7, మార్చి 2022, సోమవారం

సమస్య - 4013

8-3-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అగ్నికీలపైఁ జీమ నృత్యమ్మొనర్చె”
(లేదా...)
“నేరుపుతోఁ బిపీలికయె నృత్యమొనర్చెను వహ్నికీలపై”

39 కామెంట్‌లు:

యెనిశెట్టి గంగా ప్రసాద్ చెప్పారు...

చిన్న దేశమ్ము పోరున చిరుతయేను
జనులు క్రమశిక్షణ గలిగి చాలనమున
చనిరి రణరంగమునకేగజాలకున్న
అగ్నికీలపైఁ జీమ నృత్యమ్మొనర్చె!


విరించి చెప్పారు...


తమ్మి మొగ్గరమున్ జొచ్చి తరుణుడైన
మఘవ నందనసుతుడభిమన్యుడచట
ద్రోణ కర్ణుల నెదిరింప త్రోపు నందు
అగ్నికీలపై జీమ నృత్యమ్మొనర్చె.

BMahalakshmi చెప్పారు...

ఆరునుశత్రులందరునుహంగులుజూపుచువిస్తరిల్లగా
చేినచేతనత్వమునఛీయనిరోయుచుజాగరూకతన్
భూరినలౌకికంబునగుబోధనుమానసముత్సహింపగా
నేరుపుతోబిపీలికమెనృత్యమొనర్చెనువహ్నికీలపై
నేరుపుతోపిపీలికమె

BMahalakshmi చెప్పారు...

దృష్టితీక్ష్ణంబుగాగనుఋషిగనపుడు
సర్వమంగళసాధువైసాధనమున
లలనతోషంబునందుచులాస్యయయ్యె
అగ్నికీలపైజీమనృత్యంబొనర్చె

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
గర్భమందున నుండు సందర్భమందె
తమ్మిమొగ్గరమున్ విని తండ్రి చెప్పఁ
జిరుతఁడభిమన్యుఁడాపైనఁ జెలఁగననిరి
నగ్నికీలపైఁ జీమ నృత్యమ్మొనర్చె!

ఉత్పలమాల
పారును వ్యూహమంచునట పార్థుఁడు లేడని కౌరవాధముల్
గూరుపఁ దమ్మిమొగ్గరము గొబ్బున నా నభిమన్యుఁడేగుచున్
జీరెను బాలుఁడై పరులఁ జిందుల గర్భమునందె విన్నదౌ
నేరుపుతోఁ బిపీలికయె నృత్యమొనర్చెను వహ్నికీలపై!

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

శత్రువుల తోడ పోరగ సాహసించి
వెడలె బాల చంద్రుండు దా వెరువ కుండ
తఱచి చూడగ ననుపించ దాని గూర్చి
యగ్ని కీలపై జీమ నృత్య మ్మొ నర్చె
ననుచు పలికిరి గాంచుచు నబ్బు రము గ

sarada చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
sarada చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విరించి చెప్పారు...


నారి సుభద్ర నందనుడు నాయన లేడని లోటు పూడ్చగన్

దూరెను తమ్మిమొగ్గరము ద్రోణుడు పన్నిన వ్యూహమందునన్

వీరపరాక్రమాన్వితుల పేరడగించుచు సాగె ముందుకున్

నేరుపు తోఁ బిపీలికయె నృత్యమొనర్చెను వహ్ని కీలపై.

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

శూరుడు శస్త్ర విద్యలను క్షుణ్ణముగానెరు
గర్జనుండటన్
పోరొనరించ రాడనియు పూనియు పన్నిరి
తమ్మి మొగ్గరం
బారయ కౌరవుల్ ,వెడలె నాయభి మన్యుడు
బాలకుండు తా
నేరుపుతో బిపీలికము నృత్యమొనర్చెను
వహ్ని కీలిపై

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

బాలుడైనను జొచ్చెను భండనమున
వైరిమూకల నడుమకు పార్థ సుతుఁడు
విక్రమముఁగన చాలవు వేయి కన్ను
లగ్నికీలపైఁ జీమ నృత్యమ్మొనర్చె

sitharamayya solasa చెప్పారు...

రవి యెపుడు కుంగకుండు సామ్రాజ్యమునకు
దేశము విడిచి వెళ్ళుటె తిన్నదనుచు
తలచ జేసిన గాంథి వి ధమును జూడ
అగ్నికీలపైఁ జీమ నృత్యమ్మొనర్చె

Rama murthy చెప్పారు...

మరుఁడు సంధించి శరములు మరల మరల
విడువ వివశుఁడై పడిపోయె మృడుఁడు మన్మ
థాగ్ని కీలపైఁ,జీమనృత్యమ్మొనర్చె
పుష్ప బాణమ్ములందొప్పి మురిపెముగను.

చేరువ దాగియుండి శశిశేఖరుపై సుమసాయకమ్ములన్
మారుఁడు వేయ మాటికిని మన్మథ కీలలఁజిక్కె నాతఁడున్
మారుని సూనబాణముల మధ్యను నొప్పుచు సంతసంబునన్
నేరుపుతో పిపీలికయె నృత్యమొనర్చెను వహ్నికీలలన్.

M.B.G.TILAK చెప్పారు...

నిత్య కృత్యమై హోమము నిర్వహించు
నీమముగలమహర్షి తానెరప నెంచె
యజ్ఞ మానాడు తత్సమయమ్మున 'జమ
దగ్ని' కీలపైఁ జీమ నృత్యమ్మొనర్చె

కీల = మోచేతిదిబ్బ

తంగిరాల సుందర రఘురాం చెప్పారు...

యూరపు శీతకాలమున నుష్ణముకై యొక నిప్పుగూటినిన్
వారగ యున్న యద్దపు గవాక్షము మీదన గంతులాడెనో
హీర, గభాల్న చూడనిటు లింగిలమున్ యది తోచెనిట్టులే
నేరుపుతోఁ బిపీలికయె నృత్యమొనర్చెను వహ్నికీలపై||

తంగిరాల సుందర రఘురాం చెప్పారు...

నిప్పుగూడు = fireplace

అపర్ణ గాడేపల్లి చెప్పారు...

ఉ.మా.
దారుణ కృత్యముల్సలుపు దానవు లెందరొ చుట్టునుండగన్
భారము మోయు ధారుణిగ భారత నారియె యోర్పుతోడుతన్
మారుచు శక్తిరూపిణిగ మానవ దృక్కుల దీరుమార్చగా
*నేరుపుతోఁ బిపీలికయె నృత్యమొనర్చెను వహ్నికీలపై*

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చేరిన చేతనత్వమున... టైపాటు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'హతవిధి+అంచు' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. "హతవిధి యని" అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఉష్ణమునకై' అనడం సాధువు. *... నుష్ణము గోరుచు నిప్పు... వారగ నున్న... మీదను ... లింగిలమున్ గన.." అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

🙏ధన్యోస్మి గురుదేవా!🙏

యెనిశెట్టి గంగా ప్రసాద్ చెప్పారు...

ధన్యవాదములార్యా!🙏

sarada చెప్పారు...

తేటగీతి
అగ్ని వైద్య మతః పరం, హతవిధి యని
సుశిఖ కీలల గాల్చిన సూది జేత
వాత బెట్ట దలచెనొక వ్యాధితుండు
అగ్ని కీలపై జీమ నృత్యమ్మొనర్చె

ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
(అగ్ని వైద్యంమని వాతలు పెట్టు ప్రక్రియ.అన్ని వైద్యాలు అయిన పిమ్మట చేయు వైద్యం) గురువు గారు.

subbarao చెప్పారు...

హోమ గుండపు దెఱపైన హొయల వోలె
గదులు చుండగ చిత్రముగా గనబడె
నగ్ని కీలపై జీమ నృత్యమ్మొనర్చె
జూడ వింతగా నుండును జూపరులకు

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

చెట్టు పైనను గాకుండఁ బుట్ట లోనఁ
గాక మఱి యింటి లో నైనఁ గాక యకట
చేతి లోనఁ జెలంగెడుఁ జిత్ర మగు ని
రగ్నికీలపైఁ జీమ నృత్యమ్మొనర్చె


వారక కీటకం బొకటి ప్రాణములం గొని విఱ్ఱవీఁగుచున్
వీర విహార ముద్ధతిని బిట్టుగఁ జేయుచు నాక్రమించెనే
దారుణ శస్త్ర సంచయము తద్దయుఁ గల్గిన విశ్వ మూర్ధమున్
నేరుపుతోఁ బిపీలికయె నృత్యమొనర్చెను వహ్నికీలపై

subbarao చెప్పారు...

ఆరని హోమగుండమున కావల దూరమునందు చేలపై
నేరుపుతో బిపీలికయె నృత్యమొనర్చెను వహ్నికీలపై
యీరకమైన వింతకల యేర్పడి వచ్చెను జిత్రమయ్యెడిన్
దూరుపు తెల్లవారెననిదోచుట చేతను నిద్రలేచితిన్