16, మే 2023, మంగళవారం

దత్తపతి - 195

17-5-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
'కిక్, కుక్, చిక్, చెక్' పదాలను ప్రయోగిస్తూ
తెలుగు భాషా వైభవాన్ని గురించి
స్వేచ్ఛఛందంలో పద్యం వ్రాయండి.
(ఆముదాల మురళి గారి చిత్తూరు శతావధాన దత్తపది)

17 కామెంట్‌లు:

 1. కందం
  చిక్కని కారణముండగ
  చెక్కిన శిల్పంపు లిపిగ జీవము గలదై
  కుక్కిద విభవాన పరులు
  కిక్కురనరు శివుని డమరు కృత్యము తెనుగై

  రిప్లయితొలగించండి
 2. కిక్కనకుండుగాశిశువుగీతముతెల్గుననాలపించినన్
  ఫక్కునజోకుకున్విరియుపామరునవ్వులుతెల్గుభాషలో
  చిక్కనిభావసౌరభముచేతనయందుసువాసనల్గనున్
  చెక్కినశిల్పమాయెగదచెప్పగతిక్కనతెల్గుభారతిన్

  రిప్లయితొలగించండి
 3. చెక్కిన శిల్పము వోలెను
  చిక్కని భావాల తెలుగు చెలు వంబ గుచున్
  కిక్కురు మనకుండ జనుల
  కుక్కు గ కనిపించి మించు గొప్పని భాషై

  రిప్లయితొలగించండి

 4. కుక్క గొడుగుల వలెన్ గల
  కిక్కిరిసిన భాషలందు కీరితినే తా
  చిక్కించుకున్న తెలుగిది
  చెక్కిన శిల్పంబు వోలె జిలుగులు చిందున్.

  రిప్లయితొలగించండి

 5. కిక్కిరి బిక్కిరట్లు పలు గీతలు గీసెడి భాషకాదురా
  కుక్కుట మస్తకమ్ము పయి కోహళియే తలకట్లుగా రుచిన్
  చిక్కని పుష్పసారమది జిహ్వను తాకిన భంగి, కాంచగన్
  చెక్కిన శిల్పమట్లు కడు చెన్నుగ నుండు తెనుంగు భాషయే.

  రిప్లయితొలగించండి
 6. ఉ.

  చిక్కని తేట భాష యిది చెప్పెను నన్నయ భారతంబుతో
  చెక్కిన శిల్పముల్ గనులు శ్రేష్ఠపు టక్షర మాలచే రహిన్
  కుక్కిరి గద్య శైలి గవి కోకిల లెందరొ నవ్యభాషయై
  కిక్కురువెట్టు పండితులు కేరడమున్ బొడ నన్యభాషచే.

  రిప్లయితొలగించండి
 7. చెక్కిన నల్లఱాయికొక స్నిగ్ధ మనోహర రూపమిచ్చి బల్
  చక్కగఁ గూర్చు శిల్పివలె సత్కవి చిక్కని కావ్య వర్ణనల్
  కుక్కిదమౌ సమాసములఁ గూర్చిన జాను తెనుంగు పద్దెముల్
  కిక్కిటినీస్వనంపునెఱి కీరపు బల్కుల సౌరులే సుమా!

  కుక్కిదము = సాంద్రము
  కిక్కిటినీస్వనం = కిచకిచమను శబ్దము (A chirping sound)

  రిప్లయితొలగించండి
 8. కుక్కు టములు చేసెడుదొలికూత వినగ
  కిక్కురుసలుపక దెలుగు కృతి జదువ
  చెంగును మనము నందలి చిక్కు లన్ని ,
  చెక్కుపయి చొట్టలు పడగ జెలువు యెదుగు

  రిప్లయితొలగించండి
 9. కిక్కురువెట్టు నంచునపకీర్తిని కొన్నది కాదు సోదరా
  కుక్కిదమైన దేశమున కోమల మైనది తెల్గు భాషరా
  చిక్కని భావ సృష్టికిది చేవను కూర్చుట నిక్కమేకదా
  చెక్కిటచెయ్యిచేర్చి విను జీవము నిండిన తెల్గు భాషనే

  రిప్లయితొలగించండి
 10. చిక్కని పాలమీగడ రుచించును భాషను పల్కగా మదిన్
  చెక్కిన జక్కనార్య వరశిల్పములయ్య! తెలుంగు వర్ణముల్
  పెక్కగు శబ్దజాలమది పేరిమిగా‌‌ మనకిక్కడుండగా
  కుక్కిన సంచి వోలె మనకుంగల భాషను మార్చుటొప్పునే
  (అన్య భాషా ప్రయోగములు)

  రిప్లయితొలగించండి
 11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చిత్తూరు లో శతావధానము జరిగినదా ! తెలియక పోయెనే :)

   తిరుపతి వేరే కుంపటి అయిపోనాది :)

   కుక్కిన పేను నిదుర విడి
   గ్రక్కున చిక్కగు సమస్య కనులన్ బడగా
   కిక్కిచ్చెడు విధి పద్యపు
   చిక్కదనము చెక్కు పొంగు సిరి తెలుగుదగున్

   తొలగించండి
  2. ఏప్రిల్ 28, 29, 30 తేదీలలో చిత్తూరులో ఆముదాల మురళి గారి శతావధానం జరిగింది. అనారోగ్య కారణంగా నేను ఆ శతావధానానికి రాలేకపోయాను.

   తొలగించండి
 12. చిక్కనిపద్యముచదివిన
  కిక్కదికలుగుగ మనసది కేరింతలతో
  కుక్కినయట్లుగనోటను
  చెక్కిలములతోడతీపి క్షీరమువోలెన్


  చిక్కని పాలలోపలను చెక్కెర కల్పిన రీతియౌగ నా
  చెక్కిన శిల్పమట్లుగను చిత్తము రంజిల చేయుచున్ వడిన్
  కిక్కునుకూర్చుచుండుగదకేవలమొక్కతెలుంగుపద్యమే
  కుక్కినయట్లునోటికినికూర్చినయట్లుగహెచ్చుమోదమున్


  రిప్లయితొలగించండి
 13. కం॥ చిక్కని భావామృతమున
  క్రిక్కించు తెలుఁగు ముదముగఁ గీర్తన వోలెన్
  గుక్కిదముగఁ ద్రావి బుధులు
  చెక్కిరి యద్భుత కవితలు శ్రేయము నొందన్

  క్రిక్కించు గిలిగింతతో నవ్వునట్లు చేయు
  కుక్కిదము సాంద్రము
  (నిఘంటువు సహాయం)

  రిప్లయితొలగించండి

 14. పిన్నక నాగేశ్వరరావు.

  కుక్క గొడుగుల పగిదిగా
  కిక్కిరిసిన భాషలందు కీర్తి తెలుగుదే
  చిక్కగ భాసిల్లు లిపియు
  చెక్కిన శిల్పమ్ము వోలె చెన్నుగనుండున్.

  రిప్లయితొలగించండి