18, మే 2023, గురువారం

సమస్య - 4424

19-5-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గర్భముం దాల్చె సర్పము గప్ప వలన”
(లేదా...)
“గర్భముఁ దాల్చె సర్పమనఁ గప్పయె కారణమాయె వింతగన్”
(ఆముదాల మురళి గారి చిత్తూరు శతావధాన సమస్య)

15 కామెంట్‌లు:

  1. పగనుబట్టినకాళముపారుచున్న
    మండుకంబునుమ్రింగంగమాటునుండి
    ఉదరముబ్బెనునంతలోనుసురుగొనగ
    గర్భమునుదాల్చెసర్పముకప్పవలన

    రిప్లయితొలగించండి
  2. అర్భక శరీరి యౌకప్ప నారగించ
    మ్రింగఁదొడగెను సర్పము మెల్లగాను
    కబళమేజారి మెల్లగ కడుపు లోకి
    గర్భముం దాల్చె సర్పము గప్ప వలన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దుర్భరమైన నాకలిని ద్రుంచగ భావన చేసి సర్పమే
      నిర్భర మానసంబుగల నిశ్చల జీవిని యెంచు కొన్నదై
      నర్భకమౌ మరూకమును హాయిగ మ్రింగఁ దొడంగె చూడగా
      గర్భముఁ దాల్చె సర్పమనఁ గప్పయె కారణమాయె వింతగన్

      తొలగించండి
  3. పొలముగట్టున జరజర బురదపాము
    ప్రాకుకొని యొక కప్పను పట్టుకొనెను
    పొట్టలో చేరిగన్పట్టె పొటమరించి
    గర్భముం దాల్చె సర్పము గప్ప వలన

    రిప్లయితొలగించండి

  4. బాండ్రు‌ కప్పను‌ మ్రింగెను‌ పాము‌ వడిగ‌
    పొంగి‌ పోవంగ‌ తనపొట్ట‌ బుట్టలాగు‌
    చూడ తోచెను‌ నాకది‌ చూలిలాగు
    గర్భముం దాల్చె సర్పము గప్ప వలన”

    రిప్లయితొలగించండి

  5. కడుపదియె యుబ్బి మత్తుగా కదులు చున్న
    సర్పమొకదాని నచ్చోట శాస్త్రి గాంచి
    పలికె తాను చమత్కార పలుకు లిటుల
    గర్భముం దాల్చె సర్పము గప్ప వలన.



    నిర్భర మందు భేకములు నీడను గెంతుచు నాడుచుండగా
    నర్భక ప్రాణులన్ మెసవ నచ్చట చేరి గ్రసించి నంతనే
    దుర్భర మై ఫణాకరపు తుందమె యుబ్బగ గాంచి పల్కెనే
    గర్భముఁ దాల్చె సర్పమనఁ గప్పయె కారణమాయె వింతగన్.

    రిప్లయితొలగించండి
  6. తేటగీతి
    రగిలి పరువాన పున్నమి రాత్రివేళ
    యారగింపగ వెంటాడ నందకుండ
    గెంతిపోయిన, మగపాము క్రింద నలిగి
    గర్భముం దాల్చె సర్పము, గప్ప వలన

    ఉత్పలమాల
    దుర్భర కామకీలలను దోగుచు పున్నమి రాత్రివేళలో
    నిర్భర 'క్షుత్తునన్ దరిమి' నేరక చిక్కియు జర్రిపోతుకున్
    దర్భలమధ్యనన్ దొరలి తాపము దీరగ పొందు గూడగన్
    గర్భముఁ దాల్చె సర్పమనఁ 'గప్ప' యె కారణమాయె వింతగన్

    రిప్లయితొలగించండి
  7. పెద్ద కప్పను‌ మ్రింగెను‌ పిల్లపాము‌
    పొంగి పోవంగ‌ తనపొట్ట‌ బుట్టలాగు‌
    చూడ‌ తోచెను‌ నాకది‌ చూలిలాగు‌
    గర్భముం‌ దాల్చె‌ సర్పము‌ గప్ప‌ వలన

    రిప్లయితొలగించండి
  8. సహజ రీతిగ వనమున జక్రి యొకటి
    గర్భముం దాల్చె : సర్పము గప్ప వలన
    కడుపు నిండగ తృప్తిగ కనె శిశువును
    దాని గనుచు గాలము సాగె దనివి దీర

    రిప్లయితొలగించండి
  9. అర్భకజీవి దర్దురము నక్కట సర్పము పట్టి మ్రింగగా
    దుర్భర పల్లటమ్ముబడె తుందము నందునఁ జేరి కప్ప సం
    దర్భమెరుంగనట్టియొక ద్రాపుడు తాఁదలబోసె నివ్విధిన్
    గర్భముఁ దాల్చె సర్పమనఁ గప్పయె కారణమాయె వింతగన్

    రిప్లయితొలగించండి
  10. ఉభయ చరమును గాంచియు నురగ మొకటి
    వెంబడి o చియు దానిని వేగ మ్రింగ
    కడుపు నుబ్బగ దానిని గనియు న నిరి
    " గర్భముo దాల్చె సర్పమ్ము కప్ప వలన "

    రిప్లయితొలగించండి
  11. తే॥ శాస్త్ర విద్యఁ గరపు వాఁడ చాలు చాలు
    నద్భుత విషయమనినంత నసలు విషయ
    మరసి కాని నమ్మను దెల్పు మంటి నెచట
    గర్భముందాల్చె సర్పము గప్పవలన

    ఉ॥ అర్భకుఁడైనఁ గల్లలను హాస్యపు పల్కుల నాలకించునో!
    దుర్భర కల్లలన్ వినఁగ దోషము చూడఁగ శాస్త్రబద్ధతన్
    గర్భముఁ గప్పతో ఫణికి గాంచుటసాధ్యము తెల్పుమెచ్చటన్
    గర్భముఁ దాల్చె సర్పమనఁ గప్పయె కారణమాయె వింతగన్

    రిప్లయితొలగించండి
  12. ఉ.

    అర్భకు లంచు కప్పలను హాయిగ భక్షణ చేయు దృంభువుల్
    నిర్భయమొంద కప్ప రతి నీటిని జూడగ మోహమందెడిన్
    *గర్భముఁ దాల్చె సర్పమనఁ గప్పయె కారణమాయె వింతగన్*
    దుర్భరమయ్యె మానవుల దోహదమున్ బశు మైథునాంశమున్.

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.

    పెండ్లి జరిగిన రెండేండ్ల పిదప యువతి
    గర్భముందాల్చె; సర్పము గప్ప వలన
    నాకలిన్ దీర్చు కొననెంచి ప్రాకుచుండ
    భయముతోడ మండూకము ప్రక్కనున్న
    కొలనులో గెంతి తప్పించుకొనెను ముప్పు.

    రిప్లయితొలగించండి