20, జులై 2022, బుధవారం

సమస్య - 4140

21-7-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“లయకారుఁడె సృష్టిఁ జేసె లావణ్యముగన్”
(లేదా...)
“లయకారుం డొనరించె సృష్టి హృదయోల్లాసంబుఁ గల్గించుచున్”

26 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. భయమును దొలగుం జేయును
    లయకారుడె ,సృష్టిఁ జేసె లావణ్యముగన్
    తోయలి శాంభవి పనుపున
    స్వయంభువుఁ డొకడె మొదటన జగమునఁ దానై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...దొలగం జేయును' అని ఉండాలి. మూడవ పాదాన్ని గురువుతో ప్రారంభించారు.

      తొలగించండి
    2. భయమును దొలగం జేయును
      లయకారుడె ,సృష్టిఁ జేసె లావణ్యముగన్
      బ్రియయగు శాంభవి పనుపున
      స్వయంభువుఁ డొకడె మొదటన జగమునఁ దానై

      తొలగించండి
  3. కందం
    దయగల దేవుండు శివుడు
    లయకారుఁడె, సృష్టిఁ జేసె లావణ్యముగన్
    జయకరముగ బ్రహ్మ యనుచు,
    నియమిత పాలక హరియగు నిశ్చయ రీతిన్.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి

  4. నయనాయుధుడా బాలుని
    దయవీడుచు కూల్చువేళ దశభుజి యేడ్వన్
    బ్రియసఖి కౌశికి హృదయా
    లయకారుఁడె సృష్టిఁ జేసె లావణ్యముగన్.

    రిప్లయితొలగించండి
  5. కందం
    స్వయముగ తన కర్తవ్యము
    నియతిని సాగింప నలువ నిండుగ వాణిన్,
    జయమని దీవింప హరియు
    లయకారుఁడె, సృష్టిఁ జేసె లావణ్యముగన్

    మత్తేభవిక్రీడితము
    నియతిన్ గూర్చి జగమ్మనంతరము నిర్నిద్రన్ జగన్మాత త
    ద్దయ సృష్టి,స్థితి, యంతమౌ లయ త్రిమూర్త్యాత్ముల్ విలోకింపగన్
    జయమౌ దీవెన నప్పగింప, నలువన్ గాంచంగ శ్రీకాంతుఁ డా
    లయకారుం డొ, నరించె సృష్టి హృదయోల్లాసంబుఁ గల్గించుచున్

    రిప్లయితొలగించండి

  6. భయమున్ జూపక నడ్డగించెననుచున్ బాలుండ నా శంభుడే
    దయయేమాత్రము లేక కూల్చెననుచున్ దాక్షాయణీ యేడ్వగన్
    బ్రియకాంతామణి బాధ గాంచి జవమున్ వేదండ శీర్షంబుతో
    లయకారుం డొనరించె సృష్టి హృదయోల్లాసంబుఁ గల్గించుచున్.

    రిప్లయితొలగించండి
  7. దయతో గాచును భక్తుల
    లయ కారుడె : సృష్టి చేసె లావణ్యముగన్
    స్వయముగ నజుడా వాణిని
    ప్రియ ముగ జేకొనె వలచి యు ప్రేమ జనింపన్

    రిప్లయితొలగించండి
  8. కందము
    క్షయకారుఁడు దక్షాధ్వర
    *లయకారుఁడె; సృష్టిఁజేసె లావణ్యముగన్*
    స్వయముగ విధాత జగముల్
    నియమముతో స్థితినిఁగూర్చు శ్రీవల్లభుఁడే.

    రిప్లయితొలగించండి

  9. దయఁ జూపించుమ యంచు గౌరి దను గైదండంబులంగోరగా
    లయకారుం డొనరించె సృష్టి హృదయోల్లాసంబుఁ గల్గించుచున్
    దయతో గూడిన మానసం బడర వేదండంపు శీర్షంబుతో
    నియతిన్ గూర్చెను బాలుకిన్ సొగసుఁ దానేర్వంగ మార్గంబు నన్

    రిప్లయితొలగించండి
  10. వ్యయము పెరుగుటకు కరణము
    లయకారుఁడె ; సృష్టిఁ జేసె లావణ్యముగన్
    నియమము తప్పక , నా ఆ
    లయమును క్రొత్తగ దొరికిన లాక్షణికుండే

    లయకారుడు = మోసగాడు

    రిప్లయితొలగించండి
  11. రయమున్ దక్షుని శీర్షముం దునిమి యౌరా!మేష శీర్షంబిడెన్
    భయముంగూర్చుచు బాలు శీర్షమును విధ్వంసంబు గావించియున్
    నయమొప్పంగరి శీర్ష మే యతికి ప్రాణంబిచ్చి రక్షించె,త
    *ల్లయకారుండొనరించె సృష్టి హృదయోల్లాసంబు గల్గించుచున్.*

    రిప్లయితొలగించండి
  12. క్షయ మొనరించియు దయ ద
    క్ష యజ్ఞమున మేఁక శిర మొసఁగి రక్షించెన్
    దయ నిభ శిర మొసఁగి సుతుని
    *లయకారుఁడె సృష్టిఁ జేసె లావణ్యముగన్*


    నయ మేపారఁగఁ బ్రీతిఁ బంచుకొని రా నాథుల్ ధరం గార్య సం
    చయ మిబ్భంగిని సృష్టి రక్షణము నాశంబుల్ శతానందుఁడే
    దయ శ్రీనాథుఁడు రక్షణం బొసఁగ విధ్వంసమ్ముఁ జేకూర్పఁగా
    *లయకారుం డొనరించె సృష్టి హృదయోల్లాసంబుఁ గల్గించుచున్*

    రిప్లయితొలగించండి
  13. పయనంబయ్యె హిమగిరికి
    లయకారుడె: సృష్టి చేసె లావణ్యముగన్
    స్వయముగ నలువయె వాణిని
    రయముగ చేపట్టె తాను రాణిగ ప్రీతిన్

    జయహో యంచట నంబరాధిపతు లాశ్చర్యంబుతో గాంచగన్
    దయనీయంబగు రీతిగా మరుని తాధగ్ధం బొనర్చన్నటన్
    లయకారుం డొ,నరించె సృష్టి హృదయోల్లాసంబుఁ గల్గించుచున్”*
    నయనానందముగా సరోజభవుడానందమ్ముతో భారతిన్.

    రిప్లయితొలగించండి