7, మార్చి 2023, మంగళవారం

సమస్య - 4359

8-3-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తారా రమ్మనుచుఁ బిల్చె దాశరథి దమిన్”
(లేదా...)
“తారా రమ్మని పిల్చె రాముఁ డెలమిన్ దానంద సౌఖ్యమ్ములన్”
(ఆముదాల మురళి గారి శతావధానంలో గంగుల నాగరాజు గారి సమస్య)

50 కామెంట్‌లు:


  1. పారావారము దాటుచు
    నా రావణు సంహరించి నారిని గనుచున్
    బేరిమి తోడ పిలిచె సీ
    తా! రా రమ్మనుచుఁ బిల్చె దాశరథి దమిన్.

    రిప్లయితొలగించండి
  2. కారడవినివెన్నెలవుగ
    భారముకాదీపయనముభావింపంగా
    తోరమ్మికసహచరి సీ
    తారారమ్మనుచుఁబిల్చెదాశరథితమిన్

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. చీరల మూటను, వానర
      వీరులు చూపగ జనకజవే యని తెలియన్
      చేరగ ఓ ఫణి రాడవ
      తారా! రమ్మనుచుఁ బిల్చె దాశరథి దమిన్

      ఫణిరాట్+ అవతారా

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చేరగ నొక...' అనండి.

      తొలగించండి
    3. ఓ ఫణిరా డవతారా సంబోధన పరముగా సాధువే కదండి.
      తెలియం /జేరఁగ నో ఫణిరాడవతరా!

      తొలగించండి
  4. కూరాకుల్ఘనభక్ష్యభోజ్యములుమ్రాకుల్నీడలిచ్చున్గదాభారంబేయదికాదులేమనకునీభాగ్యంబులేదెచ్చటన్
    పారేనీళులుదప్పిదీర్చునటవిన్పండెంగదాజన్మ, సీ
    తారారమ్మనిబిల్చెరాముడెలమిన్దానందసౌఖ్యమ్ములన్

    రిప్లయితొలగించండి
  5. ఆరాతిరి వెన్నెలలో
    నారామములో దిరుగుచు నతులిత హాయిన్
    కోరిక లీరికలై సీ
    తా రా రమ్మనుచుఁ బిల్చె దాశరథి దమిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తారాచంద్రులు నింగిలోని వెలుగై దాసోహమన్పించగా
      శ్రీరాముండలరారుచున్ మమతనే చిందించు చిత్తంబుతో
      నారామమ్మున సంచరించుటకు సౌహార్ధంబు సూచించి సీ
      తా రా రమ్మని పిల్చె రాముఁ డెలమిన్ దానంద సౌఖ్యమ్ములన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. ధీరత తో సమ రమ్మున
    వీరత్వ ము జూపి భామ వేదన బాపెన్
    జేరి యను రాగ మున సీ
    తా!రమ్మనుచు బిల్చె దాశరథి దమిన్

    రిప్లయితొలగించండి

  7. పారావారము దాటి భీమమగునా పౌషమ్ములో రావణున్
    వీరాగ్రేసరుడా నరోత్తముడె తా వేటాడగా తోషమున్
    జేరన్ వచ్చు సతిన్ గనన్ గనులవే చిప్పిల్లగా పేర్మి సీ
    తా! రా రమ్మని పిల్చె రాముఁ డెలమిన్ దానంద సౌఖ్యమ్ములన్.

    రిప్లయితొలగించండి
  8. వీరాగ్రేసరుడైన కాముకుడు దా ప్రేమించి
    కాంతామణిన్
    వారీ సంగతి దెల్ప పెద్దలకు సంవాదంబు
    పెట్రేగ గా
    వేరే మార్గము లేక ప్రేమికుడు తా వేసారి
    కోపాన సీ
    తా !రా రమ్మని పిల్చె రాముడెలిమిన్ దా
    నంద సౌఖ్యంబులన్ 9/3/23

    రిప్లయితొలగించండి
  9. వారధి గట్టిన దదుపరి
    నా రావణు బురము జేరి యా రమ ణిని గనన్
    నా రాక్షసుని దునిమి సీ
    తా ! రారమ్మనుచుఁ బిల్చె దాశరథి దమిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. "...యా సతిని గనన్" అనండి.

      తొలగించండి
  10. కందం
    నేరము సేసితినా? కాం
    తారమ్మున దాగినీవు దపనలు వడ నే
    నీరీతి నలిపెదవె సీ
    తా! రా రమ్మనుచుఁ బిల్చె దాశరధి దమిన్

    శార్దూలవిక్రీడితము
    పారావార సమానమౌ మమతనే బండింప వెన్నంటి కాం
    తారంబందున వీడి నిర్దయను సంతాపమ్మునన్ ముంచినన్
    దూరమ్ముల్ విడె రావణాంతమున నిర్దోషాగ్నిఁ దేలన్ బునీ
    తా! రా రమ్మని పిల్చె రాముఁ డెలమిన్ దానంద సౌఖ్యమ్ములన్

    రిప్లయితొలగించండి
  11. రిప్లయిలు
    1. పారావారమతిక్రమించి బలమేపారంగ లంకాపురిన్
      శ్రీరాముండు దురంబునన్ దునిమి దుర్నీతుండునౌ రావణున్
      చేరంజీరి యశోకవాటిక కడన్ సీతన్ ముదంబార సీ
      తా! రారమ్మని పిల్చె రాముఁ డెలమిన్దానంద సౌఖ్యమ్ములన్

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సీతన్... సీతా' అని పునరుక్తి. "కడన్ జేటి ముదంబార సీతా!" అందామా?

      తొలగించండి
    3. అలాగే సవరిస్తాను గురువుగారూ! ధన్యవాదములు 🙏🏻

      తొలగించండి
  12. పారావారంబావల
    నా రావణ లంకయందు నతిదుఃఖితయై
    శ్రీరాముని దలఁపున సీ
    తా! రా రమ్మనుచుఁ బిల్చె దాశరథి దమిన్

    రిప్లయితొలగించండి
  13. శా.

    తారా మండలమందు చంద్రుని గనెన్ దాక్షిణ్య భావమ్ముతో
    గారుణ్యమ్మున నద్దమందు గనగా గర్వించి బింబమ్మటన్
    వీరావేశమునర్భకుండు ముదమున్ వీక్షించి పల్కెన్ *సుమం*
    *తా ! రా ! రమ్మని పిల్చె రాముఁ డెలమిన్ దానంద సౌఖ్యమ్ములన్.*

    రిప్లయితొలగించండి

  14. చేరుచుగంగాతటమును
    తీరుగ నాశోభను గని దేహము పొంగన్
    కారడవినసాగుచు సీ
    తారారమ్మనుచుపిలిచెదాశరథి తమిన్

    మరొక పూరణ

    ఘోరారణ్యమటంచు భీతివిడుమా కూర్మిన్ యిటన్పం చగా
    నీరాజీవములెల్లవేచెగనుమానిక్కంబుగానోచెలీ
    యారామమ్ముగజూచుచున్గడుపగానాలస్యమింకేలసీ
    *“తారా రమ్మని పిల్చె రాముఁ డెలమిన్ దానంద సౌఖ్యమ్ములన్”*

    రిప్లయితొలగించండి
  15. శ్రీరాముని యభిషేకము
    నారయ భార్యలను గూడి హరి వరు లెల్లన్
    వార కయోధ్యకుఁ జన వలెఁ
    దారా! రమ్మనుచుఁ బిల్చె దాశరథి దమిన్

    రారాదం చనఁ గానకున్ వినవె యారాటమ్మునున్ వీడ వో
    నారీ రత్నమ! సమ్మతించితిని యానందమ్ము నిండన్ మదిన్
    దారా!సీత! విదేహ రాజ సుత! మచ్చైతన్య ధారా నభ
    స్తారా! రమ్మని పిల్చె రాముఁ డెలమిన్ దానంద సౌఖ్యమ్ములన్

    రిప్లయితొలగించండి
  16. శా॥ శ్రీరాముండు యశోవిరాజితుఁడు నిశ్శేషంబుగన్ దైత్యులన్
    ధీరోదాత్తత తోడఁ ద్రుంచు ఘనమౌతేజస్సు రంజిల్లగన్
    వైరిన్ రావణుఁ గూల్చి సీతను గనన్ బాటిల్ల హర్షంబు సీ
    తా! రారమ్మని పిల్చె రాముఁడెలమిన్ దానంద సౌఖ్యమ్ములన్

    కం॥ శ్రీరాముడు యుద్ధంబున
    నారావణుఁ గూల్చె జనులు హర్షించంగన్
    గారాముగ పిమ్మట సీ
    తా! రా రమ్మనుచుఁ బిల్చె దాశరథి దమిన్

    రిప్లయితొలగించండి
  17. ధీరోదాత్తుడు సుగుణుం
    డా రావణుసంహరించి యతిప్రేమమునన్
    వారించుచు దుఃఖము సీ
    తా! రా! రమ్మనుచు బిలిచె దాశరథి దమిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. పిన్నక నాగేశ్వరరావు.

      దూరముగా భరతుని గని
      పేరిమితో స్వాగతించ ప్రియతమ్మునితో
      చేరుచు నాతని దరి భ్రా
      తా! రా! రమ్మనుచుఁ బిల్చె దాశరథి దమిన్.

      తొలగించండి
  18. శ్రీరామున్ విడ నాడ లేక సీత తాఁ జేరెన్ గరమ్మిచ్చతో
    ఘోరారణ్యము భర్తతో గడపగా సంకోచమ్ము లేకుండ, కా
    తారమ్మందున చూపగా ప్రకృతి సౌందర్యమ్ము నో భూమిజా
    తా! రా! రమ్మని రామమూర్తి బిలిచెన్ ధారాళ వాచాగతిన్

    రిప్లయితొలగించండి