15, మే 2021, శనివారం

సమస్య - 3724

16-5-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గర్భాధానమ్ము నాఁడె కల్గిరి పుత్రుల్”
(లేదా...)
“గర్భాధానము నాఁడె కల్గిరి సుతుల్ గంజాక్షికిన్ జంటగా”

27 కామెంట్‌లు:


 1. దౌర్భకుడవైతివి కదా
  గర్భము దాల్చిన పడంతి కన్నియ యనుచున్
  దౌర్భాగ్యుడ! చేసి నారట
  గర్భాదానమ్ము నాడె, కల్గిరి పుత్రుల్.

  రిప్లయితొలగించండి
 2. దర్భలు తీసుకు వచ్చిన
  గర్భవతి యునగు ముని సతి కవలల కనియెన్
  దుర్భర బాధన్, కోడలి
  గర్భాధానమ్ము నాడె కల్గిరి పుత్రుల్

  రిప్లయితొలగించండి
 3. గర్భమునందుననుండెడి
  గర్భాగారమువలదనిగరువపుసతియున్
  అర్భకులనందెచూపున
  గర్భాదానమ్మనాడెకల్గిరిపుత్రుల్

  రిప్లయితొలగించండి

 4. దౌర్భాగ్యమ్మది నీదుమాటలె యబద్ధాలంటినో మూర్ఖుడా!
  యార్భాటమ్ముగ పెద్దవారలు వివాహంబప్పుడే చేసిరే
  గర్భాదానము నాఁడె! కల్గిరి సుతుల్ గంజాక్షికిన్ జంటగా
  గర్భాగారము నందు గాంచగను ప్రఖ్యాతుండ్రె విచ్చేసిరే.

  రిప్లయితొలగించండి
 5. కందం
  ఆర్భాటమ్ముగ మనువై,
  దౌర్భాగ్యమనఁ దన యక్క తనువును వీడన్
  నిర్భాగ్యులౌచు, చెల్లికి
  గర్భాదానమ్ము నాఁడె కల్గిరి పుత్రుల్!

  శార్దూలవిక్రీడితము
  ఆర్భాటమ్ముగఁ జెల్లి పెళ్ళి పనిలో నానంద సంధాయియై
  దౌర్భాగ్యమ్మన నక్క చిక్కుచు ప్రమాదంబందుఁ గన్మూయఁగన్
  నిర్భాగ్యుల్ సుతులుండగన్ బితర సాన్నిధ్యాన నొప్పందమై
  గర్భాదానము నాఁడె కల్గిరి సుతుల్ గంజాక్షికిన్ జంటగా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కందం
   గర్భముఁ గోరుచు పృథ సం
   దర్భమనఁగ మంత్రమెంచి తలఁపగ సద్యో
   గర్భమున దేవతలిడఁగ
   గర్భాదానమ్ము నాఁడె కల్గిరి పుత్రుల్

   శార్దూలవిక్రీడితము
   నిర్భాగ్యమ్మన భర్త శాపవశుడై నెక్కొల్ప మాద్రీసతిన్
   గర్భమ్మెంచుచుఁ గుంతి మంత్ర బలిమిన్ గైకొన్న దైవాలఁ బ్రా
   దుర్భావింపగ దివ్యతేజముల సద్యోగర్భ సంజాతులై
   గర్భాదానము నాఁడె కల్గిరి సుతుల్ గంజాక్షికిన్ జంటగా!

   తొలగించండి
 6. సవరణతో....,,
  దౌర్భకుడవైతివి కదా
  గర్భము దాల్చిన పడంతి కన్నియ యనుచున్
  దౌర్భాగ్యుడ! చేసి నారట
  గర్భాధానమ్ము నాడె, కల్గిరి పుత్రుల్.  దౌర్భాగ్యమ్మది నీదుమాటలె యబద్ధాలంటినో మూర్ఖుడా!
  యార్భాటమ్ముగ పెద్దవారలు వివాహంబప్పుడే చేసిరే
  గర్భాధానము నాఁడె! కల్గిరి సుతుల్ గంజాక్షికిన్ జంటగా
  గర్భాగారము నందు గాంచగను ప్రఖ్యాతుండ్రె విచ్చేసిరే.

  రిప్లయితొలగించండి
 7. ~~~~~~~~~~~~~~~~~~
  ఆర్భాటంబుగ జేసె బెండిలిని
  యత్యంతోత్సవంబొప్పగా
  నిర్భాగ్యుండగు మిత్రు పుత్రి
  కకు తా నిక్కంబుగా నామెదౌ
  గర్భాదానమునాడె , గల్గిరి
  సుతుల్ గంజాక్షికిన్ జంటగా
  నిర్భీతింజరియించు కోడలు
  కు నా నీరేజ పత్రేక్షకున్.
  ~~~~~~~~~~~~~~~~~~

  రిప్లయితొలగించండి
 8. సమస్య :

  గర్భాధానము నాడె కల్గిరి సుతుల్
  గంజాక్షికిన్ జంటగా

  ( తన కొడుకు , కోడలు ఒకేమాటు ఇద్దరు బిడ్డలకు తలిదండ్రులైనారన్న వార్త విన్న తండ్రి పొందిన అపరిమితానందం )

  శార్దూలవిక్రీడితము
  ..............................

  దుర్భావంబు లవేమి లేనిదగు నా
  తోరంపు వంశానికే
  స్వర్భాగ్యంబు లభించె నేడు నహహా !
  సంభావనన్ జేసితిన్
  గర్భాధానము నాడె ; కల్గిరి సుతుల్
  గంజాక్షికిన్ జంటగా ;
  గర్భంబన్నది సార్థకంబయె కదా !
  గర్వించెదన్ మెండుగా .

  రిప్లయితొలగించండి
 9. అర్భకుడొకడు తమకమున
  నిర్భయముగ పెండ్లియాడె నెలతుకనొకతెన్
  నిర్భరమగు వింత జరిగె
  గర్భాధానమ్ము నాఁడె కల్గిరి పుత్రుల్

  అర్భకుడు = మూర్ఖుఁడు

  రిప్లయితొలగించండి
 10. మన పురాణేతిహాసాలలో సద్యోగర్భాల ప్రస్తావన చాల చోట్ల ఉన్నది. కర్ణుడు,వ్యాసుడు,శుకుడు మొ. వారు

  నిర్భర మంత్రోచ్చారణ
  నర్భకురాలికి ఫలించ నర్కుని కృపతో
  దుర్భర వేదన మిగులగ
  గర్భాధానమ్ము నాడె గల్గిరి పుత్రుల్

  ఆర్భాటమ్ముగ బెండ్లి జేయ జనులాహాయంచు మెచ్చంగనే
  నిర్భీతిం జరియించ జంట తమదౌ నెత్తావి లోకమ్ములో
  స్వర్భాగ్యమ్మె యనంగ మంచి కలయై సంవత్సరాంతమ్మునన్
  గర్భాధానము నాడె కల్గిరి సుతుల్ గంజాక్షికిన్ జంటగా

  రిప్లయితొలగించండి
 11. గర్బము దాల్చెనొక సుదతి
  నర్బకులా? కాదుపుష్టి నబ్బెను చకగన్
  గర్బమున, సరిగ సోదరి
  గర్భాధానమ్ము నాఁడె ,కల్గిరి పుత్రుల్

  రిప్లయితొలగించండి
 12. గర్భమును దాల్చి తల్లియు
  నిర్భయముగ కూతు పెళ్లి నిండుగ జేయన్
  గర్భిణి ప్రసవించె, తనయ
  గర్భాదానమ్ము నాఁడె కల్గిరి పుత్రుల్

  - రాంబాబు కైప

  రిప్లయితొలగించండి
 13. గర్భిణియగుసోదరికిక
  దుర్భరమాపను ప్రసవము తోచదు వెరవా
  యర్భక ప్రాణికి చెల్లెలి
  గర్భాధానమ్ము నాఁడె కల్గిరి పుత్రుల్”

  రిప్లయితొలగించండి
 14. గర్భాగారముస్రుష్టియంతయునునాకాళందికేమందునా
  విర్భావంబునశంభునానతినితావిచ్చెంపరాశక్తిగా
  గర్భంబందునవెల్గుజూచెపరమున్కామంబురమ్యంబుగా
  గర్భాదానమునాడెకల్గిరిసుతుల్కంజాక్షికిన్జంటగా

  రిప్లయితొలగించండి
 15. రిప్లయిలు
  1. స్వర్భోగమ్ముల వైభవమ్ము పతిసౌజన్యమ్ము సంధిల్లినన్
   దౌర్భాగ్యమ్మున సంతు లేక కడకున్ దైవానుకంపామతిన్
   గర్భప్రాప్తియు కల్గె గాని యకటా కాదందుమా!
   సోదరీ
   గర్భాధానము నాఁడె కల్గిరి సుతుల్ గంజాక్షికిన్ జంటగా.

   కంజర్ల రామాచార్య.

   తొలగించండి
 16. గర్భాగారము జేర్చి వారసుని శీఘ్రంబీయుడా మోదమం
  దార్భాటంబుగ వేడ్క జేతుమనుచున్ హాస్యంబుగా బల్కిరా
  గర్భాధానము నాఁడె; కల్గిరి సుతుల్ గంజాక్షికిన్ జంటగా,
  గర్భాధాన ముహూర్త నిర్ణయము శ్లాఘ్యంబంచనన్ బంధువుల్

  రిప్లయితొలగించండి
 17. గర్భము దాల్చక పోయిన
  దౌర్భాగ్యము వెంటబడగ ద్రోవది చెలికిన్
  నర్భకు రాలగు నామెకు
  గర్భా దానమ్ము నాడె కల్గిరి పుత్రుల్

  రిప్లయితొలగించండి
 18. దుర్భరమై చెలఁగఁ బ్రథమ
  గర్భమున ముదమ్ము నీయఁగ నెడందకు నా
  కర్భకులు కవలు చెలి నీ
  గర్భాధానమ్ము నాఁడె కల్గిరి పుత్రుల్


  గర్బం బింపుగఁ గల్గ వింత యగునే కాంతాళి కెంచంగ వై
  దర్భీతుల్యపుఁ బుణ్యకాంతకు, వివాదం బేలనో పెండ్లి యై,
  దుర్భావం బది యేల, యేఁడు తగు సంతోషమ్ముగా నేఁగఁగా
  గర్భాధానము నాఁడె కల్గిరి సుతుల్ కంజాక్షికిన్ జంటగా

  రిప్లయితొలగించండి
 19. అర్భాటమ్మున నక్క పెండ్లి జరిగెన్నాహ్లాదమందించుచున్
  నిర్భారమ్ముగ చెల్లి పెండ్లి కలిగెన్ నిర్ణీత కాలమ్ములో
  గర్భమ్మున్ ధరియించి యక్క చనగా కార్యమ్ము చేయింపగా
  గర్భాధానము నాడె కల్గిరి సుతుల్ గంజాక్షికిన్ జంటగా

  రిప్లయితొలగించండి
 20. గర్భా దానము నాడె కల్గిరి సుతుల్ గంజాక్షికిన్ జంటగా
  దర్భా జానకి కూతురొక్కతె గనన్ దారాలసోమేశునిన్
  నిర్భీతిన్ జని వాని తోడనె నటన్ నెల్లాళ్ళు జీవించుటన్
  గర్భం దాల్చెనె?నేమొ యప్పుడె మఱిన్ గానంగ నట్లాయె నో


  రిప్లయితొలగించండి
 21. గర్భాదానము నాడె కల్గిరి సుతుల్ గంజాక్షికిన్ జంటగా
  రాజీవ్రాఘవ్పాండియన్వేంకట్రామపవన్సత్యలక్ష్మణప్రశాంత్
  ఇవాంజేలిన్షారాకమలేవ్లినైలవ్యూహరచనార్చనపూంద్
  నాడొక్కటే ఝామున లక్షలు మూడు పదుల వయసు గాంచేన్


  కర్రాకుల ట్రీప్టి మరియు ఉర్రూత డ్రుమిల్ సౌజన్యం చే ములకనూరు అస్త వ్యస్తవ్యూల్ ప్రేరిత ప్రేరేపణ మూలం

  రిప్లయితొలగించండి
 22. మిత్రులందఱకు నమస్సులు!

  దుర్భావం బెది లేక పెండ్లి జరిగెన్! దుష్కాలమౌఁటన్ గనన్
  గర్భాధానము మూఁడు మాసముల లగ్నంబప్డు సేయంగ, స
  ద్గర్భంబయ్యెను కాంతకప్డు ససిగాఁ; దద్వత్సరంబేఁగ, నా

  గర్భాధానమునాఁడె కల్గిరి సుతుల్ గంజాక్షికిన్ జంటగా!

  రిప్లయితొలగించండి
 23. సైన్సు పురోగతి చెందిన భవిష్యత్తు గురించి...

  దుర్భర ప్రగతి జగతిలో
  గర్భము, ప్రసవముల నడుమ గంటలు చాలున్
  గర్భము కోరిన కన్యకు
  గర్భాధానమ్ము, నాడె కల్గిరి పుత్రుల్||

  - రాంబాబు కైప

  రిప్లయితొలగించండి
 24. ఆర్భాటముతోవేడుక
  గర్భముదాల్చిన సుతకట ఘనముగ చేయన్
  నిర్భరవేదనతో గత
  గర్భాదానమ్ము, నాడె గల్గిరి పుత్రుల్

  రిప్లయితొలగించండి