11-5-2021 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“రామ పదములఁ గడుగంగ రాఁడు గుహుఁడు”(లేదా...)“కడుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై రఘురాము పాదముల్”
గుహని గ్రామంలో ఒకడు రాముణ్ణి చూసి రామకథను పాటలుగా వ్రాయాలనుకున్నాడు...తే. గి.గుహని పల్లెలో నొక్కడు గుణము చేతరామ పదముల వ్రాసెను రాతిపైనసుద్దతో చెక్కిన పదము చూసి "నట్టిరామ పదములఁ" గడుగంగ రాఁడు గుహుఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు."చూచి యట్టి రామపదముల..." అని ఉండాలనుకుంటాను.
చదివితి పలుమరు కుమార సంభవమనుగాథ కారణ జన్ముడా కార్తికేయుడాశివసుతుడు కేకివాహనుడెచటనురామ పదములఁ గడుగంగ రాఁడు గుహుడు.
చక్కని పూరణ. అభినందనలు.
సమస్య :కడుగగ రాడులే గుహుడు కాతరుడై రఘురాము పాదముల్ ( రామయ్య కాలు తగిలి రాయి నాతిగా మారిందన్న సంగతి గుర్తువచ్చిన గుహుని గొంకుజంకులు .)చంపకమాల ..................అడుగులు వేయు రాఘవుని నట్టులె వెంటనె నంటి వచ్చు నా పడతిని ; నామె వెన్క చను భద్రగుణాన్వితు లక్ష్మణున్ సభ క్తుడు వినయమ్ముగన్ బిలచి కొంచె మహల్య స్మృతిన్ గనంబడన్ గడుగగ రాడులే గుహుడు కాతరుడై రఘురాము పాదముల్ .
మనోహామైన పూరణ. అభినందనలు.
మారు మ్రోగుచుండె కరోన మరణ ఘోషఆలయమ్ములు మూతలు పడెనురయ్యజలము తెచ్చెడి వారలు జంకునుండరామ పదములఁ గడుగంగ, రాఁడు గుహుఁడు”...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'జంకుచుండ' టైపాటు.
తేటగీతిచేరి నావలో నద్దరి జేర్చుమనఁగరాతి నాతినిఁ జేసిన ప్రభువుమెచ్చిజాగరూకుడౌచును శుద్ధజలములేకరామ పదములఁ గడుగంగ రాఁడు గుహుఁడుచంపకమాలఅడవిని నావలో నదికి నావలఁ జేర్చుమనంగ, రాతినేపడతిగ మార్చెడున్ బ్రభువు పావన రాముఁడు, జాగరూకుడైయెడదను భక్తిభావములు నేర్పడ శుద్ధ జలమ్ము లేకయేకడుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై రఘురాము పాదముల్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏 ధన్యోస్మి గురుదేవా🙏
రామ పదముల స్పర్శకు రమణి యయ్యె ననెడి విషయము దెలిసిన నతడు మిగుల జాగరూకత గలిగిన చతురు డేల రామ పదముల గడుగంగ రాడు గుహుడు?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్షేమ మరయగ భక్తుని ప్రేమ తోడదైవ మరుదెంచు నిరతము బ్రోవనెంచియేరు దాటెడి నెపమున చేరె స్వామి!రామ పదములఁ గడుగంగ రాఁడు గుహుఁడు!
దుడుకుడు తారకాసురుని ద్రుంచగ నెంచి జనించినట్టి యాజడముడి జంగమున్ సుతుడు శక్తిధరుండని భక్తి తోడనే విడువక నెన్ని మారులొ పవిత్ర చరిత్ర పఠించినాడనే గడుగగ రాడులే గుహుడు కాతరుఁ డై రఘురామపాదముల్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.'విడువక యెన్ని...' అనండి.
వాడవాడలయందునపారెకరోనపడవయూపిరినిలుపంగభారమాయెభక్తిలేకున్నదక్కుగాప్రాణమంచురామపదములగడుగంగరాఁడుగుహుఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'కరొన' అనండి. లేకుంటే గణభంగం.
విడివడజన్మబంధములువిష్ణునిమాయనువింతయాక్రుతిన్పిడికెడుగుండెపిండగనుపిల్వకనంటునుగాదెపుర్వునున్తడయకజాగ్రుతిన్గనియుతారకరామునిసేమమెంచియున్కడుగగరాఁడులేగుహుఁడుకాతరుఁడైరఘురాముపాదముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "వింత యాకృతిన్... జాగృతిన్ గనని.." టైపాటు.
సమస్య :-“రామ పదములఁ గడుగంగ రాఁడు గుహుఁడు”*కందం**రామా నిలుమని నిల్పెనురామ పదములఁ గడుగంగ,రాఁడు గుహుఁడు కొయ్యా మందిరమ్మును విడిచిరాముని చక్కదనము కనులారా జూచెన్ ...................✍️చక్రి
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'కొయ్యా మందిరము'?
తడబడకుండ కానలకు తమ్మునితోడను భామసీతతోవెడలగ గంగతీరమున పేర్మినెదుర్కొని స్వాగతించితానడపెడు నావనెక్క కలు నాతిగజేసిన వైనమెంచుచున్గడుగగ రాడులే గుహుడు కాతరుడై రఘురామ పాదముల్
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
అడవిని సంచరించు సమయంబున రాముని సచ్చరిత్రమున్దడయక సర్వ సంగతులు దానుగ్రహించియు ధైర్యమొప్పగాగడు ముదమొప్ప భక్తిమెయిగాంచుచునుండెను సత్యమిప్పుడున్గడుగగ రాడులే గుహుడు కాతరుడై రఘురాము పాదముల్
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
రామనామము నెపుడు పారాయణంబుసలుపుచుండును విడువక శ్రద్ధగానుగాఢమగు భక్తి మదిలోన గలుగకున్నరామ పదములఁ గడుగంగ రాఁడు గుహుఁడు
సూర్యుడు ప్రభవించెడి దిక్కు చోద్యముగనుమారు నేమో? నపుడుగూడ మానడతడుఅవని యుండునంతవరకు, యనగలేమురామ పదములఁ గడుగంగ రాఁడు గుహుఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "మారునేమో యతడు... మానడాత । డవని... వరకు ననగలేము" అనండి.
సూర్యుడు ప్రభవించెడి దిక్కు చోద్యముగనుమారు నేమో? నపుడుగూడ మానడుగదఅవని యుండునంతవరకు, యనగలేమురామ పదములఁ గడుగంగ రాఁడు గుహుఁడు
సమస్య: “రామ పదములఁ గడుగంగ రాఁడు గుహుఁడు”(లేదా...)కడుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై రఘురాము పాదముల్1)చంపకమాలఅడుగగ గంగ దాటుటకు నాత్రుత తోడను తాను వెళ్లగాతడవగ కన్నులే విభుని, దాశరథిన్ కని సంతసంబునన్నడిచెను వెంట నీడవలె ,నాథుని జూచియు న్యూనతా మదిన్కడుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై రఘురాము పాదముల్2)నేను శూద్రుడ , నీచుడ తాను ప్రభువు నాదు మలిన భూయిష్టమైన కరములని తాను పల్లవ పదములఁ దాక వగచి “రామ పదములఁ గడుగంగ రాఁడు గుహుఁడు”3)నావ బాగుజేయుటగోరి నాడు తాను మేకు కొట్టునపుడు రాయి మీద పడగ గాయ భరితమౌ రక్తపు కరముతోడ “రామ పదములఁ గడుగంగ రాఁడు గుహుఁడు”4)పడవను బాగు జేయుటకు పాతది మేకును తాను కొట్టగా తడబడ, రాయు జారిపడి తాకగ వ్రేళ్ళకు గాయమొందగా బొడబొడ కారు రక్తమును పూర్తిగ కట్టును కట్టినందుకే “కడుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై రఘురాము పాదముల్”5)పడవను కోరి దాశరథి ప్రార్థన జేయగ సీతతోడుగా తడబడి నిల్చెనాగుహుడు దైవమె తానుగ సాయమొందగా "కడగగ లేను రాఘవుని కాళ్ళను, నీచుడనంచు తల్చుచున్"కడుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై రఘురాము పాదముల్6)పడవను గంగపై నడిపి భక్తిగ తీరము జేర్చు వేళలో తడబడి బల్కెనా జనని దారుణ కానన మేగభాగ్యమున్ కడు చెడు వార్త గుండియను గాయము జేయగ, తాను మ్రాన్పడిన్ “కడుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై రఘురాము పాదముల్”(నేను, నా స్నేహితుడు, కవిమిత్రుడు పద్మాకర్ కలిసి వ్రాసిన పద్యము )- రాంబాబు కైప 11-05-2021----------------------------------------------------------
మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
కంద పద్యరీతిలో పూరించుటకు ప్రయత్నము 7)కం . రాముని తాకగ లేనని "రామ పదములఁ గడుగంగ రాఁడు గుహుఁడు", శ్రీ | రాముడు కౌగిలి జేర్చగ రాముని పదములు కడిగెను రాల్చుచు నీరున్ || - రాంబాబు కైప 11-05-2021----------------------------------------------------------
ప్రశంసార్హమైన చక్కని పూరణ. అభినందనలు.
తగిన పనిగ దలచె తన దైవమైనరామ పదములఁ గడుగంగ ; రాఁడు గుహుఁడుముందుగనె రామ లక్ష్మణ భూసుతలనుపుణ్య నదిని దాటించగ ముదము తోడ
అడుగును సోకి రాయి మరి నచ్చరువొందగ చూచువారలున్పడతిగ మారిపోయె యని పల్మరు విన్న గుహుండు వేగిరన్జడిసెను రామునిన్ అడుగ చందన శీలిత పాదపద్మములన్“కడుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై రఘురాము పాదముల్”
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'రామునిన్ అడుగ' అని పద్యం మధ్యలో అచ్చులు రాకుండా చూడండి. 'చందన శీలిత'?
గురువు గారికి నమస్కారము. అయ్యా! పద్యాన్ని ఇలా మార్చాను.అడుగును సోకి రాయి మరి నచ్చరువొందగ చూచువారలున్పడతిగ మారిపోయె యని పల్మరు విన్న గుహుండు వేగిరన్జడిసెను, రామునాజ్ఞ గొన, చల్లని పావన గంగ నీటితో“కడుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై రఘురాము పాదముల్”
అడుగును మోపి శీర్షమున దానవ రాజును మొత్తినాడవేఅడుగును మోపి రాతినల నాతిగ చేసిన మాయగాడవేకడిగిన వేళ చేపగనొ కప్పల రూపునొ చేతువోయనిన్కడుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై రఘురాము పాదముల్”...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు. మొదటి, రెండవ పాదాలలో యతి తప్పింది. సవరించండి.
దుశ్శకునములల్లవిగో కదులుచునుండెరావణు కనుల విడక గర్వమునసురుడురామ పదములఁ గడుగంగ రాఁడు ; గుహుఁడు, ఆర్ముగుడు సాక్షిగను రావణాంతమయ్యె...భారతీనాథ్ చెన్నంశెట్టి...
వడివడివచ్చినారుజనవందితరామునిబెండ్లికోసమైగడిగెనురామపాదములుగన్యనుదానముజేసిమామయున్నడుగిడనావనందుననున్యాయముగాదదివియ్యమందగాగడుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై రఘురాము పాదముల్కొరుప్రోలు రాధాకృష్ణరావు
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
గడిగెనురామపాదములుగన్యనుదానముజేసిమామయున్నడుగిడనావనందుననున్యాయముగాదదివియ్యమందగాగడుగఁగ రాఁడులే గుహుఁడు ,కాతరుఁడై రఘురాము పాదముల్దడుపుచుమ్రొక్కినాడుమునుదద్దయునిర్మల నాత్మబంధువైకొరుప్రోలు రాధాకృష్ణరావు
విడువడు రామనామమును వేసటనొందినగాని యెన్నడున్కుడువడు బువ్వతాను వినకున్నను రాముని సచ్చరిత్రమున్తడబడియైన నీవెపుడు తప్పుగ పల్కకు మివ్విధంబుగా"కడుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై రఘురాము పాదముల్"
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రాతి నాతాయె సోకగ రామపదముమహిమ రాఘవునిదెరిగి, మనసులోనవింతగమధన బడెనుగ, విన్న గూడరామ పదములఁ గడు, గంగ రాఁడు గుహుఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'నాతి+ఆయె' అన్నపుడు సంధి లేదు. "రాయి స్త్రీ యయ్యె సోకగ.." అనండి.
రాతి నాతియయ్యెను సోకి రామపదముమహిమ రాఘవునిదెరిగి, మనసులోనవింతగమధన బడినాడు, విన్న గూడరామ పదములఁ గడు, గంగ రాఁడు గుహుఁడు
చం: నడకన సాగి రాముడట నా సరయూ నది నొడ్డు జేరగన్వడివడి వచ్చెతా గుహుడు భక్తిని గూడి ముదమ్ముతోడుతన్చలనము లేక నిల్చెనట జానకి తోడుత జూడ, నివ్వెరన్కడుగగ రాడులే గుహుడు కాతరుడై రఘురాము పాదముల్వై. చంద్రశేఖర్
దడదడలాడు గుండెలతి దారుణ జాడ్యము దీని జూడగానిడుముల పాలు జేసె భువినెల్లరనిట్లు కరోన భూతమారడుగుల దూరమున్ ముసుగులారయ గాచునటిట్టి కాలమున్కడుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై రఘురాము పాదముల్
అడుగుల నంటు పాదరజ మయ్యెడ రాతిని నాతిఁ జేసె నీపుడమిని రాతిగుండె గుణపూర్ణులు కైకయవంటి వారి యయ్యెడదల కోమలమ్ములుగ నేర్పడఁ జేయనటంచు వేదనన్కడుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై రఘురాము పాదముల్.కంజర్ల రామాచార్య.
పితృ వివాసితుఁ డయ్యెను సుతుఁడు రాముఁడంచు నెఱిఁగి నిశ్చేష్టుఁడై మించ నెడఁద లోనఁ జింత భృశము తన్ను దాను మఱచి రామ పదములఁ గడుగంగ రాఁడు గుహుఁడు ఎడఁద మహానుమోదము నహీన విచారము రెండు కల్గఁగం దడఁబడి వేగ సానుజుఁడు తారణి తెమ్మని వచ్చెనే భయంపడి రిపు వీర సంతతికి, వచ్చును గాంచఁగఁ, దాను గాఁడు నౌ కడుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై, రఘురాము పాదముల్ [నౌకు = అంగహీనుఁడు, మొఱ్ఱి; పద విభజనము: తాను గాఁడు నౌకు, కాతరుఁడై రిపువీర సంతతికి భయంపడి రాఁడులే గుహుఁడు, వచ్చును గాంచఁగ రఘురాము పాదముల్]
రాయి నాతిగ మారుట భ్రమను నుండితేరు కొనగ లేకుండుట ధ్రువుడు మదినిరామ పదమములు గడుగంగ రాడు గుహుడుప్రాణ భయములు గలిగించు భవ్యులకును
అడిగితివౌట చెప్పుదును రాముని పాదము సోకుట కారణంబుగానడవిని రాయి రూపమున హత్తుకు నుండియు నాతి రూపమున్ఋనడరుట చేత నిప్పుడిక హర్షకుమార! కడున్ భ యార్తియైకడుగగ రాడులే గుహుడు కాతరుడై రఘురామ పాదముల్
కె.వి.యస్. లక్ష్మి: కలిమిని బలిమిని కలిగియు తలపున నెన్నడు తనదగు ధనమొసగుటకై కలనయినను దలచని రూ కలు కలిగినవాడె రాజు కలికాలమునన్.
రాము పదముసోకగనయ్యె రాయి రమణియట్టి విభుడు పడవనెక్క నణగి పోవుననుచు చింతించుచు మదిని హడలిపోయిరామపదములు కడుగంగ రాడు గుహుడు.
గుహని గ్రామంలో ఒకడు రాముణ్ణి చూసి రామకథను పాటలుగా వ్రాయాలనుకున్నాడు...
రిప్లయితొలగించండితే. గి.
గుహని పల్లెలో నొక్కడు గుణము చేత
రామ పదముల వ్రాసెను రాతిపైన
సుద్దతో చెక్కిన పదము చూసి "నట్టి
రామ పదములఁ" గడుగంగ రాఁడు గుహుఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"చూచి యట్టి రామపదముల..." అని ఉండాలనుకుంటాను.
రిప్లయితొలగించండిచదివితి పలుమరు కుమార సంభవమను
గాథ కారణ జన్ముడా కార్తికేయు
డాశివసుతుడు కేకివాహనుడెచటను
రామ పదములఁ గడుగంగ రాఁడు గుహుడు.
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండికడుగగ రాడులే గుహుడు
కాతరుడై రఘురాము పాదముల్
( రామయ్య కాలు తగిలి రాయి నాతిగా మారిందన్న సంగతి గుర్తువచ్చిన గుహుని గొంకుజంకులు .)
చంపకమాల
..................
అడుగులు వేయు రాఘవుని
నట్టులె వెంటనె నంటి వచ్చు నా
పడతిని ; నామె వెన్క చను
భద్రగుణాన్వితు లక్ష్మణున్ సభ
క్తుడు వినయమ్ముగన్ బిలచి
కొంచె మహల్య స్మృతిన్ గనంబడన్
గడుగగ రాడులే గుహుడు
కాతరుడై రఘురాము పాదముల్ .
మనోహామైన పూరణ. అభినందనలు.
తొలగించండిమారు మ్రోగుచుండె కరోన మరణ ఘోష
రిప్లయితొలగించండిఆలయమ్ములు మూతలు పడెనురయ్య
జలము తెచ్చెడి వారలు జంకునుండ
రామ పదములఁ గడుగంగ, రాఁడు గుహుఁడు”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'జంకుచుండ' టైపాటు.
తేటగీతి
రిప్లయితొలగించండిచేరి నావలో నద్దరి జేర్చుమనఁగ
రాతి నాతినిఁ జేసిన ప్రభువుమెచ్చి
జాగరూకుడౌచును శుద్ధజలములేక
రామ పదములఁ గడుగంగ రాఁడు గుహుఁడు
చంపకమాల
అడవిని నావలో నదికి నావలఁ జేర్చుమనంగ, రాతినే
పడతిగ మార్చెడున్ బ్రభువు పావన రాముఁడు, జాగరూకుడై
యెడదను భక్తిభావములు నేర్పడ శుద్ధ జలమ్ము లేకయే
కడుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై రఘురాము పాదముల్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏 ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిరామ పదముల స్పర్శకు రమణి యయ్యె
రిప్లయితొలగించండిననెడి విషయము దెలిసిన నతడు మిగుల
జాగరూకత గలిగిన చతురు డేల
రామ పదముల గడుగంగ రాడు గుహుడు?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్షేమ మరయగ భక్తుని ప్రేమ తోడ
రిప్లయితొలగించండిదైవ మరుదెంచు నిరతము బ్రోవనెంచి
యేరు దాటెడి నెపమున చేరె స్వామి!
రామ పదములఁ గడుగంగ రాఁడు గుహుఁడు!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిదుడుకుడు తారకాసురుని ద్రుంచగ నెంచి జనించినట్టి యా
జడముడి జంగమున్ సుతుడు శక్తిధరుండని భక్తి తోడనే
విడువక నెన్ని మారులొ పవిత్ర చరిత్ర పఠించినాడనే
గడుగగ రాడులే గుహుడు కాతరుఁ డై రఘురామపాదముల్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'విడువక యెన్ని...' అనండి.
వాడవాడలయందునపారెకరోన
రిప్లయితొలగించండిపడవయూపిరినిలుపంగభారమాయె
భక్తిలేకున్నదక్కుగాప్రాణమంచు
రామపదములగడుగంగరాఁడుగుహుఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కరొన' అనండి. లేకుంటే గణభంగం.
విడివడజన్మబంధములువిష్ణునిమాయనువింతయాక్రుతిన్
రిప్లయితొలగించండిపిడికెడుగుండెపిండగనుపిల్వకనంటునుగాదెపుర్వునున్
తడయకజాగ్రుతిన్గనియుతారకరామునిసేమమెంచియున్
కడుగగరాఁడులేగుహుఁడుకాతరుఁడైరఘురాముపాదముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వింత యాకృతిన్... జాగృతిన్ గనని.." టైపాటు.
సమస్య :-
రిప్లయితొలగించండి“రామ పదములఁ గడుగంగ రాఁడు గుహుఁడు”
*కందం**
రామా నిలుమని నిల్పెను
రామ పదములఁ గడుగంగ,రాఁడు గుహుఁడు కొ
య్యా మందిరమ్మును విడిచి
రాముని చక్కదనము కనులారా జూచెన్
...................✍️చక్రి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కొయ్యా మందిరము'?
తడబడకుండ కానలకు తమ్మునితోడను భామసీతతో
రిప్లయితొలగించండివెడలగ గంగతీరమున పేర్మినెదుర్కొని స్వాగతించి
తా
నడపెడు నావనెక్క కలు నాతిగజేసిన వైనమెంచుచున్
గడుగగ రాడులే గుహుడు కాతరుడై రఘురామ పాదముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
తొలగించండిఅడవిని సంచరించు సమయంబు
రిప్లయితొలగించండిన రాముని సచ్చరిత్రమున్
దడయక సర్వ సంగతులు దాను
గ్రహించియు ధైర్యమొప్పగా
గడు ముదమొప్ప భక్తిమెయిగాం
చుచునుండెను సత్యమిప్పుడున్
గడుగగ రాడులే గుహుడు కాత
రుడై రఘురాము పాదముల్
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిరామనామము నెపుడు పారాయణంబు
రిప్లయితొలగించండిసలుపుచుండును విడువక శ్రద్ధగాను
గాఢమగు భక్తి మదిలోన గలుగకున్న
రామ పదములఁ గడుగంగ రాఁడు గుహుఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసూర్యుడు ప్రభవించెడి దిక్కు చోద్యముగను
రిప్లయితొలగించండిమారు నేమో? నపుడుగూడ మానడతడు
అవని యుండునంతవరకు, యనగలేము
రామ పదములఁ గడుగంగ రాఁడు గుహుఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"మారునేమో యతడు... మానడాత । డవని... వరకు ననగలేము" అనండి.
సూర్యుడు ప్రభవించెడి దిక్కు చోద్యముగను
తొలగించండిమారు నేమో? నపుడుగూడ మానడుగద
అవని యుండునంతవరకు, యనగలేము
రామ పదములఁ గడుగంగ రాఁడు గుహుఁడు
రిప్లయితొలగించండిసమస్య: “రామ పదములఁ గడుగంగ రాఁడు గుహుఁడు”
(లేదా...)
కడుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై రఘురాము పాదముల్
1)
చంపకమాల
అడుగగ గంగ దాటుటకు నాత్రుత తోడను తాను వెళ్లగా
తడవగ కన్నులే విభుని, దాశరథిన్ కని సంతసంబునన్
నడిచెను వెంట నీడవలె ,నాథుని జూచియు న్యూనతా మదిన్
కడుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై రఘురాము పాదముల్
2)
నేను శూద్రుడ , నీచుడ తాను ప్రభువు
నాదు మలిన భూయిష్టమైన కరములని
తాను పల్లవ పదములఁ దాక వగచి
“రామ పదములఁ గడుగంగ రాఁడు గుహుఁడు”
3)
నావ బాగుజేయుటగోరి నాడు తాను
మేకు కొట్టునపుడు రాయి మీద పడగ
గాయ భరితమౌ రక్తపు కరముతోడ
“రామ పదములఁ గడుగంగ రాఁడు గుహుఁడు”
4)
పడవను బాగు జేయుటకు పాతది మేకును తాను కొట్టగా
తడబడ, రాయు జారిపడి తాకగ వ్రేళ్ళకు గాయమొందగా
బొడబొడ కారు రక్తమును పూర్తిగ కట్టును కట్టినందుకే
“కడుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై రఘురాము పాదముల్”
5)
పడవను కోరి దాశరథి ప్రార్థన జేయగ సీతతోడుగా
తడబడి నిల్చెనాగుహుడు దైవమె తానుగ సాయమొందగా
"కడగగ లేను రాఘవుని కాళ్ళను, నీచుడనంచు తల్చుచున్"
కడుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై రఘురాము పాదముల్
6)
పడవను గంగపై నడిపి భక్తిగ తీరము జేర్చు వేళలో
తడబడి బల్కెనా జనని దారుణ కానన మేగభాగ్యమున్
కడు చెడు వార్త గుండియను గాయము జేయగ, తాను మ్రాన్పడిన్
“కడుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై రఘురాము పాదముల్”
(నేను, నా స్నేహితుడు, కవిమిత్రుడు పద్మాకర్ కలిసి వ్రాసిన పద్యము )
- రాంబాబు కైప
11-05-2021
----------------------------------------------------------
మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
తొలగించండికంద పద్యరీతిలో పూరించుటకు ప్రయత్నము
రిప్లయితొలగించండి7)
కం .
రాముని తాకగ లేనని
"రామ పదములఁ గడుగంగ రాఁడు గుహుఁడు", శ్రీ |
రాముడు కౌగిలి జేర్చగ
రాముని పదములు కడిగెను రాల్చుచు నీరున్ ||
- రాంబాబు కైప
11-05-2021
----------------------------------------------------------
ప్రశంసార్హమైన చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండితగిన పనిగ దలచె తన దైవమైన
రిప్లయితొలగించండిరామ పదములఁ గడుగంగ ; రాఁడు గుహుఁడు
ముందుగనె రామ లక్ష్మణ భూసుతలను
పుణ్య నదిని దాటించగ ముదము తోడ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅడుగును సోకి రాయి మరి నచ్చరువొందగ చూచువారలున్
రిప్లయితొలగించండిపడతిగ మారిపోయె యని పల్మరు విన్న గుహుండు వేగిరన్
జడిసెను రామునిన్ అడుగ చందన శీలిత పాదపద్మములన్
“కడుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై రఘురాము పాదముల్”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'రామునిన్ అడుగ' అని పద్యం మధ్యలో అచ్చులు రాకుండా చూడండి.
'చందన శీలిత'?
గురువు గారికి నమస్కారము. అయ్యా! పద్యాన్ని ఇలా మార్చాను.
తొలగించండిఅడుగును సోకి రాయి మరి నచ్చరువొందగ చూచువారలున్
పడతిగ మారిపోయె యని పల్మరు విన్న గుహుండు వేగిరన్
జడిసెను, రామునాజ్ఞ గొన, చల్లని పావన గంగ నీటితో
“కడుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై రఘురాము పాదముల్”
అడుగును మోపి శీర్షమున దానవ రాజును మొత్తినాడవే
రిప్లయితొలగించండిఅడుగును మోపి రాతినల నాతిగ చేసిన మాయగాడవే
కడిగిన వేళ చేపగనొ కప్పల రూపునొ చేతువోయనిన్
కడుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై రఘురాము పాదముల్”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి, రెండవ పాదాలలో యతి తప్పింది. సవరించండి.
దుశ్శకునములల్లవిగో కదులుచునుండె
రిప్లయితొలగించండిరావణు కనుల విడక గర్వమునసురుడు
రామ పదములఁ గడుగంగ రాఁడు ; గుహుఁడు,
ఆర్ముగుడు సాక్షిగను రావణాంతమయ్యె
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివడివడివచ్చినారుజనవందితరామునిబెండ్లికోసమై
రిప్లయితొలగించండిగడిగెనురామపాదములుగన్యనుదానముజేసిమామయున్
నడుగిడనావనందుననున్యాయముగాదదివియ్యమందగా
గడుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై రఘురాము పాదముల్
కొరుప్రోలు రాధాకృష్ణరావు
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిగడిగెనురామపాదములుగన్యనుదానముజేసిమామయున్
రిప్లయితొలగించండినడుగిడనావనందుననున్యాయముగాదదివియ్యమందగా
గడుగఁగ రాఁడులే గుహుఁడు ,కాతరుఁడై రఘురాము పాదముల్
దడుపుచుమ్రొక్కినాడుమునుదద్దయునిర్మల నాత్మబంధువై
కొరుప్రోలు రాధాకృష్ణరావు
విడువడు రామనామమును వేసటనొందినగాని యెన్నడున్
రిప్లయితొలగించండికుడువడు బువ్వతాను వినకున్నను రాముని సచ్చరిత్రమున్
తడబడియైన నీవెపుడు తప్పుగ పల్కకు మివ్విధంబుగా
"కడుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై రఘురాము పాదముల్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరాతి నాతాయె సోకగ రామపదము
రిప్లయితొలగించండిమహిమ రాఘవునిదెరిగి, మనసులోన
వింతగమధన బడెనుగ, విన్న గూడ
రామ పదములఁ గడు, గంగ రాఁడు గుహుఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నాతి+ఆయె' అన్నపుడు సంధి లేదు. "రాయి స్త్రీ యయ్యె సోకగ.." అనండి.
రాతి నాతియయ్యెను సోకి రామపదము
తొలగించండిమహిమ రాఘవునిదెరిగి, మనసులోన
వింతగమధన బడినాడు, విన్న గూడ
రామ పదములఁ గడు, గంగ రాఁడు గుహుఁడు
చం:
రిప్లయితొలగించండినడకన సాగి రాముడట నా సరయూ నది నొడ్డు జేరగన్
వడివడి వచ్చెతా గుహుడు భక్తిని గూడి ముదమ్ముతోడుతన్
చలనము లేక నిల్చెనట జానకి తోడుత జూడ, నివ్వెరన్
కడుగగ రాడులే గుహుడు కాతరుడై రఘురాము పాదముల్
వై. చంద్రశేఖర్
దడదడలాడు గుండెలతి దారుణ జాడ్యము దీని జూడగా
రిప్లయితొలగించండినిడుముల పాలు జేసె భువినెల్లరనిట్లు కరోన భూతమా
రడుగుల దూరమున్ ముసుగులారయ గాచునటిట్టి కాలమున్
కడుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై రఘురాము పాదముల్
అడుగుల నంటు పాదరజ మయ్యెడ రాతిని నాతిఁ జేసె నీ
రిప్లయితొలగించండిపుడమిని రాతిగుండె గుణపూర్ణులు కైకయవంటి వారి య
య్యెడదల కోమలమ్ములుగ నేర్పడఁ జేయనటంచు వేదనన్
కడుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై రఘురాము పాదముల్.
కంజర్ల రామాచార్య.
పితృ వివాసితుఁ డయ్యెను సుతుఁడు రాముఁ
రిప్లయితొలగించండిడంచు నెఱిఁగి నిశ్చేష్టుఁడై మించ నెడఁద
లోనఁ జింత భృశము తన్ను దాను మఱచి
రామ పదములఁ గడుగంగ రాఁడు గుహుఁడు
ఎడఁద మహానుమోదము నహీన విచారము రెండు కల్గఁగం
దడఁబడి వేగ సానుజుఁడు తారణి తెమ్మని వచ్చెనే భయం
పడి రిపు వీర సంతతికి, వచ్చును గాంచఁగఁ, దాను గాఁడు నౌ
కడుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై, రఘురాము పాదముల్
[నౌకు = అంగహీనుఁడు, మొఱ్ఱి;
పద విభజనము: తాను గాఁడు నౌకు, కాతరుఁడై రిపువీర సంతతికి భయంపడి రాఁడులే గుహుఁడు, వచ్చును గాంచఁగ రఘురాము పాదముల్]
రాయి నాతిగ మారుట భ్రమను నుండి
రిప్లయితొలగించండితేరు కొనగ లేకుండుట ధ్రువుడు మదిని
రామ పదమములు గడుగంగ రాడు గుహుడు
ప్రాణ భయములు గలిగించు భవ్యులకును
అడిగితివౌట చెప్పుదును రాముని పాదము సోకుట కారణంబుగా
రిప్లయితొలగించండినడవిని రాయి రూపమున హత్తుకు నుండియు నాతి రూపమున్ఋ
నడరుట చేత నిప్పుడిక హర్షకుమార! కడున్ భ యార్తియై
కడుగగ రాడులే గుహుడు కాతరుడై రఘురామ పాదముల్
కె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండికలిమిని బలిమిని కలిగియు
తలపున నెన్నడు తనదగు ధనమొసగుటకై
కలనయినను దలచని రూ
కలు కలిగినవాడె రాజు కలికాలమునన్.
రాము పదముసోకగనయ్యె రాయి రమణి
రిప్లయితొలగించండియట్టి విభుడు పడవనెక్క నణగి పోవు
ననుచు చింతించుచు మదిని హడలిపోయి
రామపదములు కడుగంగ రాడు గుహుడు.