భీముండు దుస్సశేనుని భీమరమందున వధించి భీరువు కురులన్ దా ముడుచు వేళ కృష్ణ హృ ద్రాముని మది ద్రోవదిఁ గని రంజిలె మిగులన్.
భామిని వల్వలూడ్చుతరి బాసయె చేసిన వాయుపుత్రుడా భీముడు సంపరాయమున భీకర రీతిని దుస్సశేనునిన్ నామమడంచి తోషమున నారిని చేరిన వేళ కృష్ణ హృ ద్రాముని మానసమ్ము గడు రంజిలె ద్రోవదిఁ గాంచినంతటన్.
ఉ:నీమము తో మెలంగుచును నీతిని వీడని ద్రౌపదిన్ గడున్ బ్రేమగ నుచ్ఛమైన పదవిన్ గొన బోవుట మెచ్చి భాజపా ప్రేమికు డిట్లనెన్ "తగిన రీతిగ నెంపిక యొప్పె గాదె !మా *రాముని మానసమ్ము,కడు రంజిలె ద్రోవది గాంచినంతటన్* (బి జె పి పార్టీ వారు తరచుగా రాముని ప్రస్తావన తెస్తారు.కనుక ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి పదవిని అందుకో బోతున్నందుకు సంతోషించి ఆమె ఎంపికకి రాముడు సంతోషించా డని అన్నాడు.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఏమీ న్యాయమె యిది,యే
రిప్లయితొలగించండిరాముని మది ద్రోవదిఁ గని రంజిలె మిగులన్
రాముడు ద్రోవది నామకు
లైై మసలిరె మీ పురమున లాలిత్య ముగన్ ?
కందము
రిప్లయితొలగించండిఆమైథిలిఁగని మెచ్చెను
రాముని మది;ద్రోవదిఁగని రంజిలె మిగులన్
శ్రీమఘవసుతుఁడు నరుఁడున్
భామా!నినుఁగాంచినంత నామది పొంగెన్.
కందం
రిప్లయితొలగించండిభామ సుగంధ సుమమ్మును
బ్రేమగ గోరఁగ రయమున ప్రీతినొసగియున్
సామీరి సతి సహృదయా
రాముని మది ద్రోవదిఁ గని రంజిలె మిగులన్
ఉత్పలమాల
భీముడు శీతశైలమున వేడ్క విహారము వత్నితోఁ జనన్
భామ సుగంధ పూర్ణ ప్రసవమ్మును బొందఁగ నిచ్ఛగించఁగన్
బ్రేమఁ దలిర్ప శీఘ్రముగఁ బ్రీతిగ నిచ్చిన నా సతీ సహృ
ద్రాముని మానసమ్ము గడు రంజిలె ద్రోవదిఁ గాంచినంతటన్
ఉత్పలమాల
రిప్లయితొలగించండికోమలి,ముగ్ధ,కన్య,మదకుంజర యానను సీతఁగాంచగా
*రాముని మానసమ్ము గడు రంజిలె;ద్రోవదిఁగాంచినంతటన్*
శ్రీమఘవాత్మజుండగు కిరీటికి మాటికి హెచ్చె ప్రేమ ,యో
భామిని!కామినీ!వలచి వచ్చిన నన్ గాని జాగుసేయకే!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగామిడి ద్రుపదుని కొమరిత
రిప్లయితొలగించండితామందరి భార్య యనుచు తరుణిని
జూపన్
నీమముగ దండమిడ బల
రాముని మది ద్రోవదిఁ గని రంజిలె మిగులన్
రాముడు, ద్రౌపది యనెడిన్
రిప్లయితొలగించండికౌమారులు భారతమనొక నాటకమునే
సిన్ మెప్పించిరి జనులన్
రాముని మది ద్రోవదిగని రంజిలె మిగులన్
రిప్లయితొలగించండిభీముండు దుస్సశేనుని
భీమరమందున వధించి భీరువు కురులన్
దా ముడుచు వేళ కృష్ణ హృ
ద్రాముని మది ద్రోవదిఁ గని రంజిలె మిగులన్.
భామిని వల్వలూడ్చుతరి బాసయె చేసిన వాయుపుత్రుడా
భీముడు సంపరాయమున భీకర రీతిని దుస్సశేనునిన్
నామమడంచి తోషమున నారిని చేరిన వేళ కృష్ణ హృ
ద్రాముని మానసమ్ము గడు రంజిలె ద్రోవదిఁ గాంచినంతటన్.
శ్రీమతి సొగసుకు మురిసెను
రిప్లయితొలగించండిరాముని మది, ద్రోవదిఁ గని రంజిలె మిగులన్
ప్రేమము నిండిన యెడదల
భీమాదులచట విరటుని పేరోలగమున్
ఏమని పొగడంగ వశమె
రిప్లయితొలగించండినీమహిమను యందరి గొద నెంతయు దీర్చన్
నామ స్మరణకున్! యదు వీ
రా! ముని మది ద్రోవదిఁ గని రంజిలె మిగులన్
(అరణ్యవాసంలో యుండగ దుర్యోధనుడంపిన దూర్వాస మహాముని మరియు యాతని శిష్యబృందపుటాకలి దీర్చిన వైనమును పొగడుచూ)
పామరు డొక్కడు బలికెను
రిప్లయితొలగించండిరాముని మది ద్రోవది గని రంజిలె మిగులన్
రా మాయ ణ ము దెలియఁ కిటు
ధీమా గా పలుక దగునె తిక మక రీతిన్
భీముడు సౌగంధికమున్
రిప్లయితొలగించండిబ్రేమగ పాంచాలికిచ్చె ప్రియముగ గోరన్
దీమసమొప్పారగ నభి
రాముని మది ద్రోవదిఁ గని రంజిలె మిగులన్
కందం
రిప్లయితొలగించండిఆ మత్స్య యంత్ర బేధన
సామాన్యునిగ విజయుండు సలుప వరించెన్
పూమాల వేయగా నభి
రాముని మది ద్రోవది గని రంజిలె మిగులన్.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
కం:ఏమియు గృహమున లేకయు
రిప్లయితొలగించండినీమముగా గృష్ణు మ్రొక్కి నెమ్మిగ విందున్
దా మునుల కొసగగన్ భళి
రా!ముని మది ద్రోవది గని రంజిలె మిగులన్
(పాండవులు అరణ్యవాసం లో ఉండగా దూర్వాసుడు మునిసమూహం తో భోజనానికి వస్తాడు.ద్రౌపది శ్రీకృష్ణునికి మ్రొక్కి ఆహారం సిద్ధం చేస్తుంది.ముని సంతోషిస్తాడు.)
ఏమని విన్నవింతు మునియే రఘు రాముడు వెంటరాగ తా
రిప్లయితొలగించండినామిథిలా పురంబు సనె నాశుభ సీత
స్వయంవరంబుకున్
భూమిజ పత్నియౌననియు ముచ్చట తీరు
నటంచునాత్మలో
రాముని మానసంబు కడు రంజిలె ద్రోవది
గాంచినంతనే
ఏమని వర్ణింపఁగ నగు
రిప్లయితొలగించండినా మృదు మధు రానుభూతి నర్జును సమ రో
ద్దాముని శాత్రవ వీర వి
రాముని మది ద్రోవదిఁ గని రంజిలె మిగులన్
తామర సాయ తాంచిత దళాక్షిని మేఘ నిభ ప్రభాంగినిం
గోమలి నీల సాంద్ర తర కుంతల మత్త గజేంద్ర గామినిన్
భామను మత్స్య యంత్ర జితఁ బాండవ మధ్యము భండ నాంగ ణా
రాముని మానసమ్ము గడు రంజిలె ద్రోవదిఁ గాంచి నంతటన్
రిప్లయితొలగించండిభామామణినిగనిమురిసె
*రాముని మది, ద్రోవదిఁ గని రంజిలె మిగులన్”*
కామముతోకీచకుడట
భీమునిచేజచ్చెగాదెవిరటుని పురిలో
మరొక పూరణ
కోమలగంధి జానకిని కూరిమితోగన సంతసించెనా
*రాముని మానసమ్ము,గడు రంజిలె ద్రోవది గాంచినంతటన్*
భీముని భ్రాత పార్థుడట వేగమె కొట్టుచు మత్స్యయంత్రమున్
ప్రేమగ పెండ్లియాడెనట పెద్దలు మెచ్చుచు సమ్మతించగా
రాముఁడు నామకం బలరు రంజిత దేహుఁడు గ్రామ మేగగా
రిప్లయితొలగించండిగ్రామపు మార్గమం దుగల గౌరమ దేవత దేవళంబు నన్
నీమము తోడఁ బూజ లను నేర్పుగ ఁ జేయునా ద్రౌపదిన్ గనన్
రాముని మానసమ్ము గడు రంజిలె ద్రోవదిఁ గాంచినంతటన్.
ఉ:నీమము తో మెలంగుచును నీతిని వీడని ద్రౌపదిన్ గడున్
రిప్లయితొలగించండిబ్రేమగ నుచ్ఛమైన పదవిన్ గొన బోవుట మెచ్చి భాజపా
ప్రేమికు డిట్లనెన్ "తగిన రీతిగ నెంపిక యొప్పె గాదె !మా
*రాముని మానసమ్ము,కడు రంజిలె ద్రోవది గాంచినంతటన్*
(బి జె పి పార్టీ వారు తరచుగా రాముని ప్రస్తావన తెస్తారు.కనుక ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి పదవిని అందుకో బోతున్నందుకు సంతోషించి ఆమె ఎంపికకి రాముడు సంతోషించా డని అన్నాడు.)