29, జులై 2022, శుక్రవారం

సమస్య - 4147

30-7-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పతన ముండు నెంతవారికైన”
(లేదా...)
“పతనం బుండదె యెంతవారలకునైనన్ లోకధర్మం బిదే”

33 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    జనన మరణ జీవ చక్రము సహజము
    భూమి పైన ,కర్మ భూమి మనది
    పుట్టి గిట్టు నెంత పుణ్య పురుషులైన
    పతన ముండు నెంతవారికైన.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. వక్ర మార్గ మందు పాలనఁ జేయుచోఁ
    బతన ముండు నెంతవారికైన
    బ్రజల బాగుఁ జూచు పాలకుఁ డెప్పుడుఁ
    బూజ్యుఁ డగును భువిని పోత వలెను

    రిప్లయితొలగించండి
  4. మేమె గొప్ప యనుచు మిడుకుచు సతతమ్ము
    విఱ్ఱ వీగు జనులు విధి వశాన
    సంఘ మందు జెడుట జరుగును గావున
    పతన ముండు నెంత వారి కైన

    రిప్లయితొలగించండి
  5. వెతలన్ జూడక రాజు దానెపుడు నావేశంబుతోఁ బాలనన్
    సతముంజేసిన దప్పకాతనికి నాశాంతమ్ముఁ జూడంగగాఁ
    బతనం బుండును నెంతవారలకునైనన్ లోకధర్మం బిదే
    పతనంబుండదు చక్కరీతిగను దాపాలించ సౌఖ్యంబుగా

    రిప్లయితొలగించండి
  6. రిప్లయిలు
    1. ఆటవెలది
      భ్రమల మోహమున పరస్త్రీల కాంక్షింప
      స్వర్ణలంకనేలు సార్వభౌముఁ
      డంతమొందె! దైవమాగ్ర హింపంగ సూ!
      పతన ముండు నెంతవారికైన! !

      మత్తేభవిక్రీడితము
      మితిమీరంగను మోహకారణమునన్ మిన్నంటు గర్వమ్మునన్
      క్షితిజన్ లంకకుఁ జేర్చ, రాఘవుఁడు దా శిక్షింప బాణోద్ధతిన్,
      మృతుడైకూలెను లంక యేలిక! పరస్త్రీపైని మోహంబునన్
      బతనం బుండదె యెంతవారలకునైనన్ లోకధర్మం బిదే!

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. ఉర్వి జనుల కెల్ల నుత్తాన పతనాలు
    కలుగ గలవు చూడ కాల గతిని
    పదవి జూచి మిడిసి పడుటయే హేయము
    పతన ముండు నెంతవారికైన

    రిప్లయితొలగించండి
  8. నేను నాది యనుచు నీల్గుచుధరలోన
    నహముచూపుచుండననవరతము
    నదియు వాస్తవమ్మ ననుమాట నిక్కంబు
    పతనముండునెంతవారికైన

    రిప్లయితొలగించండి
  9. ఆటవెలది
    బ్రహ్మ వలనఁబెక్కు వరములు వడసియు
    రమణి సీతఁదెచ్చి లంకలోకి
    రావణుండు చచ్చె రాముని చేతిలో
    *పతనముండు నెంతవారికైన.*

    మత్తేభము
    హతుఁడయ్యెంగద రావణుండు రఘురామాస్త్రప్రయోగంబుచేన్
    హతుఁడయ్యెంగద కర్ణుఁడర్జునునిచే నాజిన్;జనుల్ భీతిలన్
    హతునింజేసె సుయోధనున్ యుధిని నాహా!భీమసేనుండు మున్
    *పతనంబుండును నెంతవారలకునైనన్ లోకధర్మంబిదే.*

    రిప్లయితొలగించండి

  10. అరి భయంకరు డత డనిలాత్మజుడు జూడ
    వలలు డగుచు, శ్వేతవాజి యటనె
    పేడివాడుగాను విరటుగొలువు జేర
    పతన ముండు నెంతవారికైన.


    హితమున్ గోరెడు వాడు కృష్ణుడయినన్ హృల్లాసమున్ పొందిరా
    క్రతువున్ జేసిన పాండుపుత్రులు, గనన్ గాంతారమున్ బట్టుచున్
    గుతలమ్మెంతయొ పొందెగాదె వనమున్ గోదండ రాముండహో
    పతనం బుండదె యెంతవారలకునైనన్ లోకధర్మం బిదే.

    రిప్లయితొలగించండి
  11. ఆధిపత్యమిచ్చిరని , తలచినరీతి
    కన్ను మిన్ను గానక పుడమి పయి
    పాలన నడపించ బాడి విడిచి పెట్ట
    బతన ముండు నెంతవారికైన

    రిప్లయితొలగించండి
  12. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    భూమి యందు పుట్టి పొలయు జీవులకెల్ల
    విధి రచించి నట్టి విధము గాను
    సమయ మందు కొంత జాప్యముండును గాని
    పతన ముండు నెంత వారికైన

    రిప్లయితొలగించండి
  13. అతులంబైన పదంబునంది కరమౌయానందమున్ మున్గినన్
    మతిలో చేరి శనీశ్వరుండు నడుపన్ మాయా మయుండౌచు శ్రీ
    మతి సాంగత్యమువీడి వేశ్యలను సంభావించుచున్ వర్తిలన్
    పతనం బుండదె యెంతవారలకునైనన్ లోకధర్మం బిదే

    రిప్లయితొలగించండి
  14. ఎగిరి నట్టి బంతి యిల మీద పడు నట్లు
    పుట్టి నట్టి వాఁడు గిట్టు నట్లు
    వృద్ధి వొంది నంతఁ బృథ్విలోఁ దప్పక
    పతన ముండు నెంత వారికైన


    సతతం బుండవు హర్ష దుఃఖములు నిస్సందేహ మెవ్వారికిన్
    సతతం బుండవు భోగ భాగ్యములు నైశ్వర్యమ్ము నెవ్వారికిన్
    సతతం బుండదు వృద్ధి యెవ్వరికినిన్ సత్యంబు చింతింపఁగన్
    బతనం బుండదె యెంత వారలకు నైనన్ లోక ధర్మం బిదే

    రిప్లయితొలగించండి
  15. వితతంబౌ ఘనపాండితీ గరిమతో వేదాంగ విస్ఫూర్తితో
    సతతంబున్ శివనామ సంస్మరణతో సద్భక్తుడౌ రావణుం
    డతివన్ సీతను మ్రుచ్చిలించు కతనన్ హైన్యంబు తానొందగన్ 
    పతనం బుండదె యెంతవారలకునైనన్ లోకధర్మం బి

    రిప్లయితొలగించండి
  16. ధృతినిఁగోలుపోయి వెతల పాలాయెను
    రాముఁబత్నిఁ గోరి రావణుండు
    పరులసొత్తుకొరకు ప్రాకులాడిన నెప్డు
    పతన ముండు నెంతవారికైన

    రిప్లయితొలగించండి
  17. నేను నాది యనుచు నీల్గుచుధరలోన
    నహముచూపుచుండననవరతము
    నదియు వాస్తవమ్మ ననుమాట నిక్కంబు
    *పతన ముండు నెంత వారి కైన*


    మరొక పూరణ

    కాలమహిమదెలుపుఘనులవ్వరిలలోన
    రాకుమారి యైన రమణి కృష్ణ
    సేవ చేయ గాను చేరె సైరంధ్రిగా
    *పతన ముండు నెంత వారి కైన*

    రిప్లయితొలగించండి