21, జులై 2022, గురువారం

సమస్య - 4141

22-7-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సాహిత్యము మేలొసఁగదు చప్పున విడుమా”
(లేదా...)
“సాహిత్యంబు ప్రయోజనం బిడదు వత్సా నీకు వీడం దగున్”

29 కామెంట్‌లు:

 1. కందం
  ఊహాతీతంబగుచున్
  దేహ సహజ కామ వాంఛ తృష్ణ వివశులన్
  మోహింప జేయు క్షుద్ర పు
  సాహిత్యము మేలొసఁగదు చప్పున విడుమా
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.

  రిప్లయితొలగించు
 2. కందం
  ఏ హితమైననొనర్పఁగ
  సాహసమది చేయనొప్పుఁ, సంఘమునకు వి
  ద్రోహమగు నుగ్రవాదపు
  సాహిత్యము మేలొసఁగదు చప్పున విడుమా!

  శార్దూలవిక్రీడితము
  ఆహారావసరంబనన్ బుడమి నీకందింపదే వృత్తియున్?
  జీహాదంచును నిస్సహాయులను నిర్జీవంబొనర్పంగ వి
  ద్రోహంబౌగద సాటివారలకుఁ! గాదో? నుగ్రవాదంబుదౌ
  సాహిత్యంబు ప్రయోజనం బిడదు వత్సా! నీకు వీడం దగున్!

  రిప్లయితొలగించు
 3. సాహిత్యేతరులకు మా
  సాహిత్యము మేలొసఁగదు ,చప్పున విడుమా
  బాహా టంబుగఁ ద్రాగెడు
  నాహాలాహల సమమగు నౌషధ రసమున్

  రిప్లయితొలగించు
 4. ఊహల సౌధంబులతో
  హాహాకారంబుతోడ నాందోళనతో
  మోహమునసల్పు విప్లవ
  సాహిత్యము మేలొసఁగదు చప్పున విడుమా

  రిప్లయితొలగించు
 5. పాహియనిశరణువేడుచు
  శ్రీహరిదలచుటశుభమునుసేయునునరుడా
  నేహమ్మిదిమదిజనులకు
  సాహిత్యముమేలొసగదుచప్పునవిడుమా

  రిప్లయితొలగించు
 6. నీ హితముగోరి చెప్పెద ,
  బాహాటముగ దొరతనముపై శంకించన్
  సాహసము జేసి వ్రాసిన
  సాహిత్యము మేలొసఁగదు చప్పున విడుమా

  రిప్లయితొలగించు
 7. ఊహల నిలయంబగుచును
  బాహా టము గా చెడు పుచు పరగెడు నదియై
  సాహస మొనరించెడు నా
  సాహిత్యము మేలొసగదు చప్పున విడుమా !

  రిప్లయితొలగించు

 8. ఐహిక సుఖముల పై వ్యా
  మోహంబధికమ్ము గలుగు మూఢులు వారే
  ద్రోహులు వారు రచించెడి
  సాహిత్యము మేలొసఁగదు చప్పున విడుమా.


  దౌహిత్రుండను జేరబిల్చి పలికెన్ ధర్మంబు నే వీడుచున్
  స్నేహంబేలర, తీవ్రవాదులనగా నేరస్థులీ జాతికిన్
  ద్రోహంబున్ దలపెట్టు రాతలవి దూషించుమా, తుచ్ఛమౌ
  సాహిత్యంబు ప్రయోజనం బిడదు వత్సా నీకు, వీడం దగున్.

  రిప్లయితొలగించు
 9. సాహిత్యం బిసు మంత నేర్వకనె యా సౌరభ్య మాస్వాదనౌ
  సాహిత్యంబు ప్రయోజనం బిడదు వత్సా నీకు వీడం దగున్
  సాహిత్యంబున నన్నయాదులు భువిన్ సారంపుఁ బూదోటలో
  నాహా యంచను నట్లు నద్భుత పు పద్యా హార మందించెనే

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నేర్వకయె' అనండి.

   తొలగించు
  2. సాహిత్యం బిసు మంత నేర్వకయె యా సౌరభ్య మాస్వాదనౌ
   సాహిత్యంబు ప్రయోజనం బిడదు వత్సా నీకు వీడం దగున్
   సాహిత్యంబున నన్నయాదులు భువిన్ సారంపుఁ బూదోటలో
   నాహా యంచను నట్లు నద్భుత పు పద్యా హార మందించెనే

   తొలగించు
 10. రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'యువతర+ఊహలు = యువతరోహలు' అవుతుంది. విసంధిగా వ్రాయరాదు కదా... అక్కడ "యువకుల యూహ లవియు.." అందామా?

   తొలగించు
  2. ద్రోహమె! మరలగ యువకుల
   యూహ లవియు ప్రగతి పాటవోధ్ధరణ దిశన్
   సాహస మెంచని కుహనా
   సాహిత్యము మేలొసఁగదు చప్పున విడుమా

   తొలగించు
 11. సాహిత్యంబుయె మానవాళికి సంస్కారంబు
  నేర్పించు నే
  సాహిత్యంబిల మంచి నడ్వడికి సదా
  సన్మార్గముంజూపు నా
  సాహిత్యంబునె నీవు నేర్వ తగు ,నే
  సద్బద్ధి నొసంగ నీ
  సాహిత్యంబు ప్రయోజనంబిడదు వత్సా
  నీకు వీడందగున్

  రిప్లయితొలగించు
 12. ఆహార విహార్యములన్
  ఊహాతీతముగ మార్చునో దుష్టమగున్
  మోహ వికారము జేసెడి
  సాహిత్యము మేలొసగదు చప్పున విడుమా

  రిప్లయితొలగించు
 13. సాహిత్యంబది సద్వికాసకరమౌ జ్ఞానాంజనా రేఖయై
  మోహావేశ తమోంధకారముల నిర్మూలింప మేలౌ గనన్
  ద్రోహాహంకృతులన్ రగుల్కొలుపు వాతూలం బశాస్త్రీయమౌ
  సాహిత్యంబు ప్రయోజనం బిడదు వత్సా నీకు వీడం దగున్

  రిప్లయితొలగించు
 14. దోహదము కాదు గాంచఁగ
  దేహాదుల వృద్ధి కింత తెల్లము కాఁగా
  నాహా యేలా నీ కీ
  సాహిత్యము మేలొసఁగదు చప్పున విడుమా

  మోహావేశము లాత్మ దారకములై ముప్పొద్దు వేధించెడిన్
  గ్రా హాతీత వచో వికారమున శృంగారంపు వ్యాజ్యమ్మునన్
  బాహాటంబుగ నేఁడు లభ్య మగు నప్రాశస్త్య వాగ్ధోరణీ
  సాహిత్యంబు ప్రయోజనం బిడదు వత్సా నీకు వీడం దగున్

  రిప్లయితొలగించు
 15. ఏహితముగోరి చేసెద
  వూహించనిరీతి నాగ్రహోదగ్రమ్మౌ
  సాహిత్య రచన లికనీ
  సాహిత్యము మేలొసఁగదు చప్పున విడుమా

  రిప్లయితొలగించు
 16. ద్రోహపుబుద్ధిని పెంచెడి
  *సాహిత్యము మేలొసఁగదు చప్పున విడుమా”*
  స్నేహ సుధలుపంచెడుస
  త్సాహిత్యమెనీకుమార్గదర్శియు వినుమా

  రిప్లయితొలగించు