12, జులై 2022, మంగళవారం

న్యస్తాక్షరి - 73

13-7-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
కవి సన్మానాలను వర్ణిస్తూ
మత్తేభ విక్రీడిత పద్యం చెప్పండి
1వ పాదం 1వ అక్షరం 'స'
2వ పాదం 14వ అక్షరం 'న్మా'
3వ పాదం 5వ అక్షరం 'న'
4వ పాదం 16వ అక్షరం 'ము'

20 కామెంట్‌లు:

  1. సమతా భావము నేర్పు నా కవుల నాశాజ్యోతులే యీ సుతుల్
    మమతా రీతుల వారికిన్ నిపుడు సన్మానంబుఁ జేయంగ నౌ
    విమలం బానన సోయగంబుఁ గన వేవేలంగ నేత్రంబు లున్
    గమలా! చాలవు జూడగా నికను నేకాలమ్ము నందైననున్

    రిప్లయితొలగించండి

  2. సరిరారెవ్వరు నీకుసాటి యనుచున్ సాహిత్య లోకమ్ము ని
    న్బరిపూర్ణుండవటంచు నెంచి ఘన సన్మానమ్మునే జేయగా
    గురువుల్ జ్ఞానవిశారదుండవగు నీ కోసమ్ము పర్యంకమున్
    గరినిన్ దెచ్చిరి గండపెండెరము నీకై తాము జేయించిరే.

    రిప్లయితొలగించండి
  3. (స)భలో తత్కవి పాండితీగరిమనే శ్లాఘించి పల్మాఱులున్
    నభమంటన్;బిరుదంబొసంగి ఘన స(న్మా)నంబునుంజేయరే
    యభిమానుల్ (న)వ పుష్పదామములనే యర్పించి,మీకావ్య స
    త్ప్రభ నల్దిక్కుల వ్యాప్తి జెందుననుచుంబల్కన్ (ము)దంబందడే!

    రిప్లయితొలగించండి
  4. కవి సన్మానము బ్రాహ్మీ యర్చనని చక్కనైన పూమాలలే
    కవి కంఠంబునలంకరించి గజమెక్కంగాను జేసిన్ శుభం
    గా విదేశంబుల విశ్వవీధుల విహంగంబుననే ద్రిప్పుచూ
    నవయౌ శాలువ గండపెండెరము సన్మానంబునేజేయుదుర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవి సన్మానము బ్రాహ్మీ యర్చనని చక్కనైన పూమాలలే
      కవి కంఠంబునలంకరించి గజమెక్కంగాను జేసిన్ శుభం
      గవిదేశంబుల విశ్వవీధుల విహంగంబుననే ద్రిప్పుచూ
      నవయౌ శాలువ,గండపెండెరము సన్మానంబునే జేయుదుర్

      తొలగించండి
  5. సమయంబెంచి వధానవర్యు డిలలో సాధించగా పూరణల్
    నమసంబంచు గవీశ్వరుల్ మిగుల తన్మాత్రంబులన్ మున్గగా,
    విమలజ్ఞానము బంచగా బుధులకున్ వీక్షించు సభ్యాళికిన్
    రమణీయంబుగ సాగగా తుదిని మర్యాదన్, ముదంబందరే?

    రిప్లయితొలగించండి
  6. (స)రసల్లాపములాడుచున్ సమధికోత్సాహంబుతోడన్ జనుల్
    స్మరణమ్మే విధిగాగణింతురిట స(న్మా)నంబనే ప్రక్రియన్
    పురవీధిన్ (న)వ మోహనా కరము గాబుట్టుంగదా తోరణాల్
    మరపే రానివిధానమై మిగుల రమ్యంబౌ (ము)హూర్తంబునన్

    రిప్లయితొలగించండి
  7. మత్తేభవిక్రీడితము
    సరకున్ గూరిచి పూలమాలలకహో! సన్మానమాశించుటే?
    మఱువన్ జాలని సాహితీ గరిమతోన్మాన్యుండుగా నొప్పగన్
    ధరపై నున్నతి గర్కిపాటి దెస పద్మశ్రీ వరించున్ గదే
    యొరులీ పాటవమెన్నుచున్ బొగడుటే యుక్తమ్ము ముమ్మాటికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుదేవులకు ప్రణామములు.

      మూడవ పాదం:

      ధరపై కానగ... అని చదువుకొన ప్రార్థన.

      తొలగించండి
  8. సభలన్ జక్కని కైత లల్లిన గవియై సాధించె నా కీర్తుల్
    నభమున్ దాఁకె ననంగ సల్పిరట సన్మానం బు లన్ గొప్పగా
    విభ వంబై న మహోన్నతిన్ బడసియుం బేర్మిన్ ప్రతిష్ఠo బు లే
    శుభమై యొప్పగ వీక్షకుల్ పొగడిరే చోద్యమ్ము గా గాంచుచున్

    రిప్లయితొలగించండి
  9. సమమౌకావ్యముభారతంబునకుమీసాధ్యంబుగావచ్చెగా
    అమరన్మాకునుసభ్యులందరికిసన్మానంపుభాగ్యంబెగా
    సమతూకానకవుల్గమీరలునుమాసత్కారమున్వేడ్కతో
    సమభావంబులసాధుసంగతినిమీశాంతమ్ములన్జూపరే

    రిప్లయితొలగించండి
  10. స రసజ్ఞ వ్రజ పండిత ప్రవర విజ్ఞా నాప్రమేయ ప్రభా
    నర సందోహ స పామర ప్రథిత సన్మా నార్హ విద్యాధిక
    స్ఫుర దీశాన కృపాత్త భక్త జన సంపూజ్యమ్ముగా నూత నా
    మర కావ్యమ్ములు వ్రాయఁ దత్కవికి సన్మానమ్ము నిత్యార్హమౌ

    రిప్లయితొలగించండి
  11. మత్తేభవిక్రీడితము
    సమకాలీన కవిప్రశస్తుల, సమాజాంతర్ముఖా లోచనా
    నముగామంపు కవీశ్వరుల్ ,వివిధ సన్మానగ్రహీతోన్నతుల్
    సమతా మానవతా సుశోభితులు, వాక్చాతుర్య ధౌరేయులున్
    తమకించే వచనా ధురీణులకు యుక్తమ్మే పురస్కారముల్.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.
    నముగామము-మంచిచెడులు.

    రిప్లయితొలగించండి
  12. సభలన్జేసెడి కావ్యగానములకున్ సంరంభ మొప్పారగన్
    నభమున్ తాకెడు హర్షనాదములె సన్మానంబులౌ సత్కవుల్
    సుభగంబైన జనాళి స్పందనములన్ చొక్కంపు శ్లాఘంబులన్
    శుభసత్కారముగా తలంచికడు విస్ఫూర్తిన్ ముదంబందరే!

    రిప్లయితొలగించండి
  13. (స)రదా కావ్యము జెప్పుటన్ సుళువుగా సాధ్యంబు కాదేమొ ! యా
    నరునిన్ భక్తిగ సన్నుతించుచునె
    స(న్మా)నంబు కావించగన్
    తరముల్ కా(న)క కూడబెట్టుకొను
    చందాల్తోడ సాఫల్యమౌ
    కవిపై నేమియు పేర్మిలే నటులగా కాలే(ము) మేమెన్న డున్

    రిప్లయితొలగించండి
  14. సభలో రమ్య కవిత్వసార రుచి
    రస్థంబైన పద్యావళిన్
    నభవున్ స్తోత్రము జేయగా నలర సన్మానించిరే సత్కవుల్
    ప్రభవించెన్ నగవుల్ సభాస్థలిని సంరావించగా చర్చరుల్
    శుభమై శోభల దూగె వేదికయె
    సజ్యోత్సన్ ముదంబందగన్!

    చర్చరులు=చప్పట్లు

    రిప్లయితొలగించండి