ఆర్యు డొ సంగె పూవనుచు నాగ్రహ మందియు బూ నె నల్క నా భార్యను బుజ్జ గించుటకు వైళ మె కృష్ణుడు బూ ని నయ్యె డన్ భార్య పదా o బు జ ద్వయ ము భర్త యె పట్టెను భీత చిత్తు డై భార్య ప్రసన్న మై తనరె భావము నందు జనింప మోహము న్
పరుని భార్య తోడ తిరుగుచున్న పతిని భార్య కాంచె; వెడలె భర్త, యింటి గడపలోనె యపర కాళియై నిల్చిన భార్య కాళ్లు వట్టె భర్త జడిసి. **************************************
రిప్లయితొలగించండిచెట్టు క్రింద జేరి సిగరెట్టు కాల్చగా
తోడికోడలపుడు త్రొంగి చూడ
నన్నకు తెలుపవలదనుచు వెంటనె భ్రాత
భార్య కాళ్ళు వట్టె భర్త జడిసి.
కాలమెంతొమారెకాంతదిపైచేయి
రిప్లయితొలగించండిమారుజెప్పినంతమాయమగును
కోర్టుకెక్కుభయముకోలాటమాడగా
భార్యకాళ్లువట్టెభర్తజడిసి
ఆర్యకుపార్వతీసతికినర్థమునిచ్చెనుశంకరుండునున్
రిప్లయితొలగించండివార్యముకానిదయ్యెగదవాణినినాలుకజేర్చెబ్రహ్మయున్
కార్యమునయ్యెవిష్ణునకుకాంచగవక్షమునందులక్ష్మినిన్
భార్యపదాంబుజద్వయముభర్తయెపట్టెనుభీతచిత్తుడై
ఆటవెలది
రిప్లయితొలగించండిదొంగ దూరనింట తోయలి మేల్కొని
తట్టి లేపి పతిని, తాడు దెచ్చి
తలకు నుచ్చు వైచ ధైర్యాన దొంగకు
భార్య, కాళ్ళు వట్టె భర్త జడిసి
ఉత్పలమాల
కార్యములేవియున్ సలుప కావని దోష నివారణార్థమై
యార్యుఁడటంచు మాంత్రికుని నార్తిని బిల్వఁగ బూజ కెంచియున్
ధైర్యము సెప్పుచున్ గ్రియను ధన్యము సేయఁగ, భక్తి మ్రొక్కఁగన్
భార్య, పదాంబుజద్వయము భర్తయె పట్టెను భీతచిత్తుఁడై
చేయ రాని పనుల జేయుచు నుండగా
రిప్లయితొలగించండిసతికి తెలిసె ననుచు వెతను గుంది
తెలుపు పెద్ద ల కని దీన ము గా న ప్డు
భార్య కాళ్ళు వట్టె భర్త జడిసి
రిప్లయితొలగించండిఆర్యుడు నందితిమ్మనయె యద్భుత కావ్యము నందు తెల్పెనే
శౌర్యము తోడ దానవుల చాగఱ లాడిన కృష్ణ లీలలన్
భార్యయె తన్నినంత సఖి పాదము కందెనటంచు కొంటెగా
భార్య పదాంబుజద్వయము భర్తయె పట్టెను భీతచిత్తుఁడై.
ఉ.
రిప్లయితొలగించండికార్యములన్ని జేయగల కన్యని దాసిని దీసివేతువా?
చౌర్యమునన్ బదార్థములు సంబరమయ్యెనె తీపివంటలన్?
పర్యటనంబు లేదనుచు వక్త్రను బద్ధునిచేయగా పతిన్,
*భార్య పదాంబుజద్వయము భర్తయె పట్టెను భీతచిత్తుఁడై.*
సత్య యలిగినదని , శకటారి వెంటనె
రిప్లయితొలగించండిదాని దీర్చు విధము దానె జూపె ,
జగతి నందున గల జనులు దరించగ
“భార్య కాళ్ళు వట్టె భర్త జడిసి”
అతివ భర్తకెపుడు నపురూపమైయుండ
రిప్లయితొలగించండిచిత్ర మేమి కలదు చింత పడగ
కాలు బెణకి భార్య గాయాల పాల్బడ
భార్య కాళ్ళు వట్టె భర్త జడిసి
భార్యను చూచునెప్డు తన బాధ్యత మర్వక నెల్లవేళలన్
తొలగించండిచర్యలు ధర్మమార్గమున సాగును నిత్యము జాగరూకతన్
కార్యము చక్కబెట్టఁజని కాలికి గాయము చేసుకొన్నదౌ
భార్య పదాంబుజద్వయము భర్తయె పట్టెను భీతచిత్తుఁడై
నన్నుచూసినంత నాయాలిజడుసును
రిప్లయితొలగించండిఅనెను మిత్రులెదుట నప్పిగాడు
విషయమెరిగిభార్య పిక్కపాయసమీయ
భార్య కాళ్ళు వట్టె భర్త జడిసి”
ఎన్నడెరుగడాత డేలకోయీనాడు
రిప్లయితొలగించండిభార్య కాళ్ళు వట్టె, భర్త జడిసి
సంగతేమిటనఁగ చెంగలించుచుఁ బల్కె
చంద్ర హారముఁ గొను చాలుననుచు
భార్యకుఁ దల్లికిన్ నడుమ వైరము కొందలపాటొనర్చగన్
రిప్లయితొలగించండిధైర్యము లేకతల్లికిని దారకు సఖ్యతఁ గూర్చ చెచ్చెరన్
భార్య పదాంబుజద్వయము భర్తయె పట్టెను భీతచిత్తుఁడై
కార్యము సానుకూలపడె కయ్యము నాపు నుపాయ మిద్దియే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆ॥ ఖరము కాళ్ళు వట్టె కార్యముఁ గని వసు
రిప్లయితొలగించండిదేవుఁడపుడు కనఁగ దీనుడైన
పతి కలహము విడువ సతిని వేడుచు నేఁడు
భార్య కాళ్ళు వట్టె భర్త జడిసి
ఉ॥ బార్యకు భర్తకున్ దెలుప బంధము బీటలు వారియున్నచో
రిప్లయితొలగించండిధైర్యముఁ దగ్గు నొక్కరికి దైన్యము హెచ్చును భీరువై చనున్
శౌర్యము స్త్రీలదే కనఁగ శాపము చేసెన యెల్ల వేళలన్
భార్యపదాంబుజద్వయము భర్తయె పట్టెను భీతచిత్తుఁడై
(Man may have brute force; but women have tact, deftness & perseverance; with no offense to anyone please)
భార్యది కన్నుగప్పి పర భామను
రిప్లయితొలగించండిగూడుచు గాని కార్యముల్
ధైర్యముతోడ జేయుచును ద్రవ్యము
నెల్ల వ్యయించుచుండె నీ
క్రౌర్యపు చేష్ట గన్గొనియు గట్టిగ నర్చు
కడుగ్రరూపియౌ
భార్య పదాంబుజద్వయము భర్తయె
పట్టెను భీతచిత్తుడై
కార్యము లందు దాసియయి కమ్మని భోజన మిచ్చి, రాత్రి మా
రిప్లయితొలగించండిధుర్యము పంచుచుండగను, దూరుచు నుండ నకార్యశీలు డా
చర్యల తాళలేక సతి సద్మము వీడగ నెంచఁ, జెచ్చెరన్
భార్య పదాంబుజద్వయము భర్తయె పట్టెను భీతచిత్తుఁడై
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభార్య ను ల క్ష్య పె ట్ట క ను ప ట్న ము న న్ప ర కాం త తో డ దు
రిప్లయితొలగించండిష్కా ర్య ము లె ల్ల యు న్వి డ క స ల్చు చు నుం డ గ నా గ్ర హం బు నన్
ధై ర్య ము తో డ వా త ని డ తా ళ గ లే క ను చే య బో ని కన్
భా ర్య ప దాం బు జ ద్వ య ము భ ర్త యె ప ట్టె ను భీ త చి త్తు డై
పనులు చేయుచుండ పడినంత క్రిందను
భార్య కాళ్లు పట్ట భర్త జడిసి
కాలు విరిగిననిక ఖర్చులధికమగు
ననుచుపలికెనప్పుడతివతోడ
ఆర్యు డొ సంగె పూవనుచు నాగ్రహ మందియు బూ నె నల్క నా
రిప్లయితొలగించండిభార్యను బుజ్జ గించుటకు వైళ మె కృష్ణుడు బూ ని నయ్యె డన్
భార్య పదా o బు జ ద్వయ ము భర్త యె పట్టెను భీత చిత్తు డై
భార్య ప్రసన్న మై తనరె భావము నందు జనింప మోహము న్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
పరుల భార్య తోడ తిరుగుచున్న పతిని
భార్య కాంచె; వెడలె భర్త, యింటి
గడపలోనె యపర కాళియై నిల్చిన
భార్య కాళ్లు వట్టె భర్త జడిసి.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
పరుని భార్య తోడ తిరుగుచున్న పతిని
భార్య కాంచె; వెడలె భర్త, యింటి
గడపలోనె యపర కాళియై నిల్చిన
భార్య కాళ్లు వట్టె భర్త జడిసి.
**************************************