12, మే 2023, శుక్రవారం

సమస్య - 4419

 13-5-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చీఁకటిన్ వెదఁజల్లెను శీతకరుఁడు”
(లేదా...)
“చీఁకటిన్ వెదఁజల్లె చంద్రుఁడు చింతనిప్పులఁ గ్రక్కుచున్”
(ఆముదాల మురళి గారి చిత్తూరు శతావధాన సమస్య)

23 కామెంట్‌లు:

  1. ఆకసంబునునంటెనర్జునునిపగయ
    కొమరుజంపినవానినికోరెనదియు
    మానసంబునశోకముమారెమసిగ
    చీకఁటిన్వెదజల్లెనుశీతకరుఁడు

    రిప్లయితొలగించండి
  2. తాఁకయుద్ధమునందుతాతయుఫల్గుణీవెఱగందెగా
    శోకమందుచుతానయంతటశుద్ధమానసమందునన్
    మూఁకలీగతిమంచిచెడ్డలమూలముల్గనలేరుగా
    చీకఁటిన్వెదజల్లెచంద్ర్రుడుచింతనిప్పులగ్రక్కుచున్,

    రిప్లయితొలగించండి
  3. మూగి మబ్బులు గగనాన ముసురు కొనగ
    చాటు కేగియు దాగియు చందు రుండు
    చీకటిన్ వెదజల్లెను శీత కరుడు
    విచ్చు కొన వయ్యె కలువలు విల సిత ముగ

    రిప్లయితొలగించండి
  4. సాంధ్యరాగమ్ము లలమెను, సాగి పోయె
    జీకటిన్, వెదజల్లెను శీతకరుడు
    స్ఫీత చంద్రికల్, విరిసిన చిత్రకాంతు
    లలరె, పూచె నా రేయిని కలువ లవిగొ!

    రిప్లయితొలగించండి
  5. పండు వెన్నెలకురిసెడు పాళమందు
    చేరరాదయ్యె చెలియయే చెంతకనుచు
    మదన పడుచున్న వగకాని మనసు నందు
    చీఁకటిన్ వెదఁజల్లెను శీతకరుఁడు.

    రిప్లయితొలగించండి
  6. తేటగీతి
    కదిలె దాగియు మబ్బులు గ్రమ్మినంత
    గాలి వీచగ విడిపోయె గగనమందు
    వెన్నెల వెలుగులన్, బాపి కన్నులెదుట
    చీకటిన్, వెదఁజల్లెను శీతకరుఁడు

    మత్తకోకిల
    రాకకోరిన రామసీతకు రామ' చంద్రుడు' వెన్నెలై
    శోకమెల్లను బాపలంకను జొచ్చి వానరమూకతో
    లోకకంటకఁడైన రావణుఁ ద్రోసి, దన్మయు సూతికిన్
    చీఁకటిన్ వెదఁజల్లె 'చంద్రుఁడు' చింతనిప్పులఁ గ్రక్కుచున్

    రిప్లయితొలగించండి
  7. సూర్యుని మహము జంద్రుని సోకకుండ
    పుడమి నిలువరించుచునుండ పున్నమి రెయి
    నందు వెలుగుకు మారుగ నాకసమున
    చీఁకటిన్ వెదఁజల్లెను శీతకరుఁడు

    రిప్లయితొలగించండి
  8. గగన‌ వీధులు‌ రాత్రితో‌ కప్పబడగ‌
    చీకటిన్‌ వెదజల్లెను‌, శీతకరుడు‌
    నింగి‌ కొలనులో‌ కమలమై నిలచినాడు‌
    జ్యోత్స్న కురిపించె‌ భువిపైన‌ యోగ్యముగను

    రిప్లయితొలగించండి
  9. గగన మందున రాతిరి కమ్ముకోగ
    చీకటిన్‌ వెదఁజల్లెను‌‌, శీతకరుడు‌
    శివుని‌ శిఖనుండి‌ గమనించి చేరినాడు
    వెనుక నిలచేను‌ తనసఖి‌ వెన్నెలమ్మ‌‌

    రిప్లయితొలగించండి
  10. మ. కో.

    లోకమే యొక భార్య, సోముని లొంప, రోహిణి సన్నిధిన్
    శోకముల్ కలుగంగ దండ్రిని జూచి తారలు వేడుచున్
    మోకరిల్లగ, దక్ష శాపము ముప్పు నిచ్చెను క్షీణుడై
    *చీఁకటిన్ వెదఁజల్లె చంద్రుఁడు చింతనిప్పులఁ గ్రక్కుచున్.*

    రిప్లయితొలగించండి
  11. ఆకటా మది యాసలే యడియాసలై యడుగంటెనే
    వీకొనన్ దయమాలి నెచ్చెలి వేగె నామది కీలలన్
    చీఁకటిన్ వెదఁజల్లె చంద్రుఁడు చింతనిప్పులఁ గ్రక్కుచున్
    కాఁకఁదేఱెను హృత్సరోజము కాఁకవెల్గు మయూఖలన్

    రిప్లయితొలగించండి
  12. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వర్షసూచన నీయుచు వాసిమీఱ
    గగనమందున మబ్బులు క్రమ్ముగొనగ
    వారిదమ్ముల చాటున బందియగుచు
    చీకటిన్ వెదజల్లెను శీతకరుడు.

    రిప్లయితొలగించండి
  13. సీత కరమును చేకొని శ్రీకరముగ
    రామచంద్రుడు వెలుగాయె భూమిసుతకు
    గర్భవతియగు సీతను కానకంపి
    చీఁకటిన్ వెదఁజల్లెను శీతకరుఁడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాకుమారుని కోరికే రణరంగమందున నిల్పగా
      తోకతొక్కిన పాము లాగున తొందరించిన కోపమున్
      భీకరంబుగ బాలచంద్రుడు బెబ్బులైతెగ పోరుచున్
      చీఁకటిన్ వెదఁజల్లె చంద్రుఁడు చింతనిప్పులఁ గ్రక్కుచున్

      తొలగించండి
  14. క్రొవ్విడి వెంకట రాజారావు:

    భీకరమ్ముగ నంబరమ్మున వృష్టి సూచన లీయుచున్
    ప్రాకియుండిన నీరదమ్ముల బందిగా నిలుచుండుచున్
    చీకటిన్ వెదజల్లె చంద్రుడు, చింతనిప్పులు గ్రక్కుచున్
    పైకొనెన్ మరునాడు సూర్యుడు ప్రజ్వలించిన ద్యోతమున్.

    రిప్లయితొలగించండి
  15. నిండుపున్నమి రాతిరి నివ్వటిల్లె
    గగనమందున ఘనములు ఘనతరముగ
    నెలవెలుంగులు నీల్గెను నెలవుఁ బాసి
    చీఁకటిన్ వెదఁజల్లెను శీతకరుఁడు

    రిప్లయితొలగించండి
  16. నిశిని గగనమం దెల్లెడ నిండ గంటి
    చీకటిన్ ;వెదజల్లే ను శీతకరుడు
    నలుదెసలయందు వెన్నెలన్ నయముగాను
    సంతసించెనుతారలుసంబరాన

    రిప్లయితొలగించండి
  17. తే॥ ఆఁకటి బ్రతుకులఁ గనఁగ నవని లోన
    నంధ కారము మనుజుల నలుము కొనద!
    జితికి చిక్కుల పరమైన బ్రతుకులందు
    చీఁకటిన్ వెదఁ జల్లెను శీతకరుఁడు

    మత్త॥ చాకులాంటి యొకండుఁ జక్కని చుక్క నెంచి ముదమ్ముతో
    దూకఁగన్ ఘన ప్రేమలో నతి దుష్టుఁడై తన తండ్రియే
    మూకలన్ గొని వేరు చేయఁగ ముద్దు జంటను గ్రూరుఁడై
    చీకటిన్ వెదజల్లె చంద్రుఁడు చింత నిప్పులఁ గ్రక్కుచున్

    రిప్లయితొలగించండి

  18. నీకు నచ్చిన వాడటంచును నీచుడైన దురాత్మునిన్
    జేకొనంగనె చుట్టుముట్టెను చిక్కుపాటులవెన్నియో
    శోకమూర్తిగ మార్చెనే నిను చూచినంతనె డెందమున్
    చీఁకటిన్ వెదఁజల్లె చంద్రుఁడు చింతనిప్పులఁ గ్రక్కుచున్.

    రిప్లయితొలగించండి
  19. ఆకతాయి లోనర్చు కుట్రల కడ్డు కట్టలు వేయగన్
    భీక రంబగు చర్య గైకొన పేర్మి కోపము జూపు చున్
    పీక నుల్మగ బూనెశాంతము వీడన య్యె డ ను గ్రు డై
    చీకటిన్ వెదజల్లె చంద్రుడు చింత నిప్పులు గ్రక్కు చున్

    రిప్లయితొలగించండి