12-7-2022 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పృచ్ఛకుని వధాని దిట్టె వేదికపైనన్”(లేదా...)“తిప్పలఁ బెట్టు పృచ్ఛకునిఁ దిట్టె వధాని సభాంతరమ్మునన్”
తేటగీతికని నమస్కరించెను*పృచ్ఛకుని వధాని,తిట్టె వేదిక పైనన్*సుదీర్ఘముగనులంచగొండుల,రౌడీల,వంచితులను.వర్ణనముఁజేయుమన్నచోఁబద్యతతుల.
స్వచ్ఛత లేనిది యగుటనుపృచ్ఛకుఁ నిన్ బ్రశ్నవిధము బెడుసున్ గొట్టన్ నిచ్ఛను గోపముఁ గలుగగఁబృచ్ఛకుని వధాని దిట్టె వేదికపైనన్”
స్వఛ్చపు ప్రశ్నలు వేయక నిచ్చ కు వఛ్చిన దెరగున నిరు కు న బెట్టన్ రచ్చ ను జేయగ బూనిన పృచ్చకుని వధాని దిట్టె వేదిక పైనన్
చెప్పుమువర్ణనన్గరిమశాసనజేరినశాసనసభ్యులీలలంచప్పుడజెప్పనొప్పెపదజాలపునర్తననాశువంచునున్విప్పెనువాస్తవంబులనివీనుల విందుగనాలకింపనాతిప్పలుఁబెట్టుపృచ్ఛకునిఁదిట్టెవధానిసభాంతరమ్మునన్
స్వచ్ఛపుపదములపొందికకచ్ఛగవర్ణనతలపడిఖంగునమ్రోగన్లుచ్ఛాజెప్పుముసభననపృచ్ఛకునివధానిదిట్టెవేదికపైనన్
స్వచ్ఛత గనితా మెచ్చెనుపృచ్ఛకుని వధాని, దిట్టె వేదికపైన న్నిచ్ఛకు వచ్చిన రీతిగస్వేచ్ఛగ చెణుకులనువేయు పృచ్ఛక వర్యున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
స్వచ్ఛత గలుగు పదములనవిచ్ఛిన్నమ్ముగ బలుకుచు విచ్చలవిడిగానిచ్ఛా శ్లేషలు మొనయగ పృచ్ఛకుని వధాని దిట్టె వేదికపైనన్
ఉత్పలమాలచెప్పుచునుండ పద్యములు చీటికిమాటికి నడ్డువచ్చుచున్తప్పుగ మాటలాడెడు విధంబు సభాపతి కాంచి క్రోధియై*తిప్పలుఁబెట్టు పృచ్ఛకునిఁదిట్టె; వధాని సభాంతరమ్మునన్*గొప్పగఁజేసె ధారణము కోవిదులెల్ల బళీ!సెబాసనన్.
తప్పుడు ప్రశ్నలన్ విసుగుఁ దాల్చువి ధంబుగ వేయుచుండుచున్ దిప్పలఁ బెట్టు పృచ్ఛకునిఁ దిట్టె వధాని సభాంతరమ్మునన్ జెప్పగ లేకయా మనిషి చేష్టలు సూసిన నవ్వుకొందురే చెప్పుడు మీరలం దరును జేరియు నాతని దప్పుయం చునున్
కందం"అచ్చట సతిఁబతి నొక చెరఁబిచ్చిగఁ గంసుండు నుంచె విజ్ఞుడె?" యనఁగన్దుచ్ఛుఁడు నీవలె గాడనిపృచ్ఛకుని వధాని దిట్టె వేదికపైనన్! ఉత్పలమాలచెప్పుమటంచు కొంటెతుఁడు, "సేమము కాదని కంసుఁడెట్లు దానొప్పెను జెల్లి బావలకు నొక్కటె ఖైదు న"టన్న తాళకేనిప్పును మోమునందదిమి, "నీవలెఁ దుచ్ఛుడు కాడ"టంచు నాతిప్పలఁ బెట్టు పృచ్ఛకునిఁ దిట్టె వధాని సభాంతరమ్మునన్
పృచ్ఛకులందొకడు తననుతుచ్ఛపు పలుకుల నుడువుచు దూరుట వినగన్ఇచ్ఛా విధానమున నాపృచ్ఛకుని వధాని దిట్టె వేదికపైనన్
తుచ్ఛపు నాయక ఖలములనుచ్ఛరణకు తగని రీతి నుత్తర ముఖమున్స్వేచ్ఛగ ప్రశ్నకు మెచ్చియుపృచ్ఛకుని, వధాని దిట్టె వేదికపైనన్(ఖలములు:దురితములు)
గొప్పగ జేసె పూరణలు గోరగ బల్కె శతాశుపద్యముల్చప్పున నంచు మిత్రునకు జక్కగ నొక్కడు తెల్పుచుండి సౌరొప్పగ నాడె నీఫణితి నున్నతమైన వధానమందునన్ దిప్పలఁ బెట్టు పృచ్ఛకునిఁ దిట్టె వధాని సభాంతరమ్మునన్
కందంఆచ్ఛాంతపు మాట నుడువఉచ్ఛృంఖలపు పనుల గని యుక్తము గానేస్వచ్ఛంద పరిమితు లెరుగపృచ్ఛకుని వధాని దిట్టె వేదిక పైనన్.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
తప్పులులేనిరీతి యవధానము పండిత రంజకమ్ముగాగొప్పగ సాగుచుండ నొక కూళుడు సైంధవుఁ డయ్యె వేదికన్చెప్పెడు పూరణన్ వినక చీటికిమాటికి నడ్డగించుచున్తిప్పలఁ బెట్టు పృచ్ఛకునిఁ దిట్టె వధాని సభాంతరమ్మునన్
విచ్ఛిన్న మయ్యె డెందము పృచ్ఛకునకు నత్తఱిని వివేకం బాఱెం దచ్ఛిరము వ్రాలె నక్కట పృచ్ఛకుని వధాని దిట్టె వేదిక పైనన్మెప్పుల నింక నిందలను మేటి వధానులు పూరణమ్ములన్ గొప్పగఁ బల్కు చుండుదురు కూర్మిఁ గ్రహింపఁగ నొప్పు వానినిం దప్పుగ నెంచఁగాఁ దగదు ధర్మము కాదు తలంప నివ్విధిం దిప్పలఁ బెట్టు పృచ్ఛకునిఁ దిట్టె వధాని సభాంతరమ్మునన్
పృచ్చకుని గనొచ్చేనొకతుచ్ఛ సఖుడు నిచ్చెనొక్క తొక్క ప్రశ్నన్నచ్చని వధాని నేర్పుగపృచ్చకుని వదాని తిట్టె వేదిక పైనన్
గొప్పలుబోవు నొక్కడు సఖుండును తుచ్చుడు పృఛ్చకున్ గనేజెప్పుమనే తనందమును సీసను పద్యమునే యనంగనేనప్పుడనే వధాని మరి నందమునన్ కపి,సూకరంబనేతిప్పల బెట్టు పృచ్చకుని దిట్టె వధాని సభాంతరమ్మునన్
వచ్చిన ప్రేక్షకులు కనగనచ్చతెనుగు పలుకనట్టి యధములు వీరే మ్లేచ్ఛులని పలికి నంతనె పృచ్ఛకుని వధాని దిట్టె వేదికపైనన్. తప్పులవెన్నియో గల పదమ్ముల గూర్చిన పాదమొక్కటిన్ బొప్పడటన్ సమస్యగను పూరణ కోసమనిచ్చి వెంటనే చెప్పుడి పద్యమంచునతి శీఘ్రముగా నని పండితాగ్రణిన్ తిప్పలఁ బెట్టు పృచ్ఛకునిఁ దిట్టె వధాని సభాంతరమ్మునన్.
ఇచ్ఛగనవధానమ్మునుస్వేచ్ఛగయొనరించుచుండవెకిలితనముతోపృచ్ఛను చేయుచునుండగపృచ్ఛకునివధాని దిట్టెవేదికపైనన్
తేటగీతి
రిప్లయితొలగించండికని నమస్కరించెను*పృచ్ఛకుని వధాని,
తిట్టె వేదిక పైనన్*సుదీర్ఘముగను
లంచగొండుల,రౌడీల,వంచితులను.
వర్ణనముఁజేయుమన్నచోఁబద్యతతుల.
స్వచ్ఛత లేనిది యగుటను
రిప్లయితొలగించండిపృచ్ఛకుఁ నిన్ బ్రశ్నవిధము బెడుసున్ గొట్టన్
నిచ్ఛను గోపముఁ గలుగగఁ
బృచ్ఛకుని వధాని దిట్టె వేదికపైనన్”
స్వఛ్చపు ప్రశ్నలు వేయక
రిప్లయితొలగించండినిచ్చ కు వఛ్చిన దెరగున నిరు కు న బెట్టన్
రచ్చ ను జేయగ బూనిన
పృచ్చకుని వధాని దిట్టె వేదిక పైనన్
చెప్పుమువర్ణనన్గరిమశాసనజేరినశాసనసభ్యులీలలం
రిప్లయితొలగించండిచప్పుడజెప్పనొప్పెపదజాలపునర్తననాశువంచునున్
విప్పెనువాస్తవంబులనివీనుల విందుగనాలకింపనా
తిప్పలుఁబెట్టుపృచ్ఛకునిఁదిట్టెవధానిసభాంతరమ్మునన్
స్వచ్ఛపుపదములపొందిక
రిప్లయితొలగించండికచ్ఛగవర్ణనతలపడిఖంగునమ్రోగన్
లుచ్ఛాజెప్పుముసభనన
పృచ్ఛకునివధానిదిట్టెవేదికపైనన్
స్వచ్ఛత గనితా మెచ్చెను
రిప్లయితొలగించండిపృచ్ఛకుని వధాని, దిట్టె వేదికపైన
న్నిచ్ఛకు వచ్చిన రీతిగ
స్వేచ్ఛగ చెణుకులనువేయు పృచ్ఛక వర్యున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిస్వచ్ఛత గలుగు పదములన
తొలగించండివిచ్ఛిన్నమ్ముగ బలుకుచు విచ్చలవిడిగా
నిచ్ఛా శ్లేషలు మొనయగ
పృచ్ఛకుని వధాని దిట్టె వేదికపైనన్
ఉత్పలమాల
రిప్లయితొలగించండిచెప్పుచునుండ పద్యములు చీటికిమాటికి నడ్డువచ్చుచున్
తప్పుగ మాటలాడెడు విధంబు సభాపతి కాంచి క్రోధియై
*తిప్పలుఁబెట్టు పృచ్ఛకునిఁదిట్టె;
వధాని సభాంతరమ్మునన్*
గొప్పగఁజేసె ధారణము కోవిదులెల్ల బళీ!సెబాసనన్.
తప్పుడు ప్రశ్నలన్ విసుగుఁ దాల్చువి ధంబుగ వేయుచుండుచున్
రిప్లయితొలగించండిదిప్పలఁ బెట్టు పృచ్ఛకునిఁ దిట్టె వధాని సభాంతరమ్మునన్
జెప్పగ లేకయా మనిషి చేష్టలు సూసిన నవ్వుకొందురే
చెప్పుడు మీరలం దరును జేరియు నాతని దప్పుయం చునున్
కందం
రిప్లయితొలగించండి"అచ్చట సతిఁబతి నొక చెరఁ
బిచ్చిగఁ గంసుండు నుంచె విజ్ఞుడె?" యనఁగన్
దుచ్ఛుఁడు నీవలె గాడని
పృచ్ఛకుని వధాని దిట్టె వేదికపైనన్!
ఉత్పలమాల
చెప్పుమటంచు కొంటెతుఁడు, "సేమము కాదని కంసుఁడెట్లు దా
నొప్పెను జెల్లి బావలకు నొక్కటె ఖైదు న"టన్న తాళకే
నిప్పును మోమునందదిమి, "నీవలెఁ దుచ్ఛుడు కాడ"టంచు నా
తిప్పలఁ బెట్టు పృచ్ఛకునిఁ దిట్టె వధాని సభాంతరమ్మునన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపృచ్ఛకులందొకడు తనను
రిప్లయితొలగించండితుచ్ఛపు పలుకుల నుడువుచు దూరుట వినగన్
ఇచ్ఛా విధానమున నా
పృచ్ఛకుని వధాని దిట్టె వేదికపైనన్
తుచ్ఛపు నాయక ఖలముల
రిప్లయితొలగించండినుచ్ఛరణకు తగని రీతి నుత్తర ముఖమున్
స్వేచ్ఛగ ప్రశ్నకు మెచ్చియు
పృచ్ఛకుని, వధాని దిట్టె వేదికపైనన్
(ఖలములు:దురితములు)
గొప్పగ జేసె పూరణలు గోరగ బల్కె శతాశుపద్యముల్
రిప్లయితొలగించండిచప్పున నంచు మిత్రునకు జక్కగ నొక్కడు తెల్పుచుండి సౌ
రొప్పగ నాడె నీఫణితి నున్నతమైన వధానమందునన్
దిప్పలఁ బెట్టు పృచ్ఛకునిఁ దిట్టె వధాని సభాంతరమ్మునన్
కందం
రిప్లయితొలగించండిఆచ్ఛాంతపు మాట నుడువ
ఉచ్ఛృంఖలపు పనుల గని యుక్తము గానే
స్వచ్ఛంద పరిమితు లెరుగ
పృచ్ఛకుని వధాని దిట్టె వేదిక పైనన్.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
తప్పులులేనిరీతి యవధానము పండిత రంజకమ్ముగా
రిప్లయితొలగించండిగొప్పగ సాగుచుండ నొక కూళుడు సైంధవుఁ డయ్యె వేదికన్
చెప్పెడు పూరణన్ వినక చీటికిమాటికి నడ్డగించుచున్
తిప్పలఁ బెట్టు పృచ్ఛకునిఁ దిట్టె వధాని సభాంతరమ్మునన్
విచ్ఛిన్న మయ్యె డెందము
రిప్లయితొలగించండిపృచ్ఛకునకు నత్తఱిని వివేకం బాఱెం
దచ్ఛిరము వ్రాలె నక్కట
పృచ్ఛకుని వధాని దిట్టె వేదిక పైనన్
మెప్పుల నింక నిందలను మేటి వధానులు పూరణమ్ములన్
గొప్పగఁ బల్కు చుండుదురు కూర్మిఁ గ్రహింపఁగ నొప్పు వానినిం
దప్పుగ నెంచఁగాఁ దగదు ధర్మము కాదు తలంప నివ్విధిం
దిప్పలఁ బెట్టు పృచ్ఛకునిఁ దిట్టె వధాని సభాంతరమ్మునన్
పృచ్చకుని గనొచ్చేనొక
రిప్లయితొలగించండితుచ్ఛ సఖుడు నిచ్చెనొక్క తొక్క ప్రశ్నన్
నచ్చని వధాని నేర్పుగ
పృచ్చకుని వదాని తిట్టె వేదిక పైనన్
గొప్పలుబోవు నొక్కడు సఖుండును తుచ్చుడు పృఛ్చకున్ గనే
రిప్లయితొలగించండిజెప్పుమనే తనందమును సీసను పద్యమునే యనంగనే
నప్పుడనే వధాని మరి నందమునన్ కపి,సూకరంబనే
తిప్పల బెట్టు పృచ్చకుని దిట్టె వధాని సభాంతరమ్మునన్
రిప్లయితొలగించండివచ్చిన ప్రేక్షకులు కనగ
నచ్చతెనుగు పలుకనట్టి యధములు వీరే
మ్లేచ్ఛులని పలికి నంతనె
పృచ్ఛకుని వధాని దిట్టె వేదికపైనన్.
తప్పులవెన్నియో గల పదమ్ముల గూర్చిన పాదమొక్కటిన్
బొప్పడటన్ సమస్యగను పూరణ కోసమనిచ్చి వెంటనే
చెప్పుడి పద్యమంచునతి శీఘ్రముగా నని పండితాగ్రణిన్
తిప్పలఁ బెట్టు పృచ్ఛకునిఁ దిట్టె వధాని సభాంతరమ్మునన్.
ఇచ్ఛగనవధానమ్మును
రిప్లయితొలగించండిస్వేచ్ఛగయొనరించుచుండవెకిలితనముతో
పృచ్ఛను చేయుచునుండగ
పృచ్ఛకునివధాని దిట్టెవేదికపైనన్