30, మే 2021, ఆదివారం

సమస్య - 3737

31-5-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దున్ననుఁ గని దోఁచితివని రుల్లంబులనే”
(లేదా...)
“దున్ననుఁ గాంచి దోఁచితివె యుల్లములంచు వచించి రెల్లరున్”

74 కామెంట్‌లు:

 1. సన్నని గాలిలోన శశి చక్కగ వెన్నెల లీను చుండగా
  చెన్నగు రూపుతోడుతను చేరిన నల్లని వాడు ప్రీతితో
  మిన్నగు వేణునాదమున మించుచు పూలవనంపు మధ్య యం
  దున్ననుఁ గాంచి దోఁచితివె యుల్లములంచు వచించి రెల్లరున్

  రిప్లయితొలగించండి
 2. పెన్నిధిపేదలకేనును
  ఎన్నగసేవలుజనులకునెప్పుడుసేతున్
  పనిలోకరకునుగలచే
  దున్ననుగనిదోచితివనిరుల్లంబులనే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సవరణతో
   పెన్నిధిపేదకేనును
   ఎన్నగసేవలుజనులకునెప్పుడుసేతున్
   అన్నగకరకునుగలచే
   దున్ననుఁగాంచిదోచితివనిరుల్లంబులనే

   తొలగించండి

 3. విన్నది తలపై దాల్చిన
  పన్నగ భూషణుడు హరుడు భద్రుండతడే
  కన్నులు మూడు సిగను చం
  దున్ననుఁ గని దోఁచితివని రుల్లంబులనే.

  రిప్లయితొలగించండి

 4. అన్నులమిన్న పార్వతికి నర్థశరీరము నివ్వనేమిరా
  కన్నుల జూడమూడయిన కంఠముపైన కిలాసముండినన్
  బన్నగమే విభూషణము పాణిని శూలము కైశికమ్ము జం
  దున్ననుఁ గాంచి దోఁ చితివె యుల్లము లంచు వచించిరెల్లరున్.

  రిప్లయితొలగించండి
 5. వెన్నెల కాంతిని మసలుచు
  నన్నుల మిన్నల విరహపు ట o దము మెచ్చె న్ వెన్నుడు వారల వని యం
  దున్నను గని దోచితి వని రుల్లంబు లనే

  రిప్లయితొలగించండి
 6. మిన్నగ కాకర కాయల
  కున్నటి చేదును వదలగ నోపిక తోడన్
  చెన్నుగ వండగ చిరు చే
  దున్ననుఁ గని దోఁచితివని రుల్లంబులనే!

  ఉన్నది చందమామ మది
  నూయల లూపెడి కౌముదీ లతల్
  మిన్నును నేలనున్గలిపి
  మేలిమి జిల్గుల శోభ నిండగన్
  పన్నుగ లోకమంతటను
  భాసిల, హాయిని, నాకసంబునం
  దున్ననుఁ గాంచి దోఁచితివె
  యుల్లములంచు, వచించి రెల్లరున్!

  రిప్లయితొలగించండి
 7. వన్నెలమోముఁజూచుటకువారికిముచ్చటగల్గెనేయెదన్
  పన్నుగణజేరదీసిననుపాపనువింతగజూచిరాయెడన్
  ఎవ్నగజాజిపూవువలెనెంచగవెన్నెలనవ్వులేతచం
  దున్ననుగాంచిదోచితివెయుల్లములంచువచించిరెల్లరున్

  రిప్లయితొలగించండి
 8. వెన్నుని నాభిబుట్టి ఘన విద్యల తల్లికి భర్తృపీఠమై
  ఆన్నులమిన్నయౌ చపలకాసన మానన లోచనమ్ములై
  చెన్నుగ, భూమిపైన గడుచిన్నతనంబున జూచు పంకమం
  దున్నను గాంచి దోచితివె యుల్లములంచు వచించి రెల్లరున్

  రిప్లయితొలగించండి
 9. సమస్య :

  దున్నను గాంచి దోచితివె
  యుల్లములంచు వచించి రెల్లరున్

  ( సత్యవంతుని ప్రాణమిచ్చిన యమధర్మరాజునే కాక ఆయన వాహనమైన మహిషరాజాన్ని సైతం ప్రశంసిస్తున్న జనసమూహం )

  " కన్నులపండువయ్యె గద !
  కానగలేదెట ; విన్న వార్తయున్
  మున్నును గాదు ; సద్గుణుని
  భూపతి పుత్రుని ధర్మవర్తియే
  క్రన్నన జీవితున్ సలిపె ;
  గావున నీకును జోత " లంచు నా
  దున్నను గాంచి " దోచితివె
  యుల్లము " లంచు వచించి రెల్లరున్ .

  రిప్లయితొలగించండి
 10. ఎన్నగ ముదిరెను జబ్బని

  ఉన్నది ఊడ్చిరి సకలము నూతన వైద్యుల్

  కన్నుల కదిలిన కాలుని

  దున్ననుఁ గని దోఁచితివని రుల్లంబులనే”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధన్యవాదములండీ

   రెండవ పాదము:
   చిన్నగనూడ్చిరి సకలము శ్రేష్టుల్ వైద్యుల్

   నాల్గవ పాదము :: సమస్య

   తొలగించండి
  2. నేనునూ మొదట ఇలాగే తడబడ్డాను. క్షమించాలి మీకు చెప్పగల వాడను కాను. నేను మూడు పాదాలు వ్రాసిన తర్వాత నాకు తెలిసింది. అప్పుడు బాధతో నా మనసు ఇలా అనింది.

   "తడబడి దున్నయన్న యతి తప్పును" దున్న"యు "ఉన్న" కావలెన్"

   తొలగించండి
 11. ఉ:

  మన్నన బొందు మాటలును మౌనము తోడుత దీర్చు కార్యముల్
  కన్నుల భాష లెంచి నిక కన్నులవిల్తుని బోలు చందమున్
  సన్నని నవ్వులన్ విసరి సఖ్యత గోరుచు ముద్దుగుమ్మ యెం
  దున్నను గాంచి దోచితివె యుల్లము లంచు వచించి రెల్లరున్

  కన్నులవిల్తుడు= మన్మథుడు

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 12. మిత్రులందఱకు నమస్సులు!

  అన్నులమిన్నలౌ వనిత లందఱు తానములాడుచుండఁగాఁ,
  బిన్నవయస్కుఁడైన మురభిత్తు దుకూలములన్ హరించి, తా
  నన్నగ శాఖపై నునిచి, నవ్వుచు వేణువు నూఁద, "శాఖలం

  దున్ననుఁ గాంచి, దోఁచితివె యుల్లము!" లంచు వచించి రెల్లరున్!

  రిప్లయితొలగించండి
 13. రిప్లయిలు
  1. కందం
   తిన్నగ ముని బృందమునకు
   వెన్నుని దయ విందుఁ గుడుప వేడుక కృష్ణా!
   'మన్నన' వనవాసమునం
   దున్ననుఁ గని 'దోఁచితి'వని రుల్లంబులనే

   ఉత్పలమాల
   తిన్నగ మౌని బృందమట తీరుచు విందునుఁ గోర ద్రౌపదీ!
   వెన్నుడు దారి జూపగనె వేడుక వారికి తృప్తిఁగూర్చియున్
   మన్నన జూపితే మివుల మౌనులు తృప్తి నరణ్యవాసమం
   దున్ననుఁ గాంచి దోఁచితివె యుల్లములంచు వచించి రెల్లరున్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 14. పున్నమ రేయిలోన సురపొన్న
  వనంబున దిర్గుచుండ మా
  కన్నయతోడ హాయిగను గాలము
  గడ్పుచు, రాధ మెల్లగా
  సన్నని కూని రాగమును జక్కగ
  దీయుచు వచ్చి తోటయం
  దున్నను గాంచి దోచితివె యుల్ల
  ములంచు దలంచి రందరున్

  రిప్లయితొలగించండి

 15. అన్నువు కాకర కాయల
  సన్నగ ముక్కలుగ కోసి శాకమ జేయన్
  మిన్నయగు రుచి కలిగి చే
  దున్ననుఁ గని దోఁచితివని రుల్లంబులనే

  రిప్లయితొలగించండి
 16. మల్లెల.నాగరాజ


  కన్నుల స్నేహభావముల కాంతులఁ జిమ్మి నృపాసనమ్ముపై
  ఖిన్న మతిం గుచేలుఁ గని కేలుని పట్టి సుగందమద్ది,సం
  పన్నతలిచ్చి తీర్చితివి బాధలు, మిక్కిలియౌ దరిద్ర మం
  దున్నను గాంచి, దోఁచితివి యుల్లములంచు వచించి రెల్లరున్!

  రిప్లయితొలగించండి
 17. మల్లెల.నాగరాజ


  కన్నుల స్నేహభావముల కాంతులఁ జిమ్మి నృపాసనమ్ముపై
  ఖిన్న మతిం గుచేలుఁ గని కేలుని పట్టి సుగందమద్ది,సం
  పన్నతలిచ్చి తీర్చితివి బాధలు, మిక్కిలియౌ దరిద్ర మం
  దున్నను గాంచి, దోఁచితివి యుల్లములంచు వచించి రెల్లరున్!

  రిప్లయితొలగించండి
 18. కామోత్కంఠత గోపికల్.....

  ఉ.
  సన్నని వేణుగానమది చక్కిలి గింతలువెట్టగా మదిన్
  వెన్నుని గోరుచున్ వెదకి వేసట నొందుచు గొల్లభామ లా
  యన్నుల మిన్నలే తుదకు నర్మిలి దీర్పగ మానసంబు నం
  దున్ననుఁ గాంచి, దోఁచితివె యుల్లములంచు వచించి రెల్లరున్.

  రిప్లయితొలగించండి
 19. క్రన్నన తల్లులదండ్రుల
  కన్నులముందర కరోన కబళించంగా
  పిన్నలకాపాడుటయం
  దున్ననుఁ గని దోఁచితివని రుల్లంబులనే

  రిప్లయితొలగించండి
 20. చిన్నది యింటికే వెలుగు చింతలు బాపును తండ్రికే తనూ
  అన్నకు ముద్దు చెల్లి తను, అమ్మకు సాయము వంటలో తనూ
  వన్నెల చిన్నతల్లి తను, వచ్చుపటించుటకై తనెప్పుడెం
  దున్ననుఁ , గాంచి దోఁచితివె యుల్లములంచు వచించి రెల్లరున్

  రిప్లయితొలగించండి
 21. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 22. అన్ని యదనుల తమపతుల
  వెన్నడి గాపురమును కొనసాగించచునే ,
  వెన్నుడు యెదురయి దమ ముం
  దున్ననుఁ గని దోఁచితివని రుల్లంబులనే

  రిప్లయితొలగించండి
 23. మన్నన పొంది గాంధి తన మంచి గుణంబున శాంతి తో డుతన్
  పన్నుచు వ్యూహముల్ దొరల పాలిట నిప్పుగ ప్రజ్వరిల్ల గా
  కన్నులు కుట్టి జాతిపిత కట్టడికై చెర పట్ట జైలు నం
  దున్ననుఁ గాంచి దోఁచితివె యుల్లములంచు వచించి రెల్లరున్

  రిప్లయితొలగించండి
 24. అన్నము లేదు కొన్ని మధురాంబుపులున్నవి యన్చు త్యాగము

  న్నున్న జలంబులున్ విడిచెనొక్కడు , రావణ వైరి సాక్షిగన్

  సన్నలు కారు వారు హరి సాక్షిగ వేద్యుడు రంతి దేవుడెం

  దున్ననుఁ గాంచి దోఁచితివె యుల్లములంచు వచించి రెల్లరున్”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 25. ( సత్యవంతుని ప్రాణమిచ్చిన యమధర్మరాజునే కాక
  ఆయన వాహనమైన మహిషరాజాన్ని సైతం ప్రశంసిస్తున్న జనసమూహం )

  " కన్నులపండువయ్యె గద !
  కానగలేదెట ; విన్న వార్తయున్
  మున్నును గాదు ; సద్గుణుని
  భూపుని ధర్ముడు సాధ్వి కిచ్చెలే ;
  క్రన్నన వందనం " బనుచు
  గమ్రపు దున్నయె మోదమౌనమం
  దున్నను గాంచి " దోచితివె
  యుల్లము " లంచు వచించి రెల్లరున్ .

  రిప్లయితొలగించండి
 26. ఎన్నని చెప్ప నోపు భవదీయవిచిత్రవిలాసలీలలన్?
  చెన్నుగ నేకపత్నిని, వశీకృతగోపికలన్ వరించి, యా
  పన్నుల రక్షవై పరమభాగవతోత్తమయోగిహృత్తులం
  దున్ననుఁ గాంచి దోఁచితివె యుల్లములంచు వచించి రెల్లరున్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 27. క్రన్నన తల్లిదండ్రులను రక్కసి కోవిడు మ్రింగు వేళనా
  పన్నుల వారిపిల్లలకు భద్రతగూర్చగ దీక్షబూని సం
  పన్నుడనాథ పిల్లలను పాలనపోషణచేయు కృత్యమం
  దున్ననుఁ గాంచి దోఁచితివె యుల్లములంచు వచించి రెల్లరున్

  రిప్లయితొలగించండి
 28. మన్నన చేయగా తగదు మారిన కాలము నందు దున్నలన్
  కన్నుల నీరు పెట్టి నను కాదని ఖండన చేయు జాతరల్
  పన్నుగ నాపె నొక్కరుడు పాతకమౌబలి లేవయస్సు నం
  దున్ననుఁ గాంచి దోఁచితివె యుల్లములంచు వచించి రెల్లరున్

  రిప్లయితొలగించండి
 29. శ్రీ గురుభ్యోనమః

  వెన్నెల నింపుచున్ నిశిని వేడుక జేయగ చందమామయే
  యన్నులమిన్నయౌ తనదు యానన మాశశి నందుపోల్చగన్
  కన్నుల యందునన్ నిలిచి గారడి చూపుల కొల్లగొట్టి యెం
  దున్ననుఁ గాంచి దోఁచితివె యుల్లములంచు వచించిరెల్లరున్

  రిప్లయితొలగించండి
 30. కె.వి.యస్. లక్ష్మి:

  వెన్నెల రాతిరిన్ మదిని వెన్నుని నామమె నెంచుచున్ మరిన్
  సన్నని వెన్నెలన్ సఖుని చక్కని రూపము గాంచి నంతటన్
  మిన్నగు వేణు నాదమును మీటుచు పూపొద చాటులందు నెం
  దున్ననుఁ గాంచి దోఁచితివె యుల్లములంచు వచించి రెల్లరున్

  రిప్లయితొలగించండి
 31. అన్న నటింపగ నాడా
  కన్నుల విందౌ దెఱఁగున కర్ణుని పాత్రన్
  మిన్నగు చలచిత్రము నిడు
  దున్ననుఁ గని దోఁచితివని రుల్లంబులనే

  రిప్లయితొలగించండి
 32. తెన్నును జూప మీనమున ధీధితి నొప్పుచు చేరి నావుగా,
  మన్నిక తోడ కూర్మముగ మంధర పర్వత మెత్తి నావుగా,
  మన్నుశుభాంగి కాచ మన మంధిర మందు వరాహ మైతివే ,
  చిన్ని మనంబు వాడడుగ చేరితివే మొగరాడు నందునన్,
  మిన్నుకు నొక్క పాదమును మేధిని పైనొక పాదమున్
  తన్నుచు నెత్తిపై నొకటి దైత్యుని పైనిడి నావు శోభతో ,
  మన్నియ లెల్లరన్ వెదకి మౌలిని లోపడ ద్రొక్కి నావుగా,
  అన్నుల మిన్న భూమిజను యాతువు బట్ట వధించి నావుగా,
  వెన్నుడవై శుభాంగనల వేడుకలన్ సరి దీర్చుచు నుండి నావుగా,
  పన్నగ శాయి రూపములు బాడము లైనను యెన్ని జీవులం
  దున్ననుఁ గాంచి దోఁచితివె యుల్లములంచు వచించి రెల్లరున్”


  రిప్లయితొలగించండి
 33. సన్నని కాకర కాయలు
  నున్నగ పైదొక్కదీసి నూనెను వేచిన్
  చెన్నున వండగ చిరుచే
  దున్నను గని దోచితివనిరుల్లం బులనే

  రిప్లయితొలగించండి
 34. మిన్నగఁ గ్రిమి బారినిఁ బడి
  యున్న జనుల కీయ ధైర్య మున్నతముగ నీ
  వన్నగరమున కరుగఁ గుం
  దున్ననుఁ గని దోఁచితి వని రుల్లంబులనే

  [కుందు +ఉన్నను =కుందున్నను]


  సన్నము సేయ నెంచి తగ సంశయ కారక చింత నావలిన్
  భిన్నపు దృక్పథమ్ములను బేరిమి నేకము సేయ నెంచుచుం
  దిన్నగఁ గూర్ప స్నేహమును దిట్టతనమ్మున వారి మధ్య వా
  దున్ననుఁ గాంచి దోఁచితివె యుల్లము లంచు వచించి రెల్లరున్

  [వాదు +ఉన్నను =వా దున్నను; వాదు =కలహము]

  రిప్లయితొలగించండి

 35. అన్నుల మిన్న జానకి ప్రియంబగు మాటల నాడి జేరర
  మ్మన్నను రావుగాదె కమలాక్షి సుఖంబుల పొందవచ్చు నీ
  కన్నుల నీరదేల కలకంఠి, చొకారము నీవరణ్యమం
  దున్ననుఁ గాంచి దోఁచితివె యుల్లములంచు వచించిరెల్లరున్

  రిప్లయితొలగించండి
 36. కన్నయ వేణుగానమున గాంతల దేల్చగ రాసలీలలన్,
  మన్నును దిన్నవాడనుచు మాయలు జేయునటంచు జూడుడీ
  చిన్నతనంబునాడె దమ చీరలు దోచెనటంచు గొంత వా
  దున్ననుఁ గాంచి దోఁచితివె యుల్లములంచు వచించి రెల్లరున్

  రిప్లయితొలగించండి
 37. మిన్నగు ముఖ్యమంత్రి యని మెప్పును గోరుచునప్పు చేసి దా
  నన్నను మీకటంచు జనులందరికిన్ దగ డబ్బు పంచగా,
  మున్నెరుగంగలేని బలుమోసములెన్నియొ జేసెనంచు వా
  దున్ననుఁ గాంచి దోఁచితివె యుల్లములంచు వచించి రెల్లరున్

  రిప్లయితొలగించండి
 38. సన్నని దేహముంగలిగి చక్కటి రూపున లేవయస్సునం
  దున్నను గాంచి దోచితివెయుల్లములంచు వచించి రెల్లరున్
  నన్నువ గల్గియుండునెడ నాదరమొప్పగ స్నేహభావమున్
  మిన్నగ జూపునందరును మేదిని సాజముచింతజేయగన్

  రిప్లయితొలగించండి