26-5-2021 (బుధవారం)కవిమిత్రులారా,నాలుగు పాదాలలో యతి స్థానాలలోవరుసగా పా - రా - వా - రం అక్షరాలను న్యస్తం చేస్తూసముద్ర మథనాన్ని వర్ణిస్తూస్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.
పట్ట తోకను దివిజులు ,పాము పడగరాక్షసులు పట్టెను, వర నారాయణుండుపర్వతము క్రింద కూర్మమై వాలయముగరక్ష నిడ, చిలికిరి సాగరంబు నపుడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు."రాక్షసులు పట్టిరి... కూర్మమై వాటముగము..." అనండి.
బ్రహ్మ రసమును సాధింప పాల సంవరమ్మును మదింప దలచి సురాసురు లటవాసుకియె పాశముగ జేసి వార్ధి చిలుకరమయు నుడ్వీశుడు మదాంబరంబు పుట్టె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పానమమ్రుతంబుచేయనుపాటుబడిరిరాక్షసానీకవైరులురహినిగలిగివాసుదేవునిరక్షయేవారికుండెరంగమందునదైత్యుడురాడుతుదకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'పాన మమృతంబు..' టైపాటు.
ధన్యవాదములండిగురువుగారు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
భారమును మోసెనుగ చక్ర పాణి తానులక్ష్మి యుద్భవించెను సుర రాజు బ్రోవపాహి యనగలోకులు, గాచె వారిని గరళమును తనకంఠ సీమన రంగరించిహరుడు హరిహరు లెదగు నిహపరమీయ
వనధి వద్దకు జేరిన పావన సుర రవము విని యు దైత్య గణము రాగలిగియు వలసిన విధపు సాయము వాంఛితముగ రయము వార్ధి మధన మొన రంగ జేసె
వాసవాదులు దైత్యులు పాలకడలిద్రచ్చగాబుట్టె శ్రీలక్ష్మి , రాజు, విషము,పారిజాతము , తెల్లని వారణమ్ములక్ష్మి చేబట్టె ముదమున రంగనాథు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.డు ప్రత్యయం లేకుండా రంగనాథు అన్నారు. "లక్ష్మి జేపట్టితె ముదాన రంగనాథ!" అందామా?
ధన్యవాదములాచార్యా! సవరిస్తాను.🙏🙏🙏
సవరణతోవాసవాదులు దైత్యులు పాలకడలిద్రచ్చగాబుట్టె శ్రీలక్ష్మి , రాజు, విషము,పారిజాతము , తెల్లని వారణమ్ములక్ష్మి చేబట్టె ముదమున రంగశాయి
క్రొవ్విడి వెంకట రాజారావు:వాసుకి త్రాడు నవ్వగను పాల సముద్రమునంత చిల్కుచున్రాసము జేయుచున్ సురలు రాక్షసు లందరు గోలగోలగన్పాసెము రూపు నబ్ధిజను వాసిగ పొందెడి లక్ష్యము తోడ నెంతొ పేరాసను స్పర్థ గూడుచు తరంతము నెంచిరి కోర్కె తీరగన్.
తరంతము= సముద్రము)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మూడవ పాదంలో గణభంగం. సవరించండి.
గురువు గారికి నమస్సులు. పొరబాటును సరిచేశాను. పరిశీలించండి. వాసుకి త్రాడు నవ్వగను పాల సముద్రమునంత చిల్కుచున్రాసము జేయుచున్ సురలు రాక్షసు లందరు గోలగోలగన్పాసెము రూపు నబ్ధిజను వాసిగ పొందెడి దృష్టితోడ పే రాసను స్పర్థ గూడుచు తరంతము నెంచిరి కోర్కె తీరగన్.
వాసుకిరజ్జుఁగాఁగనటుపాలసముద్రముజిల్కనెంచ,నారాసముకోసమైనచటరాక్షసులందరుఁబాలుగోఱగన్బాసలుసేసిదేవతలువాలముబట్టిరిశక్తిహీనులైరాసిగఁబొంగువారగనురంగమునిల్చిరిగామితార్థులైకొరుప్రోలు రాధాకృష్ణ రావు
పావని సిరిని చేపట్టి పావనుండురత్న కడలికల్లుండయ్యె రాగముననువరదుడునసుర వైరి , భవాని పతి పరమ శివుడు మింగె గరళము రంభ సాక్షి...భారతీనాథ్ చెన్నంశెట్టి...
ఆటవెలదిపర్వతమ్ముదెచ్చి పాలకడలిఁజిల్కరసమొదవ హరుఁడు బిరాన గ్రోలెలక్ష్మి పుట్టి హరికి రాణి యయ్యె ,హరి విలాసము సుధ సురలు రంజిల నిడెఉత్పలమాలవాసుకి రజ్జుయై గిరియె పాలసముద్రముఁ జిల్కు కవ్వమైలాసము సాగగన్ హరి నిరాశను బాపగ లోన కూర్మమైబాసట గ్రోలె నా విషము వాముడు, నింది హిమాంశువుల్ కడన్రా. .,సుధ మోహినీ హొయల రంజిల వేల్పులుఁ బంచె విష్ణువే
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. 'రజ్జు+ఐ' అన్నపుడు యడాగమం రాదు. "వాసుకు రజ్జుగా/నై..." అనండి.
🙏ధన్యోస్మి గురుదేవా🙏సవరించుకుంటాను. ఉత్పలమాలవాసుకి రజ్జునై గిరియె పాలసముద్రముఁ జిల్కు కవ్వమైలాసము సాగగన్ హరి నిరాశను బాపగ లోన కూర్మమైబాసట గ్రోలె నా విషము వాముడు, నింది హిమాంశువుల్ కడన్రా. .,సుధ మోహినీ హొయల రంజిల వేల్పులుఁ బంచె విష్ణువే
సవరించినఆటవెలదిపర్వతమ్ముదెచ్చి పాలకడలిఁజిల్కరసమొదవ హరుఁడు బిరాన గ్రోలెపార్థివిఁ గొనిన ఖగవాహనుని విలాసము సుధ సురలు రంజిల నిడె ఆటవెలది
పట్టుబట్టి సురలు పాలకడలి చెంతరయముగానుకలిసి రాక్షసులనుబాయకచిలుకంగ వాసిగా నృత్యమురహిని గూర్చ బుట్టె రంజుగాను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'నృత్యము'? "వాసిగా నమృతమ్ము" అనవచ్చు కదా?
వాసుకియమరె మథియించు *పా*శముగనురాక్షసులుదేవతలుగూడి *రా*గనటకువారు మథనంబు సలుపగ *వా*ర్ధినుండికంజముద్భవమొందెను *రం*జనముగ
న్యస్తాక్షరి :నాలుగుపాదాలలో యతిస్థానాలలో పా -రా -వా -రం అనే అక్షరాలు ఉంచుతూ సముద్రమథన వర్ణనం స్వేచ్ఛాఛందస్సులో పట్టు సడలని యోచన పాదుగొల్పి రభస మొప్పార దేవతారాక్షసులును వాసుకినిబట్టుచు వదనవాలములను ;రత్నజలధిని చిలికిరి రంగు లెగయ .( రంగులు - కాంతులు )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఉ:బాసగ బొంది దేవతలు పాల సముద్రము జిల్క నెంచనైరాసిని వచ్చి నిల్చిరట రాక్షసు ద్రోయ జయింప క్లేశముల్వాసుకి చేర రజ్జుగను వాటము కొద్ది మథింప గొండనున్లాసిగ శబ్దముల్ వెడలి రంగము గూర్చె జనింప కంజమున్రాసి=రాశికంజము =అమృతమువై. చంద్రశేఖర్
ధన్యవాదములు
పాల సంద్రము జిలుకనుపాయమెంచిరాక్షసులతోడ సంధికి రాదలంచివారినొప్పించిదైత్యులు వాడుకొనగరంగమందున కార్యమారంభమయ్యె
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅2)శంకరాభరణం వారి సమస్య : పా - రా - వా - రం అక్షరాలను న్యస్తం చేస్తూ, సముద్ర మథన ఘట్టం లోని లక్ష్మీ ఆవిర్భావం వర్ణిస్తూ పూరణ తే .గీ . రమణి కంకణములతోడ రాక తెలిపె పట్టు బట్టల నిచ్చెను పాల కడలి లక్ష్మి వైకుంఠమేగె వరంబు పొంది ప్రభువు సతిగను వెలిసెను వారిజాక్షి - రాంబాబు కైప 25-05-2021🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
బాగుంది. కాని న్యస్తాక్షరాల వరుస తప్పింది.
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅శంకరాభరణం వారి సమస్య : పా - రా - వా - రం అక్షరాలను యతి స్థానంలో న్యస్తం చేస్తూ, సముద్ర మథనాన్ని వర్ణిస్తూ పూరణ ఉ.మా. పాలకులెల్ల వేడగను*పా*యము జెప్పెను విష్ణుమూర్తియే ; రాలును స్త్యేనమంచు నట *రా*క్షస మూకని స్వాగతించగా పాలసముద్రమే కడవ ; *వా*సుకి రజ్జుగ, కొండ కవ్వమై లాలస చిత్తులై చిలక, *రం*జిలు లక్ష్మియు నుద్భవించెనే - రాంబాబు కైప 25-05-2021🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
వాసుకి నొక రజ్జుగ జేసి ‘పా’ల సాగరమును చిలుకగ , శిరమును ‘రా’క్ష స గుమిపట్టుకొని సురలకు దాని ‘వా’లమొసగలక్షణముగ నామధనమా’రం’భ మయ్యెరజ్జు = త్రాడు
కె.వి.యస్. లక్ష్మి: పావనముగను చిలికిరి పాలకడలి రయము తోడను దేవతల్ రాక్షసులును వచ్చె నమృతంపు కలశమే వాసిగొనగ లక్షణంబుగ పంచె పురంధరుండు.
పరమపావన మైనట్టి పాలకడలిత్రచ్చి రల సురలమృతము రాదలంచిబలయుతనిశాచరుల తోడ వార్యమనుచుభ్రమల ముంచిరి వారి నారంభమతులు.కంజర్ల రామాచార్య.
తే.గీ.భాగ్య మని త్రాడుగాజేర (పా)పఱేడుగ్రావ మట నిల్వ కవ్వమై (రా)ణ కదురవాసుదేవుండు కూర్మమై (వా)సి కెక్కద్రచ్చి రబ్ధిని కాంక్ష తీ(రం)గ వారు.
పన్నగము రజ్జుగా జేసి *పా* లకడలిత్రచ్చగా నాదితేయులు *రా* త్రిచరులువత్తిడిని తాళ జాలక *వా* సుకి విడరసము, శంకరుడు గొనె స్థి *రం* పు మదిని
వాసుకి త్రాడుగా నునిచి పాలసముద్రము జిల్గగా సురల్ లాసము రీతినిన్ మిగుల రావము జేయుచు గాలకూటమే భాసిల,యంతటన్ వెఱచి వాసవు డాదిగ సర్వులున్ గనన్ రాసుధ యంచునా యజుడు రంజిలు నట్లుగ బంచెవారికిన్
జిల్కగా
పాశము రా ఫణి వాసుకి యాశను గిరి మందరంబ యా కవ్వము గా నా శుభ బారావారం బీశుని కృపఁ ద్రచ్చి రెల్ల రీ సుర లసురుల్
యతి స్థానములో నన్నది విస్మరించితిని. మఱియొక పూరణము చేసెదను.
వాసుకి భుజగమ్ము పాశ మయ్యెను మందరంబు భీమ శైల రాజ మయ్యె వరపుఁ గవ్వ మప్డు వార్ధి జిల్కిరట సురలు నసురవరులు వరం బిడ హరి
వార్ధిఁ జిల్కిరట
పాము గిరికి జుట్టి చిలుక పాలకడలిరాక్షసులును సురలు దొల్త రాలె విషమువాముడది గ్రోలి దా గావ వారనంతరంబున బడసిరమృతంబు రంజనమున
వాటముగా గిరీంద్రమును పాలసముద్రమునందు డించి యారాటము మీర దేవతలు రాక్షసులు న్మథియించుచుండ నప్పాటున ముందుగా విషపు వాహిను లాయెను శంభుఁ డాపె మండ్రాటము బిమ్మట న్మదులు రంజిల నాయె సుధోదయ మ్మహో!
పాల కడలి మథనమందు పాల్గొనంగ దీక్ష తోడుత వేల్పులు రాక్షసులను వఱల ఫణి శిరము సురలు వాలము గొన రాత్రి చరులుండ త్రచ్చుటా రంభ మయ్యె
పాటు పడి చిలుకగ పాల క డలి, మందరంబును కొని వచ్చి రాపిడొ రయవడిగ త్రిప్పి చుట్టి వాసుకిన్ లాగగారగిలె క్షీర సాగ రంబు విషము బుట్టి.పారెను కాల్చుచున్ విషము పాలసముద్రము నుండి చిల్కగన్రారిటు దేవతల్ జడిసి, రాలగ తారలు, గౌరి నాధునిన్వారణ సేయ గోరగ చివాలున గైకొని మ్రింగె నీశుడున్రాక్షస వీరులున్, సురులు రంజిల నాగరళంబు నంతయున్.
మిత్రులందఱకు నమస్సులు!వాసిగ దేవదానవులు [పా]లసముద్రముఁ ద్రచ్చుకోసమైత్రాసము లేక మంథగిరి [రా]జిల వాసుకిఁ జుట్టి చిల్కగాభాసుర రీతి మున్గఁగను [వా]రిశు వేడఁగఁ గూర్మమై గిరిన్లాసిగ వీఁపు నుంపఁగను [రం]జిలుచున్ సుధ పుట్టెరా తుదన్!
పట్ట తోకను దివిజులు ,పాము పడగ
రిప్లయితొలగించండిరాక్షసులు పట్టెను, వర నారాయణుండు
పర్వతము క్రింద కూర్మమై వాలయముగ
రక్ష నిడ, చిలికిరి సాగరంబు నపుడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"రాక్షసులు పట్టిరి... కూర్మమై వాటముగము..." అనండి.
రిప్లయితొలగించండిబ్రహ్మ రసమును సాధింప పాల సంవ
రమ్మును మదింప దలచి సురాసురు లట
వాసుకియె పాశముగ జేసి వార్ధి చిలుక
రమయు నుడ్వీశుడు మదాంబరంబు పుట్టె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపానమమ్రుతంబుచేయనుపాటుబడిరి
రిప్లయితొలగించండిరాక్షసానీకవైరులురహినిగలిగి
వాసుదేవునిరక్షయేవారికుండె
రంగమందునదైత్యుడురాడుతుదకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పాన మమృతంబు..' టైపాటు.
ధన్యవాదములండిగురువుగారు
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభారమును మోసెనుగ చక్ర పాణి తాను
తొలగించండిలక్ష్మి యుద్భవించెను సుర రాజు బ్రోవ
పాహి యనగలోకులు, గాచె వారిని గర
ళమును తనకంఠ సీమన రంగరించి
హరుడు హరిహరు లెదగు నిహపరమీయ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివనధి వద్దకు జేరిన పావన సుర
రిప్లయితొలగించండిరవము విని యు దైత్య గణము రాగలిగియు
వలసిన విధపు సాయము వాంఛితముగ
రయము వార్ధి మధన మొన రంగ జేసె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివాసవాదులు దైత్యులు పాలకడలి
రిప్లయితొలగించండిద్రచ్చగాబుట్టె శ్రీలక్ష్మి , రాజు, విషము,
పారిజాతము , తెల్లని వారణమ్ము
లక్ష్మి చేబట్టె ముదమున రంగనాథు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిడు ప్రత్యయం లేకుండా రంగనాథు అన్నారు. "లక్ష్మి జేపట్టితె ముదాన రంగనాథ!" అందామా?
ధన్యవాదములాచార్యా! సవరిస్తాను.🙏🙏🙏
తొలగించండిసవరణతో
తొలగించండివాసవాదులు దైత్యులు పాలకడలి
ద్రచ్చగాబుట్టె శ్రీలక్ష్మి , రాజు, విషము,
పారిజాతము , తెల్లని వారణమ్ము
లక్ష్మి చేబట్టె ముదమున రంగశాయి
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండివాసుకి త్రాడు నవ్వగను పాల సముద్రమునంత చిల్కుచున్
రాసము జేయుచున్ సురలు రాక్షసు లందరు గోలగోలగన్
పాసెము రూపు నబ్ధిజను వాసిగ పొందెడి లక్ష్యము తోడ నెంతొ పే
రాసను స్పర్థ గూడుచు తరంతము నెంచిరి కోర్కె తీరగన్.
తరంతము= సముద్రము)
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదంలో గణభంగం. సవరించండి.
గురువు గారికి నమస్సులు. పొరబాటును సరిచేశాను. పరిశీలించండి.
తొలగించండివాసుకి త్రాడు నవ్వగను పాల సముద్రమునంత చిల్కుచున్
రాసము జేయుచున్ సురలు రాక్షసు లందరు గోలగోలగన్
పాసెము రూపు నబ్ధిజను వాసిగ పొందెడి దృష్టితోడ పే
రాసను స్పర్థ గూడుచు తరంతము నెంచిరి కోర్కె తీరగన్.
వాసుకిరజ్జుఁగాఁగనటుపాలసముద్రముజిల్కనెంచ,నా
రిప్లయితొలగించండిరాసముకోసమైనచటరాక్షసులందరుఁబాలుగోఱగన్
బాసలుసేసిదేవతలువాలముబట్టిరిశక్తిహీనులై
రాసిగఁబొంగువారగనురంగమునిల్చిరిగామితార్థులై
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపావని సిరిని చేపట్టి పావనుండు
రిప్లయితొలగించండిరత్న కడలికల్లుండయ్యె రాగమునను
వరదుడునసుర వైరి , భవాని పతి ప
రమ శివుడు మింగె గరళము రంభ సాక్షి
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండిపర్వతమ్ముదెచ్చి పాలకడలిఁజిల్క
రసమొదవ హరుఁడు బిరాన గ్రోలె
లక్ష్మి పుట్టి హరికి రాణి యయ్యె ,హరి వి
లాసము సుధ సురలు రంజిల నిడె
ఉత్పలమాల
వాసుకి రజ్జుయై గిరియె పాలసముద్రముఁ జిల్కు కవ్వమై
లాసము సాగగన్ హరి నిరాశను బాపగ లోన కూర్మమై
బాసట గ్రోలె నా విషము వాముడు, నింది హిమాంశువుల్ కడన్
రా. .,సుధ మోహినీ హొయల రంజిల వేల్పులుఁ బంచె విష్ణువే
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి'రజ్జు+ఐ' అన్నపుడు యడాగమం రాదు. "వాసుకు రజ్జుగా/నై..." అనండి.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిసవరించుకుంటాను.
ఉత్పలమాల
వాసుకి రజ్జునై గిరియె పాలసముద్రముఁ జిల్కు కవ్వమై
లాసము సాగగన్ హరి నిరాశను బాపగ లోన కూర్మమై
బాసట గ్రోలె నా విషము వాముడు, నింది హిమాంశువుల్ కడన్
రా. .,సుధ మోహినీ హొయల రంజిల వేల్పులుఁ బంచె విష్ణువే
సవరించినఆటవెలది
తొలగించండిపర్వతమ్ముదెచ్చి పాలకడలిఁజిల్క
రసమొదవ హరుఁడు బిరాన గ్రోలె
పార్థివిఁ గొనిన ఖగవాహనుని వి
లాసము సుధ సురలు రంజిల నిడె ఆటవెలది
పట్టుబట్టి సురలు పాలకడలి చెంత
రిప్లయితొలగించండిరయముగానుకలిసి రాక్షసులను
బాయకచిలుకంగ వాసిగా నృత్యము
రహిని గూర్చ బుట్టె రంజుగాను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నృత్యము'? "వాసిగా నమృతమ్ము" అనవచ్చు కదా?
వాసుకియమరె మథియించు *పా*శముగను
రిప్లయితొలగించండిరాక్షసులుదేవతలుగూడి *రా*గనటకు
వారు మథనంబు సలుపగ *వా*ర్ధినుండి
కంజముద్భవమొందెను *రం*జనముగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిన్యస్తాక్షరి :
రిప్లయితొలగించండినాలుగుపాదాలలో యతిస్థానాలలో పా -రా -వా -రం
అనే అక్షరాలు ఉంచుతూ సముద్రమథన వర్ణనం స్వేచ్ఛాఛందస్సులో
పట్టు సడలని యోచన పాదుగొల్పి
రభస మొప్పార దేవతారాక్షసులును
వాసుకినిబట్టుచు వదనవాలములను ;
రత్నజలధిని చిలికిరి రంగు లెగయ .
( రంగులు - కాంతులు )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఉ:
రిప్లయితొలగించండిబాసగ బొంది దేవతలు పాల సముద్రము జిల్క నెంచనై
రాసిని వచ్చి నిల్చిరట రాక్షసు ద్రోయ జయింప క్లేశముల్
వాసుకి చేర రజ్జుగను వాటము కొద్ది మథింప గొండనున్
లాసిగ శబ్దముల్ వెడలి రంగము గూర్చె జనింప కంజమున్
రాసి=రాశి
కంజము =అమృతము
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిపాల సంద్రము జిలుకనుపాయమెంచి
రిప్లయితొలగించండిరాక్షసులతోడ సంధికి రాదలంచి
వారినొప్పించిదైత్యులు వాడుకొనగ
రంగమందున కార్యమారంభమయ్యె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
రిప్లయితొలగించండి2)
శంకరాభరణం వారి సమస్య :
పా - రా - వా - రం అక్షరాలను న్యస్తం చేస్తూ, సముద్ర మథన ఘట్టం లోని
లక్ష్మీ ఆవిర్భావం వర్ణిస్తూ పూరణ
తే .గీ .
రమణి కంకణములతోడ రాక తెలిపె
పట్టు బట్టల నిచ్చెను పాల కడలి
లక్ష్మి వైకుంఠమేగె వరంబు పొంది
ప్రభువు సతిగను వెలిసెను వారిజాక్షి
- రాంబాబు కైప
25-05-2021
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
బాగుంది. కాని న్యస్తాక్షరాల వరుస తప్పింది.
తొలగించండి🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
రిప్లయితొలగించండిశంకరాభరణం వారి సమస్య :
పా - రా - వా - రం అక్షరాలను యతి స్థానంలో న్యస్తం చేస్తూ, సముద్ర మథనాన్ని వర్ణిస్తూ పూరణ
ఉ.మా.
పాలకులెల్ల వేడగను*పా*యము జెప్పెను విష్ణుమూర్తియే ;
రాలును స్త్యేనమంచు నట *రా*క్షస మూకని స్వాగతించగా
పాలసముద్రమే కడవ ; *వా*సుకి రజ్జుగ, కొండ కవ్వమై
లాలస చిత్తులై చిలక, *రం*జిలు లక్ష్మియు నుద్భవించెనే
- రాంబాబు కైప
25-05-2021
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివాసుకి నొక రజ్జుగ జేసి ‘పా’ల సాగ
రిప్లయితొలగించండిరమును చిలుకగ , శిరమును ‘రా’క్ష స గుమి
పట్టుకొని సురలకు దాని ‘వా’లమొసగ
లక్షణముగ నామధనమా’రం’భ మయ్యె
రజ్జు = త్రాడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండిపావనముగను చిలికిరి పాలకడలి
రయము తోడను దేవతల్ రాక్షసులును
వచ్చె నమృతంపు కలశమే వాసిగొనగ
లక్షణంబుగ పంచె పురంధరుండు.
పరమపావన మైనట్టి పాలకడలి
రిప్లయితొలగించండిత్రచ్చి రల సురలమృతము రాదలంచి
బలయుతనిశాచరుల తోడ వార్యమనుచు
భ్రమల ముంచిరి వారి నారంభమతులు.
కంజర్ల రామాచార్య.
తే.గీ.
రిప్లయితొలగించండిభాగ్య మని త్రాడుగాజేర (పా)పఱేడు
గ్రావ మట నిల్వ కవ్వమై (రా)ణ కదుర
వాసుదేవుండు కూర్మమై (వా)సి కెక్క
ద్రచ్చి రబ్ధిని కాంక్ష తీ(రం)గ వారు.
పన్నగము రజ్జుగా జేసి *పా* లకడలి
రిప్లయితొలగించండిత్రచ్చగా నాదితేయులు *రా* త్రిచరులు
వత్తిడిని తాళ జాలక *వా* సుకి విడ
రసము, శంకరుడు గొనె స్థి *రం* పు మదిని
వాసుకి త్రాడుగా నునిచి పాలసముద్రము జిల్గగా సురల్
రిప్లయితొలగించండిలాసము రీతినిన్ మిగుల రావము జేయుచు గాలకూటమే
భాసిల,యంతటన్ వెఱచి వాసవు డాదిగ సర్వులున్ గనన్
రాసుధ యంచునా యజుడు రంజిలు నట్లుగ బంచెవారికిన్
జిల్కగా
తొలగించండిపాశము రా ఫణి వాసుకి
రిప్లయితొలగించండియాశను గిరి మందరంబ యా కవ్వము గా
నా శుభ బారావారం
బీశుని కృపఁ ద్రచ్చి రెల్ల రీ సుర లసురుల్
యతి స్థానములో నన్నది విస్మరించితిని. మఱియొక పూరణము చేసెదను.
తొలగించండివాసుకి భుజగమ్ము పాశ మయ్యెను మంద
తొలగించండిరంబు భీమ శైల రాజ మయ్యె
వరపుఁ గవ్వ మప్డు వార్ధి జిల్కిరట సు
రలు నసురవరులు వరం బిడ హరి
వార్ధిఁ జిల్కిరట
తొలగించండిపాము గిరికి జుట్టి చిలుక పాలకడలి
రిప్లయితొలగించండిరాక్షసులును సురలు దొల్త రాలె విషము
వాముడది గ్రోలి దా గావ వారనంత
రంబున బడసిరమృతంబు రంజనమున
వాటముగా గిరీంద్రమును పాలసముద్రమునందు డించి యా
రిప్లయితొలగించండిరాటము మీర దేవతలు రాక్షసులు న్మథియించుచుండ న
ప్పాటున ముందుగా విషపు వాహిను లాయెను శంభుఁ డాపె మం
డ్రాటము బిమ్మట న్మదులు రంజిల నాయె సుధోదయ మ్మహో!
పాల కడలి మథనమందు పాల్గొనంగ
రిప్లయితొలగించండిదీక్ష తోడుత వేల్పులు రాక్షసులను
వఱల ఫణి శిరము సురలు వాలము గొన
రాత్రి చరులుండ త్రచ్చుటా రంభ మయ్యె
పాటు పడి చిలుకగ పాల క డలి, మంద
రిప్లయితొలగించండిరంబును కొని వచ్చి రాపిడొ రయ
వడిగ త్రిప్పి చుట్టి వాసుకిన్ లాగగా
రగిలె క్షీర సాగ రంబు విషము బుట్టి.
పారెను కాల్చుచున్ విషము పాలసముద్రము నుండి
చిల్కగన్
రారిటు దేవతల్ జడిసి, రాలగ తారలు, గౌరి నాధునిన్
వారణ సేయ గోరగ చివాలున గైకొని మ్రింగె నీశుడున్
రాక్షస వీరులున్, సురులు రంజిల నాగరళంబు నంతయున్.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండివాసిగ దేవదానవులు [పా]లసముద్రముఁ ద్రచ్చుకోసమై
త్రాసము లేక మంథగిరి [రా]జిల వాసుకిఁ జుట్టి చిల్కగా
భాసుర రీతి మున్గఁగను [వా]రిశు వేడఁగఁ గూర్మమై గిరిన్
లాసిగ వీఁపు నుంపఁగను [రం]జిలుచున్ సుధ పుట్టెరా తుదన్!