుదరము
  మఱువను బూదిపొలదిండి మసిజేసిన చా
  తురిఁ పరమేశుని విడుపున
  విరహముఁ బాపుమని గౌరి వెన్నుని వేడెన్

  చంపకమాల
  తరలె గజాసురోదరము దంపతి నెంచక నిందుమౌళి, న
  త్తెరగున మున్ను బూదిపొలదిండిని గాల్చిన మేటి నేర్పునన్
  వరద! మహేశ్వరున్ రయమె పాతకునుంచి విముక్తి జేయుచున్
  విరహముఁ బాపవే యనుచు వెన్నుని వేడెను గౌరి తప్తయై

  రిప్లయితొలగించండి
 6. సరిగనుచల్లగాలులనుచాలచలించినపద్మమందునన్
  కురిసినబిందుగుమ్మటముకూల్చెనుఱెక్కలకాంతులయ్యెడన్
  సరసిజసుందరీరమణిసన్నుతతేజముఁజేరివేడిమిన్
  విరహముఁబాపవేయనుచువెన్నునివేడెనుగౌరితప్తయై

  రిప్లయితొలగించండి
 7. ~~~~~~~~~~~~~~~~~~~~~
  కరము తపంబు జేసె దశకం
  ఠుడు శంకరు గూర్చి యేడులున్
  పరమ శివుండు రావణుని
  భక్తికి మెచ్చియు గోరినట్లుగా
  వరమిడె నాత్మలింగమును వా
  నికి యిచ్చె , నెరింగి దీనతన్
  విరహము బాపవే యనుచు
  వెన్నుని వేడెను గౌరి తప్తయై.
  ~~~~~~~~~~~~~~~~~~~~~

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "వానికి నిచ్చె" అని కదా ఉండాలి?

   తొలగించండి

 8. వరమునొసంగిదానవ కబంధము నందున జేరినట్టియా
  పురహరి కానరాక సతి పొక్కడమందుచు నంది భృంగితో
  నరమెయిజోటి వానికయి యాహరి సన్నిధి కేగి భక్తితో
  విరహము బాపవే యనుచు వెన్నుని వేడెను గౌరి తప్తయై.

  రిప్లయితొలగించండి
 9. కరిముఖ రక్కసు నుదరము
  జొర బడి నట్టి తన పతి యశో విభ వాత్మున్
  సరగున విడిపించి తనదు
  విరహము బాపు మని గౌరి వెన్నుని వేడెన్

  రిప్లయితొలగించండి
 10. క్రొవ్విడి వెంకట రాజారావు:

  వరమిడి గజాసురు కడకు
  తెరలిన నాధుని రయమున తెచ్చియు నీవున్
  కరుణను నీ చెల్లెలి దౌ
  విరహము బాపుమని గౌరి వెన్నుని వేడెన్.

  రిప్లయితొలగించండి
 11. సమస్య :
  విరహము బాపవే యనుచు
  వెన్నుని వేడెను గౌరి తప్తయై

  ( గౌరవర్ణిని రాధ - శ్యామవర్ణుడు కృష్ణుడు . కనుక ఈమె గౌరి . ఆయన శ్యాముడు .శ్యామునితో గౌరి అంటున్నది )

  చంపకమాల
  .....................

  " నిరతము నిన్నె కోరితిని
  నెమ్మనమందున శ్యామసుందరా !
  నిరపమమూర్తి ! నా యెడల
  నీ దయ నెందున దాచినావురా ?
  అరయ సుధాకరుండు కఠి
  నాత్ముడు వేచుచు నుండె ; రాగదే !
  విరహము బాపవే ! " యనుచు
  వెన్నుని వేడెను గౌరి తప్తయై .

  రిప్లయితొలగించండి
 12. మల్లెల.నాగరాజ


  ధరకు త్రివేణిఁ దెచ్చుటకు తాపము వేడె భగీరథుం డహో
  వరము లొసంగి గంగఁ దలపై ధరియించి చరించుచుండఁ గం
  పరమగుఁ జూడగా మనసు పాడగు నూడుచు యుక్తి జెప్పి, నా
  విరహము బాపవే యనుచు వెన్నుని వేడెను గౌరి తప్తయై!

  రిప్లయితొలగించండి
 13. కరిరాక్షసు నాకాంక్షను
  పురహరుడు వసింప యతని బొజ్జను తృప్తిన్
  శరణాగతి తో సోదరి
  విరహము బాపుమని గౌరి వెన్నుని గోరెన్

  అరమర లేనివాడు వరయాశ్రితవత్సలుడై గజాసురో
  దరమునుజొచ్చి నిష్ఠురము దారను వాసము విస్మరించెనే
  కరివరదా!మనోహరుని గానగలేక కృశించు చెల్లికిన్
  విరహము బాపవేయనుచు వెన్నుని గోరెను గౌరితప్తయై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   "వసింప నతని..."
   "లేనివాడు హరు డాశ్రిత..." అనండి (వర+ఆశ్రిత=వరాశ్రిత)

   తొలగించండి
  2. ధన్యవాదములాచార్యా! సవరించెదను!🙏🙏🙏

   తొలగించండి
  3. సవరణలతో
   కరిరాక్షసు నాకాంక్షను
   పురహరుడు వసింప నతని బొజ్జను తృప్తిన్
   శరణాగతి తో సోదరి
   విరహము బాపుమని గౌరి వెన్నుని గోరెన్

   అరమర లేనివాడు హరుడా శ్రితవత్సలుడై గజాసురో
   దరమునుజొచ్చి నిష్ఠురము దారను వాసమువిస్మరించెనే
   కరివరదా!మనోహరుని గానగలేక కృశించు చెల్లికిన్
   విరహము బాపవేయనుచు వెన్నుని గోరెను గౌరితప్తయై

   తొలగించండి
 14. హరుఁడు హిమాలయమ్మున సుఖాంబుధిఁ దేలుచు పల్కె నిట్టులన్
  "హరి వటువై చనెన్ బలి యహమ్ము నడంచఁగఁ గార్యశూరుఁడై
  తిరిగి వికుంఠ మేగిన మదిన్ ముదమందిన శ్రీలలామయే
  విరహము బాపవే యనుచు వెన్నుని గోరెను గౌరి! తప్తయై"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గౌరి అను గృహిణి పలుకులుగా...

   "పరదేశము సనె నా పతి
   తిరిగి యెపుడు వచ్చునొ కడు దీనాత్మను స
   త్వరమె యతని రప్పించియు
   విరహము బాపు" మని గౌరి వెన్నుని వేడెన్.

   తొలగించండి
 15. మురళీ కృష్ణుని చెలియల
  పరివారములోగలదొక బాలామణి ‘శ్రీ
  గౌరి’ యను నామముగలది
  విరహముఁ బాపుమని గౌరి వెన్నుని వేడెన్

  రిప్లయితొలగించండి
 16. హరుడసుర యుదరమందున
  జెరబడుట నెరుగని గిరిజ చింతించి మనో
  హరుని యునికిని యెరిగి దన
  విరహముఁ బాపుమని గౌరి వెన్నుని వేడెన్

  రిప్లయితొలగించండి
 17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 18. అరయగ హిరణ్యనేత్రుని
  హరి సూకరమై సరిగొని, యవనిని గాచన్
  మురిపెముతో పులకరమున
  విరహముఁ బాపుమని గౌరి వెన్నుని వేడెన్.

  రిప్లయితొలగించండి
 19. హరుని తపంబునన్ గొలిచి యాతని గోరెనుగా గజాసురే
  కరముల మ్రొక్కుచున్ "సుఖము గానిలు నాయుదరంబునన్ నువే"
  పరమ శివిండు తానిలిచె వానుదరంబున, నాధుగానకన్
  "విరహముఁ బాపవే " యనుచు వెన్నుని వేడెను గౌరి తప్తయై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "గజాఖ్యుడే... యుదరంబునన్ హరా.. శివుండు.." అనండి. 'వాని+ఉదయము' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.

   తొలగించండి
  2. హరుని తపంబునన్ గొలిచి యాతని గోరెనుగా గజాఖ్యుడే
   కరముల మ్రొక్కుచున్ "సుఖము గానిలు నాయుదరంబునన్ హరా"
   పరమ శివుండు తానిలువ పాతకుకుక్షము, నాధుగానకన్
   విరహముఁ బాపవే యనుచు వెన్నుని వేడెను గౌరి తప్తయై -- thanks Sankarayya gaaru

   తొలగించండి
 20. మొరటు, హిరణ్యనేత్రుడటు భూరిప్రతాపుఁడు లోకకంటకున్
  ధర భరియింప జాలక సుధాజలధిన్ నగుమోము వానిఁ వేఁ
  డ, రమణుఁ డాదిచక్రముఖుడై సమయింపగ, మోదమందుచున్
  విరహముఁ బాపవే యనుచు వెన్నుని వేడెను గౌరి తప్తయై.

  ఆదిచక్రముఖుడు-ఆదివరాహము
  గౌరి - భూదేవి

  రిప్లయితొలగించండి
 21. వరుసగవరములనిచ్చుచుఁ
  బరవశమైఁబరమశివుడుభక్తులజేరన్,
  ద్వరితముఁగొనివచ్చిఁదనదు
  విరహముఁ బాపుమని గౌరి వెన్నుని వేడెన్

  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 22. తరుణియె దగ్ధమయ్యె కుపితమ్మున దక్షుని యజ్ఞ వాటికన్

  మరణముగాంచి ఖేదమున మారుని వైరియె సన్యసించగన్

  మరునిని పంపి శంకరుని మార్గము మార్చర ఆది దంపతు
  ల్విరహముఁ బాపవే యనుచు వెన్నుని వేడెను గౌరి తప్తయై”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 23. పవిత్రమైన యమునానది బృందావనం సందర్శిస్తున్న పార్వతి అచ్చట రాధిక అనుభవిస్తున్న విరహవేదనకు చలించి తన సోదరునితో ...

  సరసవిలాసధూర్తకృతచర్యల దేల్చి యమానుజాతటిన్
  మరులనుగొల్పువేణురవమాధురులం జవిఁ జూపి, నేడు దు
  ర్భరకటువిప్రయోగపరివర్ధితదుస్సహనీయరాధికా
  విరహముఁ బాపవే యనుచు వెన్నుని వేడెను గౌరి తప్తయై.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 24. పరిణయ మాడగ పార్వతి
  పరిచర్యలుజేసి కొల్చె పరమేశ్వరునిన్
  హరుడి జడమడగ వరమిడి
  విరహము బాప మని గౌరి వెన్నుని గోరెన్

  రిప్లయితొలగించండి
 25. మఱచెనొ యేమొ నా యునికి మాయను జిక్కెనొ మెచ్చి యా గజా
  సురుని తపమ్ము వచ్చెదను చూచి యటంచును జెప్పి పోయె మ త్పురుషుఁడు శంభుఁ డన్న! యెటఁ బోయెనొ కన్గొన నీవె యింక మ
  ద్విరహము బాపవే యనుచు వెన్నుని వేడెను గౌరి తప్తయై.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   '..యెటఁ బోయెనొ కన్గొని..' అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
 26. స్థిరముగఁగంగనెత్తుకొనిశీర్షముఁబైననుజేర్చినాడహో
  నిరతముతీర్థయాత్రలకునెయ్యముతోడుతగంగయేగనన్
  భరముగభాషణంబుననుభక్తులముచ్చటదీర్చుచుండ,దా
  విరహముఁ బాపవే యనుచు వెన్నుని వేడెను గౌరి తప్తయై

  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 27. నిరతము కాటిలో తిరిగి నిండగు ప్రేమను పంచ కుండె నా
  సరసకు రాడు రాత్రికిని చల్లని వెన్నెలలోన నాడగా
  నరహరి! నీవె దిక్కు వడి నాథునికిన్ వివరించి నావ్యథన్
  విరహముఁ బాపవే యనుచు వెన్నుని వేడెను గౌరి తప్తయై

  రిప్లయితొలగించండి
 28. పరి పరి సేవలన్ కొలిచె పార్వతి భక్తిని శంభునిన్ వృధా
  హరణము నయ్యె కాలమును, హారతి యయ్యెను యవ్వనంబు, ఆ
  హరునికి ప్రేమలున్ గలుగ, హాయిని బొంద మహేశ్వరు పొందుకై
  విరహముఁ బాపవే యనుచు వెన్నుని వేడెను గౌరి తప్తయై.

  రిప్లయితొలగించండి
 29. కం//
  పరమేశుని జపమందున
  పరితాపము జెందుచుంటి బాలుని వైనన్ !
  కరములు మోడ్చెద మదిలో
  విరహముఁ బాపుమని గౌరి వెన్నుని వేడెన్ !!

  రిప్లయితొలగించండి
 30. పదహారు వేల మంది గోపికలలో గౌరి కూడా ఒక గోపికగా ఈ నా ప్రయత్నము:

  ఉ:

  గిరిధర నీదు నామమును కీర్తన చేయుచు విస్మరింపకన్
  పరిపరి వైనముల్ మదిని పాడుచు వేడుచు సంస్మరించుచున్
  నిరతము సొఖ్య మందగను నిక్కము జీవిత సార మెంచగన్
  విరహము బాపవే యనుచు వెన్నుని వేడెను గౌరి తప్తయై

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 31. కరుణకు దాను స్థానమను ఖ్యాతిని గాంచ విభుండు దుర్మతుల్
  వరములు గోర నిచ్చుచును వారల చెంతనె జేరు నిచ్చ లో
  హరి! యనుజా! పినాకి కెటులైన హితంబును బోధచేసి నా
  విరహముఁ బాపవే యనుచు వెన్నుని వేడెను గౌరి తప్తయై.

  రిప్లయితొలగించండి
 32. మిత్రులందఱకు నమస్సులు!

  సరగున వచ్చి, యా భృగువు, శౌరిని వక్షముపైనఁ దన్నఁగాఁ,
  ద్వరపడి లక్ష్మి డిగ్గి, పెనుఁ దామసమంది, ముకుందు వీడియున్,
  సరసిని నుండఁ, గాంచియు, వెసన్ జని, "యన్నయ! వేగ లక్ష్మి కీ

  విరహముఁ బాపవే!" యనుచు వెన్నుని వేడెను గౌరి తప్తయై!

  రిప్లయితొలగించండి
 33. వరమిడెనీశుఁడసురుని యు
  దరంబున వసింతునంచు దానట జిక్కెన్
  సరగున విడిపింపుము నా
  విరహముఁ బాపుమని గౌరి వెన్నుని వేడెన్

  రిప్లయితొలగించండి
 34. హర ధాత్రాదుల పిమ్మట
  హిరణ్యకశిపుఁ బరిమార్చితే యిక నైనన్
  నరహరి! శాంతించి రమా
  విరహముఁ బాపు మని గౌరి వెన్నుని వేఁడెన్


  హరి కరి రక్షకుండ గతి యంచు మనమ్మున విశ్వసించుచున్
  వరము నొసంగి చిక్కెఁ బతి పన్నుగ వెల్వడఁ జేయు మంచుఁ దా
  నరహరిఁ గాంచి తెల్పి నిజ నాథు గజాసుర గర్భ సంస్థితున్
  విరహముఁ బాపవే యనుచు వెన్నుని వేఁడెను గౌరి తప్తయై

  రిప్లయితొలగించండి
 35. కరమును మోహము గలుగగ
  గిరిజే దాజేరి కృష్ణు గిరిధర!వినుమా
  హరుని నొడబరచి యేనా
  విరహము బాపుమని గౌరి వెన్నుని వేడెన్

  రిప్లయితొలగించండి
 36. నిరతము రాజశేఖరుని నెమ్మది భావనజేయు గౌరి దా
  హరునికి భార్య,యౌ టకునె నార్తిని ఘోరపపంబు జేసియున్
  హరికిని బల్కె నిట్లుగను నాభవుతోడను జెప్పి యిప్పుడే
  విరహము బాపవే యనుచు వెన్నుని వేడెను గౌరి తప్తయై

  రిప్లయితొలగించండి
 37. నిరతము రుద్రావాసము
  హరుడు నెలవుగానొనర్చి యంబను మరువన్
  పురహరుని కలిపి తనకున్
  విరహముఁ బాపుమని గౌరి వెన్నుని వేడెన్

  రిప్లయితొలగించండి
 38. నిరతము వల్లకాటికడ నిర్మల నిశ్చల నిర్వికారుడై
  పరమశివుండు తాపసిగ భస్మవిభూషణుడై దలిర్చగా
  పురహరు బాసి ఖేదమును బొందిపతిన్జతగూర్చి నాదుయీ
  విరహముఁ బాపవే యనుచు వెన్నుని వేడెను గౌరి తప్తయై

  రిప్లయితొలగించండి
 39. వరముల నిడుచును తననే
  మరచుచునసురేంద్రువెంట మహిలో సాగన్
  పెరిగిన యాపతిదేవుని
  విరహము బాపుమనిగౌరి వెన్నుని కోరెన్

  రిప్లయితొలగించండి