20, మార్చి 2023, సోమవారం

సమస్య - 4372

21-3-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“లెక్కలు రానట్టివాఁడు లెక్కలు నేర్పెన్”
(లేదా...)
“లెక్కలు రాని వాఁడొకఁడు లెక్కలు నేర్పెను మేలనన్ జనుల్”
(ఆముదాల మురళి గారి శతావధానంలో గంగిశెట్టి లక్ష్మినారాయణ గారి సమస్య)

24 కామెంట్‌లు:


  1. అక్కడ వాడొక్కడె గద
    చక్కగ బోధించువాడు సౌమ్యుండతడే
    యెక్కువగా నా వృత్తిని
    లెక్కలు రానట్టివాఁడు , లెక్కలు నేర్పెన్.

    లెక్కలు= పైసలు

    రిప్లయితొలగించండి
  2. చక్కని రూపవంతుడును సౌమ్యుడు పేదల యందు ప్రేమతో
    నక్కడి పిల్లవాండ్రకత డద్భుత రీతిని బోధ సేయగన్
    పెక్కురు నిమ్నజాతులని విత్తము కోరక నట్టి వృత్తిలో
    లెక్కలు రాని వాఁడొకఁడు, లెక్కలు నేర్పెను మేలనన్ జనుల్.

    రిప్లయితొలగించండి
  3. లెక్కల పండితు డాతడు
    చక్కగ బోధించువాడు సద్గుణుడతడే
    టక్కుటమారము చేసెడి
    లెక్కలు రానట్టివాఁడు లెక్కలు నేర్పెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లెక్కల పండితుండు మరి లెక్కల చిక్కులు లెక్కసేయునా
      చక్కనిబోధనాపటిమ స్పష్టత జక్కొను రీతినేర్పుతో
      టక్కున చక్కబెట్టినను టక్కుటమారపు కల్లబొల్లివౌ
      లెక్కలు రాని వాఁడొకఁడు లెక్కలు నేర్పెను మేలనన్ జనుల్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  4. రిప్లయిలు
    1. రాయబారమున కేగిన కృష్ణుడు:

      కందం
      నిక్కిన కర్ణులు రణమున
      కెక్కిన పదివేవురైన నిలపాండవులన్
      ద్రెక్కొన లేరని తప్పుడు
      లెక్కలు రానట్టివాఁడు లెక్కలు నేర్పెన్

      ఉత్పలమాల
      నిక్కుచు యుద్ధమున్ భ్రమల నీదగు గర్వము మిన్నుముట్టగన్
      వెక్కసమెంచ గోర పదివేవురునైనను కర్ణులాగుచున్
      ద్రెక్కొన లేరు పాండవుల నిక్కమనెన్ హరి, మీరి తప్పుడున్
      లెక్కలు రాని వాఁడొకఁడు లెక్కలు నేర్పెను మేలనన్ జనుల్

      తొలగించండి
  5. మిక్కిలి ప్రావీణ్య ముతో
    చక్కగ బోధించు ప్రజ్ఞ సామర్థ్య ము తో
    నిక్కుచు నెప్పుడు తప్పుడు
    లెక్కలు రానట్టి వాడు లెక్కలు నేర్పె న్

    రిప్లయితొలగించండి
  6. తిక్కగననె నతడు దనకు
    లెక్కలు రానట్టివాఁడు లెక్కలు నేర్పెన్ ;
    ముక్కున వ్రేలిడి యందరు
    ఫక్కున హాసించిరతని పలుకులు వినగన్

    రిప్లయితొలగించండి
  7. చిక్కుల వలలో చిక్కెను
    లెక్కలు రానట్టివాఁడు, లెక్కలు నేర్పెన్
    చక్కని నైపుణ్యముతో
    నిక్కువమగుగణితవిద్య నేర్చిన ఘనుడే

    రిప్లయితొలగించండి
  8. చిక్కులయందు చిక్కుకొని చింతిలె నష్టముపాలు గాఁగ తా
    రెక్కలు ముక్కలౌ పగిది రేబవలున్ శ్రమియించు చుండినన్
    లెక్కలు రాని వాఁడొకఁడు, లెక్కలు నేర్పెను మేలనన్ జనుల్
    నిక్కఁపు లెక్కలందు కడు నేర్పరియైన గురుండు వానికిన్

    రిప్లయితొలగించండి
  9. ఒక్కడె పంతులుండెనొక యూర సదా
    యొక పాఠశాలలో
    మిక్కిలి యోర్మితో విమల పేరిమితోడను
    బోధచేయు వా
    డక్కట యెర్గి యెర్గనివి యన్నియు గాదన
    కుండ సక్కగా
    లెక్కలు రానివాడొకడు లెక్కలు నేర్పెను
    మేలనన్ జనుల్.

    రిప్లయితొలగించండి
  10. నిక్కపుసాధువుతానై
    పెక్కులుకషములనుగనిపెంచినభక్తిన్
    చక్కనిదేవునిజూపెగ
    లెక్కలురానట్టివాడులెక్కలునేర్పెన్

    రిప్లయితొలగించండి
  11. ఉ.
    ఉక్కును జూపు మోములట నుత్తర గోగ్రహణంబు భంగమన్
    నిక్కుచు నీల్గి కౌరవులు నెగ్గిన భావము నర్జునున్ గనన్
    *లెక్కలు రాని వాఁడొకఁడు లెక్కలు నేర్పెను మేలనన్ జనుల్*
    చిక్కుముడిన్ శమించు విధి శ్రేష్ఠుడు భీష్ముడు మందలించెడిన్.

    రిప్లయితొలగించండి
  12. ఎక్కడ యుండడు జగతిని
    లెక్కలు రానట్టివాఁడు, లెక్కలు నేర్పెన్
    జక్కటి మెలకువ లుదెలిపి
    మక్కువతో మమ్ము మలచె మాయొజ్జసుమా

    రిప్లయితొలగించండి
  13. చక్కని తెన్గు జాతి కుల సంకుల పంకిల సాంఖ్యకంబుగా
    ముక్కలు చేసి ప్రాంతముల మోసపు బాసల ముంచి దేల్చుచున్
    దక్కినదెల్ల దోచుకొని తక్కిన చిల్లర పంచి మీట నే
    నొక్కితి చూడుడీ ప్రగతి నోట్లకు నోటులు రాలునంచహా
    లెక్కలు రాని వాఁడొకఁడు లెక్కలు నేర్పెను మేలనన్ జనుల్

    ~ సూర్యం

    రిప్లయితొలగించండి
  14. మక్కువ గల్గ నేర్చియును మాన్యత నొందిన గుర్వు యొద్దయున్
    జక్కని రీతిలో మెలగి సాయముఁజేయుచు గుర్వు గారికిన్
    బిక్కటిలంగఁ జేసికొని బెద్దలు సంతసిలంగఁదానయై
    లెక్కలు రాని వాఁడొకఁడు లెక్కలు నేర్పెను మేలనన్ జనుల్

    రిప్లయితొలగించండి
  15. ఉపాధ్యాయున కెంత వచ్చు నన్నది ముఖ్యము కాదు తానెంత చక్కఁగ బోధింపఁ గలఁ డన్నదే ముఖ్యము.

    అక్కఱకు వచ్చు నట్టివి
    లెక్కకు మించినవి యెన్నొ లీలా గతినిం
    జిక్కని కష్ట తరమ్ములు
    లెక్కలు రా నట్టి వాఁడు లెక్కలు నేర్పెన్

    ఇక్కలి కాల మందు నిజ మెన్న నెడంద వహించి ధైర్యమున్
    లెక్కకు సుంత గైకొనమి రేఁగ నగౌరవ గౌరవమ్ములే
    మిక్కుట మబ్బు శాంతియు నమేయ సుఖమ్ములు నాఁగఁ జేరఁగా
    లెక్కలు రాని వాఁడొకఁడు లెక్కలు నేర్పెను మేలనన్ జనుల్

    [లెక్క = పరిగణనము, లక్ష్యము, లెక్క]

    రిప్లయితొలగించండి
  16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి