22, జులై 2022, శుక్రవారం

దత్తపది - 185

23-7-2022 (శనివారం)
కవిమిత్రులారా,
'పేపరు - పెన్ను - టైపు - మెమో'
ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.

25 కామెంట్‌లు:

  1. కీచకుడు సైరంధ్రితో...

    కందం
    తలపే పరుగులు దీసెను
    వలపులు సొంపెన్నుచు ముడివడ సైరంధ్రీ!
    నెలవున నొకటై పులకలఁ
    దులతూగమె మోదమనినఁ తోయజనేత్రా!

    రిప్లయితొలగించండి
  2. ఆ(మె మో)ము‌నుచూడ ప్రేమ‌ పొంగి పొరలు చుండును‌ సతతము,‌గుండె లోన

    నాట్యమాడు చునుండు నాకామె‌ తల(పే,పరు)గులె
    త్తుచుండుగా గగన మునకు


    మోహంపు కోరికల్ , పూలతో
    (టై పు)డమి వికసించునుగదా మించు బోడి

    నడయాడ, , రంభకు (పెన్ను)ది గాదె తలచ యీ‌‌ కన్నె,యీమె



    తోడ రతి‌సుఖములు‌ను పొందుటయె నాకు

    భాగ్యమనుచు నా‌హృ దయము పలుకు చుండె

    నీ దినమున కూడగ వలె‌ నెట్టు లైన

    యనుచు కీచకుడు తలచె వనితను గని

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వాట్సప్ సమూహంలో నా సూచనను గమనించండి.

      తొలగించండి
  3. వలపే పరువకు వచ్చెను
    దలపులు సొంపెన్ను చుండి దరములు వోవన్
    గలలో నొకటై పులకలు
    దులతూగమె మోదమలర తొయ్యలి కృష్ణా!

    రిప్లయితొలగించండి

  4. చంద్రబింబమె మోమది సఖియనీది
    మరులు గొలిపే పరువమంటి, పెరిమి తోడ
    నిద్దరమొకటై పుష్కరమేలవచ్చు
    సింహ బలుని తప్పెన్ను వజీరు డెవడు.

    రిప్లయితొలగించండి
  5. జూదమున తననోడి నట్లు తెలిసిన ద్రౌపది

    తే॥గీ.॥

    వలువలూడ్చుటకు మునుపే పరువు పోయె
    నిపుడు పతులొకటై పుడమీశు నందు
    కింక నంత జూపెన్నుఱికి యతనిపయి ,
    దాని గాంచగ నామె మోదమును బొందె

    రిప్లయితొలగించండి
  6. భామ వల(పే పరు)వులెత్తె పార్థునిగని
    నారి (పెన్ను)రముప్పొంగె వారిరువురి
    తనువు లొక్క(టై పు)లకలు తమకపడగ
    సత్వర(మె మో)హ వివశులై సంతసిలిరి

    రిప్లయితొలగించండి
  7. రేపే పరుల వధించియు
    జూపగ నన్ బెన్నుతి యింత్రు శూరుం డ నుచున్
    పాపులు చేటై పుట్టిన
    శాపమున సమర మె మోక్ష సాధన మ గు తన్
    ( భీముని మనో గతం )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. రెండవ పాదంలో బెన్నుతి o త్రు అని సవరణ చేయడమైనది

      తొలగించండి
  8. ఆ(మె మో)మును గాంచగ నర్జునుండు
    పూల తో(టై పు)లకరించి పోయె మనము
    చెలిసుభద్ర సొం(పెన్ను)ట నలువ తరమ?
    యనుతలం(పేపరు)గుదీసె మనమునందు.

    రిప్లయితొలగించండి
  9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చంపే' అనడం సాధువు కాదు.

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువు గారు
      తేటగీతి
      ఆమె మోహ పరవశ, సింహబలుడంత
      రూపుసెడ, భీము డంపేపరుని, పరుగున
      తలపడిరి పొరపాటై పుతపుత పోయి
      కీచకానుజుల్ పెన్నుద్దు గిట్టి రపుడు.
      ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
      ఉండవల్లి సెంటర్.
      ఆమె-ద్రౌపది, పెన్నుద్దు-సరిసమానులు

      తొలగించండి
  10. దత్తపది : పేపరు - పెన్ను - టైపు - మెమో - అన్యార్థంలో భారతార్థంలో
    విదురుడు ధృతరాష్ట్రునితో
    కలుగును చెరపే పరులను కలతపెట్ట
    సతము మొప్పెన్నుతించు నీ సుతుడు, దుష్టు
    లొక్కటై పురుషోత్తము ప్రక్కకేగి
    పట్టసాధ్యమా మోహముఁ బడిన మదిని
    అసనారె

    రిప్లయితొలగించండి
  11. వల*పేపరు"గిడ తీయని
    తలపులు మది*పెన్ను*బుకగ తరుణిని గనుచున్
    పరవశ*మెమోమునిండగ
    కరమ్ములొక*టైపు*లకలుకవ్వడికయ్యెన్

    రిప్లయితొలగించండి
  12. వగ పే పరు దయ్యె నెద వి
    నఁగఁ బెన్నుడులు వెగటై పునర్వచనములం
    దగ నేర దామె మో మె
    త్తి గరిమ బదు లిడఁగఁ గృష్ణ దీనత్వమునన్

    [వగపు ఏపు అరుదయ్యె;
    వగపు యొక్క ఏపు(ఆధిక్యము) వగపేపు, షష్ఠీతత్పురుష సమాసము, టు గాగమమునకుఁ దావు లేదు]

    రిప్లయితొలగించండి