16, జులై 2022, శనివారం

సమస్య - 4136

17-7-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సంబరములు సలుపుటేల జన్మదినమునన్”
(లేదా...)
“జన్మదినం బటంచుఁ గడు సంబరముల్ జరిపించుటేలనో” 

(జులై 17 నా పుట్టినరోజు. 73వ ఏట అడుగుపెడుతున్నాను)

25 కామెంట్‌లు:

  1. సంబరములు సలుపుటేల జన్మదినమునన్
    నా యనగ నొప్ప దిప్పుడు నాన్న సముఁడ!
    సకల శుభములఁ గలిగించు శంక రుం డె
    యాయు రారోగ్య సంపద లన్ని యిడుత

    రిప్లయితొలగించండి

  2. అంబరమంటెడు విధమున
    నింబుగ వేడుక జరుపక నివ్విధిని నిరా
    డంబరము నిరాసక్తిగ
    సంబరములు సలుపుటేల జన్మదినమునన్.

    రిప్లయితొలగించండి
  3. అంబుధినీటనుబుడగా
    డంబరముననల్లలాడియణగుటచూడన్
    డింభకతెలివినిగనుమా
    సంబరములుసలుపుటేలజన్మదినమునన్

    రిప్లయితొలగించండి
  4. అంబరమంటు ముదముతో
    డంబముగ నవీన వస్త్ర డాబుతొ విరులన్
    అంబకలంకరణ నిడని
    సంబరములు సలుపుటేల జన్మదినమునన్

    రిప్లయితొలగించండి
  5. జన్మదినం బటంచుఁ గడు సంబరముల్ జరిపించుటేలనో
    'తన్మయ ! చెప్పుదున్వినుము తప్పని జెప్పగ లేముగా వెసన్
    జన్మది నంబునున్మ నము చక్కటి పండుగ వోలె జర్పు చో
    సన్మతు లెల్లరున్మనకు చల్లటి యాశిసు లిచ్చునే గదా

    రిప్లయితొలగించండి
  6. సన్మతితో సమస్యలను సక్రమ రీతిగ
    నిచ్చుచున్ సదా
    తన్మయమొప్పపూరణలు దప్పక
    చూచుచు జక్కదిద్దు వో
    చిన్మయ! మాకుసంబరము చేకురు,
    మీకు శుభంబు గల్గెడిన్
    జన్మదినంబటంచు కడు సంబరముల్ జరిపించుటేలనో

    రిప్లయితొలగించండి
  7. 'అంబర మంటెడు రీతిని
    సంబరములు సలుపుటేల జన్మదినమునన్?'
    'వెంబడి నడిచెడి వారలు
    సంబంధీకులు మురియుచు సంతస మొందన్!'


    (గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు)

    రిప్లయితొలగించండి
  8. గురుదేవులకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐

    కందం
    డంబము లేశము లేదన
    నంబ సరస్వతికి శంకరార్యులు ప్రియమై
    కుంభినిఁ బొగడగ! నొకచో
    సంబరములు సలుపుటేల జన్మదినమునన్?

    ఉత్పలమాల
    తన్మయమొందగన్ మదిని దానొక శ్రేష్ఠునిగన్ సరస్వతీ
    చిన్మయ రూపమంచుఁ గని సేవలకొగ్గగ శిష్యులెల్లడన్
    సన్ముని శంకరార్యులకు నల్దిశలందున గాక నొక్కచో
    జన్మదినం బటంచుఁ గడు సంబరముల్ జరిపించుటేలనో?

    రిప్లయితొలగించండి
  9. తేటగీతి
    శంకరార్య!"సంబరములు సలుపుటేల?
    జన్మదినము నన్"అనుట యసమ్మతమగు
    పద్య సేద్యంబులో మీరు ప్రతిదినమ్ము
    గడప వలె జన్మదిన శుభాకాంక్షలివియె.

    కందము
    అంబ కటాక్షమె చాలును
    సంబరములు సలుపుటేల?,జన్మదినమునన్
    డాంబికములేల?యను మీ
    కంబుజభవుఁడిచ్చుగా చిరాయువు సిరులున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      జన్మదినోత్సవంబునను శంకర!మీకు నమస్సుమూంజలుల్
      సన్మతులైన శిష్యతతి చక్కగ పద్యములల్ల నేర్వ మీ
      జన్మయు సార్ధకంబయెను శారద దివ్య కటాక్షమొప్ప నీ
      జన్మదినంబటంచు గాడు సంబరముల్ జరిపించుటేలనో!

      తొలగించండి
    2. సవరణము:మూడవ పద్యము మొదటి పాదమున"నమస్సుమాంజలుల్"
      నాలుగవ పాదమున "గడు"

      తొలగించండి
  10. సన్మతివీవటంచును యశమ్మును పొందిన సాటిలేని వి
    ద్యన్మణివీవె, పండితులు పామరు లెల్లనుతింతు రొజ్జగా
    నిన్మరువంగలేరుకద నిత్యపురస్కృతులందు నీకికన్
    జన్మదినం బటంచుఁ గడు సంబరముల్ జరిపించుటేలనో.

    రిప్లయితొలగించండి
  11. సంబరములు సలుపుటేల జన్మదినమునన్
    నా యనగ నొప్ప దిప్పుడు నాన్న సముఁడ
    ఙ్ఞాన వారాశి యందున ఘనుడ వగుట
    సకల శుభములఁ గలిగించు శంక రుం డె
    యాయు రారోగ్య సంపద లన్ని యిడుత

    రిప్లయితొలగించండి
  12. అంబిక పుట్టిన దినమున
    “సంబరములు సలుపుటేల జన్మదినమునన్”
    వెంబర పలుకిది నీరహి
    నంబరముకు చేర్చె నామెయని మరచితివో !

    రిప్లయితొలగించండి
  13. జన్మములందు మానవుల జన్మము దొడ్డదటండ్రు విజ్ఞులా
    జన్మము సార్థకంబగును చల్లగ నార్తుల నాదుకొన్నచో
    జన్మము వ్యర్థమౌనుగద సాయము సేయక సాటి వారికిన్
    జన్మదినం బటంచుఁ గడు సంబరముల్ జరిపించుటేలనో

    రిప్లయితొలగించండి
  14. సాంబుని ప్రతి రూ పంబై
    దంబము లేకుండ వెలుగు దక్షులు దమకా
    యంబ క టాక్ష ములు o డ గ
    సంబరములు సలుపు టేల జన్మదిన మునన్
    శంక రార్యులకు జన్మదిన శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  15. రిప్లయిలు
    1. కందము

      అంబసుతుడు శంకరు గొన
      సంబరములు సలుపుటేల జన్మదినమునన్
      ఇంబుగ నీ కవి తతిడు క
      రంబమిదియె కతనకాంబర బహూకృతిగన్

      [ఇంబుగ: ప్రియముగ; కవి తతిడు: కవి సమూహము (శంకరాభరణ సభ్యులు) యిచ్చు ; కరంబము: కదంబము (నేడు అందరూ వ్రాసిన పద్యమాల) ;
      కతనకాంబరము: బంగరుచేలము]

      శ్రీ కంది శంకరయ్య గారికి 73వ జన్మదిన శుభాకాంక్షలతో

      తొలగించండి
  16. గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు.
    కందం
    అంబర వర్ణపు మెయి ,పీ
    తాంబర ధారి హరిగొలిచి తగు నాశీర్వా
    దంబుల బడయగ, వేడుక
    సంబరములు సలుపుటేల జన్మదినమునన్
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  17. గురువుగారికి జన్మదిన శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  18. పూజ్యులు శంకరయ్యగారికి జన్మదిన శుభాకాంక్షలతో:

    అంబరము లింక నన్నము
    లం బరమ ప్రీతిని ననురాగమ్మునఁ ద్యా
    గం బర్థుల కొనరింపక
    సంబరములు సలుపు టేల జన్మ దినమునన్

    తన్మయ మంది సంతతము తద్దయు మద్య నిషేవనమ్మునం
    దున్మక దుర్గు ణావలినిఁ ద్రుంపక షడ్రిపు వర్గ మింతయున్
    విన్మ మహోత్సవమ్ముగను వేలకు వేలు వ్యయించి వెఱ్ఱులై
    జన్మ దినం బటంచుఁ గడు సంబరముల్ జరిపించు టేలనో

    రిప్లయితొలగించండి
  19. రంబాఫలములతోడను
    కంబగిరీశుని కొలిచిన కమ్మగ చాలున్
    అంబరమంటెడు విధముగ
    సంబరములుసలుపుటేలజన్మదినమునన్

    రిప్లయితొలగించండి