1, సెప్టెంబర్ 2022, గురువారం

సమస్య - 4179

2-9-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాతి కనులు దిరిగి వ్రాలె భువిని”
(లేదా...)
“రాతికిఁ గండ్లు గిఱ్ఱుమనె వ్రాలె తనూలత భస్మశేషమై”

24 కామెంట్‌లు:

  1. క్రొవ్విడి వెంకట రాజారావు:

    త్రిపుర దనుజు డిలను తెగబాఱి సలిపెడు
    క్రూర చర్య లన్ని కోలుపుచ్చ
    దలచి నట్టి చక్కదమ్మగు నా పురా
    రాతి కనులు దిరిగి వ్రాలె భువిని.

    రిప్లయితొలగించండి
  2. ఆటవెలది
    ఘోరమైన తపము నౌర!భగ్నముఁజేయ
    ఫాలనేత్రుడంత చాల కినిసి
    తెరవ నుదుటి కన్ను బిరబిర శంబరా
    రాతి కనులు దిరిగి వ్రాలె భువిని.

    ఉత్పలమాల
    ఆతత పుష్పసాయకము లల్లననల్లన తాకినంతనే
    చేతము దప్పియున్ వశము, చేడియ పైఁబడ దృష్టి, శూలి సం
    జాత రుషన్ గనుంగొనగ జ్వాలలు రేగె నయారె!శంబరా
    రాతికి గండ్లు గిఱ్ఱుమనె వ్రాలె తనూలత భస్మశేషమై.

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. ఆటవెలది
      శైలజఁగన శివుడు బూల బాణము వేయ
      మరుఁడు మీరెనంచు హరుఁడు సెలఁగి
      తెరచి గాల్చఁ బోవ తిగకంటి, శంబరా
      రాతి కనులు దిరిగి వ్రాలె భువిని

      ఉత్పలమాల
      ప్రీతిని శైలజన్ హరుఁడు వేడుక గాంచిన మేలుమేలనన్
      రీతిగ మన్మథుండు వలఱేడు సుమాస్త్రము వైచినంతటన్
      ఘాతకునట్లు సూచి తిగకంటను నిప్పులు సింద శంబరా
      రాతికిఁ గండ్లు గిఱ్ఱుమనె వ్రాలె తనూలత భస్మశేషమై!

      తొలగించండి
  4. హేతువు తారకాసురుని పీచమడంచుట లోకరక్షకై
    మాతను శర్వునిన్ గలుప మారుడు పూవులబాణ
    మేయగా
    గాతరమందకే నుదిటి కన్నున నగ్నినిగుప్ప శంకరా
    రాతికి కండ్లు గిఱ్ఱుమనె వ్రాలెతనూలత భస్మశేషమై

    రిప్లయితొలగించండి
  5. క్రొవ్విడి వెంకట రాజారావు:

    భాతిగ ధ్యానమెంచెడు కపర్దికి మోహము నంటజేయగన్
    రీతిగ పూలబాణములు రెచ్చుచు వేయగ తీక్ణదృక్కులన్
    చేతనుడుగ్రుడై నిలుప చిక్కిన పంచశరుండు శంబరా
    రాతికి గండ్లు గిర్రుమనె వ్రాలె తనూలత భస్మశేషమై!

    రిప్లయితొలగించండి
  6. నడికిరేయిలోన నర్తన శాలలో
    కీచకాధమునికి పీచమడచ
    మొక్కలించు గుణుని ముష్టిఘాతములకా
    రాతి కనులు దిరిగి వ్రాలె భువిని

    రిప్లయితొలగించండి

  7. శంకరాత్మజుండు స్కందుడా దనుజుడు
    తారకుడను దునుమ తంపి యందు
    శాక్రి యిచ్చినట్టి శక్తి విసర సురా
    రాతి కనులు దిరిగి వ్రాలె భువిని.


    మాతృక గోరుకున్న కఠమర్థుని ఘోర తపమ్ము భంగమున్
    సేతునటంచు కంజనుడు చేరిశరమ్మును వేసినంతనే
    యా తిగికంటి యాగ్రహమునందెర గన్నును విప్పగా శివా
    రాతికిఁ గండ్లు గిఱ్ఱుమనె వ్రాలె తనూలత భస్మశేషమై

    రిప్లయితొలగించండి
  8. పంచ భూత ములకుఁ బ్రభువును యోగియు
    నైన శివుని పైన బాణ మిడగ
    ఫాల కంటిఁజూడ భయపడి శంబరా
    రాతి కనులు దిరిగి వ్రాలె భువిని

    రిప్లయితొలగించండి
  9. సురలు కోరినంత సుమ శరుండు శివుని
    తపము మాన్ప బూనె ధైర్య ముగను
    కంటి మంటలకును కాలుచు నా హరా
    రాతి కళ్ళు తిరిగి వ్రాలె. భువికి

    రిప్లయితొలగించండి
  10. శివముగలుగ నెంచి శివునకు గిరిజపై
    మరులు గొలుప వైచె మరుఁడు శిఖిని
    చిచ్చుకన్నుఁ దెరచిచివ్వున గన పురా
    రాతి, కనులు దిరిగి వ్రాలె భువిని

    రిప్లయితొలగించండి
  11. చిత్ర మొసగు చుండు శిల్పమందున దాని
    కనులటునిటు తిరిగి కదలు చుండు
    నటుల విడిగ మలచి యమరచ బోవగ
    రాతి కనులు దిరిగి వ్రాలె భువిని

    రిప్లయితొలగించండి
  12. ఉ.

    ఆతురతన్ వృకాసురుడునధ్వము నారద బోధగా గొనెన్
    చేతిని నెత్తిపై నిడ నచేతనుడై తల నూరుముక్కలౌ
    భాతిగ భూతనాథ వర భాగ్యపరీక్షను విష్ణు, శంకరా
    *రాతికిఁ గండ్లు గిఱ్ఱుమనె వ్రాలె తనూలత భస్మశేషమై.*

    రిప్లయితొలగించండి
  13. ఆటవెలది
    రాతి బొమ్మ రెచ్చి రీతిగ బొమ్మల
    కొలువు నందు రమణి కోరి యుంచ
    బుడుత డదియు బూచి బొమ్మ యనుచు త్రుంచ
    రాతి కనులు దిరిగె వ్రాలె భువిని.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  14. ఆతత భక్తినిల్పినది యద్రిజ యీశ్వరు పొందుకోసమై
    ఖ్యాతిగొనంగ పూవిరుల గార్ధ్రము వేయమరుండు క్రోథసం
    జాతము కన్నులం గదుర చయ్యన జూసె శివుండు, శంబరా
    రాతికిఁ గండ్లు గిఱ్ఱుమనె వ్రాలె తనూలత భస్మశేషమై

    రిప్లయితొలగించండి
  15. బల విహీనుఁ డయిన బల్లిదు నెదిరింపఁ
    గా ననర్హుఁ డెన్నఁ డైన నరయఁ
    గొట్టఁ జెంప దెబ్బ కోపమ్ము మీఱ న
    రాతి కనులు దిరిగి వ్రాలె భువిని

    నాతికి నా రతీ సతికి నాథుఁడు నిర్జర కార్య మగ్నుఁడై
    వీత భయమ్ము మన్మథుఁడు వేయఁగ పుష్ప శరమ్ము కిన్కతో
    భూత గణాధి నేత తన మూడవ కంటిని విప్ప శంక రా
    రాతికిఁ గండ్లు గిఱ్ఱు మనె వ్రాలెఁ దనూ లత భశ్మ శేషమై

    రిప్లయితొలగించండి
  16. భూతగణాధినాథునకు మోదముగా ననునిత్యమాదటన్
    శీతనగాధిరాజసుత సేవలొనర్చుట గాంచి దాసునిన్
    జేతునటంచు కోలనిడి చిచ్చఱ చూపున జిక్కె శంకరా
    రాతికిఁ గండ్లు గిఱ్ఱుమనె వ్రాలె తనూలత భస్మశేషమై

    రిప్లయితొలగించండి
  17. భమిడిపాటి కాళిదాసు. అనకాపల్లి.

    పాతకుడైన భస్మసురు బారిన హారియె భీతిపర్విడన్!
    శీతనగాధి వాసుడగు చేతను నాభవు గావ జెచ్చరన్!
    నాతిగ మారి జూప హరి నాట్యము నందలి చాతురిన్ సురా
    రాతికిఁ గండ్లు గిఱ్ఱుమనె వ్రాలె తనూలత భస్మ శేషమై!!

    రిప్లయితొలగించండి
  18. బవరరంగమందుపార్థుని శరముచే
    సైంధవుండుకూలెసంజలోపు
    విహ్వలంబుతోడ వీక్షించుచున్న నా
    రాతి కనులు తిరిగి వాలె భువిని

    రిప్లయితొలగించండి
  19. తాత వరమ్మునంది కడు దర్పము దేవతలన్ నొగల్చ, నా
    యాతుని యంతమున్ గొన పురారి తపమ్మును మాన్పనెంచుచున్
    చేతము తూలజేయ, గన చేతను డాగ్రహ మొంది శంకరా
    రాతికిఁ గండ్లు గిఱ్ఱుమనె వ్రాలె తనూలత భస్మశేషమై

    రిప్లయితొలగించండి