3-5-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
అంశం - భద్రాచల రామదాసు
ఛందం - శార్దూలం
1వ పాదం 1వ అక్షరం 'భ'; 2వ పాదం 2వ అక్షరం 'ద్రా'; 3వ పాదం 10వ అక్షరం 'చ'; 4వ పాదం16వ అక్షరం 'లం'
(లేదా...)
'భ - ద్రా - చ - లం' ఈ అక్షరాలను పాదాదిలో న్యస్తం చేస్తూ ఆటవెలది కాని, తేటగీతి కాని వ్రాయండి.
భక్తుల కరుణించు వాడ! దాశరథి! భ
రిప్లయితొలగించండిద్రాద్రి వాస! సుగుణ ధామ! రామ!
చప్పున నినుచేరి శరణమ్ము వేడిన
లంపటమ్ము తొలగు రామచంద్ర!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిభద్రాద్రిన్ గనమా విశేషమనమా ప్రార్థించు సందోహమున్
తొలగించండినిద్రాసక్తత లేని భక్త వరుడే నిర్మించె నీకోవెలన్
విద్రోహంబని యెంచ తానచలమై విశ్వాసమున్ వీడకన్
భద్రుండై మదినమ్మి యుంచెను సదా భారమ్ము లంకారిపై
భద్రమౌనుగజీవికిపరమపదము
రిప్లయితొలగించండిద్రావకంబదిత్రాగుమ రామ రసము
చలముతోడుతసాధనసాగుమయ్య
లంపటంబునుతొలగువైరాగ్యమందు
భక్త జనుల బ్రోచు భగవంతుడౌచు భ
రిప్లయితొలగించండిద్రా చల మున వెలయు రామ చంద్రు
చరణ మాశ్ర యించ సంపద లును కుశ
లంబు లభ్య మౌని ల నిజము గను
భద్రుండే రఘు రాముడంచు కడు విశ్వాసమ్ము నే జూపుచున్
రిప్లయితొలగించండిభద్రాద్రిన్ గుడి గట్టనెంచెనట గోపన్నాఖ్యుడే నిష్ఠతో
నిద్రాహారము మాని తానచట, తానీషాయె బంధించగా
భద్రాధీశుడె వచ్చి బ్రోచెనట తా బండారులందించు చున్.
శార్దూలవిక్రీడితము
రిప్లయితొలగించండిభద్రమ్మెంచుచు పుట్టనుండ ప్రతిమల్ భక్తాత్ముడై స్వామికై
నిద్రాసక్తత వీడి కోవెలొకటిన్ నిర్మింప నుద్యోగి, రా
జద్రోహమ్మొనరించి తా నచటి కోశాగారమున్ దోచెనన్
ముద్రన్ వైచగ రామ సోదరులు సన్ముక్తంద లంకించిరే
తేటగీతి
భద్రముగ కోవెలన్గట్టి ప్రతిమలుంచి
ద్రాణుడున్ గాని దాసుని తస్కరింపు
చరిత నంటగట్టి చెఱకు సాగనంప
లంకె వైచెను పైకమ్ము రామమూర్తి
రిప్లయితొలగించండిభక్తుడతడు గాన పాడుబడెనని భ
ద్రాద్రి లోన గుడిని తాను గట్టె
చక్కగాను రామచంద్రుని కోసమై
లంకణముల నుండి రామదాసు.
రిప్లయితొలగించండితేటగీతి
భద్రగిరిపైన గుడిగట్టె పంతమూని
ద్రాపెలు వలదన్న వినక, రాజు, చార
చక్షువు చెరసాలను వేయ సాతి కాసు
లందజేసి రక్షించె నా రాము డపుడు.
భద్రుని రహికి రాముడు వరమునిడ భ
రిప్లయితొలగించండిద్రాద్రి పయిన భ క్తుడు రామదాసు కట్టె
చక్కటి గుడి రామునకు, దాని చంద ము గన
లంబును బొగడ భక్తుల లక్ష్యమయ్యె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితే॥ భద్రగిరిని రఘువరుని భక్తి రసము
రిప్లయితొలగించండిద్రావఁగఁ గొలిచి ముదముగ తనిచె నంట
చక్కఁగా రామదాసుఁడు చవిని గొనుచు
లంపటముఁ దొలఁగె నతఁడు రక్ష నొసఁగ
భద్రుండాయెడభక్తితోడనటతాభద్రావతారుండునై
రిప్లయితొలగించండినిద్రాకారతనిండునద్రిగనెతానీరేజపత్రేక్షణున్
ఛిద్రంబాయెగపాపకర్మచనియెన్చిత్రంబుగాగౌతమిన్
ముద్రాాకారుడురామదాసుగనెనేముక్తిన్చలంబున్సదా
భక్తి తత్పరంబుగచేతు భజన! నేబ
రిప్లయితొలగించండిద్రాద్రిరామయ్యనుకొలుతు రంజితముగ
చపల చిత్తములేకను శాంతినిలిపి
లంబ తన్మయంబుననెద రామరామ!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభద్రాద్రేశుని రాము వేడ్క జరుగున్
రిప్లయితొలగించండివైభోగ మేపారగా
నిద్రాహారముమాని యర్చకులు
నిర్ణీతంపు కాలంబునన్
భద్రంబొప్పగ జర్పుచుంద్రచటకున్
భవ్యంపు భద్రాదికిన్
భద్రా!పోదము రమ్ము పుణ్యమగుసూ
పాపంబు లంతంబగున్.
భద్రంబొందఁగ రాము సేవనములో భక్తుండు గోపన్న దా
రిప్లయితొలగించండిభద్రాద్రీశుని దివ్య కీర్తనములన్ భక్తిన్ ప్రచారించుచున్
విద్రాణంబొనరించె భక్తచయమున్ బేరొందె నా రాముడే
భద్రున్ గాఁచిన మేటి దైవముగనా భద్రాచలం బందునన్
భద్రమగును నీకు భద్రాద్రి రామచం
రిప్లయితొలగించండిద్రాయటంచు బ్రోవ రమ్మనంగ
చలము చూపెదేల సాకేత రామయ్య
లంపటములబాప రావదేల?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశా॥ భద్రాద్రిన్ గుడిఁ గట్టె రామునకు నాభక్తుండు గోపన్నయే
రిప్లయితొలగించండినిద్రాహారములెంచకుండ ముదమౌ నిష్ఠాగరిష్ఠుండునై
తద్రూపంబున ఖైదు సేసి చన నాతానీష శ్రీరాముఁడా
భద్రాద్రీశుఁడు ప్రోచెఁ గీర్తిఁ బడయన్ భద్రాచలంబిట్టులన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభద్రాద్రిన్ గుడిఁ గట్ట మానసముసంభావించి గోపన్న తా
రిప్లయితొలగించండినిద్రాహారములన్ త్యజించి లలితో నిర్మించె శుల్కమ్ముతో
రౌద్రమ్మొందిన రాజు యోధ చయమున్ రప్పించి శిక్షింపగా
భద్రాద్రీశుడు కట్టె శుల్కమరయన్ భక్తున్ దలంపందుచున్
భ ద్ర గి రి ప యి కొ లు వై న శ్రీ రా మ చం
రిప్లయితొలగించండిద్రా కొ లు వ గ వ త్తు ర య ము గా ను
చ ర ణ యు గ ళ మం టి సా గి
ఆల ప డె ద ము
లం ప ట ము లు బా పి ర హి నొ సం గు
భక్తితోడగొలుతు భద్రద్రిరాభచం
ద్రాదరిసెనమొసగిదయనుచూపు
చల్లగమముచూడుసాకేతరాముండు
లంపటములుబాపి లబ్ధికూర్చు