4, మే 2021, మంగళవారం

సమస్య - 3713

5-5-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అవలీలగఁ జిన్నపిల్ల యశ్వము నెత్తెన్”
(లేదా...)
“అవలీలన్ సుకుమారి బాలికయె తా నశ్వంబు నెత్తెన్ వడిన్”

60 కామెంట్‌లు:

  1. నవవిధ మగు బొమ్మలతో
    వివిధపు రూపాల తోడవెలిగెడు చోటన్
    తవిలియు గోర్కెగ నొకచో
    నవలీలగ చిన్న పిల్ల యశ్వము నెత్తెన్

    రిప్లయితొలగించండి
  2. శివ రాత్రి జాగరణకై

    చవులూరెడు పాయసమ్ము చక్కగ తిని శై

    శవుల చదరంగపు బరిన్

    అవలీలగఁ జిన్నపిల్ల యశ్వము నెత్తెన్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  3. క్రొవ్విడి వెంకట రాజారావు:

    చివరగ పుట్టిన పాపకు
    సవురగు బొమ్మలను దెచ్చి జనకుడు నొసగన్
    పవిదిని నా బొమ్మలలో
    నవలీలగ చిన్న పిల్ల యశ్వము నెత్తెన్.

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు


    1. కందం
      శివ ధనువెత్తిన సీతయె
      నవకోమలిఁ బూనె నేమొ నాన్నయె నొసఁగన్
      జవమున జారిన కొయ్యగ
      నవలీలగఁ జిన్నపిల్ల యశ్వము నెత్తెన్

      మత్తేభవిక్రీడితము
      శివుడందించిన వింటి నెత్తు కథలో సీతమ్మ యాదర్శమై
      నవ సింగారిగఁ గన్యకా మణియె కాన్కన్ గూర్చఁగన్ దండ్రియే
      జవమున్ గ్రాలుచు కీలుగుర్రము పయిన్ జారంగ వెన్వెంటఁ దా
      నవలీలన్ సుకుమారి బాలికయె తా నశ్వంబు నెత్తెన్ వడిన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'నాన్నయె యొసగన్' అనండి.
      రెండవ పూరణలో 'నవ సింగారి' దుష్టసమాసం. "నవ శృంగారిగ" అనవచ్చు.

      తొలగించండి
    3. గురుదేవులకు ధన్యవాదములు
      సవరించిన పూరణలు :

      కందం
      శివ ధనువెత్తిన సీతయె
      నవకోమలిఁ బూనె నేమొ నాన్నయె యొసఁగన్
      జవమున జారిన కొయ్యగ
      నవలీలగఁ జిన్నపిల్ల యశ్వము నెత్తెన్

      మత్తేభవిక్రీడితము
      శివుడందించిన వింటి నెత్తు కథలో సీతమ్మ యాదర్శమై
      నవ శృంగారిగఁ గన్యకా మణియె కాన్కన్ గూర్చఁగన్ దండ్రియే
      జవమున్ గ్రాలుచు కీలుగుర్రము పయిన్ జారంగ వెన్వెంటఁ దా
      నవలీలన్ సుకుమారి బాలికయె తా నశ్వంబు నెత్తెన్ వడిన్

      తొలగించండి
  5. అవతారమెత్తెసిరియును
    శివధనువునుతీయగానుసీతగబాలా
    శివశక్తితనకునండగ
    అవలీలగచిన్నపిల్లయశ్వమునెత్తెన్
    అశ్వము-ఆయుధవిశేషము

    రిప్లయితొలగించండి
  6. జవనములను పోషించెడు
    వివేకునింట ప్రసవించె వీతి గని మనో
    జవసుడట కేగి మురియుచు
    నవలీలగ చిన్న, పిల్ల యశ్వము నెత్తెన్.

    రిప్లయితొలగించండి
  7. సమస్య :

    అవలీలన్ సుకుమారి బాలికయె తా
    నశ్వంబు నెత్తెన్ వడిన్

    అన్నదమ్ములైన రావణ కుంభకర్ణ విభీషణులు తమ ధనుస్సులనారిని మ్రోగిస్తూ శక్తిసామర్థ్యాలను ప్రదర్శిస్తూ గారాలచెల్లి శూర్పణఖను తిలకించారు " నీ
    సంగతేమి" టన్నట్లు . అప్పుడు ఆమె చేసిన పని )

    మత్తేభవిక్రీడితము
    ..........................

    భవనంబందున బాల్యమందునను శుం
    భద్వీరులున్ ధీరులున్
    జవమేపారెడి యగ్రజానుజులు శిం
    జానంబు గావించుచున్
    మువురున్ శూర్పణఖన్ ముదంబున గనన్
    ముగ్ధత్వమున్ జూపుచు
    న్నవలీలన్ సుకుమారి బాలికయె ; తా
    నశ్వంబు నెత్తెన్ వడిన్ .

    ( శింజానము - ధనుష్టంకారము )

    రిప్లయితొలగించండి
  8. కవయన్శక్తియెరూపుదాల్చెనటతాకంగన్తనూబాలయై
    అవనిన్మాహిషురాక్షసున్గెలిచిమాయామోహముల్ద్రుంపగా
    శివమెత్తంగనుచిందులాడెననియాసీమంతినీరత్నమున్
    అవలీలన్సుకుమారిబాలికయెతానశ్వంబునెత్తెన్వడిన్

    రిప్లయితొలగించండి

  9. అవనిన్ మందుల జేయు కంపెనియె తామాశించిరే యొక్క జా
    యువునే లోకము నమ్మగా దలచి తామో చిత్రమున్ దీసిరే
    జవసత్త్వమ్ముల నిచ్చు మాత్రలనుచున్ జాటింప చిత్రమ్ము లో
    నవలీలన్ సుకుమారి బాలికయె తానశ్వంబు నెత్తెన్ వడిన్.

    రిప్లయితొలగించండి
  10. అవకాశమువేసవిలో
    వివరింపగనాటపాటపిల్లలునేర్వన్,
    నవచదరంగపునాటన
    అవలీలగఁ జిన్నపిల్ల యశ్వము నెత్తెన్”

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "చదరంగపు నాటను నవలీలగ.." అనండి.

      తొలగించండి
    2. అవకాశమువేసవిలో
      వివరింపగనాటపాటపిల్లలునేర్వన్,
      నవచదరంగపునాటను
      నవలీలగఁ జిన్నపిల్ల యశ్వము నెత్తెన్”

      కొరుప్రోలు రాధాకృష్ణరావు

      తొలగించండి
  11. మిత్రులందఱకు నమస్సులు!

    నవలావణ్యసుకీర్తియుక్తగుణగణ్యాలంకృతాక్రీడకై
    చవులూరించెడి తీఁపి బొమ్మలఁ గడుం జక్కంగఁ జేయింపఁగా
    దవులందుండిన యట్టివానిఁ గొనఁగం దా మున్ను శీఘ్రమ్ముగా
    నవలీలన్ సుకుమారి బాలికయె తా నశ్వంబు నెత్తెన్ వడిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిత్రులందఱకు నమస్సులు!

      _నవలావణ్యసుకీర్తియుక్తగుణగణ్యాలంకృతాబాలకై_
      _చవులూరించెడి తీఁపి బొమ్మలఁ గడుం జక్కంగఁ జేయింపఁగా_
      _దవులందుండిన యట్టివానిఁ గొనఁగం దా మున్ను హ్లాదాత్మయై_
      _*యవలీలన్ సుకుమారి బాలికయె తా నశ్వంబు నెత్తెన్ వడిన్!*_

      *'మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు*

      తొలగించండి
  12. క్రొవ్విడి వెంకట రాజారావు:

    చివరై పుట్టిన పిల్లకున్ మమతతో చెన్నైనవౌ బొమ్మలన్
    పవిదిన్ దెచ్చి నొసంగగా నెలమి నాపాపాయి నాటాడుచున్
    సవురున్ గూడిన రీతి వాట్లనట నాశ్చర్యమ్ముతో జూచుచున్
    అవలీలన్ సుకుమారి బాలికయె తానశ్వంబు నెత్తెన్ వడిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...దెచ్చి యొసంగగా... పాపాయి యాటాడుచున్... వాటినట..." అనండి.

      తొలగించండి
  13. కె.వి.యస్. లక్ష్మి:

    అవిలో వేడుక గొల్పెడు
    సవురగు బొమ్మల కొలువును చక్కగ పేర్చన్
    పవిదిగ నందుండి తనే
    అవలీలగఁ జిన్నపిల్ల యశ్వము నెత్తెన్.

    (అవి= ఇల్లు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తనే' అనడం సాధువు కాదు. "పవిదిగ తానందుండియు నవలీలగ..." అనండి.

      తొలగించండి
  14. నవరాత్రుళ్ళకు బొమ్మలం గొలువు నందందన్ అమర్చన్ రహిన్
    జవరాండ్రందరు ఘల్లుఘల్లుమని గజ్జల్ మ్రోగఁ ప్రోగవ్వ నా
    సవరింతల్ మరబొమ్మ గుఱ్ఱమొక టా సందున్ పడం జప్పునన్
    యవలీలన్ సుకుమారి బాలికయె తా నశ్వంబు నెత్తెన్ వడిన్౹౹

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అందన్+అమర్చన్' అని విసంధిగా వ్రాయరాదు. "... నందందై యమర్చన్.. ప్రోగైన.." అనండి. (అవ్వ అనడం సాధువు కాదు)

      తొలగించండి
    2. సవరించానండి, ధన్యవాదాలు గురువుగారు.

      తొలగించండి
  15. అవధులు లేని వినోదము
    చవకగ, మెదడు పదునౌను, చదరంగమునన్
    జవముగ వ్యూహము పన్నుచు
    అవలీలగఁ జిన్నపిల్ల యశ్వము నెత్తెన్

    రిప్లయితొలగించండి
  16. భవనము నందలి పిల్లలు
    సవితలు కొనినట్టి బొమ్మ జంతువు లన్నిన్
    వివిధరకములుగ పేర్చగ
    నవలీలగఁ జిన్నపిల్ల యశ్వము నెత్తెన్

    రిప్లయితొలగించండి
  17. గవతము మేసెడి మిషతో
    రవ తళుకుల కపిల పిల్ల రయమున ఘీంకా
    రవమున పెను తొండముతో
    అవలీలగ జిన్న పిల్ల యశ్వము నెత్తెన్

    కపిల = పుండరీక మను దిగ్గజము భార్య కపిల,
    పిల్ల = కపిల అను ఏనుగు పిల్ల.

    రిప్లయితొలగించండి
  18. అవబాసమునకు ప్రాయం
    బవరోధమ? బిందుతంత్రబవరమునందున్
    దవురుగ పావులు కదుపుచు
    నవలీలగఁ జిన్నపిల్లయశ్వము నెత్తెన్

    రిప్లయితొలగించండి
  19. నవ సాంకేతిక చిత్ర రీతులవిగో నాట్యమ్ము సేయంగ వ

    చ్చె విశేషమ్ములు వింతలున్ పరిఢవించెన్నచ్చటన్చిత్రమౌ

    చవులూరించెడు లేహ్యమున్దినెను పల్చంగన్ప్రకాశించినన్

    అవలీలన్ సుకుమారి బాలికయె తా నశ్వంబు నెత్తెన్ వడిన్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  20. ఈ నాటి శంకరా భరణము వారి సమస్య

    అవలీలగ చిన్నపిల్ల యశ్వము నెత్తెన్


    ఇచ్చిన పాదము కందము

    నా పూరణ సీసములో


    కట్టెల బదులుగ కాళ్ళను భూత మొ
    కటి పొయ్యి లోబెట్టి ఘనత తోడ

    వంటను చేసెను,మంటను జలమున
    పుట్టించి చూపెను భూత మొకటి,



    కత్తులు దూసి మకరి పొట్ట చీల్చె నొ
    క శశము గజమును ఘనత తోడ

    రక్షించగ ,నవలీలగ జిన్నపిల్ల
    యశ్వము నెత్తె ,నెటుల
    సాధ్య మగున

    నుచు తలచగ వలదిపుడు నువ్వు నమ్మ

    వలయును విఠలా చార్యుడు సులువు తోడ

    చూపె చలనచిత్ర ములందు చోద్యముగను,

    యని తెలిపె నొకడు రయమున్ తనయుని‌ గని

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సీసం నాల్గవ పాదంలో గణభంగం. 'చోద్యముగను+అని' అన్నపుడు యడాగమం రాదు. సవరించండి.

      తొలగించండి
  21. అవనీనాథుని గృహమున
    జవనాశ్వము జన్మనీయ చక్కని కుఱ్ఱన్
    నవజాతను బహుప్రేమను
    యవలీలగ జిన్న పిల్లయశ్వము నెత్తెన్

    రిప్లయితొలగించండి
  22. అవిడి యనుగ్రామ మందున
    జవరాండ్రలు బొమ్మకొలువు జక్కగబెట్టన్
    వివిధములగు బొమ్మలు గని
    యవలీలగ జిన్నపిల్ల యశ్వము నెత్తెన్

    రిప్లయితొలగించండి
  23. అవకాశము జిక్కెననుచు
    కవలలు చదరంగమాడగా శకటంబున్
    జవమున జరుపగ నగ్రజ
    అవలీలగఁ జిన్నపిల్ల యశ్వము నెత్తెన్

    రిప్లయితొలగించండి
  24. రిప్లయిలు
    1. సవరించిన పూరణ :-

      మ:

      చివురించంగను గ్రొత్త యాశలు మదిన్ శీఘ్రంబు నయ్యేస్సుగా
      వివరించన్ దన పేరు ప్రస్ఫుటముగా వేనోళ్ళ శ్లాఘించుచున్
      నవ వాసంతపు కోయిలై మధురిమా నాదమ్ములే చేయనై
      యవలీలన్ సుకుమారి బాలికయె తా నశ్వంబు నెత్తెన్ వడిన్

      IAS =అయ్యేస్సు

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
    2. 3 వ పాదము చేయనై / కూయగా ...నవలీలన్ గా చదువ గలరు

      తొలగించండి
  25. దివిలో దీవింప నమరు
    లవలోకించి ముద మార నా పాలకుఁడే
    యవనిఁ బడ నీన గుఱ్ఱం
    బవలీలగఁ జిన్నపిల్ల, యశ్వము నెత్తెన్


    ధవళాచ్ఛాద పరీవృ తేద్ధ ముఖపద్మ ద్యోత, శోభిల్లఁగా
    ఛవిమత్కుండల యుగ్మ కంకణ మృదు స్వానమ్ము, హస్త ద్వయిన్
    నవ కాంతిన్ వెలుఁగొందు గవ్వల గమిన్ నట్టింట నాసీనయై
    యవలీలన్ సుకుమారి బాలికయె తా నశ్వంబు నెత్తెన్ వడిన్

    [అశ్వము =ఏడు సంఖ్య]

    రిప్లయితొలగించండి
  26. అవరోధంబులు లేకపోవుటన నాయాచోటగానంబడన్
    నవలీలన్ సుకుమారి బాలికయె తానశ్వంబు నెత్తెన్వడిన్
    నవరాత్రుల్ సమయాన భామినులు నవ్యంబైన బొమ్మల్ దగన్
    భవముల్గల్గగ గొల్వుదీరుదురు సౌభాగ్యంబు వెల్గొందనౌ

    రిప్లయితొలగించండి
  27. జవనాశ్వంబులు బంటులున్ శకటముల్ సారంగముల్ మంత్రులున్
    అవనీజానిని రక్షజేయుటకుగానామంత్రణం బొందగన్
    తివిరిన్బావులు దక్షతన్కదుపగన్ ద్వేష్యుండు, పైయెత్తుగా
    అవలీలన్ సుకుమారి బాలికయె తానశ్వంబు నెత్తెన్ వడిన్

    రిప్లయితొలగించండి
  28. కువకువలాడుచు పెద్దలు
    నవసర చదరంగమాడి యటవిడిచి చనన్
    దవదవ బ్రాకి మిఠాయని
    "అవలీలగఁజిన్నపిల్ల యశ్వమునెత్తెన్"

    రిప్లయితొలగించండి
  29. జవముగ తాతయు చేసెను
    నవదారువుదెచ్చి హయము నవ్యపు రీతిన్
    సవినయముగగనుచునచట
    యవలీలగ చిన్నపిల్ల యశ్వము నెత్తెన్.

    రిప్లయితొలగించండి