16, మే 2021, ఆదివారం

సమస్య - 3725

17-5-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జనకుఁ జంపినవానికి జనుల నతులు”
(లేదా...)
“జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్”

71 కామెంట్‌లు:

  1. మిత్రులందఱకు నమస్సులు!

    వినయవిధేయతల్ గలిగి, వేగమఁ దాటకిఁ గూల్చి, స
    న్మునివరు యాగముం దడవి, పోయి శిలన్ గొమగా నొనర్చి, త్ర్య
    క్షుని విలుఁ ద్రుంచి, జానకినిఁ గోరియుఁ జేకొని,యట్లె యింద్రజి
    జ్జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొదటి పాదంలో చిన్నపదం తొలగిపోయింది. దానిని చేర్చి తిరిగి ప్రకటిస్తున్నాను...

      వినయవిధేయతల్ గలిగి, వేగమఁ దాటకిఁ గూల్చి, చేరి స
      న్మునివరు యాగముం దడవి, పోయి శిలన్ గొమగా నొనర్చి, త్ర్య
      క్షుని విలుఁ ద్రుంచి, జానకినిఁ గోరియుఁ జేకొని,యట్లె యింద్రజి
      జ్జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్!

      తొలగించండి
    2. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి

  2. అనవరతము విడువక శ్రీ హరియె రక్ష
    కుడని వచియించు చుండగ కోప మందు
    నాత్మజుండె తనకు శత్రువనిదలచిన
    జనకుఁ జంపిన వానికి జనుల నుతులు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      జనకుని చంపించాడే కాని తాను స్వయంగా చంపలేదు కదా!

      తొలగించండి
    2. ఆత్మజుని తన శత్రువుగ తలచిన జనకుని .....ప్రహ్లాదుని శత్రువుగా భావించిన ఆ తండ్రిని అనికదా!

      తొలగించండి
  3. ఘనముగ వధించ నా పంక్తి గళుణి రామ

    చంద్రుడు సమరమును చేసి, యింద్ర జిత్తు

    జనకు జంపిన వానికి జనుల నతులు

    నిడుచు హారతు లొసగెను పుడమి పైన

    రిప్లయితొలగించండి
  4. భక్తకోటికినాదర్శబాలకుండు
    విష్ణుభక్తుడుజగతికివెలుగుదివ్వె
    నిర్వికారుండునెమ్మదినేర్పువలన
    జనకుఁజంపినవానికిజనులనుతులు

    రిప్లయితొలగించండి
  5. రాఘవునికి, దనుజవైరి, రాఘవేంద్రు
    నికి, కమలనేత్రునికి రామునికివిజయము
    యినకులతిలకునికి, నిల ఇంద్రజిత్తు
    జనకుఁ జంపినవానికి, జనుల నుతులు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విజయము+ఇనకుల' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  6. ఇందుగలను సందేహమదేలననుచు

    కంబమును చీల్చి చీల్చె రాక్షసుని కడుపు

    లచ్చిమి పతిని కొలుచు ప్రహ్లాద కుమరు

    జనకుఁ జంపినవానికి జనుల నతులు”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  7. చెల్లి కడుపున బుట్టెడు చిన్నవాడు
    చంపబోవును నన్నను శంకతోడ
    చెడ్డబుద్ధిని కంసుడు చెఱనుబెట్ట
    జనకు, జంపిన వానికి జనుల నుతులు

    దనుజుడు కాముకత్వమున దల్లిని సీతను దొంగలింపగా
    హనుమసహాయ మందుకొని యద్భుతరీతిని దాటివారిధిన్
    ఘనమగు యుద్ధనైపుణిని గర్వమడంచుచు నీచుడింద్రజి
    జ్జనకుని జంపినట్టి గుణశాలికి మ్రొక్కెదరెల్ల సజ్జనుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ఈశ్వరుని బిల్వకే గొప్ప యిష్టిజేయ
      పుట్టినింటికి వచ్చిన పుత్రికగని
      చుల్కనగజూడ మితిలేని యల్కను సతి
      జనకు జంపిన వానికి జనుల నుతులు

      తొలగించండి
    2. మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యాస్మి గూరువర్యా! నమోనమః!🙏🙏🙏

      తొలగించండి

  8. ఘన విధుడిచ్చినట్టి వర గర్వము పొందిన మానుషాదుడే
    తనయుడు వీడకుండె హరి ధ్యానమటంచు నమర్ష మందితా
    ననురతి వీడి చంపమని యానతి నిచ్చిన దుష్టశీలుడౌ
    జనకుని జంపినట్తి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్.

    రిప్లయితొలగించండి
  9. అనయమువంశమబ్ధినినయంబునపోంగగఁజేయుచంద్రుడై
    మనుటకువిష్ణుపాదములమానకగోల్చినబాలుడాయెడన్
    పనిగోనివైరమూనుచుతపంబునుఁజేసినతండ్రిముక్తికై
    జనకునిఁజంపినట్టిగుణశాలికిమ్రోక్కెదరెల్లవారలున్

    రిప్లయితొలగించండి
  10. తేటగీతి
    రామ సతినుంచి లంకలో రావణుండు
    వినక యాలిని తమ్ముని వెఱవ కున్న
    నెగసి కూల్చంగ రాముండు, నింద్రజిత్తు
    జనకుఁ జంపినవానికి జనుల నతులు

    చంపకమాల
    తనదొక స్వర్ణలంక యని త్ర్యక్షుని దీవెన గల్గు మేటి భా
    వనలకు దూరమై పరమ పావని సీతను బంధి జేయుచున్
    బెనఁకువ గోరి రాఘవుని వేటుకు జిక్కిన మోహి యింద్రజి
    జ్జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. 🙏ధన్యోస్మి గురుదేవా!🙏

      సవరించిన చంపకం:

      చంపకమాల
      తనదొక స్వర్ణలంక యని తానొక పాలకుఁడన్న మేటి భా
      వనలకు దూరమై పరమ పావని సీతనుఁ బొందు లాలసన్
      బెనఁకువ గోరి రాఘవుని వేటుకు జిక్కిన ద్రోహి నింద్రజి
      జ్జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్


      తొలగించండి
  11. వినయము తోడ దైవకృప
    విస్మయ రీతిని నొంది భావమం
    దనిశము శ్రీహరిన్ దలచి
    యాతన వెట్టిన తండ్రి కోరికన్
    దనర నృసింహరూపమును
    దక్షత తోడుత జూపి వేగమే
    జనకునిఁ జంపినట్టి గుణ
    శాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్!

    రిప్లయితొలగించండి
  12. కోతిమూక తోడుత సీత కొరకు రాము
    డధిగమించి సాగరమును, ఆలమందు
    మించి రావణు జంపెను, మేఘనాథు
    "జనకు, జంపినవానికి జనుల నతులు"

    రిప్లయితొలగించండి
  13. ~~~~~~~~~~~~~~~~~~
    జనకుని పుత్రి జానకిని జంగమ
    వేషపు ధారణార్థియై
    యనుపమ సాధ్వి రాముని మహా
    ప్రియ పత్ని దశాన నాఢ్యుడా
    దనుజుడు వెంట జేకొనియు
    ధైర్యముతో జనె ,యుద్దమంధునన్
    ఘను భుజశాలి పుత్రుడగు గౌరవ
    వీరుడు యింద్రజిత్తుకున్
    జనకుని జంపినట్టి గుణ శాలికి
    మ్రొక్కెదరెల్ల సజ్జనుల్
    ~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  14. కదనరంగమునందున కపులగూడి
    దుష్టరక్కసిమూకల దురితమణచి
    మిక్కుటమగు శౌర్యముజూపి మేఘనాథు
    జనకుఁ జంపినవానికి జనుల నతులు

    రిప్లయితొలగించండి
  15. 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
    శంకరాభరణం వారి సమస్య : "జనకుఁ జంపిన వానికి జనుల నుతులు"

    ఎందుకో కందం కదం దొక్కి దూకింది.. రెండు పాదాలు బిరబిరా వచ్చాయి.
    అదృష్టమేమిటంటె ప్రాస, గణాలు సరిపోవడం ..

    తనువుయు నరసింహము వలె
    తన నఖముల తోడ చీల్చె దానవ పొట్టన్ |
    చిన ప్రహ్లాదు "జనకుఁ జం
    పిన వానికి జనుల నుతులు" పెట్టిరి కనరే ||

    - రాంబాబు కైప
    17-05-2021

    🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తనువుయు' అనడం సాధువు కాదు. "తనువే/తనువది...దానవు కుక్షిన్" అనండి. (దానవపొట్ట.. దుష్టసమాసం)

      తొలగించండి
  16. సతుల శీలము దోయుచు చంపు దుష్ట
    యువకుని నెలవు కనుగొనె యువతి సృజన
    వాడిని తునిమి నభటుడు వాసు,ఆ సృ
    "జనకు, జంపినవానికి జనుల నతులు"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
      "దోచుచు..వానిని తునిమి" అనండి.

      తొలగించండి
  17. దనుజుఁడు శంభరాసురుఁడు తాను జయింప జనించు మృత్యువున్
    కనుగొని సంద్రమందు జని గ్రక్కున ముంచగ మ్రింగు చేపకుం
    బనుగొను వాని జాలరులు భద్రముగా నిడ పెంచినట్టియా
    జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్

    రిప్లయితొలగించండి
  18. జనకుడు తీవ్రవాదిమరిజన్మనొసంగిన తల్లిపెంచగా
    తనయుడు గొప్పశిక్షణనుతానొక చక్కని ఐపిఎస్ గ నై
    తనపని లోనిభాగముగతండ్రిని కాల్పుల జంపెకానలో
    “జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్”

    రిప్లయితొలగించండి
  19. వనమునలక్కయింటమునుబ్రాణమునిల్పినసోదరుండుదా
    రణముననర్థభాగముగరాజగువానినిజీల్చివేయగా,
    ఘనుడగురాజరాజునునుగాయముజేయగనెంచిలక్ష్మణా
    జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్”

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రాజరాజునునుగాయము' అర్థం కాలేదు. 'లక్ష్మణ జనకుని' అనడం సాధువు.

      తొలగించండి
  20. వనమున నున్నజానకిని వంచనతో గొని పోవ లంకకున్
    కనుకొని సీతజాడ దశకంఠుని రాజ్యము నందు తోటలో
    వనటనొసంగి నట్టి కడుఁ బాపి నిశాచరుడైన యింద్రజిత్
    జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్

    రిప్లయితొలగించండి

  21. జనకుని పుత్రి రామసతి జానకి సద్గుణ శీలి బంధిసే
    సిన మనుజాశనుండు శశి శేఖర భక్తుడు పంక్తి కంఠునిన్
    దునుమదలంచి వానరులతో తిమి దాటి సమిత్తు నింద్రజి
    జ్జనకుని జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్

    రిప్లయితొలగించండి
  22. కె.వి.యస్. లక్ష్మి:

    జనకు నాహ్వానమే లేక చనెను పుత్రి
    యిష్టి గాంచగ పుట్టింటి యిచ్ఛ తోను
    ఈస డించగ నంతనె ఈశు సతికి
    జనకు జంపిన వానికి జనుల నుతులు.

    రిప్లయితొలగించండి
  23. మునిజనసజ్జనాదులకు ముప్పు ఘటించుచు హింసకుండునై
    వనరుహనాభదుష్టపరిపంథియునౌ నరకాసురాధమున్
    కనలుచు, పత్ని సత్య సహకారము లొప్పగ ధూర్తధీతమో
    జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  24. ఇనకుల వార్ధి చంద్రుడతడేలిన కాలము రామరాజ్యమై
    దనరెను విశ్వమందు ఘనతన్ వహియించిన పుణ్యమూర్తికిన్
    మునిజనవంద్యుకున్ విమలమూర్తికి రాముకు మేఘనాధునిన్
    జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వంద్యునకున్, రామునకు' అనడం సాధువులు.

      తొలగించండి
  25. రిప్లయిలు
    1. కాంచఁ గలికాలమున నిట్టి ఘనులు కలరు
      కేవల ధనార్తు లధములు కేలి లీల
      నవ్వ యాస్తికై నిర్దయ నెవ్వ రిత్త్రు
      జనకుఁ జంపినవానికి జనుల నతులు


      ఇనకుల వంశ వర్ధనున కిద్ధ చరిత్రున కేక సత్య వా
      గ్ఘనునకు సత్య శౌర్య గుణ గణ్యున కిద్ధర సీత భర్త కా
      యనయుని లోకరావణు దశానను భండన మందు నింద్రజి
      జ్జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  26. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  27. మరణ శిక్షను విధియింత్రు దొరలు సుమ్ము
    జనకు జంపిన వానికి,జనుల నతులు
    శాశ్వ తంబుగ నుండును సజ్జనులకు
    వారి మంచియే వారిని బ్రస్తుతించు

    రిప్లయితొలగించండి
  28. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  29. జనకుని జంపినట్టి గుణశాలికీ మ్రొక్కెదరెల్ల సజ్జనుల్
    కనుమరు గాయెనే భువిని గావగ దండ్రిని ధైర్య శాలురల్
    జనకుని జంపు వాని గుణశాలిగ బల్కుట చిత్రమే గదా
    వినగను రోత పుట్టె నిది పేలగ మారెను లోకమే సుమా

    రిప్లయితొలగించండి
  30. ధన బల గర్వితుండతడధర్మ పరాయణుడై చరించుచున్
    జనులను బాధ పెట్టు పలు చట్టములన్ విధియించి క్రూరతన్
    పెనగుచు వారి యాస్తులను వేచు దురాత్ముని వావి యెంచకన్
    జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్

    రిప్లయితొలగించండి
  31. ధర్మరక్షణ చేయంగ ధరణి యందు
    నవతరించె త్రేతాయుగమందుహరియు
    ఇలజనపహరించినవాడు యింద్రజిత్తు
    జనకు జంపిన వానికి జనుల నతులు.

    రిప్లయితొలగించండి
  32. తాను చేసిన మోసము తెలుపకుండ
    ఎదుటివారిని ప్రశ్నించి నేమిచేయు
    ప్రజలమోదముపొందిన ఫలమునొందు
    జనకు జంపిన వానికి జనులనుతులు

    రిప్లయితొలగించండి