24, జులై 2022, ఆదివారం

సమస్య - 4143

25-7-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పుంస్త్వము లేనట్టివాఁడు పుత్రునిఁ బడసెన్”
(లేదా...)
“పుంస్త్వము లేనివాఁ డొకఁడు పుత్రునిఁ బొందెను లోకు లౌననన్”

20 కామెంట్‌లు:

  1. తేటగీతి
    సంతతిని యెట్లుఁబడయును సతినిఁగూడి
    పేడి*పుంస్త్వము లేనట్టి వాఁడు;పుత్రు
    నిబడసెన్ *మగసిరిగలట్టి బలశాలి
    సుందరిని పెండ్లియాడియు సుందరముగ.

    రిప్లయితొలగించండి
  2. కందం
    పుంస్త్వము క్షేత్రము గొనుచున్
    బుంస్త్వము నిర్ధారణ మయి పుడమిని సృష్టిన్
    బుంస్త్వమె వెలయింపఁగ నే
    పుంస్త్వము లేనట్టివాఁడు పుత్రునిఁ బడసెన్?

    ఉత్పలమాల
    పుంస్త్వము క్షేత్రమున్ గొనుచు ముచ్చట దీర్పఁగ దైవమొప్పఁగన్
    బుంస్త్వ నిరూపణమ్మున ప్రమోదము గూర్చుచు వింత శోభలన్
    బుంస్త్వమె సృష్టినిన్ వెలయు పోడిమి జూపఁగ, వైద్య సాధనన్
    బుంస్త్వము లేనివాఁ డొకఁడు పుత్రునిఁ బొందెను లోకు లౌననన్!

    రిప్లయితొలగించండి
  3. పుంస్త్వంబాడుతనంబున
    పుంస్త్వాకారుడుశివుడునుపూర్ణండాయెన్
    పుంస్త్వంబర్థంబేగా
    పుంస్త్వములేనట్టివాడుపుత్రునిబడసెన్

    రిప్లయితొలగించండి
  4. పుంస్త్వము తోఁ బని లేక యె
    పుంస్త్వమునకు బదులు మందు బోనముఁ జేయన్
    పుంస్త్వముఁ గలిగిన వోలెను
    పుంస్త్వము లేనట్టివాఁడు పుత్రునిఁ బడసెన్

    రిప్లయితొలగించండి
  5. పుంస్త్వ మె నరులకు ముఖ్యము
    పుంస్త్వ ము గల వాడె పొందు పుడమిని సంతున్
    పుంస్త్వము. లోపింప నెటుల
    పుంస్త్వ ము లేనట్టి వాడు పుత్రుని బడసెన్?

    రిప్లయితొలగించండి

  6. పుంస్త్వమన పౌరుషమ్మట
    పుంస్త్వమ్మన్నను మగటిమ పురుషున కిలలో
    పుస్త్వమె ముఖ్యంబెవ్విధి
    పుంస్త్వము లేనట్టివాఁడు పుత్రునిఁ బడసెన్?

    రిప్లయితొలగించండి
  7. బుంస్త్వము లేకపోయినను బొందగ వచ్చును వైద్యసాధనన్
    పుంస్త్వము సాటి సాధనముఁ బొందుగఁ గాంచిరి దానివల్ల నే
    పుంస్త్వము లేనివాఁ డొకఁడు పుత్రునిఁ బొందెను లోకు లౌననన్
    పుంస్త్వముఁ గల్గు వారలన బుత్రుల గందురు సాజ రీతిగన్

    రిప్లయితొలగించండి

  8. పుంస్త్వమటన్న పౌరుషము పూరుషజాతికి గాంచ ముఖ్యమే
    పుంస్త్వము, బిడ్డలెక్కువయి పోషణ భార మటంచు నెంచుచున్
    పుంస్త్వముఁ గల్గినట్టి కడు మూర్ఖుడు బిడ్డను దత్తతివ్వగా
    పుంస్త్వము లేనివాఁ డొకఁడు పుత్రునిఁ బొందెను లోకు లౌననన్.

    రిప్లయితొలగించండి
  9. (పుత్రకామేష్ఠి యాగము)

    పుంస్త్వము గూర్చి యెరుగవే !
    పుంస్త్వముకై క్రతువు జేయ ముదముగ పొసగెన్
    పుంస్త్వము పాయస మందున
    పుంస్త్వము లేనట్టివాఁడు పుత్రునిఁ బడసెన్

    రిప్లయితొలగించండి
  10. పుంస్త్వము వేరు దేహ పరిపుష్టియు వేరని యీవెరుంగవే?
    పుంస్త్వము లేని వారికిని పూర్వము భారత కాలమాదిగా,
    పుంస్త్వ ప్రధానధాతువది పుత్ర సముద్భవ మందు నొప్పగా,
    పుంస్త్వము లేనివాఁ డొకఁడు పుత్రునిఁ బొందెను లోకు లౌననన్.

    రిప్లయితొలగించండి
  11. పుంస్త్వము స్త్రీత్వముంగలియఁబుట్టును సంతతి సత్కవీశ్వరా!
    పుంస్త్వము లేకపోయిన నపుంసకుఁడందురు గాదె వానికిన్
    పుఃస్త్వము కల్గు వాడొకఁడు పుత్రుని దత్తత నిచ్చె నందుచే
    *పుంస్త్వము లేని వాడొకఁడు పుత్రునిఁబొందెను లోకులౌననన్.

    రిప్లయితొలగించండి
  12. పుంస్త్వము పురుషుని చిహ్నము
    పుంస్త్వము పోయిన విజయుడు పొందెను వరమున్
    పుంస్త్వము పునరుద్భవమున
    పుంస్త్వము లేనట్టివాఁడు పుత్రునిఁ బడసెన్

    రిప్లయితొలగించండి
  13. పుంస్త్వమె యాధారమగును
    పుంస్త్వముగల సంతునొంద, పూనగ వెజ్జుల్
    పుంస్త్వపు పునరుద్ధరణకు
    పుంస్త్వము లేనట్టివాఁడు పుత్రునిఁ బడసెన్

    రిప్లయితొలగించండి
  14. పుంస్త్వము గోలుపోవగను పోరును జేయుచు వైరి సేనపై
    పుంస్త్వము చక్కజేయగను పోడిగ వైద్యులు నూత్న పద్ధతిన్
    పుంస్త్వముకల్గెనంచు సఖి మోదముతోడుట పెండ్లి యాడగన్
    పుంస్త్వము లేని వాడొకఁడు పుత్రునిఁబొందెను లోకులౌననన్

    రిప్లయితొలగించండి
  15. ఉత్పలమాల
    పుంస్త్వము లేని వారి నిధి పూరుష వీర్యపు బ్యాంకులుండగన్
    పుంస్త్వము లేని వారలకు పొందగ సంతు నవీన రీతిగన్
    పుంస్త్వము నడ్డు గోడ యన పూర్తి యసత్యము లోకమందునన్
    పుంస్త్వము లేనివాఁ డొకఁడు పుత్రునిఁ బొందెను లోకు లౌననన్
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  16. డా. బల్లూరి ఉమాదేవి

    పుంస్త్వుండనిపల్కుచును, న
    పుంస్త్వుండే పెండ్లియాడిభూరిగ పడతిన్
    పుంస్త్వుని వీర్యము. నందుచు
    పుంస్త్వము లేనట్టి వాడు పుత్రుని బడసెన్

    రిప్లయితొలగించండి
  17. పుంస్త్వా పుంస్త్వ విదారిత
    పుంస్త్వ వితర్కమ్ము లెల్ల భూతల మందుం
    బుంస్త్విషిత మనో భవముల్
    పుంస్త్వము లేనట్టి వాఁడు పుత్రునిఁ బడసెన్


    పుంస్త్వరమాణ కార్యములు భూరి ఫలమ్ము లొసంగు నిత్యముం
    బుంస్త్విషిత ప్రవృత్తి పరిపోషణ మెన్నఁగ గర్హ్యనీయమే
    పుంస్త్వచ మిచ్చు దర్పమును బొందఁగ దైవ దయామృతమ్మునుం
    బుంస్త్వము లేనివాఁ డొకఁడు పుత్రునిఁ బొందెను లోకు లౌననన్

    [త్విషితము= ఉద్రిక్తమైన]

    రిప్లయితొలగించండి