4, మే 2023, గురువారం

సమస్య - 4412

5-5-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జిన్ సేవించినఁ గలుగును స్థిరవాగర్థాల్”
(లేదా...)
“జిన్ సేవించిన వారికిన్ స్థిరములై చేకూరు వాగర్థముల్”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)


18 కామెంట్‌లు:

  1. కందం
    పెన్ సాకులు సెప్పుచు పూ
    జన్ సల్పఁగ లేవె వాణి సన్నిధి శిష్యా!
    నిన్ సైచుసరస్వతి, నా
    జిన్ సేవించినఁ గలుగును స్థిరవాగర్థాల్

    శార్దూలవిక్రీడితము
    పెవ్ సాకుల్ రొదపెట్టి బాలకునివై విద్యార్థిగా నొప్పి పూ
    జన్ సల్పన్ జెవిఁగూడు గట్టి తెలుపన్ సారింపవే శిష్య! ని
    న్నున్ సైచున్దన దీవనల్ గురియఁగన్, నోరార వాగ్దేవి నా
    జిన్ సేవించిన వారికిన్ స్థిరములై చేకూరు వాగర్థముల్

    ఆజి : క్షణకాలము

    రిప్లయితొలగించండి
  2. వాసిగ బసికందులకే
    యూసుల వాచించుచు వస నొసగెదరు గదా ,
    బోసివడిన ముదుసలులకు
    జిన్ సేవించినఁ గలుగును స్థిరవాగర్థాల్

    రిప్లయితొలగించండి

  3. కన్ సారించుచు గను మ
    మ్మన్ సురసుందరి మృడాని మాతంగినె భ
    క్తిన్ సిద్ధిని గోరుచు రా
    జిన్ సేవించినఁ గలుగును స్థిరవాగర్థాల్.
    (రాజి= వరుసగా)


    నిన్ సేవించెడు బుద్ధినిమ్మనుచు నే నిత్యంబు ప్రార్థింతు న
    మ్మన్ సంసిద్ధినె గోరుచున్, మదిని సన్మార్గమ్ములో నుంచు శ
    క్తిన్ సాధించి జపింతు బ్రహ్మసతి యా గీర్దేవినే గాదె, రా
    జిన్ సేవించిన వారికిన్ స్థిరములై చేకూరు వాగర్థముల్.

    రిప్లయితొలగించండి
  4. నన్ శిష్యునిగా జేకొని
    కన్ సన్నలనుంచి విద్య గరపిన గురు సే
    వన్ సేయగ మేలగు యా
    “జిన్ సేవించినఁ గలుగును స్థిరవాగర్థాల్”

    రిప్లయితొలగించండి
  5. నన్ శిష్యున్గ ప్రతిగ్రహించి యభిమానమ్మున్ ప్రదర్శించి సే
    వన్ సేయన్ తమకెల్ల వేళలను నాపైనన్ దయాపూర్ణతన్
    కన్ సన్నన్ గమనించి విద్యలను నాకందించిరే! సోమయా
    జిన్ సేవించిన వారికిన్ స్థిరములై చేకూరు వాగర్థముల్

    రిప్లయితొలగించండి
  6. తాన్ సేన్ సంగీతము విను
    చున్ సాక్షీభూతుడగుచు సుజనుడు ఫాలా
    క్షున్ సేవించినఁ బాలా
    జిన్ సేవించినఁ గలుగును స్థిరవాగర్థాల్

    రిప్లయితొలగించండి
  7. పెన్ సేవల తో భారతి
    నిన్ సకల శుభ ముల తోడ నిరుపమ రీతిన్
    కన్ సన్నల జూడ గ నా
    జిన్ సేవించిన గలుగును స్థి ర వా గ ర్థా ల్

    రిప్లయితొలగించండి
  8. కం॥ నిన్ సేవించెద వాణీ
    కన్ సైగల నొసఁగు మమ్మ కవితల్ సంధిం
    చన్ సూక్త పటిమ, సురజా
    జిన్ సేవించినఁ గలుగును స్థిరవాగర్థాల్!

    మరొక పూరణ

    కం॥ నిన్ సేవించెద వాణీ
    నన్ సేవకుఁడను గృపఁగన నమ్మితి ననుచున్
    బెన్ సేవల విరియు, నెటుల
    జిన్ సేవించినఁ గలుగును స్థిర వాగర్థాల్!

    రిప్లయితొలగించండి
  9. పెన్‌సేవలుచేతునునే‌
    నున్‌ సద్భక్తిగ‌ కొలుతును‌ నోవిక‌ పెరగం‌
    గన్‌ శ్రద్ధగ‌ నే‌ హనుమా‌
    జిన్ సేవించినఁ గలుగును స్థిరవాగర్థాల్.

    రిప్లయితొలగించండి