18-7-2022 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“తేలుకొండిని ముద్దాడె నీలవేణి”(లేదా...)“వృశ్చికపుచ్ఛమున్ వనిత వేడుకతోఁ గని ముద్దులాడెనే”
తేటగీతికొంటె చూపులుఁజూచెడు కుఱ్ఱగానిప్రేమ వార్ధిలో మునిగియు పీకలోతువద్దు వద్దన పెద్దలు బుద్దిలేకతేలు కొండిని ముద్దాడె నీలవేణి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పంచ దారపా కపుటచ్చు వైచి నట్టి తేలు కొండిని ముద్దాడె నీల వేణి దాని రూపురే ఖలఁ గాంచి తన్వి నొంది సాజ మేకద ముద్దాడ సరసు లకిల
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'రూప రేఖల' అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తేటగీతిబాలరాముని చర్యకు భగ్గుమనఁగపిదప పట్టమ్ము నందెడు వేళ ముదిరికైక దాసిగ మంధర కక్కవిషముతేలుకొండిని ముద్దాడె నీలవేణి!ఉత్పలమాలమశ్చెలువమ్ము బాలునిగ మార్చె కురూపిగనంచు దాసి యానిశ్చయమైన పట్టమును నీలకళేబరు రాముమూర్తికిన్దుశ్చరితార్థమున్ బడయ దూరము సేయగఁ గైకనెంచగన్వృశ్చికపుచ్ఛమున్ వనిత వేడుకతోఁ గని ముద్దులాడెనే!(దాసి = మంథర)
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. వృత్తంలో 'మశ్చెలువమ్ము'?
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణలు పరిశీలింప ప్రార్థన. తేటగీతిబాలరాముని చర్యకు భగ్గుమనఁగపిదప పట్టమ్ము నందెడు వేళ ముదిరికాక దాసిగ మంథర కక్కవిషముతేలుకొండిని ముద్దాడె నీలవేణి!దుశ్చిదధీన బాలునిగ ద్రోహమొనర్చెనటంచు దాసియేనిశ్చయమైన పట్టమును నీలకళేబరు రాముమూర్తికిన్దుశ్చరితార్థమున్ బడయ దూరము సేయఁగఁ గైకనెంచఁగన్వృశ్చికపృచ్ఛమున్ వనిత వేడుకతోఁ గని ముద్దులాడెనే!(దాసి = మంథర)
ఆటవెలదిపంచదార తోడ బాగుగాఁజేసినచిలుక,కోడి,తేలు,చేపలుండఁగోరి విఱచి "తేలుకొండిని; ముద్దాడెనీలవేణి "బుగ్గనే ప్రియుండు.
నీతి రీతిని వీడియు నీచుడొకడుఆస్తి పెంచుటకై చేసె నత్యలెన్నొసంపదాశకు యెరుగక సత్యమరరె! తేలుకొండిని ముద్దాడు నీలవేణి
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'హత్యలెన్నొ... సంపదాశకు నెరుగక' అనండి.
స్తన్యమిచ్చెడు తరుణిని సంహరించినట్టి మాయావియే యత డధముడంచుపలికె రుక్మితోడను శిశు పాలుడిట్లు తేలుకొండినిముద్దాడె నీలవేణి.దుశ్చరితుండు కృష్ణుడొక దొంగయు కుత్సితు డైన వానినే నిశ్చలుడంచునెంచి కద నెచ్చెలి రుక్మిణి కోరె దుష్టునిన్ నిశ్చయమైనమాటయిది నేస్తమ వెఱ్ఱితనంబు తోడ నా వృశ్చికపృచ్ఛమున్ వనిత వేడుకతోఁ గని ముద్దులాడెనే.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
విపణిలో కొనితెచ్చిన వృశ్చికమునమణి పొదుగబడి యుండుట మగువ చూసితేలుకొండిని ముద్దాడె ; నీలవేణికెంత మాత్రము పోరామి యెసగలేదు
ఉత్పలమాలనిశ్చయమిద్ది లక్ష్మణుఁడ! నెమ్మది నిన్నె వరించి వచ్చితిన్దుశ్చరితంబు నాది యని తూలకు,శూర్పణఖన్ వచింపు నీనిశ్చయ మేదియో ?యనగ నేర్పుగ కోసెను కర్ణనాసికల్వృశ్చిక పుచ్ఛమున్ వనిత వేడుక తోడను ముద్దులాడెనే!
వృశ్చిక పృచ్ఛమున్ గనగఁ బీయువు తోడను బోతఁ బోయుటన్ వృశ్చికపుచ్ఛమున్ వనిత వేడుకతోఁ గని ముద్దులాడెనే నిశ్చయ మైనమా టయిది నేర్వుము జీవిత భాగ ధేయమా వృశ్చిక మేనిజం బయిన వేడుక గల్గుట సాధ్యమౌ నునే
గారడీవిద్యలోనారితేరితరుణిరకరకాలమాయలజూపె రంగమందుప్రేక్షణికులెల్లవీక్షించు నాక్షణముతేలుకొండిని ముద్దాడె నీలవేణి
అన్నెమును పున్నెమెరుగని కన్నెపిల్లచిక్కుకొన్నది ప్రేముడి చిక్కునందుతుంటరతడని తెలియక తొందరించితేలుకొండిని ముద్దాడె నీలవేణి
నిశ్చయమాయె నా తరుణి నెమ్మనమందున ప్రేమ వానిపైవృశ్చికమాతడన్న తలపేమదిఁ దోచక మోసపోయి తానిశ్చల చిత్తమందతనినే పతిగా తలబోసె నక్కటా!వృశ్చికపుచ్ఛమున్ వనిత వేడుకతోఁ గని ముద్దులాడెనే
తేటగీతిచిత్ర కథ ఘట్టమందు విచిత్ర పాత్రశతృ వినాశనకారక సాధన సకిగరళ చుంబన చేటిక కల్పితమగుతేలుకొండిని ముద్దాడె నీలవేణి
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "శత్రు నాశనకారక కారక సఖి" అనండి.
ధన్యవాదాలండీ. 🙏
తేటగీతిచిత్ర కథ ఘట్టమందు విచిత్ర పాత్రశత్రు నాశనకారక సాధన సఖిగరళ చుంబన చేటిక కల్పితమగుతేలుకొండిని ముద్దాడె నీలవేణి
దాహమును వేయ వెడలెను ద్రా గ నీరు చూడ కుండగ ద్రా గంగ చోద్య ముగను తేలు కొండిని ముద్దాడె నీలవేణి బాధ భరియింప లేదాయె పనవు చపుడు
వృశ్చిక పుబొమ్మనుగనుచు వేగ మచటపంచదారతో చేసిన ప్రతిమ యనుచుతేలుకొండిని ముద్దాడె నీలవేణితినగనెంచుచు వేడ్కతో తీరుగాను.
మించి యా యంచయాన వహించి చేత సారె సారెకు నాకుచు సారె యంచుఁ బంచఁ బొరుగు వారు తమకుఁ బంచదార తేలు కొండిని ముద్దాడె నీలవేణి పశ్చిమ దేశ పర్యటన భావము తోఁచుఁ బరీక్ష సేయఁగా దుశ్చరితమ్ముఁ దోఁప దిట దోష మొకింతయుఁ గాన రాదులే నిశ్చయ రీతి మంచి దని నెమ్మి వహించి తులాఖ్య రాశినిన్ వృశ్చిక పుచ్ఛమున్ వనిత వేడుకతోఁ గని ముద్దు లాడెనే
సెలవు లియ్యంగ బడికిన్ చిరు గోపబాల లాడుచు గెంతుచు పాడుచు పలుబొమ్మ లేజేయ తేలును బోలు బొమ్మతేలు కొండిని ముద్దాడె నీలవేణి
తేటగీతి
రిప్లయితొలగించండికొంటె చూపులుఁజూచెడు కుఱ్ఱగాని
ప్రేమ వార్ధిలో మునిగియు పీకలోతు
వద్దు వద్దన పెద్దలు బుద్దిలేక
తేలు కొండిని ముద్దాడె నీలవేణి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపంచ దారపా కపుటచ్చు వైచి నట్టి
రిప్లయితొలగించండితేలు కొండిని ముద్దాడె నీల వేణి
దాని రూపురే ఖలఁ గాంచి తన్వి నొంది
సాజ మేకద ముద్దాడ సరసు లకిల
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'రూప రేఖల' అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిబాలరాముని చర్యకు భగ్గుమనఁగ
పిదప పట్టమ్ము నందెడు వేళ ముదిరి
కైక దాసిగ మంధర కక్కవిషము
తేలుకొండిని ముద్దాడె నీలవేణి!
ఉత్పలమాల
మశ్చెలువమ్ము బాలునిగ మార్చె కురూపిగనంచు దాసి యా
నిశ్చయమైన పట్టమును నీలకళేబరు రాముమూర్తికిన్
దుశ్చరితార్థమున్ బడయ దూరము సేయగఁ గైకనెంచగన్
వృశ్చికపుచ్ఛమున్ వనిత వేడుకతోఁ గని ముద్దులాడెనే!
(దాసి = మంథర)
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండివృత్తంలో 'మశ్చెలువమ్ము'?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిగురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణలు పరిశీలింప ప్రార్థన.
తొలగించండితేటగీతి
బాలరాముని చర్యకు భగ్గుమనఁగ
పిదప పట్టమ్ము నందెడు వేళ ముదిరి
కాక దాసిగ మంథర కక్కవిషము
తేలుకొండిని ముద్దాడె నీలవేణి!
దుశ్చిదధీన బాలునిగ ద్రోహమొనర్చెనటంచు దాసియే
నిశ్చయమైన పట్టమును నీలకళేబరు రాముమూర్తికిన్
దుశ్చరితార్థమున్ బడయ దూరము సేయఁగఁ గైకనెంచఁగన్
వృశ్చికపృచ్ఛమున్ వనిత వేడుకతోఁ గని ముద్దులాడెనే!
(దాసి = మంథర)
ఆటవెలది
రిప్లయితొలగించండిపంచదార తోడ బాగుగాఁజేసిన
చిలుక,కోడి,తేలు,చేపలుండఁ
గోరి విఱచి "తేలుకొండిని; ముద్దాడె
నీలవేణి "బుగ్గనే ప్రియుండు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినీతి రీతిని వీడియు నీచుడొకడు
రిప్లయితొలగించండిఆస్తి పెంచుటకై చేసె నత్యలెన్నొ
సంపదాశకు యెరుగక సత్యమరరె!
తేలుకొండిని ముద్దాడు నీలవేణి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'హత్యలెన్నొ... సంపదాశకు నెరుగక' అనండి.
రిప్లయితొలగించండిస్తన్యమిచ్చెడు తరుణిని సంహరించి
నట్టి మాయావియే యత డధముడంచు
పలికె రుక్మితోడను శిశు పాలుడిట్లు
తేలుకొండినిముద్దాడె నీలవేణి.
దుశ్చరితుండు కృష్ణుడొక దొంగయు కుత్సితు డైన వానినే
నిశ్చలుడంచునెంచి కద నెచ్చెలి రుక్మిణి కోరె దుష్టునిన్
నిశ్చయమైనమాటయిది నేస్తమ వెఱ్ఱితనంబు తోడ నా
వృశ్చికపృచ్ఛమున్ వనిత వేడుకతోఁ గని ముద్దులాడెనే.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండివిపణిలో కొనితెచ్చిన వృశ్చికమున
రిప్లయితొలగించండిమణి పొదుగబడి యుండుట మగువ చూసి
తేలుకొండిని ముద్దాడె ; నీలవేణి
కెంత మాత్రము పోరామి యెసగలేదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉత్పలమాల
రిప్లయితొలగించండినిశ్చయమిద్ది లక్ష్మణుఁడ! నెమ్మది నిన్నె వరించి వచ్చితిన్
దుశ్చరితంబు నాది యని తూలకు,శూర్పణఖన్ వచింపు నీ
నిశ్చయ మేదియో ?యనగ నేర్పుగ కోసెను కర్ణనాసికల్
వృశ్చిక పుచ్ఛమున్ వనిత వేడుక తోడను ముద్దులాడెనే!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివృశ్చిక పృచ్ఛమున్ గనగఁ బీయువు తోడను బోతఁ బోయుటన్
రిప్లయితొలగించండివృశ్చికపుచ్ఛమున్ వనిత వేడుకతోఁ గని ముద్దులాడెనే
నిశ్చయ మైనమా టయిది నేర్వుము జీవిత భాగ ధేయమా
వృశ్చిక మేనిజం బయిన వేడుక గల్గుట సాధ్యమౌ నునే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగారడీవిద్యలోనారితేరితరుణి
రిప్లయితొలగించండిరకరకాలమాయలజూపె రంగమందు
ప్రేక్షణికులెల్లవీక్షించు నాక్షణము
తేలుకొండిని ముద్దాడె నీలవేణి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅన్నెమును పున్నెమెరుగని కన్నెపిల్ల
రిప్లయితొలగించండిచిక్కుకొన్నది ప్రేముడి చిక్కునందు
తుంటరతడని తెలియక తొందరించి
తేలుకొండిని ముద్దాడె నీలవేణి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినిశ్చయమాయె నా తరుణి నెమ్మనమందున ప్రేమ వానిపై
రిప్లయితొలగించండివృశ్చికమాతడన్న తలపేమదిఁ దోచక మోసపోయి తా
నిశ్చల చిత్తమందతనినే పతిగా తలబోసె నక్కటా!
వృశ్చికపుచ్ఛమున్ వనిత వేడుకతోఁ గని ముద్దులాడెనే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిచిత్ర కథ ఘట్టమందు విచిత్ర పాత్ర
శతృ వినాశనకారక సాధన సకి
గరళ చుంబన చేటిక కల్పితమగు
తేలుకొండిని ముద్దాడె నీలవేణి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"శత్రు నాశనకారక కారక సఖి" అనండి.
ధన్యవాదాలండీ. 🙏
తొలగించండితేటగీతి
తొలగించండిచిత్ర కథ ఘట్టమందు విచిత్ర పాత్ర
శత్రు నాశనకారక సాధన సఖి
గరళ చుంబన చేటిక కల్పితమగు
తేలుకొండిని ముద్దాడె నీలవేణి
దాహమును వేయ వెడలెను ద్రా గ నీరు
రిప్లయితొలగించండిచూడ కుండగ ద్రా గంగ చోద్య ముగను
తేలు కొండిని ముద్దాడె నీలవేణి
బాధ భరియింప లేదాయె పనవు చపుడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివృశ్చిక పుబొమ్మనుగనుచు వేగ మచట
పంచదారతో చేసిన ప్రతిమ యనుచు
తేలుకొండిని ముద్దాడె నీలవేణి
తినగనెంచుచు వేడ్కతో తీరుగాను.
మించి యా యంచయాన వహించి చేత
రిప్లయితొలగించండిసారె సారెకు నాకుచు సారె యంచుఁ
బంచఁ బొరుగు వారు తమకుఁ బంచదార
తేలు కొండిని ముద్దాడె నీలవేణి
పశ్చిమ దేశ పర్యటన భావము తోఁచుఁ బరీక్ష సేయఁగా
దుశ్చరితమ్ముఁ దోఁప దిట దోష మొకింతయుఁ గాన రాదులే
నిశ్చయ రీతి మంచి దని నెమ్మి వహించి తులాఖ్య రాశినిన్
వృశ్చిక పుచ్ఛమున్ వనిత వేడుకతోఁ గని ముద్దు లాడెనే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసెలవు లియ్యంగ బడికిన్ చిరు గోప
రిప్లయితొలగించండిబాల లాడుచు గెంతుచు పాడుచు పలు
బొమ్మ లేజేయ తేలును బోలు బొమ్మ
తేలు కొండిని ముద్దాడె నీలవేణి