20-7-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆశావాది వధాని యనుటయె యబద్ధము శిష్యా”
(పైది ఛందో గోపనం)
(లేదా...)
“ఆశావాది వధానియౌననుట శిష్యా పెద్ద బొంకే సుమా”
(మొన్న హైదరాబాదులో ఆశావాది ప్రకాశరావు గారి సంస్మరణ సభలో జరిగిన అష్టావధానంలో నేనిచ్చిన సమస్య)
వాదనలన్నిటమునుగుట
రిప్లయితొలగించండివేదనయెంతయుమిగులగపెద్దగసభలో
కాదని చెప్పుట, నాశా
వాదివధానియనుటయెయబద్ధముశిష్యా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం॥
రిప్లయితొలగించండివాదన లెందుకు ! పద్యపు
పాదము నందలి గణముల పరచయ మడుగన్
యేదీ జవాబు ? ఆశా
వాది వధాని యనుటయె యబద్ధము శిష్యా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పరిచయమడుగన్' టైపాటు. 'అడుగన్+ఏదీ' అన్నపుడు యడాగమం రాదు. సవరించండి.
🙏🏽
తొలగించండివాదనఁ బ్రియమను నాశా
రిప్లయితొలగించండివాదివ ధానియ నుటయె యబద్ధము శిష్యా!
వాదన ముఁ జేయ కుండగ
హ్లాదముఁ గలిగెడు నటులుగ హవణిం చవలెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందము
రిప్లయితొలగించండిసాధన,ధారణ,మతి,ధృ
త్యాదులు లేకుండగ నవధానముఁజేయం
గాఁదలపోయు దురాశా
వాది,వధాని యనుటయె యబద్ధము శిష్యా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినాశంబోటమిలేదునైజమిదిరానామాటలాలింపుమా
రిప్లయితొలగించండికోశంబంతయువల్లెవేసిగనుతాఁజేకొన్నరంగంబునున్
వీసంబంతయునోడలేడుసభనావీరుండుసంసిద్ధుడే
ఆశావాదివధానియౌననుటశిష్యాపెద్దబొంకేసుమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆ దీర్ఘదర్శి చేయగ
నీదిన మవధానమదియె యింపును గూర్చెన్
వాదింపకు మట నాశా
వాది వధానియనుటయె యబద్ధము శిష్యా.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆశావాది వధానియౌననుట శిష్యా పెద్ద బొంకే సుమా
రిప్లయితొలగించండియాశా వాదము లేని పృధ్విని నెటన్ నాజన్మ మున్జూడ మో
యీశా ! చూపుము నీవ, గల్గెనె నికన్ నీలోక మందెచ్చ టన్
నాశా వాదమె రక్ష యెల్లర కు దా హ్హాదంబు నొందంగ సూ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'...గల్గెనె యికన్' అనండి.
వేదము నెఱిగిన బుధుడు వి
రిప్లయితొలగించండివాదముల బరిష్కరించు పరిపక్వతతో
మేధను గనియు నిరాశా
వాది వధాని యనుటయె యబద్ధము శిష్యా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిహా!శబ్దార్థమెఱుంగడౌర!కవితావ్యాసంగమేలేదు,ఛం
రిప్లయితొలగించండిదోశాస్త్రాదులుపద్యగద్యములహో!నోరార వల్లింపకే
ధీశాలిన్,కవి పండితుండనని వాదించున్ సదా యిట్టి,య
*త్యాశావాది,వధానియౌననుట శిష్యా!పెద్ద బొంకే సుమా!*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమేధో సంపద నొసఁగెడు
రిప్లయితొలగించండిసాధన యొకటే వధాని సత్ఫలితములన్
సాధించు వెరవు యాశా
వాది వధాని యనుటయె యబద్ధము శిష్యా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిలేదన గర్వము కవిగా
మోదిత బహు గ్రంథకర్త బుధజనవంద్యున్!
మేదినిఁ గేవలమాశా
వాది వధాని యనుటయె యబద్ధము శిష్యా!
శార్దూలవిక్రీడితము
లేశమ్మున్ బహు గ్రంథకర్తయయినన్ లేదన్న గర్వమ్మదే
రాశిన్బోసిన పాండితిన్ గవియనన్రాణింప ప్రావీణ్యుఁడౌ
బ్రాశస్త్యమ్మును మెచ్చి దేశమిడఁగన్ బద్మమ్మహో! కేవల
మ్మాశావాది వధానియౌననుట శిష్యా పెద్ద బొంకే! సుమా!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా 🙏
తొలగించండివాదమ లవేల నాశా
రిప్లయితొలగించండివాదివధాని యనుటయెయబద్ధముశిష్యా
మోదముకూర్చెడు రచనలు
మేదిని యందువిరచించిమేటియు నయ్యెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆ శర్వాణిని భక్తితో సతము తానర్చించు సద్భక్తు డౌ
నా శిష్యుండట చేసెగాదె యవధానమ్మొక్కటిన్ గొప్పగా
నా సాయంత్రమదే నిజమ్ము , మరి మీరచ్చోటులో నుండెనా
యాశావాది వధానియౌననుట శిష్యా పెద్ద బొంకే సుమా.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాదన బోరిల నాశా
రిప్లయితొలగించండివాది వధాని యనుట యె : యబద్ద ము శిష్యా
మోదం బిడుట నిరాశా
వాదిసఫ ల మగు ననంగ పలుకుట జూడన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిచాదస్తపు కవి సుజనా
మోదము లేక సభలందు మూర్ఖ వచనముల్
వాదము సలుపు నిరాశా
వాది వధాని యనుటయె యబద్ధము శిష్యా
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఏశబ్దార్థ వివేచనన్దెలియకన్నే గ్రంధము ల్జూడకన్
రిప్లయితొలగించండిలేశంబైనను ధారణా పటిమయున్ లేనట్టి యేబ్రాసి తా
నాశావాదముతో వధానమును సేయం జాలునే యెన్నడున్
ఆశావాది వధానియౌననుట శిష్యా పెద్ద బొంకే సుమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆదరము దనర నిజ కృ
రిప్లయితొలగించండిత్యాదుల నమ్మగ సతము జయం బగు నంచున్
మేదినిఁ దా నగు నాశా
వాది వధాని యనుటయె యబద్ధము శిష్యా
కౌశే యాంబర మూని దర్పమున శంకన్ వీడి డెందమ్మునం
బ్రాశస్త్యమ్ముగఁ జెప్ప నేరకయె యౌరా కీర్తి కండూతి నాఁ
బా శాబద్ధుఁ డనుక్షణమ్ము సభలం బద్యమ్ములన్ మార్పఁగా
నాశావాది వధాని యౌ ననుట శిష్యా పెద్ద బొంకే సుమా
లేశంబైనను సంశయింపకుము నిర్దిష్టంబుగా సత్యమౌ
రిప్లయితొలగించండినాశావాది వధానియౌననుట; శిష్యా పెద్ద బొంకే సుమా
ఆ శాబ్దీ కృప లేకనే యతఁడు విద్యావంతుఁడైనాడనన్;
ప్రాశస్త్యంబొనగూర్చునా భగవతీ పాదార్చనంబే సదా
వాదములవేల నాశా
రిప్లయితొలగించండి*వాది వధాని యనుటయెయబద్ధముశిష్యా*
మోదముకూర్చెడు రచనలు
మేదిని యందువిరచించిమేటియు నయ్యెన్