15-7-2022 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“తార్‌క్ష్యుని తనయుండు గ్రీడి దమ్ముడు హరియౌ”(లేదా...)“తార్‌క్ష్యుని పుత్రుఁ డర్జునుఁడు దమ్ముఁడు శ్రీహరి బావ కర్ణుఁడౌ”
తార్క్ష్యుడు పెద్ద రాక్షసుడు తద్విషయంబును మీకుదెల్పెదన్తార్క్ష్యుని బంధువర్గమును దాము గ్రహింపుడటంచు బల్కెనాతార్క్ష్యుని నామమైన మును దానిట దెల్వనివా డొకం డిటుల్తార్క్ష్యుని పుత్రుఁ డర్జునుఁడు దమ్ముఁడు శ్రీహరి బావ కర్ణుఁడౌ
కందంఈర్క్ష్య రగులంగ వంశపువార్క్ష్యంబందు నటులెల్ల వాసినిఁ గనిరేతార్క్ష్యుని సాక్షిగ నాటికఁదార్క్ష్యుని తనయుండు గ్రీడి దమ్ముడు హరియౌ! ఉత్పలమాలఈర్క్ష్య చెలంగ లోకమున నెల్లర బంధువులట్లు వంశపున్వార్క్ష్యము నందునన్ నటులు వాసిని గాంచిరి పాటవమ్ములన్తార్క్ష్యుని సాక్షిగన్ నిజము నాటకమందున పాత్రధారులన్తార్క్ష్యుని పుత్రుఁ డర్జునుఁడు దమ్ముఁడు శ్రీహరి బావ కర్ణుఁడౌ!
తార్ క్ష్యు డన నెవరనుచు న్ తా ర్ క్ష్యు ని గూర్చి తెలియదని దక్షుని గోరన్ తా ర్ క్ష్యు ని వివరము లివియని తార్ క్ష్యు ని తనయుండు గ్రీడి తమ్ముడు హరియౌ
తార్క్ష్యుడని యెవరినందురు ?తార్క్ష్యుడెవరనంగ చక్రధరు డందురుగా !తార్క్ష్యుడొక పక్షి , మరెటులతార్క్ష్యుని తనయుండు గ్రీడి దమ్ముడు హరియౌ ?
తేటగీతివాహనముగఁగొనె నెవరిన్ బలివిరోధి?వినతకతఁడేమగును?కఱ్ఱి యని నెవఁడన?నుత్తరమిడె *తార్ క్ష్యుని,తనయుండు,గ్రీడి,తమ్ముఁడు హరియౌ*గద హలధరుని కనుచు
సవరణము:రెండవ పాదములో "కఱ్ఱియన నెవడన"?
తార్ క్ష్యుని బేరును దెలియక తార్ క్ష్యుని బంధమ్ము గురిచి తామసు డనెసూతార్ క్ష్యుడు రాక్షసు డైనను దార్‌క్ష్యుని తనయుండు గ్రీడి దమ్ముడు హరియౌ
తార్ క్ష్యుండెవరనియడుగగతార్ క్ష్యుని పొరుగింటివాడు తావివరించెన్తార్ క్ష్యుని బంధువు లిరువురుతార్ క్ష్యుని తనయుండు గ్రీడి దమ్ముడు హరియౌ
తార్ క్ష్యుని బేరుతోఁ గలఁడు తామస రూపుడు రాక్షసుండు నై దార్ క్ష్యునె ఱుంగకే యొకడు దానిటు పల్కెను వింటిరే యిదిన్ దార్‌క్ష్యుని పుత్రుఁ డర్జునుఁడు దమ్ముఁడు శ్రీహరి బావ కర్ణుఁడౌ తార్ క్ష్యుని నామమే జపము తార్ క్ష్యుని చేష్టలు బూజయే యెమో
తార్క్ష్యుని జనని వినతయని తార్క్ష్యుడు హరివాహనమని తలచితి మరి యీతార్క్ష్యుండెవ్వడు భువినేతార్క్ష్యుని తనయుండు గ్రీడి దమ్ముడు హరియౌ?
తార్క్ష్యుని తల్లియే వినత తండ్రియె కశ్యపు డంచెఱంగితిన్ దార్క్ష్యుడె విష్ణు వాహనమతండని నమ్మిరి లోకులెల్లరుల్ తార్క్ష్యుడెవండొ తెల్యకనె ద్రాపుడొకండు వచించె నిట్టులన్ తార్‌క్ష్యుని పుత్రుఁ డర్జునుఁడు దమ్ముఁడు శ్రీహరి బావ కర్ణుఁడౌ
ఈ,'ర్ క్ష్య'ను ప్రాస దుష్కరమె యిట్టుల నిచ్చుట పాడియా కవీ!తార్ క్ష్యుడెవండు చెప్పుమన తప్పుగ నిట్టులఁజెప్పె శిష్యుఁడున్సార్!"క్ష్యుని "వంశమందతఁడు చక్కగఁబుట్టెను గాదె పూర్వమాతార్ క్ష్యుని పుత్రుఁడర్జునుఁడు తమ్ముఁడు శ్రీహరి బావ కర్ణుఁడౌ.
లక్ష్యముగ దత్తపాదముతార్క్ష్యుని తనయుండు గ్రీడి దమ్ముడు హరియౌవీక్ష్యమె! పూరణ ప్రతిగాభక్ష్య రసజ్ఞత చవిగొను భక్షణ మేలౌ
తార్క్ష్యుడన గరుత్మంతుడుతార్క్ష్యుడన ననూరుడుమరి తరిదాల్పతడేతార్క్ష్యుని చుట్టము లెట్లగు"తార్క్ష్యుని తనయుండు గ్రీడి దమ్ముడు హరియౌ"?
కందంకక్ష్యకు యావలి ప్రశ్నిదితార్ క్ష్యుని తనయుండు గ్రీడి దమ్ముడు హరియౌతార్ క్ష్యుం డెవ్వడు దెలియదుతార్ క్ష్యుని ప్రవర వివరించ తార్కిక భంగిన్.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
వార్క్ష్యమున నుందు రేల సరర్క్ష్య సదృశ కాంతి సంబరమ్మున నెవఁ డీ తార్క్ష్యుఁడు వీరలు నెవ్వరు తార్క్ష్యుని తనయుండు క్రీడి దమ్ముఁడు హరియౌ [సరర్క్ష్య సదృశ కాంతి = నక్షత్ర సంబంధ (ప్రకాశము) నిభ కాంతితో] వార్క్ష్య విరాజమాన తరు పంక్తి తటాక తటమ్ము లందు ఘోరర్క్ష్య నినాద సంభరిత రమ్య గుహాంతర మందు నిల్చిరాతార్క్ష్యుఁడు వాని బంధువులు తార్క్ష్యుని చుట్టలు వార లివ్విధిన్ తార్క్ష్యుని పుత్రుఁ డర్జునుఁడు దమ్ముఁడు శ్రీ హరి బావ కర్ణుఁడౌ [ఘోరరక్ష్య నినాదము = ఘోర భల్లూక సంబంధ నినాదము]
తార్క్ష్యుడు పెద్ద రాక్షసుడు తద్విషయంబును మీకుదెల్పెదన్
రిప్లయితొలగించండితార్క్ష్యుని బంధువర్గమును దాము గ్రహింపుడటంచు బల్కెనా
తార్‌క్ష్యుని నామమైన మును దానిట దెల్వనివా డొకం డిటుల్
తార్‌క్ష్యుని పుత్రుఁ డర్జునుఁడు దమ్ముఁడు శ్రీహరి బావ కర్ణుఁడౌ
కందం
రిప్లయితొలగించండిఈర్క్ష్య రగులంగ వంశపు
వార్క్ష్యంబందు నటులెల్ల వాసినిఁ గనిరే
తార్క్ష్యుని సాక్షిగ నాటికఁ
దార్క్ష్యుని తనయుండు గ్రీడి దమ్ముడు హరియౌ!
ఉత్పలమాల
ఈర్క్ష్య చెలంగ లోకమున నెల్లర బంధువులట్లు వంశపున్
వార్క్ష్యము నందునన్ నటులు వాసిని గాంచిరి పాటవమ్ములన్
తార్క్ష్యుని సాక్షిగన్ నిజము నాటకమందున పాత్రధారులన్
తార్క్ష్యుని పుత్రుఁ డర్జునుఁడు దమ్ముఁడు శ్రీహరి బావ కర్ణుఁడౌ!
తార్ క్ష్యు డన నెవరనుచు న్
రిప్లయితొలగించండితా ర్ క్ష్యు ని గూర్చి తెలియదని దక్షుని గోరన్
తా ర్ క్ష్యు ని వివరము లివియని
తార్ క్ష్యు ని తనయుండు గ్రీడి తమ్ముడు హరియౌ
తార్క్ష్యుడని యెవరినందురు ?
రిప్లయితొలగించండితార్క్ష్యుడెవరనంగ చక్రధరు డందురుగా !
తార్క్ష్యుడొక పక్షి , మరెటుల
తార్క్ష్యుని తనయుండు గ్రీడి దమ్ముడు హరియౌ ?
తేటగీతి
రిప్లయితొలగించండివాహనముగఁగొనె నెవరిన్ బలివిరోధి?
వినతకతఁడేమగును?కఱ్ఱి యని నెవఁడన?
నుత్తరమిడె *తార్ క్ష్యుని,తనయుండు,గ్రీడి,
తమ్ముఁడు హరియౌ*గద హలధరుని కనుచు
సవరణము:రెండవ పాదములో "కఱ్ఱియన నెవడన"?
తొలగించండితార్ క్ష్యుని బేరును దెలియక
రిప్లయితొలగించండితార్ క్ష్యుని బంధమ్ము గురిచి తామసు డనెసూ
తార్ క్ష్యుడు రాక్షసు డైనను
దార్‌క్ష్యుని తనయుండు గ్రీడి దమ్ముడు హరియౌ
తార్ క్ష్యుండెవరనియడుగగ
రిప్లయితొలగించండితార్ క్ష్యుని పొరుగింటివాడు తావివరించెన్
తార్ క్ష్యుని బంధువు లిరువురు
తార్ క్ష్యుని తనయుండు గ్రీడి దమ్ముడు హరియౌ
తార్ క్ష్యుని బేరుతోఁ గలఁడు తామస రూపుడు రాక్షసుండు నై
రిప్లయితొలగించండిదార్ క్ష్యునె ఱుంగకే యొకడు దానిటు పల్కెను వింటిరే యిదిన్
దార్‌క్ష్యుని పుత్రుఁ డర్జునుఁడు దమ్ముఁడు శ్రీహరి బావ కర్ణుఁడౌ
తార్ క్ష్యుని నామమే జపము తార్ క్ష్యుని చేష్టలు బూజయే యెమో
రిప్లయితొలగించండితార్క్ష్యుని జనని వినతయని
తార్క్ష్యుడు హరివాహనమని తలచితి మరి యీ
తార్క్ష్యుండెవ్వడు భువినే
తార్‌క్ష్యుని తనయుండు గ్రీడి దమ్ముడు హరియౌ?
రిప్లయితొలగించండితార్క్ష్యుని తల్లియే వినత తండ్రియె కశ్యపు డంచెఱంగితిన్
దార్క్ష్యుడె విష్ణు వాహనమతండని నమ్మిరి లోకులెల్లరుల్
తార్క్ష్యుడెవండొ తెల్యకనె ద్రాపుడొకండు వచించె నిట్టులన్
తార్‌క్ష్యుని పుత్రుఁ డర్జునుఁడు దమ్ముఁడు శ్రీహరి బావ కర్ణుఁడౌ
ఈ,'ర్ క్ష్య'ను ప్రాస దుష్కరమె యిట్టుల నిచ్చుట
రిప్లయితొలగించండిపాడియా కవీ!
తార్ క్ష్యుడెవండు చెప్పుమన తప్పుగ నిట్టులఁజెప్పె శిష్యుఁడున్
సార్!"క్ష్యుని "వంశమందతఁడు చక్కగఁబుట్టెను గాదె పూర్వమా
తార్ క్ష్యుని పుత్రుఁడర్జునుఁడు తమ్ముఁడు శ్రీహరి బావ కర్ణుఁడౌ.
లక్ష్యముగ దత్తపాదము
రిప్లయితొలగించండితార్క్ష్యుని తనయుండు గ్రీడి దమ్ముడు హరియౌ
వీక్ష్యమె! పూరణ ప్రతిగా
భక్ష్య రసజ్ఞత చవిగొను భక్షణ మేలౌ
తార్క్ష్యుడన గరుత్మంతుడు
రిప్లయితొలగించండితార్క్ష్యుడన ననూరుడుమరి తరిదాల్పతడే
తార్క్ష్యుని చుట్టము లెట్లగు
"తార్క్ష్యుని తనయుండు గ్రీడి దమ్ముడు హరియౌ"?
కందం
రిప్లయితొలగించండికక్ష్యకు యావలి ప్రశ్నిది
తార్ క్ష్యుని తనయుండు గ్రీడి దమ్ముడు హరియౌ
తార్ క్ష్యుం డెవ్వడు దెలియదు
తార్ క్ష్యుని ప్రవర వివరించ తార్కిక భంగిన్.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
వార్క్ష్యమున నుందు రేల స
రిప్లయితొలగించండిరర్క్ష్య సదృశ కాంతి సంబరమ్మున నెవఁ డీ
తార్క్ష్యుఁడు వీరలు నెవ్వరు
తార్క్ష్యుని తనయుండు క్రీడి దమ్ముఁడు హరియౌ
[సరర్క్ష్య సదృశ కాంతి = నక్షత్ర సంబంధ (ప్రకాశము) నిభ కాంతితో]
వార్క్ష్య విరాజమాన తరు పంక్తి తటాక తటమ్ము లందు ఘో
రర్క్ష్య నినాద సంభరిత రమ్య గుహాంతర మందు నిల్చిరా
తార్క్ష్యుఁడు వాని బంధువులు తార్క్ష్యుని చుట్టలు వార లివ్విధిన్
తార్క్ష్యుని పుత్రుఁ డర్జునుఁడు దమ్ముఁడు శ్రీ హరి బావ కర్ణుఁడౌ
[ఘోరరక్ష్య నినాదము = ఘోర భల్లూక సంబంధ నినాదము]