31, మార్చి 2022, గురువారం

సమస్య - 4037

1-4-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శంకర విభూషణము నిండు చందమామ”
(లేదా...)
“పూర్ణ శశాంక బింబమె విభూషణ మయ్యెఁ ద్రిశూలపాణికిన్”

27 కామెంట్‌లు:

  1. గంగ తో బాటు నెలవంక కాంక్ష తోడ
    శంకర విభూషణము :నిండు చందమామ
    పౌర్ణమి న గగనము నందు భాస మంది
    చల్ల దనమును గల్గించు జగతి కెల్ల

    రిప్లయితొలగించండి
  2. నొసటకన్నునుగలవానినోపలేము
    పాముబుసగొట్టుకంఠముపట్టుకొనగ
    సగమునాడుదియౌనుగచాలుసొగసు
    శంకరవిభూషణమునిండుచందమామ

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. ప్రస్పుటంబుగ గనవచ్చె రాత్రివేళ
      ధవళ కాంతిపుంజములలో ధగధగమను
      శంకర విభూషణము, నిండు చందమామ
      వెలువరించెడి పున్నమి వెన్నెలందు

      తొలగించండి
  4. చూర్ణముజేయనగ్నినటచూడడుసౌరునుతప్పుజేయుచో
    అర్ణవమందుబుట్టినదియాతనకంఠమునందునిల్చెనే
    పర్ణముభోజనంబుగనుపార్వతిపెట్టునువింతయౌనుగా
    పూర్ణశశాంకబింబమెవిభూషణమయ్యెత్రిశూలపాణికిన్

    రిప్లయితొలగించండి
  5. ఆటవెలది
    కంఠహారమగుచు కంకణంబగుచును
    మేననమరియుండు గాన నెపుడు
    కవి!భుజగమె* శంకర విభూషణము,నిండు
    చందమామ*నింగికందమగును.

    రిప్లయితొలగించండి
  6. అంగమంత భస్మము దోడ నైదు మోము
    లుండు వింత యాకారపు
    యుత్తమాంగ
    మందు జూడ ముచ్చట గూర్చు నంశమొకటె
    శంకర విభూషణము నిండు చందమామ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...యాకారపు టుత్తమాంగమందు..' అనండి.

      తొలగించండి
  7. అర్ణవమందుపుట్టి గగనాంతరవీథికి శోభఁగూర్చు నా
    *పూర్ణశశాంకబింబమె;విభూషణమయ్యె త్రిశూలపాణికిన్*
    అర్ణవమందుపుట్టిన మహావిషమే గళసీమ మచ్చయై
    వర్ణన సేయగాఁదరమె పన్నగ భూషణు దివ్యలీలలన్.

    రిప్లయితొలగించండి

  8. ఉరగమే గళమందుననున్ననేమి
    సతిని గారవించుచు తన స్కందమందు
    నర్థ భాగమిచ్చిన మలయమ్మయె గన
    శంకరవిభూషణము, నిండు చందమామ.



    కర్ణవిహీనమే సరము, కంఠమునన్ విష మర్థభాగమున్

    స్వర్ణకిరీటధారి నగజాతయు, నంబరమే గజ చర్మధారికా

    యార్ణవమందు పుట్టిన బృహత్తు మనోహరి సోదరుండసం

    పూర్ణ శశాంక బింబమె విభూషణమయ్యె ద్రిశూలపాణికిన్.

    రిప్లయితొలగించండి
  9. తేటగీతి
    పాలసంద్రాన నమృతపు ప్రభలువెలయ
    విషముగైకొన్న త్యాగాన వృషభుడనఁగ
    శివుని సర్వులు గీర్తింప శిరము వెనుక
    శంకర విభూషణము నిండు చందమామ!

    ఉత్పలమాల
    నిర్ణయమై సురాసురలు నిష్ఠగ మందరఁ బూన్చి జిల్క క్షీ
    రార్ణవమందునన్ సుధయె యద్భుత రీతి జనింప శార్ఙ్గి దు
    ర్వర్ణ నగాధిపున్ బొగడ వారలు శీర్షము వెన్క దివ్యమై
    పూర్ణ శశాంక బింబమె విభూషణ మయ్యెఁ ద్రిశూలపాణికిన్!

    రిప్లయితొలగించండి

  10. భూర్ణిని బ్రోచు దీక్షగల పుష్కర నాభుడు దుభ్రమందు గో

    కర్ణమె పాన్పుగాగలుగు కైటభవైరి మనోవిహారి క్షీ

    రార్ణవ జాతయౌ మరునియంబ జఘన్యుజునిన్ సదా యసం

    పూర్ణశశాంక బింబమె విభూషణమయ్యె ద్రి శూల పాణికిన్.

    రిప్లయితొలగించండి

  11. చిత్రకారుడు గీయుచున్ శివుని పటము
    చంద్రరేఖను సవరించు సమయమందు
    శ్వేత వర్ణంబె యొలుకుచు విధుని గప్ప
    నది గని చతురుండనెనిట్లు హాస్యముగను
    శంకర విభూషణము నిండు చందమామ.

    రిప్లయితొలగించండి
  12. ఉ.మా.
    అర్ణవ మందు నెక్కొనిన హాలహలంబును నిల్ప కంఠమున్
    పర్ణము వీడి కొల్వగ నపర్ణను జేకొన నర్థభాగమున్
    స్వర్ణకురంగమున్దొడిగి వాసము జేయగ వెండికొండపై
    *పూర్ణ శశాంక బింబమె విభూషణ మయ్యెఁ ద్రిశూలపాణికిన్*

    రిప్లయితొలగించండి
  13. శిరము పైన నిలిచె గంగ కరము ప్రీతి
    గళ మలంకరించెను బన్నగమ్ము ప్రీతి
    నంకము లపరములు వల దింక మాకు
    శంకర! విభూషణము నిండు చందమామ

    [విభూషణమును + ఇండు = విభూషణము నిండు; చందమామ(న్)]


    తూర్ణము సూచువారలకుఁ దోఁపదె యివ్విధిఁ జంద్రికా ప్రభా
    వర్ణ సమాన దేహు నళి వర్ణ నిభాంచిత కేశి దివ్య ఫా
    లార్ణవ మందుఁ బుట్టిన ని జాంబక బింబము నివ్వటిల్లఁగాఁ
    బూర్ణ శశాంక బింబమె విభూషణ మయ్యెఁ ద్రిశూల పాణికిన్

    రిప్లయితొలగించండి
  14. రేక వోలెను గలచంద్ర రేఖ యౌను
    శంకరవిభూషణము,నిండు చందమామ
    వలపు రేకెత్తించును వధూవరులకునిల
    దనదు చల్లని కిరణాలు బనిచి వెసను

    రిప్లయితొలగించండి