5, మే 2021, బుధవారం

సమస్య - 3714

6-5-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నగధారి యనంగుఁ ద్రుంచి నాతిని బ్రోచెన్”
(లేదా...)
“నగరాడ్ధారి యనంగుఁ ద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే”

64 కామెంట్‌లు:

 1. రగిలెను కోపమ్మున ప

  న్నగధారి యనంగుఁ ద్రుంచి నాతిని బ్రోచెన్

  సగము శరీరమునొసగెను

  నగరాజ సుతకు రమణికి నారీ మణికిన్

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 2. నగరాట్పుత్రిని గొనగా
  చిగురాకువిలుధరుఁడేయ జిరు బాణమునే,
  భుగభుగ జ్వాలల నా ప
  న్నగధారి యనంగుఁ ద్రుంచి నాతిని బ్రోచెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'విలుధరుడు' సాధు ప్రయోగం కాదనుకుంటాను.

   తొలగించండి
 3. మిత్రులందఱకు నమస్సులు!

  నగజం గూర్పఁగ నింద్రు పన్పున వెసం గంతుండు త్ర్యక్షోత్తపో
  న్నగసాన్నిధ్యముఁ జేరి, పంచశరముల్ నాటంగ శ్రీకంఠు హృ
  న్నగమందున్, వెనువెంటనే ధర నభోంతఃప్రాంతముల్ మ్రోఁగ, ప
  న్నగరాడ్ధారి యనంగుఁ ద్రుంచి, పిదపన్ నాతిం గృపం బ్రోచెలే!

  రిప్లయితొలగించండి
 4. పొగరున నెదిరింపగ ప
  న్నగ ధారి యనంగు ద్రుంచి నాతిని బ్రోచెన్
  తెగిన తలకు బదులుగ ను నొ
  సగె గజ మస్తక మతని కి చక్కగ కుదురన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కాని... మన్మథునికి గజమస్తకాన్నివ్వడం ?

   తొలగించండి
  2. సవరించిన పూరణ --
   నగజను జేర్చతలచ ప
   న్నగ ధారి aయనంగు ద్రుంచి నాతిని బ్రోచెన్
   తగునా యని రతి వేడగ
   మగని యసువుల నొసంగెమాన్యు o డ య్యెన్

   తొలగించండి
  3. చివరి పాదంలో యసువుల నొసఁగంగ అని సవరణ చేయడమైనది

   తొలగించండి
 5. పగయా! పరిహాసమ బో
  నగధారియనంగు ద్రుంచి నాతిని బ్రోచెన్
  వగచియు రతి వేడగ ప
  న్నగధారి పతినిజూపి నాయముజేసెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   చివరి పాదంలో గణభంగం. సవరించండి.

   తొలగించండి
 6. అగపడనిబాణమేయుచు
  తెగపడిశంభునితపమునుచెరుపగరాగా
  విగళితుఁజేసెనుగాప
  న్నగధారియనంగుఁద్రుంచినాతినిఁబ్రోచెన్

  రిప్లయితొలగించండి

 7. చిగురు విలుకాని కాల్చిన
  భగుని రతీదేవి వేడ బ్రతికించె గదా!
  మగువతెలిపె నిట్టుల ప
  న్నగధారి యనుంగు ద్రుంచి, నాతిని బ్లోచెన్.

  రిప్లయితొలగించండి
 8. అగజయు వద్దన వినకను
  నగధారియనంగు ద్రుంచి నాతిని బ్రోచెన్
  సగమేనొసంగి, రతికో
  రగ పతి నిచ్చెను, జగతిని రాగము పొడమెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "అగజ వలదెనె వినక పన్నగధారి..." అనండి.

   తొలగించండి
 9. నగజాతాయెనపర్ణమానసముపూనంగన్శివుడయ్యెడన్
  పగవాడాయెనుమన్మధుండచటనాభారంబులోగ్రుంగెగా
  చిగురుల్పూవులబాణముల్వడిగతాజేర్చంగనప్పట్టుప
  న్నగరాధ్ధారియనంగుఁద్రుంచిపిదపన్నాతిన్గ్రుపన్బ్రోచెలే

  రిప్లయితొలగించండి
 10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 11. నగజాత పార్వతీసతి
  దగ శంకరు గూర్చ శరము తపనుడు వేయన్
  వెగడుపడగ జగములు ప
  న్నగధారి యనంగుఁ ద్రుంచి నాతిని బ్రోచెన్

  రిప్లయితొలగించండి
 12. జగతికి గీతను జెప్పెను
  నగపుత్రికి పతియునయ్యె నటరాజపుడున్
  ఒగి రాముడు శిలలోగల
  నగధారి, యనంగు ద్రుంచి, నాతిని బ్రోచెన్.

  రిప్లయితొలగించండి
 13. నగరాట్సుత సేవలతో
  బిగిసడలని యోగివరుడు వివశత్వమునన్
  దగులగ పూబాణము ప
  న్నగధారి యనంగుద్రుంచి నాతిని బ్రోచెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సగమౌరాత్రిని వేణునాదమున నాశాతంబు
   బూరించుచున్
   బిగువౌ ప్రేమను రాధదేవినట సంప్రీతిన్ సమావేశమై
   వగపేలేకయె రాసలీలలను దివ్యానందమున్ దేలగా
   నగరాడ్ధారి యనంగు ద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'రాధాదేవి' అనడం సాధువు. "రాధ నచ్చటను" అనవచ్చు. కాని కృష్ణుడు అనంగుని ద్రుంచడం ?

   తొలగించండి
  3. ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను.
   రాధాకృష్ణుల ప్రేమ మానుషీయమైనది కాక దివ్యమైనది కనుక మన్మథుని ద్రుంచి అనే భావన చేశాను.🙏🙏🙏🙏

   తొలగించండి
  4. సవరణతో
   సగమౌరాత్రిని వేణునాదమున నాశాతంబు
   బూరించుచున్
   బిగువౌ ప్రేమను రాధనచ్చటను సంప్రీతిన్ సమావేశమై
   వగపేలేకయె రాసలీలలను దివ్యానందమున్ దేలగా
   నగరాడ్ధారి యనంగు ద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే

   తొలగించండి
 14. సమస్య :
  నగరాడ్ధారి యనంగు ద్రుంచి పిదపన్
  నాతిన్ గృపన్ బ్రోచెలే

  ( శివతపోభంగం - మన్మథదహనం - పునర్జీవనం)

  మత్తేభవిక్రీడితము
  ...........................

  నగరాణ్మేనల ముద్దుకూతురు ; మరు
  న్నారీశిరోరత్నమౌ
  యగజన్ శంకరు గూర్ప భస్మమవగా
  నల్లాడు నిల్లాలికిన్
  మగనిన్ జీవునిగా నొనర్చిరతికిన్
  మాంగల్య మీయంగ బ
  న్నగరాడ్ధారి ; యనంగు ద్రుంచి పిదపన్
  నాతిన్ గృపన్ బ్రోచెలే .

  ( నగరాణ్మేనలు - హిమవంతుడు , మేనాదేవి ; అగజ- పార్వతి ; పన్నగరాడ్ధారి - సర్పహారి ; అనంగుడు - మన్మథుడు )

  రిప్లయితొలగించండి
 15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 16. భగము నొనరించు నా ప
  న్నగధారి యనంగుఁ ద్రుంచి నాతిని బ్రోచెన్
  నగజాత కరము జేకొని
  సగముగ జేసుకొ నుచు దన స్కంధము నందున్

  భగము = వైరాగ్యము

  రిప్లయితొలగించండి
 17. నగవైరికి గర్వమణచె
  నగధారి; యనంగుఁ ద్రుంచి నాతిని బ్రోచెన్
  నగచాపుడు; దగదు గదా
  పగటుదనము గనబఱచుట పరమాత్మ కడన్

  రిప్లయితొలగించండి
 18. నగరాజాత్మజ చంద్రశేఖరునితో నాతంబునుం గోరుచున్
  సిగలో మల్లెలు దాల్చి చెంతనిలువన్ సేవాధికృత్యంబునన్
  జగముల్ మెచ్చగ కంతుడేను శరముల్ సంధింప కోపించి ప
  న్నగరాడ్ధారి యనంగుఁ ద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే

  రిప్లయితొలగించండి
 19. పగతో పోరిడు రుక్మికి
  తగురీతిగ బుద్ది చెప్పె దామోదరుడున్
  మగువ దన సొంత మవగన్:
  నగధారి యనంగుఁ ద్రుంచి నాతిని బ్రోచెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అనంగ' శబ్దానికి మహారాజు అన్న అర్థం అంత ప్రసిద్ధం కాదు. అయినా రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో కృష్ణుడు ఏ మహారాజునూ చంపలేదు కదా!

   తొలగించండి
  2. రుక్మికి జరిగిన అవమానము క్షత్రీయులకి మృత్యువు తోసమానము గద

   తొలగించండి
 20. అగజన్ జేకొని దుష్టనాశనము చేయంగల్గు సంతానమున్
  జగతిన్ గావగ బొందు శంకరుడు విశ్వవ్యాప్తు డంచున్ సురల్
  తగ గాంక్షించుచు మన్మథున్ బనుపగా దానిన్ సమర్ధించ నా
  నగరాడ్ధారి, యనంగుఁ ద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే”

  రిప్లయితొలగించండి
 21. శ్రీ గురుభ్యోనమః
  కం.
  నగజాతను జత గూడగ
  నెగదోయుచు మరుని శరములెడదను దాకన్
  భగభగ మండుచు నా ప
  న్నగధారి యనంగు ద్రుంచి నాతిని బ్రోచెన్

  రిప్లయితొలగించండి

 22. నగరాట్పుత్రిక యీప్సితమ్ము గనియా నాకేశుడే పంపగన్
  సిగలో గంగను దాల్చువాని తపమున్ ఛేదింప కాముండజి
  హ్మగమున్ వేసినయంత నుగ్రుడయి యార్యానాథు డైనట్టి ప
  న్నగరాడ్దారి యనుంగుఁ ద్రుంచి పిదపన్, నాతిన్ గృపన్ బ్రోచెలే.

  రిప్లయితొలగించండి
 23. నగజాతను బెండిలి యా
  డఁగ వలెఁ గావున సుర కపటమ్మున వృషభేం
  ద్ర గమనుఁడు నిత్య కీర్తిత
  నగధారి యనంగుఁ ద్రుంచి నాతిని బ్రోచెన్

  [నిత్య కీర్తిత నగధారి = నిత్యము కీర్తింపఁ బడిన నగధారి యైన విష్ణువును గలవాఁడు, శివుఁడు]


  పగలే యుండవు దేవదేవునకుఁ గోపంబున్న శాంతించుగాఁ
  దగ నేకైక క్షణమ్ము నందు ఘనుఁడౌ దాక్షిణ్య భావమ్మునన్
  వగవన్ మిక్కిలి భర్తృ వేదనను భాస్వన్మేరు సంజ్ఞా మహా
  నగరాడ్ధారి యనంగుఁ ద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే

  [నగరాడ్ధారి = మేరు పర్వతమును విల్లుగా ధరించిన శివుఁడు]

  రిప్లయితొలగించండి
 24. రిప్లయిలు
  1. కందం
   మగనిగ నపర్ణ కోరఁగ
   సగమౌచును హైమవతికిఁ జంపిన మరునిన్
   వగ వీడ రతికొసఁగ ప
   న్నగధారి యనంగుఁ ద్రుంచి నాతిని బ్రోచెన్

   మత్తేభవిక్రీడితము
   నగరాట్సూన నపర్ణ పార్వతినిఁ దానై బట్టి, సూనాస్త్రునిన్
   బగతో భస్మముఁ జేసియున్ రతికినై ప్రాణేశు నందించుచున్
   వగపున్ బాపుచు నందరిన్ వసుధపై పాలించు ముక్కంటి ప
   న్నగరాడ్ధారి యనంగుఁ ద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే

   తొలగించండి
 25. చిగురువి లుకాని రిపు,ప
  న్నగధారి యనుంగుద్రుంచి నాతిని బ్రోచెన్
  మగువర తీదే విమొఱను
  సుగతులు బ్రాప్తించు నటుల సూ,వర మిచ్చెన్

  రిప్లయితొలగించండి
 26. నగరాజేంద్రుని కన్య భర్త తప
  మున్ నాగంబుపై జేయ నా
  నగజాతాజ్ఞను మన్మథుం డజుని
  బన్నంబున్ సుమాస్త్రంబుచే నతి
  భంగంబొనరించె , గ్రోధియయి
  సంకల్పాక్షి పాలాక్షితో
  నగరాడ్ధారి యనంగు దృంచి పిద
  పన్ నాతిన్ గృపన్ బ్రోచెలే .

  రిప్లయితొలగించండి
 27. నగజాతన్ తుహినాద్రి పుత్రికను విన్నాణంబుగా శూలికిన్
  తగ కళ్యాణము సల్ప దేవతల సంత్రాణార్థమై సంభవిం
  పగ షడ్వక్త్రుడు కంతుడేయ శరముల్ బామంబు పెంపార ప
  న్నగరాడ్ధారి యనంగుఁ ద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే

  రిప్లయితొలగించండి
 28. ఖగమే వాహనమైనయా యజుడువిఖ్యాతుండు లోకోద్ధరౌ
  నగరాడ్ధారి యనుంగుద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే
  నగజారాతుని సంహరించుటను నానారీతి దుఃఖించియా
  నగజానాధుని బ్రాణభిక్షమిడ విన్నాణంబుగావించెగా

  రిప్లయితొలగించండి
 29. నగజన్ శంకరు చేర్చగా తలచుచున్ నాళీకజన్ముండు తె
  ల్పగ బృందారక నారదాదులు మరున్ రప్పించి పూబాణముల్
  తగ వేయించగ వెక్కసమ్ముగను, కాతాళమ్ముతో నుగ్రుడై
  నగరాడ్ధారి యనంగుఁ ద్రుంచి, పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే
  మగనిన్ పొందగ జేసి ప్రార్థనల సమ్మానించి శీఘ్రమ్ముగా

  రిప్లయితొలగించండి
 30. మ:

  తగునా సోముని బ్రహ్మచర్య మనుచున్ తాడించ పూబాణముల్
  చిగురించంగను క్రొత్త యాశలు మదిన్ చింతించ నా పార్వతిన్
  దిగులుంజెంది విశేష దృష్టిగని క్రోధించంగ నావేశమున్
  నగరాడ్ధారి యనంగు ద్రుంచి పిదపన్ నాతిన్కృపన్బ్రోచెలే

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి