17, మే 2023, బుధవారం

మనవి


 కవిమిత్రులకు నమస్కృతులు.

    డెబ్బైమూడేళ్ళ వయస్సులో ఉన్న నేను కొంతకాలంగా తరచూ అనారోగ్యం పాలవుతున్న కారణంగా మీ పూరణ పద్యాలను సమీక్షించలేకపోతున్నాను. మాటిమాటికి జ్వరం వచ్చి పోతూ ఉండడం, దానితో పూర్తిగా నీరసించిపోవడం కారణంగా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాను. ప్రయాణాలు చేయలేక ఈమధ్య కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు కూడ వెళ్ళలేకపోయాను. డాక్టర్ గారిని సంప్రదించి మందులు వాడుతున్నాను. ఆరోగ్యం కుదుట పడగానే మీ పద్యాలను సమీక్షిస్తాను.

    ఎంతో ఆసక్తితో, కష్టపడి వ్రాసిన పద్యానికి స్పందన కరువైతే ఎంత నిరుత్సాహ పడతామో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అందుకే నేను అనారోగ్యంతో ఉన్నా, ప్రయాణాల్లో ఉన్నా మిత్రులను పరస్పర గుణదోష విచారణ చేసుకొనవలసిందిగా కోరుతూ ఉంటాను. 

    నా అశక్తతను గుర్తించి నిరుత్సాహ పడకుండా మీరంతా క్రమం తప్పకుండా సమస్యాపూరణలు చేస్తూ ఉండాలని, మిత్రులు పరస్పర సమీక్షలు చేస్తూ ఉండాలని కోరుకుంటూ నన్ను మన్నించమని కోరుకుంటున్నాను.

8 కామెంట్‌లు:

  1. గురువుగారూ! మాకు మీ ఆరోగ్యం ముఖ్యం. మందులు శ్రద్ధగా వాడి పూర్తి విశ్రాంతి తీసుకోండి.

    రిప్లయితొలగించండి
  2. నమస్కారం సార్ మీ ఆరోగ్యం కంటే మా పూరణల సమీక్ష ముఖ్యం కాదు. మీరు సంపూర్ణ విశ్రాంతి తీసుకోండి.

    రిప్లయితొలగించండి
  3. గురుదేవులకు ఆరోగ్యం త్వరగా కుదుటపడవలయునని భగవంతునికి మా ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  4. గురువుగారూమీరుత్వరగాకోలుకుంటారుమీ మంచి మనసుకు దైవానుగ్రహంతోడుంటుంది ు

    రిప్లయితొలగించండి
  5. గురువు గారు త్వరగా సంపూర్ణారోగ్యం పొందాలని దైవ ప్రార్థన..🙏

    రిప్లయితొలగించండి
  6. మీరు త్వరగా కోలు కోవాలని సర్వేశ్వరుని ప్రార్థిస్తు న్నాను

    రిప్లయితొలగించండి
  7. గురువు గారు త్వరలో మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  8. అయ్య మీరు త్వరగా సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ద్విగుణీకృతంగా సాహిత్య కార్యక్రమములు నిర్వహించాలని కోరుకుంటున్నానండి. శుభంభూయాత్

    రిప్లయితొలగించండి