23, జులై 2022, శనివారం

సమస్య - 4142

24-7-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మారునిఁ బెండ్లాడె సీత మంజులరూపున్”
(లేదా...)
“మారునిఁ బెండ్లియాడినది మంజులరూపుఁ డటంచు సీతయే”

40 కామెంట్‌లు:

  1. ఓరగజూచుచు నాసుకు
    మారునిఁ బెండ్లాడె సీత మంజులరూపున్”
    మారహరునిధనువు విరువ
    కూరిమితోనెల్లరుగన కువలయమందున్

    రిప్లయితొలగించండి
  2. వీరుని,దశరధ ప్రియ కు
    మారునిఁ బెండ్లాడె సీత మంజులరూపున్
    కారణ జన్ముడునై వెసఁ
    గ్రూర జనావళిని జంపెఁ గ్రుద్ధత్వమునన్

    రిప్లయితొలగించండి
  3. ధీరత శరమును ద్రుంచియు
    కోరిక దీర గ రఘుపతి కోమలి పొందన్
    కూరిమి గాగ దశరథ కు
    కుమా రుని బెండ్లాడె సీత మంజుల రూపున్

    రిప్లయితొలగించండి
  4. వారిజనేత్రుని శోభా
    పూరుడుసమగుణపరముడుపూతచరిత్రున్
    కోరికదశరథరాజకు
    మారునిబెండ్లాడెసీతమంజులరూపున్

    రిప్లయితొలగించండి
  5. చారులు చెప్పగ తెలిసెను
    శ్రీరా ముని గుణగణములు , చెలువము లన్నిన్
    కోరిన రీతి దశరథ కు
    మారునిఁ బెండ్లాడె సీత మంజులరూపున్

    రిప్లయితొలగించండి
  6. సారముసర్వలోకములకుశాంతమునిచ్చునుకోరువారికిన్
    భూరిగసద్గుణంబులకుపూషునివంశసుధాకరుండునై
    చేరిననాంజనేయునకుచెంగటనిల్చుమనోభిరామునా
    మారునిబెండ్లియాడినదిమంజులరూపుడటంచుసీతయే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. సారముసర్వలోకులకుసవరణతో
      పోరపాటునవ్రాశానుమన్నింపగలరు

      తొలగించండి

  7. ధీరుడు మునిజన వంద్యుం
    డా రవికుల శ్రేష్ఠుడైన యనఘుడు రిపు సం
    హారి పదితేరులదొర కు
    మారునిఁ బెండ్లాడె సీత మంజులరూపున్

    రిప్లయితొలగించండి
  8. కందం
    మారరిపుని విల్లు విఱచి
    ధీరుం డైవెలుగు చుండు ధీమతి కౌస
    ల్యారాముండుదశరథ కు
    మారుని బెండ్లాడె సీత మంజుల రూపున్
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  9. తీరుగ జనకుని సభలో
    మారారిధనువువిరిచినమహిపతి సూనున్
    కూరిమి తో గనియాసుకు
    మారుని బెండ్లాడెసీత మంజులరూపున్

    రిప్లయితొలగించండి
  10. శూరుని కార్ముకమ్మునతి సోద్యము
    నొందుచు రాజశేఖరుల్
    బారులు దీర్చి కూర్చొనయు బాగుగ
    జూచుచునుండ వంచు యా
    భూరి పరాక్రముండయిన పూజ్యుడు
    కోసల రాజు పుత్రు సు
    క్మారుని పెండ్లియాడినది మంజుల
    రూపుడంచు సీతయే

    రిప్లయితొలగించండి
  11. కందం
    ధారుణి కుల శైలమ్ములు
    భూరిగ కంపమ్మునందఁ బురహరువింటిన్
    ధీరతఁ ద్రుంచ దశరథ కు
    మారునిఁ బెండ్లాడె సీత మంజులరూపున్

    ఉత్పలమాల
    ధారుణిఁ క్రుంగ శైలములు తల్లడమందగ వీరులెల్లరున్
    కారణజన్ముడై శివుని కార్ముకమెత్తుచు ద్రుంచినంతటన్
    స్మేరముఖాబ్జ సుందరుని శ్రీరఘురాముని గాంచి మించఁగన్
    మారునిఁ బెండ్లియాడినది మంజులరూపుఁ డటంచు సీతయే!

    రిప్లయితొలగించండి

  12. ధీరుడు ధర్మరక్షణయె దీక్షగ గల్గిన పూరుషోత్తముం
    డా రవి వంశజుండరిభయంకరు డౌ రఘు రామ చంద్రునిన్
    జారెడు కన్నులున్ గలుగు సద్గుణశీలిని రూప మందున
    న్మా రునిఁ బెండ్లియాడినది మంజులరూపుఁ డటంచు సీతయే.

    రిప్లయితొలగించండి
  13. వీరులగు రాజ కొమరులు
    బారులు తీరిన సభమున భాసిలు ధీరున్
    కోరిన కోసల రాజకు
    మారునిఁ బెండ్లాడె సీత మంజులరూపున్

    రిప్లయితొలగించండి
  14. శూరుని విల్లును వంచిన
    కారణ జన్ముని దినకరు
    కాంతి సమున్నిన్
    భూరి బలుడు దశరథు కు
    మారునిఁ బెండ్లాడె సీత
    మంజుల రూపున్

    రిప్లయి

    రిప్లయితొలగించండి
  15. ప్రేరణ రాదిక నుడువగ
    ధారణ వేరుగ నిలువదు ధారాళముగన్
    పూరణలకును దశరధ కు
    మారునిఁ బెండ్లాడె సీత మంజులరూపున్

    రిప్లయితొలగించండి
  16. చేరి సభాంతరమ్మునను చెన్నగు రూపముతోడ మించుచున్
    కారణజన్ముడా శివుని కార్ముకమున్ ధరియించి త్రెంపగా
    వీరుని గాంచి మెచ్చపర వీరులు, వేల్పులు, నందమందునన్
    మారునిఁ బెండ్లియాడినది మంజులరూపుఁ డటంచు సీతయే
    అసనారె

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  18. ధీరుని,కోమల మానస

    చోరుని,ద్యుపతి కుల వంశ సోముని రిపుసం

    హారుని దశరథ రాజ కు

    మారుని‌ పెండ్లాడె సీత మంజుల రూపున్

    రిప్లయితొలగించండి
  19. తీరుగ జనకుని సభలో
    మారారి ధనువు విరిచిన మహిపతి సూనున్
    కూరిమి తోగని యాసుకు
    మారుని బెండ్లాడెసీత మంజులరూపున్


    కోరగవెంటరమ్మనుచుకూరిమితోడమునీశ్వరుండటన్
    మారుగనేమిపల్కకనుమానుగసాగినసూర్యవంశజున్
    నేరుగ తాటకాదులనునీల్గగచేసినవాడురూపునన్
    మారునిఁ బెండ్లియాడినది మంజులరూపుఁ డటంచు సీతయే”

    రిప్లయితొలగించండి
  20. మార విరోధిని భావి కు
    మార జనకుని నిజ చండ మారణ నయనున్
    మారణ కారణు నిర్జిత
    *మారునిఁ బెండ్లాడె సీత మంజుల రూపున్*
    [సీత =గంగా దేవి]

    ఆ రఘు వంశ వార్ధి శశి నంబుద సన్నిభ వర్ణ గాత్రునిం
    నీరజ పత్ర లోచనుని నిర్జిత ఘోరత రాసు రాలినిన్
    శూర వరేణ్యు దాశరథి సుందరు రాముని రమ్య నవ్య కౌ
    *మారునిఁ బెండ్లి యాడినది మంజుల రూపుఁ డటంచు సీతయే*

    రిప్లయితొలగించండి
  21. ధీరుని దశరథ రాజ కు
    మారుని మారునికెనయగు మానసహారున్
    భూరి ధనువు విరిచిన సుకు
    మారునిఁ బెండ్లాడె సీత మంజులరూపున్

    రిప్లయితొలగించండి
  22. వీరవరేణ్యు లీశ్వరుని విల్లును జేకొనలేక బేలలై
    బీరము బాసి వెన్దిరగ పెళ్ళున ద్రుంచెను రామచంద్రుడా
    మార రిపున్ మహా ధనువు మన్ననచేయగ నెల్లవారలా
    "మారునిఁ బెండ్లియాడినది మంజులరూపుఁ డటంచు సీతయే”

    రిప్లయితొలగించండి