13, జులై 2022, బుధవారం

సమస్య - 4133

14-7-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మీసములు గలుగు తరుణి కమేయాగ్రహమౌ”
(లేదా...)
“మీసములున్నఁ గాంతకును మిక్కిలి కోపము వచ్చు నిచ్చలున్”

16 కామెంట్‌లు:

  1. కందము
    మీసము పౌరుష చిహ్నము
    గా,సుదతికిఁబెట్టి నాటకమునాడంగా
    నాసందర్భంబునహో!
    మీసములు గలుగు తరుణికమేయాగ్రహమౌ.

    రిప్లయితొలగించండి
  2. కందం
    వాసిగలుగన్ బ్రతిభతో
    రాసిపడిన నహము ముదురు రంధిఁ దమ వలెన్
    భాసిలఁ గలవారి విన సు
    మీ! సములు గలుగు తరుణి కమేయాగ్రహమౌ!

    ఉత్పలమాల
    వాసిఁగలుంగు పాటవపు వంక పొగడ్తలతో నహమ్మదే
    రాసిపడంగ మోజుపడు రంధిని గ్రాలుచు సాటి వారలున్
    భాసిలఁ గాంచుచున్ కుమిలి వంతల జిక్కగఁ బల్కరింప సు
    మ్మీ! సములున్నఁ గాంతకును మిక్కిలి కోపము వచ్చు నిచ్చలున్!

    రిప్లయితొలగించండి

  3. ఆశల యందే కాదుర
    యాశయ మందైననేమి యార్భాటమ్మా
    వేశము లోనైనను గన
    మీ సములు గలుగు తరుణి కమేయాగ్రహమౌ

    రిప్లయితొలగించండి
  4. వాసిగరాణియుతానై
    భాసిలిగృహమునవరలుచుభామగనుండన్
    గాసినివచ్చెనుసవతిసు
    మీసములుగలుగుతరుణికమేయాగ్రహమౌ

    రిప్లయితొలగించండి
  5. మీసము లక్ష ణ మయ్యది
    మీసములు గలుగు తరుణి కమేయా గ్రహమౌ
    మీసముఁ గలిగెడు తరుణులు
    వాసురమునఁ గొలది మంది వసియిం తురుగా

    రిప్లయితొలగించండి

  6. కాసులు లేవటంచు తన కాసుల పేరును విక్రయించినన్
    దా సహనమ్ము జూపుచు ముదమ్మున కమ్మల నివ్వనేమిరా
    వాసుర మందు వల్లభుడు ప్రైయముఁ ముద్దుల నాడు వేళలో
    మీసములున్నఁ , గాంతకును మిక్కిలి కోపము వచ్చు నిచ్చలున్.

    రిప్లయితొలగించండి
  7. వేసము చక్కగ జేయగ
    కాసులు తక్కువగ నిడిన కరణము చేతన్
    రోసము నొందిన కృత్రిమ
    మీసములు గలుగు తరుణి కమేయాగ్రహమౌ

    రిప్లయితొలగించండి
  8. భాసిలు పురుషుని కిలలో
    మీసములు గలుగు : తరుణి క మేయా గ్రహ మౌ
    నాసి రకపు వర్తన తో
    మోసము జేసెడు పతిగని పొసగని వేళన్

    రిప్లయితొలగించండి
  9. మీసములున్నఁ గాంతకును మిక్కిలి కోపము వచ్చు నిచ్చలున్
    మీసము లుండు వారలకు మీరని కోపము సాజమే కదా
    వాసము లుండు చోట గృహ వాసుల చేష్టలఁ గారణంబుగా
    రోసము గల్గియుం డుటను లోకము నందునఁ జూచు చుంటిమే

    రిప్లయితొలగించండి
  10. మీసము భూషణంబగుసుమీ! మగవారికి,కాని,గెడ్డమున్
    మీసముఁబెంచ బూచి యని మెచ్చరు పిల్లలు భీతిఁజెందుచున్
    భాసురమైన భర్తముఖపద్మమునందున పెద్దపెద్దగా
    మీసములున్నఁ;గాంతకును మిక్కిలి కోపము వచ్చు నిచ్చలున్.

    రిప్లయితొలగించండి
  11. రోసముగలమగవానికి
    మీసములు గలుగు; తరుణి కమేయాగ్రహమౌ
    చేసిన బాసలు తీర్చక
    కాసులు మిగిలించు మగడు కనబడినంతన్

    రిప్లయితొలగించండి
  12. (కాసుల లెక్కకు పెళ్లి చేసుకొనిన యొక వరుని సింహావలోకనం)

    నైసర్గికంబది వదలి
    గ్రాసుగ ప్యాకేజ్ గణితపు కాసుల రేసం
    దున్ సమమగు! అంతర్యా
    మీ! సములు గలుగు తరుణి కమేయాగ్రహమౌ!

    రిప్లయితొలగించండి
  13. భాసుర వేదికాస్థలిని బండితగౌరవమందు బల్కుచున్
    మీసరి లేరుభూమిపయి మీద్యుతి కారకురాలు విజ్ఞయౌ
    మీసతి యంచు వారనిరి మిమ్మను రాగముతోడ జూచుచున్
    మీ సములున్నఁ గాంతకును మిక్కిలి కోపము వచ్చు నిచ్చలున్

    రిప్లయితొలగించండి
  14. మీసము లుండవు నారుల
    కే సమయము నందు నయిన నిల నొకచోఁ బే
    రాసల తోడుత నించుక
    మీసములు గలుగు తరుణి కమే యాగ్రహమౌ


    మోసము సేయు పూరుషులు పొంతన లేని విధమ్ము పల్కుచుం
    ద్రాస మొసంగు వారలును దారసిలంగ నవారితమ్ముగా
    దాసిగ సంతతం బెడఁద దారను గాంచెడు మిమ్ము గాంచినన్
    మీ సము లున్నఁ గాంతకును మిక్కిలి కోపము వచ్చు నిచ్చలున్

    రిప్లయితొలగించండి
  15. మీసము దాల్చి నటించగ
    మీ సములెవరంచు జనుల మెప్పును వడసెన్
    వేసము వీరుని దగుటను
    మీసములు గలుగు తరుణి కమేయాగ్రహమౌ

    రిప్లయితొలగించండి
  16. కందం
    మాసరి లేరను మగలకు,
    మీ సములు గలుగు ,తరుణి కమేయాగ్రహమౌ,
    సోసకు బోవక గనుమనె
    కాసంత వెదక కనబడు కాంతా మణులన్.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.
    (మగవారలకు స్వేచ్ఛా మహిళల సమాధానం సందర్భంగా)

    రిప్లయితొలగించండి